‘రణబాలి’ రివ్యూ.. విజయ్, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా..!

- A
- A+
- A++
Ranabaali Movie Review || చిత్రం: రణబాలి; నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక, ఆర్నాల్డ్ ఓస్లూ, ఈశ్వరీరావు తదితరులు; సంగీతం: అజయ్-అతుల్; రచన, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్; నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్; విడుదల: 16-10-2026 (Ranabaali Movie Release Date)

తక్కువ సమయంలోనే అటు యువతరానికీ... ఇటు కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరైన కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇటీవల కాలంలో ఆయన సినిమాల ఫలితం ఎలా ఉన్నా, ప్రేక్షకుల్లో క్రేజ్‌లో ఏమాత్రం తగ్గలేదు. ‘రణబాలి’ సందడే అందుకు ఉదాహరణ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం (Ranabaali Movie) ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
కథేంటంటే..
Ranabaali Movie Story || 1870 కాలం అది. మద్రాస్ ప్రెసిడెన్సీలో తీవ్రమైన కరవు సంభవిస్తుంది. తినడానికి మెతుకు దొరకదు. మరోవైపు ఆంగ్లేయుల అరాచకాలు కొనసాగుతుంటాయి. పన్ను కట్టాలంటూ పండించిన ధాన్యాన్ని పోర్టుల నుంచి తరలిస్తుంటారు. ఆ ప్రాంతానికి కమిషనర్‌గా ఉన్న సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ ఓస్లూ) ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని తరలించి మరో పెద్ద పదవిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలోనే లక్షల మంది ఆకలితో చనిపోతున్నా అసలేమాత్రం లెక్కచేయడు. ఇదంతా శింగనమలని కాపు కాస్తున్న పాలెగాడు బొబ్బిలి రణబాలి ( )కి తెలుస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? కరవు రాక్షసుడిగా పేరు పడిన హెక్టర్‌ని ఎదిరించే క్రమంలో రణబాలికి ఎదురైన పరిణామాలేంటి?ఈ పోరాటంలో జయమ్మ ( ) పాత్ర ఏంటి?శింగనమలలో వందల యేళ్ల కిందట జీవసమాధి అయిన భద్రమల్లన్న తాతకు, రణబాలికీ సంబంధం ఏమిటనే విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
Ranabaali Review || వెలుగు చూడని చరిత్రని ప్రపంచానికి తెలియజెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే ‘రణబాలి’ అని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ వేడుకలో చెప్పారు. బ్రిటిష్ కాలంలో జరిగిన అకృత్యాలు, భారత స్వాతంత్రోద్యమ నేపథ్యం, అందులో పాల్గొన్న మన వీరుల కథలతో ఇప్పటికే పలు భాషల్లో ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. అందుకే, ఈ చిత్రంతో కొత్తగా ఏం చెబుతున్నారు? అనే ఉత్సుకత వ్యక్తం కావడం సహజం. అయితే, తన మాటలకు తగ్గట్టుగానే మన చరిత్ర పెద్దగా చూపించని కోణాన్ని ఈ తో పక్కాగా స్పృశించారు దర్శకుడు. 1870 దశకంలో భారతావనిని వెంటాడిన కరవు రక్కసి నేపథ్యాన్ని ఓ మంచి డ్రామాతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందీ చిత్రం. రాయలసీమ వీరుల స్ఫూర్తితో సృష్టించిన కల్పిత పాత్ర శింగనమల బొబ్బిలి రణబాలి తిరుగుబాటు ఈ చరిత్రని ముందుకు నడిపిస్తుంది. చరిత్రకు ఊరి దేవుడు, వీరుడి నేపథ్యాన్ని ముడిపెడుతూ ఈ కథని మలిచిన విధానం చూస్తే... ఓ రచయితగా రాహుల్ ( )కు వందకు వంద మార్కులు పడతాయి. కొత్త కోణంలోని కథని ఎంచుకున్నప్పటికీ, దాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకు రాలేకపోయారు. ఊహకు తగ్గట్టుగా సాగే కథనం, నిడివి కారణంగా చాలాచోట్ల సినిమాను సాగదీశారనే భావన కలుగుతుంది.

