రాహుల్‌ తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదు: కిషన్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Team Published : 16 Oct 2026 16:32 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హైదరాబాద్‌: రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy) విమర్శించారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు, కేంద్రాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పది నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించేలా రాహుల్‌గాంధీ వ్యవహరిస్తున్నారని అన్నారు.

‘‘ 2029 వరకు ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. బంగ్లాదేశ్‌, శ్రీలంకలో చేసినట్లు ప్రభుత్వాన్ని కూల్చుతామని దింపుడుకల్లం ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంటే.. భారత్‌ మాత్రం అభివృద్ధి చెందుతోంది. రాహుల్‌ గాంధీ తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సీఎం సొంత జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు?: కవిత ఎల్‌నినోపై 10 నెలల ముందు నుంచే హెచ్చరికలు ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు.
  • సికింద్రాబాద్‌లో కేజేఆర్‌ గార్డెన్‌ నేలమట్టం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ప్రాంతంలోని కేజేఆర్ గార్డెన్‌ను అధికారులు పూర్తిస్థాయిలో కూల్చి వేశారు.
  • ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరవు: కేటీఆర్‌ రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడికి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.
  • భక్తులతో దాండియా ఆడిన రోబో.. వీడియో వైరల్‌ కరీంనగర్‌ జిల్లా నగునూరులోని దుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
  • విశేష అలంకరణలో అమ్మవారు.. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దర్శించుకుంటున్నారు.
  • దుబాయ్‌-హైదరాబాద్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఎమిరేట్స్‌ విమానం అత్యవసరంగా ముంబయిలో ల్యాండైంది.
  • డబుల్‌ డ్యూటీకి సెలవుల్లేవ్‌! డబుల్‌ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్‌ డ్యూటీ అడ్వాన్స్‌ మాత్రమే చెల్లించాలని.. డీఆఫ్, సీఆఫ్‌ (సంబంధిత సెలవులు) మంజూరు చేయవద్దంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదేశించింది.
  • ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌’ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం విచారించాలి ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను సవాల్‌ చేస్తూ విజయ్‌గోపాల్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ సిద్ధం.. దసరా నుంచి ఓపీ సేవలు ఎంజీఎం భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనంలోకి వైద్య విభాగాలను తరలించి సేవలు అందించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
  • ఒకరి నష్టం నుంచి మరొకరు ధనవంతులు కాకూడదు బుక్‌ చేసుకున్న ఫ్లాట్‌ను అప్పగించడంలో విఫలమైన రియల్‌ఎస్టేట్‌ సంస్థ డబ్బు వాపస్‌ ఇచ్చినప్పుడు దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అతను సొంతంగా చెల్లించిన మొత్తం మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • సింగరేణి భవిష్యత్తుపై కేటీఆర్‌ మొసలి కన్నీరు సింగరేణి భవిష్యత్తు, బకాయిలపై మాజీ మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.
  • ‘రైతు బీమా’ కొనసాగించకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా ‘బొగ్గు ఉత్పత్తి లేక విద్యుత్తు నిలిచిపోతోంది. జల లభ్యత ఉన్నా ప్రాజెక్టుల్లో మోటార్లు నడవకపోవటంతో నీళ్లు వస్తలేవు. రాష్ట్రంలో మూడు నెలల నుంచి రైతు బీమా పథకం ఆగిపోయింది. మూడు వేల రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
  • తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్తలను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
  • ఐదు లక్షల ఎకరాల్లో పంటలకు తెగుళ్ల బెడద రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీరందక పంట రక్షణకు ఆపసోపాలు పడుతున్న అన్నదాతలను పంట తెగుళ్లు బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లో ప్రధాన పంటలు వివిధ తెగుళ్ల బారిన పడినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.
  • నంబులాద్రి స్వామివారు.. ఏడాదికి 3 రోజులే కొలువవుతారు! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కొదురుపాక నంబులాద్రిస్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో స్వామివారు సంవత్సరంలో మూడు రోజులే కొలువై భక్తులకు దర్శనమిస్తారు.
  • ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ: మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
  • భవన నిర్మాణ కార్మికుల బోర్డును ప్రక్షాళన చేస్తాం: మంత్రి వివేక్‌ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తామని, ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న కార్మికులను బదిలీ చేస్తామని శక్తి శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.
  • లలితా మహా త్రిపురసుందరి అలంకరణలో భద్రకాళి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం..ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు లలితా మహా త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • సత్వరమే మార్కెట్‌ యార్డులను డిజిటలీకరించాలి: మంత్రి తుమ్మల రాష్ట్రంలో మార్కెట్‌ యార్డులన్నింటిని వెంటనే డిజిటలీకరించి.. చెల్లింపుల ప్రక్రియ వంటివన్నీ ఆన్‌లైన్‌లో జరపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
  • గురుకులాల్లో బఫర్‌ స్టాక్‌ను సిద్ధం చేయండి: మంత్రి అడ్లూరి సంక్షేమ గురుకులాల్లో సరకుల కొరతకు తావులేకుండా ముందస్తుగా బఫర్‌ స్టాక్‌ను సిద్ధం చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.