పిడుగులా.. అలా.. అలా.. థండర్‌ బోల్ట్‌తో పవర్‌ ఫుల్‌ ఛార్జింగ్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 16 Oct 2026 18:47 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

మొబైల్‌ ఫోన్‌.. ఆధునిక తరం ల్యాప్‌టాప్‌ తదితర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఛార్జింగ్‌ పెట్టాలంటే యూఎస్‌బీ సీ కేబుల్‌ ఉందా? అని అడుగుతాం. కానీ ఇప్పుడు యూఎస్‌బీ 4 లేదా థండర్‌బోల్ట్‌ 4/5 ఉన్నాయా? అని అడుగుతున్నారు. చూడ్డానికి ఇవన్నీ ఒకేలా ఉంటాయి. కానీ సాంకేతికతలు వేర్వేరు. నిమిషాల్లోనే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఛార్జింగ్‌ అవ్వాలన్నా, జీబీల కొద్దీ డేటా అత్యంత వేగంతో బదిలీ చేయాలన్నా యూఎస్‌బీ 4, థండర్‌బోల్ట్‌ సాంకేతికత తప్పనిసరి. యూఎస్‌బీ సీ కేబుళ్లతో పోలిస్తే వేగవంతమైన స్పీడ్, మెరుగైన విద్యుత్తు సామర్థ్యం అందిస్తాయి. వీటి ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా మానిటర్లు, టీవీల్లో 4కే, 8కే వీడియోలు చూడొచ్చు... కాకపోతే ఈ వైర్ల ఖర్చు కాస్త ఎక్కువ. బ్రాండ్‌కు అనుగుణంగా రూ.1,500 నుంచి రూ.3వేల వరకు ఉంటాయి. యూఎస్‌బీ సీ కేబుల్‌ అయితే అందరికీ తెలిసిందే... యూఎస్‌బీ 4, థండర్‌బోల్ట్‌ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాటి  వివరాలేంటో తెలుసుకోండి.

  • యూఎస్‌బీ 4, థండర్‌బోల్ట్‌ 4/5 అనేవి ప్రత్యేక పరికరాలు కాదు.. యూఎస్‌బీ సీ అనే కేబుల్‌ వీటికి భౌతిక రూపం.
  • యూఎస్‌బీ సీ అనేది కేబుల్‌   కనెక్టర్‌. యూఎస్‌బీ 4, థండర్‌బోల్ట్‌ అనేవి దాని లోపలి సాంకేతికత. ఇదో ప్రొటోకాల్‌. టన్నెలింగ్‌ ద్వారా ఒకే పోర్టు నుంచి మానిటర్లు, డిస్‌ప్లేలు, గ్రాఫిక్‌ కార్డులు కనెక్ట్‌ చేస్తాయి.
  • యూఎస్‌బీ 4, థండర్‌ బోల్ట్‌ సాంకేతికత కలిగిన ప్రతి కేబుల్‌ తప్పనిసరిగా యూఎస్‌బీ సీ ఆకారంలోనే ఉంటుంది. కానీ ప్రతి యూఎస్‌బీ సీ కేబుల్‌ తప్పనిసరిగా యూఎస్‌బీ 4, థండర్‌బోల్ట్‌ సాంకేతికతను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని యూఎస్‌బీ 2.0/3.0/3.2 వేగంతో (480 ఎంబీపీఎస్‌/5జీబీపీఎస్‌/20జీబీపీఎస్‌) ఉండొచ్చు.
  • బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లోని యూఎస్‌బీ సీ పోర్టు కేవలం 480 ఎంబీపీఎస్‌ వేగానికే పరిమితం కావచ్చు. అదే సమయంలో ఒక ప్రొఫెషనల్‌ ల్యాప్‌టాప్‌లోని సీపోర్టు యూఎస్‌బీ 4/థండర్‌బోల్ట్‌ (40 జీబీపీఎస్‌ వేగం)కి మద్దతు ఇచ్చేలా ఉంటుంది. తయారీ సంస్థలు ఆయా పోర్టుల వెనక అమర్చే సాంకేతికత సామర్థ్యంపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

కేబుల్‌కు చెందిన ప్యాకింగ్, ప్లగ్‌పై యూఎస్‌బీ ఐఎఫ్‌ సర్టిఫికేషన్‌ లోగోతోపాటు యూఎస్‌బీ 40 జీబీపీఎస్‌/80 జీబీపీఎస్‌ అనే మార్కింగ్స్‌ ఉంటాయి. థండర్‌బోల్ట్‌ అయితే లైటెనింగ్‌ (మెరుపు గుర్తు) 4 లేదా లైటెనింగ్‌ 5 అని ఉంటాయి.

థండర్‌బోల్ట్‌ 4 పోర్టు:ఇంటెల్‌ నిర్వహించే సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌. కఠిన ప్రమాణాలు కలిగిన ప్రీమియం సాంకేతికత. ప్రతి థండర్‌బోల్ట్‌ 4 పరికరం తప్పనిసరిగా 40జీబీపీఎస్‌ వేగం, డ్యూయల్‌ 4కే డిస్‌ప్లే సపోర్ట్, 32 జీబీపీఎస్‌ పీసీఐ, ఛార్జింగ్‌కు కనీసం 15 వాట్లు, ల్యాప్‌టాప్‌ సపోర్టు చేయడానికి కనీసం ఒక పోర్టు గరిష్ఠంగా 100 వాట్ల వరకు పవర్‌ డెలివరీ అందించాలి.

