



మన బంగారు కొండలు.. ‘బాగు పడేలా మాటలు!’

- A
- A+
- A++
‘వీడికి చెప్పడం ఇక నా వల్ల కాదు’ ‘చెప్పీచెప్పీ నా నోరు పోతుందే తప్ప అమ్మాయి మారడం లేదు’
ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో తల్లిదండ్రులు అనే మాటలే ఇవి. ఉద్యోగరీత్యా, ఇతర పనుల్లో భాగంగా ఉదయం వెళ్లి.. సాయంత్రానికి తిరిగివస్తుంటారు. ఈ మధ్యలో పిల్లలకు అప్పగించిన పని చేయకపోతే.. ‘ఇంకా చేయలేదా’, ‘చెబితే వినవా’ అంటూ అసహనం వ్యక్తం చేస్తుంటారు. కొందరైతే.. ‘చెప్పడమే వేస్ట్’ అనే భావనలో ఉండిపోతారు. అయితే, ఈ ధోరణి సరైంది కాదని, ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పిల్లలు వినడం లేదని చెప్పడం మానేస్తే వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టినట్లేనని హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో తీవ్ర మార్పులు వస్తాయంటున్నారు.
- చిన్నారుల్లో ఏకాగ్రత, భావోద్వేగాలు నియంత్రించుకునే సామర్థ్యం తగ్గుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ అధ్యయనం వెల్లడిస్తోంది.
- తమ నిర్ణయాలే సరైనవి అనుకునే ప్రమాదముంది.
- సందేహం వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందిపడతారు.
- కొన్నాళ్లకు మొండిగా మారుతారు.
- పెద్దలపై గౌరవం పోయి.. శత్రువుల్లా చూస్తారు.
- ఆలోచనా శక్తి తగ్గుతుంది.
ఒక బాక్సింగ్ ప్లేయర్.. మొదటి రౌండ్లోనే రింగ్‌లో ప్రత్యర్థి చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్నాడు. ముక్కు నుంచి రక్తం కారుతుంటే సహాయకులు వచ్చి శుభ్రం చేస్తుంటారు. ఒకరు రుమాలుతో విసురుతుంటే, మరొకరు శరీరంపై చరుస్తూ ప్రోత్సహిస్తుంటారు. క్రీడాకారుడు ప్రత్యర్థి వైపు చూస్తుంటాడు. ఇవేమీ పట్టించుకోని కోచ్.. క్రీడాకారుడు వింటున్నాడా లేదా అని కూడా చూడకుండా అతని చెవిలో ఏదో చెబుతూనే ఉంటాడు. శిక్షణ సమయంలో చెప్పిన విషయాలే కావచ్చు. కోచ్ చెప్పడం మాత్రం ఆపడు. ఇలా వంద చెబితే.. ఆ సమయానికి కావాల్సిన టెక్నిక్ ఒక్కటైనా క్రీడాకారుడికి తడుతుందనే తాపత్రయమే ఆ కోచ్‌ది. ఇదే ధోరణి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అవసరమంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. చెప్పినవన్నీ పిల్లలు చేయాల్సిన అవసరం లేదు. పది చెప్పినప్పుడు నాలుగు విన్నా చాలు. జీవితంలో ఏదో ఒక సందర్భంలోనైనా అవి ఉపయోగపడతాయి. అందుకే పిల్లల స్పందన ఎలా ఉన్నాసరే నిత్యం కొత్త, పాత విషయాలు చెబుతూనే ఉండాలి.
ఒకే మాటను పదేపదే అరుస్తూ చెబితే చిన్నారులు పట్టించుకోరు. ఉపన్యాసాలు ఇవ్వకుండా వయసుకు తగినట్లు చెప్పాలి. ముందు వినడం నేర్పించాలి. రెండు, మూడేళ్ల ప్రాయంలో అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. చిన్నపిల్లలకు ఒక్కసారి ఒక్క సూచనే ఇవ్వాలని, వయసుకు తగ్గ పనే చెప్పాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల అధ్యయనం తెలుపుతోంది. మాట వినకపోవడాన్ని ప్రతిసారీ మొండితనంగా భావించొద్దు. ఆకలి, అలసట, పనిలో కష్టం, ఆందోళన, స్పష్టతలేమి ఉండొచ్చు. అందుకే ‘ఎందుకు చేయలేదు’ అనే ప్రశ్నకు ముందు ‘ఏ భాగం కష్టంగా అనిపించింది’ అని అడిగితే సమాధానం దొరుకుతుంది.
పిల్లలు కేవలం ఇంట్లోనే మాట వినడం లేదా, బడిలోనూ అలాగే ఉంటున్నారా అని గమనించాలి. తరచూ మరిచిపోతున్నారా, సాధారణ పనులూ పూర్తి చేయలేకపోతున్నారా, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చిందా చూడాలి. వీటిని మొండితనంగా కొట్టిపారేయొద్దు. భావోద్వేగాలకు సంబంధించినవి కావొచ్చు. ప్రతిదానికి తలూపడం సరికాదని చెప్పాలి. అసౌకర్యం, అనుచితం, ప్రమాదకరంగా అనిపించే సూచనలకు వద్దని చెప్పడం కూడా నేర్పించాలి.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 15:38 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- డబుల్ డ్యూటీకి సెలవుల్లేవ్! డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలని.. డీఆఫ్, సీఆఫ్ (సంబంధిత సెలవులు) మంజూరు చేయవద్దంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదేశించింది.
- ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం విచారించాలి ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సవాల్ చేస్తూ విజయ్‌గోపాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ సిద్ధం.. దసరా నుంచి ఓపీ సేవలు ఎంజీఎం భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనంలోకి వైద్య విభాగాలను తరలించి సేవలు అందించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
- ఒకరి నష్టం నుంచి మరొకరు ధనవంతులు కాకూడదు బుక్ చేసుకున్న ఫ్లాట్‌ను అప్పగించడంలో విఫలమైన రియల్ఎస్టేట్ సంస్థ డబ్బు వాపస్ ఇచ్చినప్పుడు దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అతను సొంతంగా చెల్లించిన మొత్తం మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
- సింగరేణి భవిష్యత్తుపై కేటీఆర్ మొసలి కన్నీరు సింగరేణి భవిష్యత్తు, బకాయిలపై మాజీ మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.
- ‘రైతు బీమా’ కొనసాగించకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా ‘బొగ్గు ఉత్పత్తి లేక విద్యుత్తు నిలిచిపోతోంది. జల లభ్యత ఉన్నా ప్రాజెక్టుల్లో మోటార్లు నడవకపోవటంతో నీళ్లు వస్తలేవు. రాష్ట్రంలో మూడు నెలల నుంచి రైతు బీమా పథకం ఆగిపోయింది. మూడు వేల రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
- తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్తలను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
- ఐదు లక్షల ఎకరాల్లో పంటలకు తెగుళ్ల బెడద రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీరందక పంట రక్షణకు ఆపసోపాలు పడుతున్న అన్నదాతలను పంట తెగుళ్లు బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల్లో ప్రధాన పంటలు వివిధ తెగుళ్ల బారిన పడినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.
- నంబులాద్రి స్వామివారు.. ఏడాదికి 3 రోజులే కొలువవుతారు! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక నంబులాద్రిస్వామి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో స్వామివారు సంవత్సరంలో మూడు రోజులే కొలువై భక్తులకు దర్శనమిస్తారు.
- ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ: మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
- భవన నిర్మాణ కార్మికుల బోర్డును ప్రక్షాళన చేస్తాం: మంత్రి వివేక్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తామని, ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న కార్మికులను బదిలీ చేస్తామని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
- లలితా మహా త్రిపురసుందరి అలంకరణలో భద్రకాళి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం..ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు లలితా మహా త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
- సత్వరమే మార్కెట్ యార్డులను డిజిటలీకరించాలి: మంత్రి తుమ్మల రాష్ట్రంలో మార్కెట్ యార్డులన్నింటిని వెంటనే డిజిటలీకరించి.. చెల్లింపుల ప్రక్రియ వంటివన్నీ ఆన్లైన్లో జరపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
- గురుకులాల్లో బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయండి: మంత్రి అడ్లూరి సంక్షేమ గురుకులాల్లో సరకుల కొరతకు తావులేకుండా ముందస్తుగా బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.
- అన్ని విచారణలను త్వరగా తేల్చాలని ఈడీ, సీబీఐకి లేఖలు రాయాలి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ త్వరగా తేల్చాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు, కాళేశ్వరం విచారణ త్వరగా చేపట్టాలని సీబీఐకి లేఖలు రాయాలని కేటీఆర్‌కు.. ప్రభుత్వ విప్ వేముల వీరేశం సూచించారు.
- చిత్రాలతో ‘గీతా’సారం ‘జ్ఞానేనతు తద జ్ఞానం యేషాం నాశిత మాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయంతి తత్పరం’’ భగవద్గీత ఐదో అధ్యాయంలోని ఈ శ్లోకం భావం ఎంతో గొప్పదైనా.. దీన్ని తెలుగులోకి అనువదించి, విడమరిచి చెబితేగానీ అర్థం చేసుకోలేరు.
- ఔషధ దుకాణాల్లో అనేక ఉల్లంఘనలు రాష్ట్రవ్యాప్తంగా వందల ఔషధ దుకాణాల్లో అనుమతుల్లేకుండా పలు రకాల మందులు అమ్ముతూ..వ్యాపారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ‘టీజీ సేఫ్’ డ్రగ్స్ విభాగం అధికారులు వెల్లడించారు.
- సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ: శ్రీపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మొండివైఖరి అవలంబిస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
- ఏఐపీసీ ఛైర్మన్‌గా మధుయాస్కీగౌడ్ బాధ్యతల స్వీకరణ ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) ఛైర్మన్‌గా మధుయాస్కీగౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం దిల్లీలోని ఏఐసీసీ భవన్లో గురువారం జరిగింది.
- విడిపోని బంధానికి 24 ఏళ్లు.. నేడు వీణ-వాణీల పుట్టినరోజు అవిభక్త కవలలు వీణ-వాణీలు శుక్రవారం 24వ వసంతంలోకి అడుగిడనున్నారు.