ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పనికిరారు.. జెలెన్‌స్కీపై ట్రంప్‌ మండిపాటు

Eenadu icon
By International News Team Published : 16 Oct 2026 10:24 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump) మరోసారి విమర్శలు గుప్పించారు. యుద్ధాన్ని ముగించడానికి జెలెన్‌స్కీ సుముఖంగా లేరని.. అందువల్లే రష్యాపై దాడులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. అమెరికాతో డీల్‌ చేసుకోవడానికి ఆయన సరైన వ్యక్తి కారని అన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఆయన ఇక ఎంత మాత్రం పనికిరారని.. కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం ఉత్తమమని ఆ దేశ ప్రజలకు సూచించారు. శాంతి చర్చలు, రాజీ యత్నాలంటూ బయటకు చెబుతారు కానీ.. లోపల మాత్రం యుద్ధం కొనసాగించాలనే ఆయన  కోరుకుంటారన్నారు. జెలెన్‌స్కీ వల్లే ఆ దేశం నాశనం అవుతోందని దుయ్యబట్టారు. మరోవైపు 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ యుద్ధం కొనసాగింపునకు గత ఒబామా, బైడెన్ ప్రభుత్వాలు అందించిన సాయంపై కూడా విమర్శలు చేశారు.

రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్‌ దాడి...

రష్యాలోని ర్యాజాన్‌ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం (oil refinery)పై ఉక్రెయిన్ గురువారం డ్రోన్‌ దాడులకు పాల్పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు మధ్య ఉక్రెయిన్‌లోని కిరోవోగ్రాడ్ ప్రాంతంపై మాస్కో విరుచుకుపడడంతో ముగ్గురు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య తక్షణమే ఇంధన వనరుల కాల్పుల విరమణ (Energy Ceasefire) ఒప్పందం అమల్లోకి వచ్చిందని ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది వెలువడి వారం కూడా పూర్తి కాక ముందే ఇరుదేశాలు పరస్పర దాడులకు పాల్పడుతుండడం గమనార్హం.  ఇదీ చదవండి: ఇరాన్‌ ‘అణు’చివేతకు మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌!

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు.. నిందితుడిని కాల్చేసిన స్థానికుడు US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో ఓరెగన్‌ రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో పసిబిడ్డలను లక్ష్యంగా చేసుకొని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ స్థానికుడు తెగించి ఎదురుదాడి చేయడంతో చాలా మంది చిన్నారుల ప్రాణాలు దక్కాయి.
  • ఇరాన్‌ ‘అణు’చివేతకు మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌! అమెరికా అమ్ములపొదిలో శక్తిమంతమైన సంప్రదాయ ఆయుధం మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ (ఎంవోఏబీ) మరోసారి తెరపైకి వచ్చింది.
  • పాక్‌లో కూలిన స్కూల్‌ పైకప్పు.. 34 మంది చిన్నారుల మృతి పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 34 మంది చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
  • అతి త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందానికి సంబంధించి కీలక అంశాలపై చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని మన దేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తెలిపారు.
  • ఆస్పత్రి నుంచే పని ప్రారంభించిన పోప్‌ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ కణితి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో - 14 బాగా కోలుకున్నారని, ఆయన గురువారం ఆస్పత్రి నుంచే పనిచేయడం ప్రారంభించారని చికిత్స అందించిన వైద్యులు, వాటికన్‌ అధికారులు వెల్లడించారు.
  • అమ్మో.. ఆ తుపాకీ పని చేసి ఉంటే! అమెరికా ఇల్లినోయీలోని అరోరాలో ఉన్న హిందూ దేవాలయంలో పెను ముప్పు తప్పింది. హిందూ మతంపై ద్వేషంతో కాల్పులు జరిపి పలువురిని హతమార్చాలని భావించిన అమెరికా టీనేజర్‌ తుపాకీ చివరి నిమిషంలో పని చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
  • మదీనాపై దాడి యత్నం తిప్పికొట్టాం: సౌదీ పవిత్ర మదీనా నగరంపై క్షిపణి దాడికి జరిగిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టామని సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి గురువారం వెల్లడించింది. అయితే ఈ దాడికి బాధ్యులెవరన్నది కూటమి పేర్కొనలేదు.
  • యెమెన్‌ ప్రభుత్వ భవనంపై హూతీల క్షిపణి దాడులు యెమెన్‌లో హూతీ తిరుగుబాటు దారులు మరోసారి విరుచుకుపడ్డారు. పోర్టు నగరమైన ఏడెన్‌లో ఉన్న ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ లక్ష్యంగా క్షిపణి దాడులు జరిపారు.
  • హర్మూజ్‌లో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు! హర్మూజ్‌ జలసంధిలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. సీమైన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC) వెల్లడించింది.
  • కుప్పకూలిన పాఠశాల పైకప్పు.. 34 మంది విద్యార్థులు మృతి పాకిస్థాన్‌ (Pakistan)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి (school roof collapses) 34 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.
  • పుతిన్‌ కోసమే స్టార్‌ ‘లింక్‌ తెగిందా’.. అమెరికా ప్రభుత్వం చేతిలో కీ..! Elon Musk-Starlink: శాటిలైట్ ఆధారిత స్టార్‌లింక్ (Starlink) సేవల భారత్‌ ప్రవేశ జాప్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
  • యువ జిమ్నాస్ట్‌ల నగ్న వీడియోలు చిత్రీకరించిన కోచ్‌.. 90 ఏళ్ల జైలు యువ జిమ్నాస్ట్‌ (young gymnasts)ల నగ్న వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన కోచ్‌కు అమెరికా (USA) న్యాయస్థానం 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
  • పడేనా ట్రంప్‌ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
  • కోలుకుంటున్న పోప్‌ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్‌ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్‌ మేరీ మిల్బెన్‌ ఆరోపించారు.
  • ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే... ఎలాన్‌ మస్క్‌ కూడా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్‌ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్‌ బుధవారం పేర్కొంది.