సుబ్బులక్ష్మి బయోపిక్.. ఇప్పటికీ బాధపడుతున్నా: విద్యాబాలన్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలనే తన కల నెరవేరనందుకు ఎంతో బాధగా ఉందని నటి విద్యాబాలన్ అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని (M.S Subbulakshmi biopic) ప్రస్తావించారు.
‘‘2014లో రాజీవ్ మేనన్‌తో కలిసి ఎం.ఎస్. సుబ్బులక్ష్మిపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ, ఆ సినిమాపై స్టే ఆర్డర్ ఉండటం వల్ల మేము ముందుకు వెళ్లలేకపోయాం. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నటించడం నా కల. అది తీరనందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. ఆమె పాడిన ‘సుప్రభాతం’ తోనే మా ఇంట్లో రోజు ప్రారంభమవుతుంది. ఆమె జీవితం గురించి నాకు చాలా విషయాలు తెలుసు. రాజీవ్ స్క్రిప్ట్ కూడా అద్భుతంగా రాశారు. కానీ, ఆ గొప్ప ప్రాజెక్ట్‌ను రూపొందించలేకపోయాం’’ అని చెప్పారు.
- రివ్యూ: క్రేజీ కళ్యాణం.. అనుపమ కొత్త చిత్రం వినోదాన్ని పంచిందా?
ఇక తన కలను ఫొటోషూట్‌తో తీర్చుకున్నట్లు విద్యాబాలన్ (Vidya Balan) తెలిపారు. ‘‘రెండేళ్ల క్రితం ఎం.ఎస్ సుబ్బులక్ష్మికి నివాళులర్పిస్తూ పొటోషూట్ చేశాం. అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నాకు చాలా అవకాశాలు కూడా వచ్చాయి’’ అని చెప్పారు. ‘ఎం.ఎస్’ పేరుతో రష్మిక ప్రధానపాత్రలో సుబ్బులక్ష్మి బయోపిక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ అనేది ఉప శీర్షిక. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జయమ్మ సేవలు.. తన నటనతో ప్రేక్షకులను అలరించడంతోనే కాదు.. ఆప్యాయతతో ప్రజలను ఆదుకోవడంలోనూ రష్మిక ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె జయమ్మగా రణబాలితో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ‘రణబాలి’ నేడు విడుదలైంది. ఈ సందర్భంగా రష్మిక చేసిన కొన్ని మంచి పనుల గురించి తెలుసుకుందాం..
- ఈరోజు బతికిపోయాను దేవుడా.. అనుకునేదాన్ని: అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న భయంకరమైన రోజులను అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయం తెలిసిందే.
- సినిమా పుట్టిందే విజయవాడలో..: నిర్మాత బండ్ల గణేశ్ సినిమాను పుట్టించిందే విజయవాడ.. సినిమా రంగాన్ని పైకి తీసుకువచ్చిందే విజయవాడ అని నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు.
- రివ్యూ: క్రేజీ కళ్యాణం.. అనుపమ కొత్త చిత్రం వినోదాన్ని పంచిందా? అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ ఎలా ఉంది? ఎలాంటి నవ్వులు పంచింది?
- డబ్బుల కోసం నటించాలని నేనెప్పుడూ అనుకోను! ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’’ అంటున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. ‘‘ఇది ఈ పండక్కి ప్రేక్షకులకు ఓ మంచి క్రేజీ ఫిల్మ్ చూశామన్న అనుభూతిని కలిగిస్తుంద’’ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె..
- కౌంట్‌డౌన్ మొదలైంది ఊహకందని ప్రపంచాన సాగించే సాహస యాత్రతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా... ఓ సాహస గాథతో తెరకెక్కుతున్న చిత్రమే ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
- మదిలో నిలిచిపోయే ప్రేమకథ సిద్ధం! జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ.. గ్లామర్‌కు నటనని జోడించి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కథానాయిక శ్రీలీల. ఇటీవల దక్షిణాదిలో అగ్రతారల సరసన మెరిసినామె..
- కరికాల ప్రారంభం సందీప్‌కిషన్ కథానాయకుడిగా... యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కరికాల’. కేథరిన్, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ కథానాయికలు. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాతలు.
- కొత్త కబురు వినిపించారు కథానాయకుడు సాయిదుర్గా తేజ్ కొత్త కబురు వినిపించారు. గురువారం పుట్టినరోజు సందర్భంగా తన 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్‌సిరీస్‌తో మెప్పించిన తేజ కాకుమానుని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయనున్నారు.
- నా జీవితంపై బయోపిక్ ఎప్పటికీ రాదు ఓవైపు సినిమాలు.. మరోవైపు పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్. త్వరలో ‘మాతృభూమి’ సినిమాతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని అలరించడానికి సన్నద్ధమవుతున్నారాయన.
- నవ్విస్తూ.. ఆలోచింపజేసేలా! లోమేశ్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్.కె తెరకెక్కిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’. పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్నారు. ప్రణీత పట్నాయక్, కృష్ణభగవాన్, విజ్ఞాని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- స్నేహితులు తక్కువ.. శత్రువులు ఎక్కువ ‘విధి నిర్వహణలో మాకు స్నేహితులు తక్కువ.. శత్రువులు ఎక్కువ’ అని అంటున్నారు మనోజ్ బాజ్పేయీ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘గజబ్ రాత్’ సినిమా గురించే ఇదంతా.
- విద్యాబాలన్‌తో అక్షయ్ ఆటాపాట? ఈ ఏడాది ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’, ‘హైవాన్’ లాంటి చిత్రాలతో ఇప్పటికే తెరపై మెరిశారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.
- సంక్షిప్త వార్తలు (3) బాలీవుడ్ అందాల తార శార్వరీ వాఘ్, హీరో ఆయుష్మాన్ ఖురానా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘యే ప్రేమ్ మోల్ లియా’. సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు.
- దీపికా పదుకొణె డిమాండ్‌లో తప్పేముంది?: 8 గంటల పనిపై ‘దృశ్యం 3’ నటి సినిమా సెట్లో రోజుకు 8 గంటలు మాత్రమే పని అనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి దీపికా పదుకొణె గతంలో ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’తో పాటు ‘కల్కి’ సీక్వెల్ నుంచి తప్పుకొన్నప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
- అప్పుడు రజనీ దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథి పాత్రలో: ‘జైలర్ 2’లో హృతిక్ ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్ అభిమానులు 40 ఏళ్ల క్రితం నాటి ఓ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.
- ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ దంపతులు ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా వేడుకల్లో విజయ్ దేవరకొండ దంపతులు పాల్గొన్నారు.
- రివ్యూ: జైలర్2.. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్ ఎలా ఉంది? రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ యాక్షన్ ఫిల్మ్ ‘జైలర్2’. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- వివాదాస్పద చిత్రం.. ట్రైలర్ రిలీజ్ మనోజ్ బాజ్పేయీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘గజబ్ రాత్ ’.
- అమ్మ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి.. ఇప్పుడు రూ.50 కోట్ల వసూళ్లతో సంచలనం! స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. ప్రచారానికి డబ్బుల్లేవు! అయినా ప్రేక్షకుల మనసులు గెలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోందో చిన్న కన్నడ సినిమా.