కెనడా విచ్ఛిన్నానికి అమెరికా యత్నాలు: కార్నీ సంచలన వ్యాఖ్యలు

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: తమ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రావిన్స్ ఆల్బెర్టాలో వచ్చే సోమవారం రిఫరెండం జరగనున్న నేపథ్యంలో ప్రచార ర్యాలీలో కార్నీ మాట్లాడారు. ఆల్బెర్టా (Alberta) కెనడాలో భాగంగా ఉండేలా ఆ ప్రావిన్స్ ప్రజలు ఓటు వేయాలని కోరారు. అందుకు భిన్నంగా జరిగితే.. విభజన, అనిశ్చితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ప్రపంచం ప్రమాదకరంగా, సొంత లక్ష్యాల ఆధారంగా విడిపోయి ఉంది. మన సరిహద్దులకు అవతల ఉన్నవారు మనల్ని విచ్ఛిన్నం చేసి, గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా ఏమాత్రం అనుకూలంగా లేని సమయంలో రిఫరెండం జరుగుతోంది. ఇందులో నిర్ణయాత్మక ఫలితం వేర్పాటువాద సమస్యను పరిష్కరిస్తుంది. ఆల్బెర్టా విడిపోవడానికి వేసే ఓటు సంవత్సరాల తరబడి అనిశ్చితికి దారితీస్తుంది’’ అని ఆ ప్రావిన్స్ ప్రజలను హెచ్చరించారు.
- ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనికిరారు.. జెలెన్స్కీపై ట్రంప్ మండిపాటు
ప్రస్తుతం అమెరికా, కెనడా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది (USA-Canada). మరోవైపు కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని పలు సందర్భాల్లో ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యలకు గతంలోనే కార్నీ కౌంటర్ ఇచ్చారు. ఆల్బెర్టా ప్రజలు కెనడా నుంచి విడిపోవాలని గతంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ( Elon Musk) చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
ఆల్బెర్టా.. చమురు, సహజవాయువులతో సుసంపన్నమైన ప్రాంతం. తాము కెనడా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో సహకరిస్తున్నప్పటికీ.. తమకు లభిస్తున్న ప్రాతినిధ్యం, నిధులు తక్కువని ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆర్థిక అసమానతలు, ఫెడరల్ ప్రభుత్వ విధానాలు, రాజకీయ విభేదాలు వేర్పాటువాద ఆలోచనకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న ఓటింగ్ జరగనుంది. కెనడా నుంచి వేరుపడే ప్రక్రియను చట్టబద్ధంగా ప్రారంభించాలా.. వద్దా..?అనే దానిని దీని ద్వారా నిర్ణయించనున్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 11:12 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనికిరారు.. జెలెన్స్కీపై ట్రంప్ మండిపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు.
- ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు.. నిందితుడిని కాల్చేసిన స్థానికుడు US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో ఓరెగన్ రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో పసిబిడ్డలను లక్ష్యంగా చేసుకొని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ స్థానికుడు తెగించి ఎదురుదాడి చేయడంతో చాలా మంది చిన్నారుల ప్రాణాలు దక్కాయి.
- ఇరాన్ ‘అణు’చివేతకు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్! అమెరికా అమ్ములపొదిలో శక్తిమంతమైన సంప్రదాయ ఆయుధం మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (ఎంవోఏబీ) మరోసారి తెరపైకి వచ్చింది.
- పాక్‌లో కూలిన స్కూల్ పైకప్పు.. 34 మంది చిన్నారుల మృతి పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 34 మంది చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
- అతి త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందానికి సంబంధించి కీలక అంశాలపై చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని మన దేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.
- ఆస్పత్రి నుంచే పని ప్రారంభించిన పోప్ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్ లియో - 14 బాగా కోలుకున్నారని, ఆయన గురువారం ఆస్పత్రి నుంచే పనిచేయడం ప్రారంభించారని చికిత్స అందించిన వైద్యులు, వాటికన్ అధికారులు వెల్లడించారు.
- అమ్మో.. ఆ తుపాకీ పని చేసి ఉంటే! అమెరికా ఇల్లినోయీలోని అరోరాలో ఉన్న హిందూ దేవాలయంలో పెను ముప్పు తప్పింది. హిందూ మతంపై ద్వేషంతో కాల్పులు జరిపి పలువురిని హతమార్చాలని భావించిన అమెరికా టీనేజర్ తుపాకీ చివరి నిమిషంలో పని చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- మదీనాపై దాడి యత్నం తిప్పికొట్టాం: సౌదీ పవిత్ర మదీనా నగరంపై క్షిపణి దాడికి జరిగిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టామని సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి గురువారం వెల్లడించింది. అయితే ఈ దాడికి బాధ్యులెవరన్నది కూటమి పేర్కొనలేదు.
- యెమెన్ ప్రభుత్వ భవనంపై హూతీల క్షిపణి దాడులు యెమెన్‌లో హూతీ తిరుగుబాటు దారులు మరోసారి విరుచుకుపడ్డారు. పోర్టు నగరమైన ఏడెన్‌లో ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లక్ష్యంగా క్షిపణి దాడులు జరిపారు.
- హర్మూజ్‌లో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు! హర్మూజ్ జలసంధిలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. సీమైన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) వెల్లడించింది.
- కుప్పకూలిన పాఠశాల పైకప్పు.. 34 మంది విద్యార్థులు మృతి పాకిస్థాన్ (Pakistan)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి (school roof collapses) 34 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.
- పుతిన్ కోసమే స్టార్ ‘లింక్ తెగిందా’.. అమెరికా ప్రభుత్వం చేతిలో కీ..! Elon Musk-Starlink: శాటిలైట్ ఆధారిత స్టార్‌లింక్ (Starlink) సేవల భారత్ ప్రవేశ జాప్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
- యువ జిమ్నాస్ట్‌ల నగ్న వీడియోలు చిత్రీకరించిన కోచ్.. 90 ఏళ్ల జైలు యువ జిమ్నాస్ట్ (young gymnasts)ల నగ్న వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన కోచ్‌కు అమెరికా (USA) న్యాయస్థానం 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
- పడేనా ట్రంప్ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
- కోలుకుంటున్న పోప్ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
- కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు.
- ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే... ఎలాన్ మస్క్ కూడా ఉక్రెయిన్ను దెబ్బకొట్టారు.
- జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
- మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్ బుధవారం పేర్కొంది.