
ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం

- A
- A+
- A++

ఊబకాయం పిల్లల నుంచి పెద్దల దాకా పెను సమస్యై కూర్చుంది. దీన్ని తగ్గించుకోవడానికి జనం పడే తంటాలు అన్నీఇన్నీ కావు. వైద్య చికిత్సలు, వ్యాయామాలు, ఆహారపు అలవాట్లను మార్చకోవడం.. ఇలా చేయాల్సినవన్నీ చేస్తుంటారు. అయితే జీవనశైలిలో మార్పులతోనే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. దీని కట్టడికి తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల్ని సైతం జారీచేసింది. వీటి ఉద్దేశం కేవలం బరువు తగ్గించడమే కాదు.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం అని సూచిస్తోంది. ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలకు అనుగుణంగా బరువు తగ్గించే పద్ధతులను నిర్ణయించటం, దీర్ఘకాల అనుశీలనం ముఖ్యమని నొక్కి చెబుతోంది. మానసిక ఆరోగ్య సంరక్షణకూ పెద్దపీట వేయాలని చెబుతోంది. ఊబకాయాన్ని ‘దీర్ఘకాల, తిరగబెట్టే జబ్బు’గా డబ్ల్యూహెచ్ఓ నిర్వచించింది.
- ఊబకాయ పిల్లలు జీవితంలో తొలి దశలోనే ఆరోగ్యపరంగా, సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- ఊబకాయంతో మధుమేహం, గుండెజబ్బుల వంటి సాంక్రమికేతర వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
- నామోషీగా భావించడం, ఇతరుల వేధింపులకు గురికావటం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- ఆందోళన, కుంగుబాటు, ఆత్మ విశ్వాసం సన్నగిల్లటం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతారు.
- ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం, నలుగురితో కలవకపోవడం కారణంగా బరువు పెరుగుతారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం, 5-19 మధ్య వయసున్న వారిలో ఊబకాయం 1990లో 2 శాతం ఉండగా.. 2024లో 8 శాతానికి ఎగబాకింది. అంటే నాలుగు రెట్లు పెరిగిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 2024లో సుమారు 17 కోట్ల మంది బాలలు, యుక్తవయసు పిల్లలు ఊబకాయంతో బాధపడుతుండగా వారిలో ఐదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల లోపు పిల్లలు 7 కోట్లు. 19 ఏళ్లలోపు పిల్లలు 10 కోట్లు ఉండటం గమనార్హం.
- పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించటానికి మందులు, చికిత్సలు చివరి అవకాశాలుగానే పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.
- ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, ప్రవర్తన మార్పుల వంటి వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
- 0-9 వయసున్న పిల్లలకు మందులు, బరువును తగ్గించే పరికరాలు వాడొద్దు.
- 10-19 ఏళ్ల పిల్లలకు జీవనశైలి మార్పుల వంటి వాటితో ఫలితం లేకపోతేనే అనుమతి పొందిన మందులను ప్రయత్నించాలి.
- తీవ్ర ఊబకాయం ఉన్నవారికి కఠిన నిబంధనల మేరకే బేరియాట్రిక్ శస్త్రచికిత్సలను పరిగణనలోకి తీసుకోవాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ సాధనాలు చవకగా, అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మ్యూల్ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
- మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు.
- మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం మద్రాస్ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
- రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- స్పర్శ్ హాస్పీస్ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్ హాస్పీస్’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
- మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
- ట్రాన్స్ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండుతో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
- మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో రాష్ట్ర విద్యార్థుల సత్తా జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ప్రాజెక్టుల ఇన్స్పైర్ పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ చాటారు.
- కిమ్స్, యూకే ఆరోగ్య సంస్థల మధ్య ఒప్పందం వైద్య పరిశోధనలు, వైద్య విద్య, చికిత్సా రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కిమ్స్ హాస్పిటల్స్, బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బీఐఎంఎస్), యూకేలోని లివర్‌పూల్ ఎన్హెచ్ఎస్ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- అక్రమ భూములున్నట్లు నిరూపిస్తే అక్కడే రాసిస్తా: ఎంపీ చామల ‘నా పేరు మీద ఎసైన్డ్, అక్రమ భూములున్నట్లు భారాస నేతలు నిరూపిస్తే.. అధికారులను పిలిచి ఆ భూముల వద్దే రాసిస్తా’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
- భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం: ఒవైసీ భాజపా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
- సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ యత్నం సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని, ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
- నేటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పలు జిల్లాల్లో 15-18వ తేదీ మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
- తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా తెలంగాణలో పెట్టిన పెట్టుబడులు పూర్తి భద్రతతో, సురక్షితంగా ఉంటాయని.. ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతోందని యార్క్‌షైర్, యూకే వ్యాపార ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో.. బాహుబలి మోటార్లు ప్రారంభం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్-అంజనగిరి జలాశయం మొదటి లిఫ్టు వద్ద రెండు బాహుబలి మోటార్లు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
- మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల రుణాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడేళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంకు రుణాలను అందజేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
- శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చిన భద్రకాళి తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ఓరుగల్లు శ్రీభద్రకాళి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.