థండర్‌బోల్ట్‌ 5:బహుళ 8కే మానిటర్లు, 540 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉంటుంది. 80 జీబీపీఎస్‌ నుంచి 120 జీబీపీఎస్‌ వేగాన్ని అందిస్తుంది. ఛార్జింగ్‌ పవర్‌ కనీసం 140 వాట్ల నుంచి 240 వాట్లు ఉంటుంది. ఇది నెక్ట్స్‌ జెన్‌ సాంకేతికత. సాధారణంగా రెండు వైపులా 80 జీబీపీఎస్‌ వేగాన్ని ఇస్తూ...హెవీ డిస్‌ప్లే మోడ్‌లో 120 జీబీపీఎస్‌ స్పీడ్‌ అందిస్తుంది. గేమింగ్, ప్రొఫెషనల్‌ వీడియో ఎడిటింగ్‌ వర్క్‌స్టేషన్లకు నుకూలిస్తుంది.

యూఎస్‌బీ 4వెర్షన్‌ 2.0 అయితే గరిష్ఠ వేగం 80 జీబీపీఎస్‌ ఉంటుంది. మెరుగైన బ్యాండ్‌ విడ్త్‌ అందిస్తుంది. ల్యాప్‌టాప్, పీపీ నుంచి ఒకేసారి 8కే మానిటర్లు అనుసంధానించినప్పుడు, ల్యాప్‌టాప్‌కి గ్రాఫిక్‌ కార్డులు అనుసంధానించినప్పుడు, ఏఐ మోడల్స్‌ ప్రాసెస్‌ చేసే సమయంలో.. ఎలాంటి లాగ్‌ లేకుండా ఉండేందుకు 120 జీబీపీఎస్‌ వేగం లభించేలా సర్దుబాటు చేసే అసిమ్మెట్రిక్‌ సాంకేతికతను కలిగి ఉంది.

యూఎస్‌బీ 4:2019లో విడుదలైన ప్రొటోకాల్‌ ప్రమాణం. థండర్‌బోల్ట్‌ 3 సాంకేతికతతో తయారైంది. 40 జీబీపీఎస్‌ గరిష్ఠ వేగం, 240 వాట్ల పవర్‌ డెలివరీ, డ్యూయల్‌ 4కేకి కనీసం ఒక డిస్‌ప్లే, యూఎస్‌బీ 3ఎక్స్, యూఎస్‌బీ 2.0, థండర్‌బోల్ట్‌ 3కి బ్యాక్‌వర్డ్‌ కంపాటిబిలీటీ ఉంటుంది. 

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 17:17 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సీట్ల లేక్క తేలింది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
  • పుర పోరుకు 5,485 కేంద్రాల్లో నామినేషన్లు రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
  • ఏడుగురు మేయర్, 20మంది ఛైర్మన్‌ అభ్యర్థులతో వైకాపా తొలి జాబితా మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మేయర్, ఛైర్మన్‌ అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా గురువారం ప్రకటించింది.
  • ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలంటూ పిల్‌ ‘స్థానిక’ ఎన్నికల్లో కల్పించిన బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన డాక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.
  • ప్రగతి సారథులు మహిళలే ‘స్వయం సహాయక సంఘాలు ఊహించని రీతిలో విస్తరించాయి. గ్రామీణ జీవన విధానాన్ని సమూలంగా మారుస్తూ, దేశ సమగ్రాభివృద్ధికి వెలకట్టలేని సేవలందిస్తున్నాయి.
  • నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు ‘మహిళ ఆర్థికంగా ఎదిగితే.. ఆ కుటుంబం పైకొస్తుంది.. స్త్రీలు అభివృద్ధి చెందితే.. దేశం పురోగమిస్తుంది.
  • రాష్ట్రపతికి మంగళగిరి చేనేత చీర,ఏటికొప్పాక కళాకృతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
  • చకచకా పోలవరం నిర్వాసితులకు ఇళ్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీ పనులనూ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది.
  • కూటమి విజయానికి జనసేన శ్రేణులు పాటుపడాలి ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగానే మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సాధించాం.
  • సర్వభూపాలంపై వేణుగోపాలుడిగా శ్రీవారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహనసేవ ఘనంగా జరింది.
  • అంత డబ్బు ఎలా సమకూరింది? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు.
  • ఆకాంక్షలు, విజయాలకు చిరునామా ఏపీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల జోడీ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది.
  • బ్యాంకింగ్‌ వ్యవస్థకు వెన్నెముక గ్రామీణ మహిళలు గ్రామీణ మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారు.
  • స్త్రీ శక్తితోనే సర్వతోముఖాభివృద్ధి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, సహజసిద్ధ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ వస్తువులను సరస్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచారు.
  • శ్రీవారి వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం...
  • విదేశీ నిపుణులకు ‘డయాఫ్రం వాల్‌ డాక్యుమెంట్‌’ పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి ప్యానళ్ల ఏర్పాటు, ఇతర అంశాలపై 36 పుస్తకాలతో సిద్ధం చేసిన డాక్యుమెంట్‌ను విదేశీ నిపుణుల బృందానికి అధికారులు గురువారం సమర్పించారు.
  • మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ బైక్‌ ర్యాలీ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31 నాటికి గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు చేరుకునేలా తలపెట్టిన ‘జాతీయ ద్విచక్ర వాహనాల ర్యాలీని (నేషనల్‌ మోటర్‌ సైకిల్‌ ర్యాలీ) డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
  • శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
  • స్కందమాతగా భ్రమరాంబాదేవి శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 
  • ఉపాధి కల్పిస్తున్నా.. బీటెక్‌ వైపే మొగ్గు! పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నా చాలా మంది వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.