నిర్జీవమవుతున్న స.హ.చట్టం!

Eenadu icon
By Editorial News Team Published : 15 Oct 2026 01:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

జవాబుదారీతనం లేని అధికారం నిరంకుశత్వానికి పాదులుతీస్తుంది. పాలనలో పారదర్శకత లేకపోతే అవినీతి ప్రబలమవుతుంది. యంత్రాంగం పనితీరును పరిశీలించడానికి, ప్రశ్నించడానికి ప్రజలకు అవకాశమివ్వని చోట ప్రజాస్వామ్యం మేడిపండు చందమవుతుంది. ఆ ముప్పు వాటిల్లకుండా చూడటంకోసమే రెండు దశాబ్దాల క్రితం సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం పురుడుపోసుకుంది. ప్రభుత్వ విభాగాల దగ్గర ఉండే సమాచారానికి నిజమైన యజమానులు ప్రజలేనని స్పష్టీకరిస్తూ, చట్టసభలకు అందించదగిన ఎలాంటి వివరాలనైనా భారతీయ పౌరులెవరికైనా అందించవచ్చుననే నియమంతో అమలులోకి వచ్చిన ఆ శాసనం ఇప్పుడు నిర్జీవమవుతోంది. జనానికి అన్నీ తెలిస్తే తమ అక్రమాల పునాదులు కదిలిపోతాయని భయపడే అధికారశ్రేణులు ఆదినుంచీ ఆర్టీఐపై విషం కక్కుతూనే ఉన్నాయి. వాటికి బాధ్యత మప్పుతూ ప్రజాతంత్ర స్ఫూర్తిని కాపాడాల్సిన సమాచార కమిషన్లు ఎందుకూ కొరగానివవుతున్నాయి. కమిషనర్ల నియామకాలను సకాలంలో జరపని ప్రభుత్వాలు, వాటిని చేపట్టినప్పుడు కూడా అయినవారికే పెద్దపీట వేస్తున్నాయి. దాంతో పాలనలో ప్రజాభాగస్వామ్యానికి వారధులు కావాల్సిన సమాచార కమిషన్లు ప్రభావశూన్యమవుతున్నాయి!  

సమాచారం పొందడం కోసం ప్రజలు వీలైనంత తక్కువగా ఆర్టీఐను ఆశ్రయించేలా చూడటమే చట్టం లక్ష్యమని సెక్షన్‌4(2) స్పష్టంగా నిర్దేశిస్తోంది. అంటే, ఎవరూ ప్రత్యేకంగా అర్జీ పెట్టి అడగక మునుపే అధికార యంత్రాంగమే పూనుకుని వీలైనంత ఎక్కువ సమాచారాన్ని పౌరులకు క్రమానుగతంగా అందించాలి. అది కూడా స్థానికంగా వాడుకలో ఉన్న భాషలో అందరికీ ఆ వివరాలు సులువుగా విస్తృతంగా అందుబాటులో ఉండేలా చూడాలి. ఈ స్వచ్ఛంద సమాచార వెల్లడికి సున్నంపెడుతున్న  అధికారగణాలు- దాఖలవుతున్న దరఖాస్తులకూ సక్రమంగా స్పందించట్లేదు. 30రోజుల్లోగా సమాచారమివ్వాల్సిందేనని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ చాలాచోట్ల ఆ గడువును పాటించట్లేదు. ఏళ్లూపూళ్లు గడచిపోతున్నప్పటికీ దరఖాస్తుదారులు కోరిన పూర్తి వివరాలను పంపించట్లేదు. చట్టాన్ని బేఖాతరు చేసే అలాంటి అధికారులను దారిలోపెట్టాల్సిన సమాచార కమిషన్లలో ఖాళీల మూలంగా పెండింగ్‌ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు 28 రాష్ట్రాల కమిషన్లలో 3.85 లక్షలకుపైగా రెండో అప్పీళ్లు, ఫిర్యాదులు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో అలాంటివి 27వేలకు పైబడ్డాయి. కేసులు త్వరగా తెమలకపోవడం, సమాచారం ఇవ్వకపోతే జరిమానా కట్టాల్సి వస్తుందన్న భయం కొరవడటంతోనే ఆర్టీఐ అమలులో యంత్రాంగం ఆడింది ఆటగా చెల్లిపోతోంది! 

