భారత్ ‘బ్యాటు’ గర్జిస్తేనే.. విండీస్‌ ‘పట్టు’ తప్పేది!

Eenadu icon
By Sports News Team Updated : 16 Oct 2026 17:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఎప్పుడో 2002లో భారత్‌ గడ్డపై వెస్టిండీస్‌ (IND vs WI) ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గింది. ఇప్పుడు మళ్లీ అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, టీమ్‌ఇండియా దెబ్బకు ‘వన్డే’లను వదిలేసుకుంది. ఇక మిగిలిన ‘పొట్టి’ సిరీస్‌నైనా సొంతం చేసుకుందామనే దూకుడు మీదుంది. అన్నట్టుగానే ఐదు టీ20ల సిరీస్‌ రేసులోకి దూసుకొచ్చింది. బ్యాటింగ్‌ మెరుపులతో మరోసారి విజృంభించాలని చూస్తోన్న వేళ మనమూ అదే మంత్రం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక మరి.

ఈ స్టేడియం (Chinnaswamy Stadium) పేరు వినగానే.. భారీ స్కోర్లు గుర్తుకొస్తాయి కదా.. ఇతర వాటితో పోలిస్తే మైదానం హద్దులు కూడా కాస్త చిన్నవే. అసలే విండీస్‌ జట్టులో భీకరమైన హిట్టర్లు. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలంటే ‘పార్ట్‌ టైమ్‌’ బౌలర్లు సరిపోరు. స్పెషలిస్ట్‌లు ఉండాల్సిందే. గత నాలుగు మ్యాచుల్లో మాదిరిగా తొమ్మిదో స్థానం వరకూ బ్యాటింగ్‌ చేయగలవారికే ఛాన్స్‌ అంటే మాత్రం ‘విండీస్‌’ దూకుడుకు కళ్లెం వేయడం మళ్లీ కష్టమయ్యే ప్రమాదం లేకపోలేదు. 

ఐదో బౌలర్‌ ఉంటేనే..

ముగ్గురు ప్రధాన పేసర్లతోపాటు ఫాస్ట్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను టీమ్‌ఇండియా ( Team India) తీసుకుంటోంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ ఎలానూ ఉన్నాడు. అతడితోపాటు నమన్‌ ధిర్‌ను తీసుకుంటూ అతడితో బౌలింగ్ చేయిస్తోంది. ఆ తప్పిదాన్ని మరోసారి పునరావృతం చేయొద్దని మాజీలూ సూచిస్తున్నారు. ధైర్యమంటే.. ఐదుగురు నాణ్యమైన బౌలర్లతో బరిలోకి దిగడమేనని కైఫ్ వ్యాఖ్యానించాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లకు అడ్డుకట్ట వేయాలంటే ‘స్పెషలిస్ట్‌’ బౌలింగ్‌ దళం ఉండాలనేది అతడి అభిప్రాయం. కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశాలు ఇస్తూనే ఉండాలనే డిమాండ్లూ వస్తున్నాయి. బెంగళూరు మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్ పునరాగమనం చేయడం దాదాపు ఖాయమే. మయాంక్‌ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. వేగంతోపాటు నిలకడ చూపిస్తేనే వికెట్లు వస్తాయి. ప్రిన్స్‌ యాదవ్‌ ఫర్వాలేదు కానీ.. అతడికి వికెట్లు ఎక్కువగా రావడంలేదు. 

  • ఇది మిక్స్‌డ్‌ జెండర్ క్రికెట్‌.. ఒకే జట్టులో అమ్మాయిలు, అబ్బాయిలు

బ్యాటింగ్‌పైనా ఫోకస్

విండీస్ 250 పరుగుల టార్గెట్‌ను కూడా ఛేదించిందంటే ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్ ఆ స్థాయిలో ఉంది. కెప్టెన్ షై హోప్ (Shai Hope) ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. ఆ తర్వాత హెట్‌మయెర్, రూథర్‌ఫోర్డ్ మద్దతుగా నిలుస్తున్నారు. ఆఖర్లో షెఫర్డ్ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి నిలకడ మన బ్యాటర్లు చూపించడంలో కాస్త వెనుకబడ్డారు. ఓపెనర్లలో ఎవరో ఒకరు ఆడితే.. మరొకరు నిరాశపరుస్తున్నారు. నాలుగో టీ20లో సంజు దూకుడుగా ఆడితే.. అనూహ్యంగా అభిషేక్ నెమ్మదించాడు. కెప్టెన్ శ్రేయస్‌ ( Shreyas Iyer) నుంచి ఇంకాస్త మెరుగైన ఆటతీరు రావాలి. వైస్‌ కెప్టెన్ తిలక్ వర్మ తన బాధ్యతను సక్రమంగా చేస్తున్నా.. ఆఖర్లో అతడికి తోడుగా నిలిచేవారు లేకుండా పోతున్నారు. అక్షర్, నమన్ తమ ‘ఆల్‌రౌండ్‌’ ప్రతిభకు పదునుపెట్టాలి.

  • బెంగళూరులోనే భువీ పునరాగమనం..

చివరిగా:బౌలర్లు ఎంత కష్టపడినా.. చిన్నస్వామిలాంటి స్టేడియంలో భారీ స్కోరు తప్పదు. అలాంటప్పుడు బ్యాటింగ్‌ లైనప్‌ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ‘వెస్టిండీస్‌’ను (India vs West Indies) ఉత్త చేతులతో పంపించేందుకు అవకాశాలు ఉంటాయి. లేకపోతే పాతికేళ్ల కరవును తీర్చుకొనే ప్రమాదం లేకపోలేదు.