అయితే, కరవును ప్రతిబింబించే ప్రపంచాన్ని సృష్టించడంలో చిత్రబృందం (Ranabaali Cast and Crew) విజయవంతమైంది. కథానాయకుడి పుట్టుక, కారణం, గండం, ఉత్సవాల నేపథ్యం తర్వాత హీరో తెరకు పరిచయమవుతాడు. తొలి పోరాటంతోనే అతడి పాత్రలోని మొరటుదనం, కరకుదనం పూర్తిగా అర్థమయ్యేలా చేశాడు దర్శకుడు. జయమ్మ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రణబాలి, జయమ్మ పాత్రల మధ్య ప్రేమ, భావోద్వేగాలు బాగా పండాయి. పన్ను కోసం ఊరికొచ్చి వేధిస్తున్న ఆంగ్లేయులకు కారం పెట్టి బెదిరించడం, ఓ చిన్న పాపతో ముడిపెట్టి గుత్తి క్యాంప్‌నకు కథానాయకుడు వెళ్లేలా చేయడంలాంటి సన్నివేశాల్లో బలమైన రచన కన్పిస్తుంది.
కథానాయకుడు ( Vijay Deverakonda) సవాల్ విసిరే సన్నివేశంతో ప్రథమార్ధం ముగుస్తుంది. ద్వితీయార్ధంలో గుహ నేపథ్యంలో సాగే పోరాటం ఆకట్టుకుంటుంది. ఆ తర్వాతే సినిమాలో వేగం తగ్గిపోతుంది. ఈ కథకి దైవత్వాన్ని జోడించి, కొత్తదనాన్ని తీసుకొచ్చింది చివరి అంకమే. అయితే అంతకుముందు సాగే పోరాట ఘట్టాలే పతాక సన్నివేశాల్ని తలపించడం, ఊహకు తగ్గట్టుగా సాగే మలుపులతో చివరి అంకం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మొత్తంగా చరిత్రని వాణిజ్య కోణంలో చెప్పాలనుకోడంలో రాహుల్ (Director Rahul Sankrityan) కొంతమేర విజయవంతమయ్యారు.
ఎవరెలా చేశారంటే..
Ranabaali Cast and Crew || రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ తీరు ఆకట్టుకుంటుంది. రాయలసీమ పాలెగాడిని తలపించేలాగే ఉంది ఆయన ఆహార్యం. ఆ యాసలో సంభాషణలు పలికిన విధానం బాగుంది కానీ, కొన్ని చోట్ల బిగపట్టి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. జయమ్మ పాత్రలో రష్మిక (Rashmika Mandanna) సహజంగా ఒదిగిపోయారు. వీరి మధ్య పండిన కెమిస్ట్రీ సినిమాపై బలమైన ప్రభావం చూపించింది. విలన్‌గా మమ్మీ ఫేం ఆర్నాల్డ్ ఓస్లూ, కథానాయకుడి తల్లిగా ఈశ్వరీరావు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. మైమ్ మధు, కిశోర్, వినోద్‌సాగర్ తదితర సహాయ నటుల పాత్రలు బాగున్నాయి.
సాంకేతికంగా సినిమా (Ranabaali Movie) ఉన్నతంగా ఉంది. నీరవ్ షా విజువల్స్ సినిమాకి ప్రధానబలం. 1870 దశకం నేపథ్యాన్ని, కరవు నేలని అత్యంత సహజంగా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. అజయ్ - అతుల్ సమకూర్చిన పాటల్లో ఏందయ్యా సామీ, రణబాలి పాటలు మెప్పిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాపై ప్రభావం చూపించింది. ఎడిటింగ్ విభాగం ఇంకొంచెం పనిచేయాల్సిందనిపిస్తుంది. దర్శకుడు రాహుల్ ప్రయత్నం అభినందనీయం. ఆయన ప్రయత్నంలో నిజాయతీ కనిపిస్తుంది. కథని చెప్పడంలో ఇంకాస్త వేగం పెంచుంటే ఫలితం మరోలా ఉండేది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + కథ
- + భావోద్వేగాలు
- + విజయ్, రష్మిక జోడీ
- బలహీనతలు
- - నిడివి
- - ఊహకందేలా కొన్ని సన్నివేశాలు
- చివరిగా: రణబాలి... మెప్పిస్తాడు! (Ranabaali Movie Review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రివ్యూ: క్రేజీ కళ్యాణం.. అనుపమ కొత్త చిత్రం వినోదాన్ని పంచిందా? అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ ఎలా ఉంది? ఎలాంటి నవ్వులు పంచింది?