పౌరసేవల పంపిణీలో లోపాలను పరిహరించడానికి, ప్రజాధనాన్ని దిగమింగే భ్రష్టాచారుల ముసుగులు తొలగించడానికి, ప్రజాప్రయోజనాలను పెళ్లగించే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాలను నిలువరించడానికి స.హ.చట్టం అక్కరకొస్తుంది. ఆ ఆశతోనే సామాన్య ప్రజానీకం ఎక్కువగా ఆ శాసనాన్ని ఆశ్రయిస్తోంది. కానీ, నిర్హేతుక సవరణలు ఒకవైపు చట్టాన్ని బలహీనం చేస్తుంటే- ప్రశ్నించేవారిపై నాయకులూ అధికారుల్లో పెరుగుతున్న అసహనం మరోవైపు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమవుతోంది. భిన్న రంగాలకు చెందిన సమర్థులూ ప్రజాసేవానురక్తులనే సమాచార కమిషనర్లుగా నియమించాలన్న విజ్ఞత ప్రభుత్వాల్లో మేల్కొన్నప్పుడే ఆర్టీఐకు జవసత్వాలు ఒనగూడతాయి. అది జరగనంతకాలం పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాతంత్ర విలువల గురించి నాయకులు వల్లించే మాటలన్నీ వట్టి నీటిమూటలే అవుతాయి! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


English Translation

The Dying Community Act!

Eenadu icon
By Editorial News Team Published : 15 Oct 2026 01:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

APower without discretion leads to tyranny. If there is no transparency in governance, corruption will prevail. Democracy fails where the people are not given the opportunity to question and scrutinize the functioning of the machinery. The Right to Information (RTI) Act was enacted two decades ago to prevent that threat. The statute, which came into force with the rule that any Indian citizen can provide any information that can be provided to the legislature, is now defunct, clarifying that the public is the real owner of information held by government departments. Since the beginning, the authorities have been poisoning the RTI because they are afraid that the foundations of their illegality will be shaken if the people know everything. Why are the Information Commissions which are supposed to protect the spirit of democracy while holding them accountable? Governments that do not make timely appointments of commissioners and even when they do, make a big deal out of them. With that, the information commissions, which are supposed to be bridges for public participation in governance, are becoming ineffective!  

Section 4(2) clearly states that the objective of the Act is to ensure that people resort to RTI as little as possible to obtain information. That is, the authorities should periodically provide as much information as possible to the citizens before anyone specifically requests it. It should also ensure that the details are easily and widely available to all in the language used locally. The authorities seeking this voluntary information disclosure have not responded properly to the applications filed. Although the law clearly states that information must be given within 30 days, many places do not follow that deadline. Despite the passing of years, the complete details sought by the applicants have not been sent. Pending cases are piling up due to vacancies in Information Commissions which are supposed to track down such law-abiding officers. According to the latest report of Satark Nagarik Sangathan, by the end of June this year, more than 3.85 lakh second appeals and complaints have remained unresolved in 28 state commissions along with the Central Information Commission. In AP and Telangana there are more than 27 thousand. Due to the fact that the cases are not filed quickly and there is no fear of having to pay a fine if the information is not given, the mechanism played in the implementation of RTI is paying off! 

The Civil Service Act seeks to remedy the defects in the delivery of public services, unmask the corrupt people who siphon off public funds, and prevent governments from taking arbitrary decisions that compromise the public interest. It is with that hope that the general public is mostly resorting to that law. But, if the unreasonable amendments are weakening the law on one hand, the growing intolerance of the leaders and officials against the questioners is on the other hand becoming dangerous for democracy. RTI will become a reality only when the wisdom of appointing competent and public service people from different fields as information commissioners is awakened in the governments. As long as that does not happen, all the words of the leaders about transparency, accountability and democratic values ​​will become empty! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this regard.