- ఇంటర్నెట్ డెస్క్‌

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 17:50 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇది మిక్స్‌డ్‌ జెండర్ క్రికెట్‌.. ఒకే జట్టులో అమ్మాయిలు, అబ్బాయిలు తొలిసారి నిర్వహిస్తోన్న మిక్స్‌డ్‌ జెండర్ టోర్నీకి కొలంబో వేదికగా నిలిచింది.
  • బెంగళూరులోనే భువీ పునరాగమనం.. భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం ఇంకాస్త ముందుగానే జరగనుంది. ఇప్పటికే కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అతడిని.. విండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కూ బీసీసీఐ తీసుకుంది.
  • రూ. 285 కోట్ల ఆదాయం.. మాకు దమ్మిడీ రాదు: విండీస్ బోర్డు సీఈవో భారత్‌తో సిరీస్‌ ఆడినా తమకు ఆదాయపరంగా ఎలాంటి ప్రయోజనం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. 
  • పిచ్‌లు బౌలర్లకు సహకరించేలా చూడండి..: మాజీ చీఫ్‌ సెలక్టర్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలం కాకుండా.. బౌలర్లకూ పిచ్‌ నుంచి సహకారం లభించేలా చూడాలని బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యానించారు.
  • అలా మద్యం మానేశా.. అది నాకు పునర్జన్మే: చాహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాహల్.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.
  • భారత్ - జింబాబ్వే టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు స్పెషల్ ఆఫర్ జింబాబ్వేతో భారత మహిళా జట్టు మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది.
  • బంతి బావురుమంటోంది! వన్డేలో 350 పైచిలుకు లక్ష్యం సరిపోలేదు. టీ20లో 250 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. భారత బౌలర్లను చూడగానే ప్రత్యర్థి బ్యాటర్లు పూనకాలొచ్చినట్లు రెచ్చిపోతున్నారు. అవతలి జట్టు కెప్టెన్‌ అయితే కెరీర్లో ఎన్నడూ లేనంతగా చెలరేగుతున్నాడు.
  • బౌలర్లనేమీ అనలేం.. బ్యాటర్లదే బాధ్యత భారత బ్యాటర్లు ఛేదనలో మరింత బాధ్యతగా ఆడాలని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ సూచించాడు. వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమ్‌ఇండియా 24 పరుగుల తేడాతో పరాజయంపాలైన నేపథ్యంలో ఆయన ఇలా అన్నాడు.
  • స్మృతి సారథ్యంలో.. భారత మహిళల క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతోంది. పదేళ్ల పాటు జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన హర్మన్‌ప్రీత్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌గా నియమితురాలైన స్మృతి మంధాన.. తొలి సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో ఆమె జట్టును ఎలా నడిపిస్తుందన్నది ఆసక్తికరం.
  • మీ విజయం యావద్భారతానికి గర్వకారణం ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల్ని దక్కించుకునే దిశగా భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
  • అంతర్జాతీయ క్రికెట్‌కు పూనమ్‌ రౌత్‌ గుడ్‌బై భారత సీనియర్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల ఈ ముంబయి ప్లేయర్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. పూనమ్‌ 2009-21 మధ్య 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
  • జగ్‌శేర్‌కు పతకం ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్‌ జగ్‌శేర్‌ సింగ్‌ సత్తాచాటాడు. అతడు సెమీఫైనల్లో అడుగుపెట్టి, భారత్‌కు పతకం ఖాయం చేశాడు.
  • చీఫ్స్‌.. 5 ఓటముల తర్వాత ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో వరుస పరాజయాలు చవిచూస్తున్న చోళా చీఫ్స్‌ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. గురువారం ఆ జట్టు 2-0తో పృథ్వీరాజ్‌ యోధాస్‌పై షూటాఫ్‌లో నెగ్గింది.
  • క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ భారత డబుల్స్‌ స్టార్లు పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ.. డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
  • విశ్వజీత్‌కు రజతం భారత గ్రీకో రోమన్‌ రెజ్లర్‌ విశ్వజీత్‌ మోరె అదరగొట్టాడు. అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు రజతం చేజిక్కించుకున్నాడు. ఈ టోర్నీలో వెండి పతకం గెలిచిన భారత తొలి రెజ్లర్‌గా ఘనత సాధించాడు.
  • సంక్షిప్త వార్తలు (3) ప్రపంచ నం.2 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) షాంఘై మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం అతడు 6-4, 6-4తో అలెక్స్‌ డి మినార్‌(ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
  • 15 ఏళ్ల వయసులోనే పతకాలు సాధించడం గర్వకారణం: మోదీ రాబోయే కాలంలో మరింతమంది కొత్త క్రీడాకారులు సిద్ధమవుతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
  • యశస్వి.. అలాంటివి వద్దు: మాజీ చీఫ్‌ సెలక్టర్ కీలక సూచన యశస్వి జైస్వాల్ కొత్తగా వికెట్ కీపర్ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసమే ప్రాక్టీస్ కూడా చేసేస్తున్నాడు.
  • ఆసియా గేమ్స్‌ పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని ఆసియా క్రీడల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు.
  • కివీస్‌తో వన్డే సిరీస్‌.. బుమ్రాకి రెస్ట్? కారణమిదేనా? కివీస్‌ పర్యటనలో భారత్ ఐదు వన్డేల సిరీస్‌ కూడా ఆడనుంది. కానీ, ఆ సిరీస్‌ నుంచి బుమ్రాకి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.