- రివ్యూ: జైలర్2.. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్ ఎలా ఉంది? రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ యాక్షన్ ఫిల్మ్ ‘జైలర్2’. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- సాఫ్ట్వేర్ కంపెనీలో పెళ్లికాని ప్రసాదు: ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రివ్యూ ఇంటిల్లిపాది ఆస్వాదించేగలిగే కంటెంట్‌తో ప్రేక్షకులకు చేరువైంది ఈటీవీ విన్. ఈ సంస్థ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించారు.
- రివ్యూ: హనుమాన్ అంశ్.. తెలుగువారినీ అలరిస్తుందా? బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి భక్తి భావాన్ని నింపింది?
- రివ్యూ: ఖలీఫా: ది రూలర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన ‘ఖలీఫా: ది రూరల్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్.. శ్రీవిష్ణు ఎంటర్టైనర్ మెప్పించిందా? శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- అమ్మాయి ‘నో’ చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య.. నేరం ఎవరిది?: ‘పూజా మేరీ జాన్’ రివ్యూ తాను ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమకు ‘నో’ చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే, ఆ యువతి నేరస్థురాలవుతుందా?ఈ విషయాన్ని చర్చిస్తూ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan).
- రివ్యూ: #లవ్.. ఆ 60 రోజుల డేటింగ్లో ఏం జరిగింది? మోడ్రన్ రిలేషన్షిప్స్ నేపథ్యంలో ‘#లవ్’ (#Love) వెబ్ సిరీస్ విడుదలైంది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) నిర్మాణంలో, ‘మారి’, ‘మారి 2’ చిత్రాల దర్శకుడు బాలాజీ మోహన్ (Balaji Mohan) దీన్ని తెరకెక్కించారు.
- రివ్యూ: ది ఇండియా స్టోరీ.. ఆ పాప హత్యకు కారణం ఎవరు? కాజల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కాజల్ పోరాటం ఎవరిపై చేసింది?
- రివ్యూ: తెల్లకాగితం.. రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? హర్ష్ రోషన్ కథానాయకుడిగా నటించిన ‘తెల్లకాగితం’ బలమైన ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: సిగ్మా.. దర్శకుడిగా సీఎం విజయ్ కుమారుడి ఫస్ట్ మూవీ ఎలా ఉంది? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన ‘సిగ్మా’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: దృశ్యం: ది కన్‌క్లూజన్.. సమీర్ చావుకు హిందీలోనైనా ముగింపు పలికారా? అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఫహద్ ఫాంటసీ ఫిల్మ్ మెప్పించిందా? మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: డోరతీ.. వార్తల్లో నిలిచిన కీర్తి సురేశ్ కొత్త మూవీ ఎలా ఉంది? కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ‘డోరతీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- మూగ యువతి కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారితే: ‘బేబీ డూ డై డూ’ రివ్యూ ప్రముఖ నటి హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రధారిగా నటించిన ‘బేబీ డూ డై డూ’ రివ్యూ.
- రివ్యూ: ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్.. ఫాంటసీ థ్రిల్లర్ మెప్పించిందా? సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ది వన్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: అనుమాన పక్షి.. రాగ్ మయూర్ మూవీ వినోదాన్ని పంచిందా? రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘అనుమాన పక్షి’. ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: ‘ది ప్యారడైజ్’.. నాని యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- ఫస్ట్ నైట్ రోజే వధువు ‘సారీ బ్రో..’ అంటే! ‘మొద రాత్రి’ రివ్యూ ‘మొద రాత్రి’ రివ్యూ. ఈరోజుల్లో ఒకరిని ప్రేమించి, ఆ విషయం తల్లితండ్రులకు చెప్పలేక అయిష్టంగానే మరొకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతున్నదే. అలాంటి ఘటన ఆధారంగా రూపొందిన సినిమా ఇది.
- రివ్యూ: ‘లస్ట్ స్టోరీస్ 3’.. సిద్ధార్థ్-అదితి దంపతుల ఆంథాలజీ ఎలా ఉంది? మహిళల లైంగిక స్వేచ్ఛ గురించి ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ చర్చించాయి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 3’ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.