
సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ యత్నం

- A
- A+
- A++
ఈనాడు డిజిటల్, కరీంనగర్; న్యూస్‌టుడే, గోదావరిఖని: సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని, ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిలో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు, సైట్ విజిట్ సర్టిఫికేషన్, ఓపెన్ కాస్ట్ గనుల టెండర్లు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవకతవకలపై సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం, భారాస ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘నైనీ బొగ్గు టెండర్ల కుంభకోణాన్ని అడ్డుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మొత్తాన్ని కాజేయాలనుకున్నది ఎవరు? అసలు విషయం బయటకు రావాలి. వాటాలు కుదరకనే నైనీ బ్లాక్ టెండర్లు రద్దయ్యాయి. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేషన్ పేరిట సుమారు రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై ఆధారాలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తే ఈ వ్యవహారంపై విచారణ జరపకుండా ఆయన సీఎంకు లేఖ రాశారు. దీని ద్వారా కాంగ్రెస్, భాజపాల మధ్య చీకటి ఒప్పందం ఉందని స్పష్టమవుతోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి టెండర్ల నిర్వహణలో ఆలస్యమే ప్రధాన కారణం. సైట్ విజిట్ సర్టిఫికేషన్ పేరుతో టెండర్లను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో ఏడు సార్లు టెండర్లు వాయిదా వేయడం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బావమరిది సృజన్రెడ్డిలది కీలక పాత్ర.

40 లక్షల టన్నుల బొగ్గు మాయం
సింగరేణిలో 2023 డిసెంబరులో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఉంటే, గతేడాది 58 మిలియన్ టన్నులకు పడిపోయింది. టెండర్లలో జాప్యం, నిర్వహణ లోపాలు, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమే ఇందుకు కారణం. సింగరేణివ్యాప్తంగా సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. అది ఎక్కడికి వెళ్లిందో సమాధానం చెప్పాలి. యాదాద్రిలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తే ప్రస్తుతం 400 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి కావడం లేదు. రాష్ట్రం ఏర్పడే సమయానికి విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లుగా ఉండేది. కేసీఆర్ పాలనలో దాన్ని 24 వేల మెగావాట్ల స్థాయికి తీసుకెళ్లాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు అందించిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోతలు పెరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతుండటంతో రైతులు మళ్లీ రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎదురైంది. లోయర్ సీలేరు ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం చంద్రబాబు కోరిక మేరకు ఏపీకి అప్పగించి తెలంగాణకు అన్యాయం చేసింది. సింగరేణికి ప్రభుత్వం రూ.60 వేల కోట్లు బకాయి పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం వాటన్నింటినీ ఏం చేసింది? దిల్లీలోని రాహుల్‌గాంధీకి చెల్లిస్తున్నారు. సింగరేణిలో రెండేళ్లలోనే రూ.6,317 కోట్ల నిధులు పక్కదారి పట్టాయి. కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ప్రభుత్వం ఏటా తగ్గిస్తోంది. ఇటీవల ఆర్టీసీ కార్మిక ఎన్నికల్లో వచ్చిన ఫలితమే సింగరేణి ఎన్నికల్లో పునరావృతం కావాలి. సంస్థను కాపాడుకోవడానికి కేసీఆర్ నాయకత్వం అవసరం’’ అని కేటీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సభలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, కోవ లక్ష్మి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, పుట్ట మధు, గండ్ర వెంకటరమణారెడ్డి, రవిశంకర్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ బుధవారం కొత్తగా కనిపించారు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కనిపించే ఆయన గోదావరిఖనిలో నిర్వహించిన కార్మిక గర్జన సభకు గడ్డంతో హాజరయ్యారు. సభలో ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ప్రస్తావించారు. కరీంనగర్‌కు రాగానే గంగుల కమలాకర్.. ‘ఏందన్నా గడ్డంతో ఉన్నావ్’ అని అడిగారు. ‘సింగరేణి పురిటి గడ్డ గోదావరిఖని సభకు సాధారణంగా వెళ్తే ఏముంటుంది. అందుకే గడ్డంతో బయలుదేరానని చెప్పా’ అని పేర్కొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రేచుకుక్క వేటకి.. వేగమే ఆయుధం! పెద్దపులి కాదు.. బలమైన పంజాలు లేవు. భయపెట్టించే ఆకారమూ కాదు. చిన్న శరీరం, పొడవాటి కాళ్లు, సన్నని దేహం, గుబురుగా ఉండే తోక.
- నీటి సంరక్షణలో ‘శం షేర్’పల్లి! ఇక్కడ యంత్రంతో కలుపు తీస్తున్న శేర్పల్లి(హెచ్)కు చెందిన రైతు పేరు గోవర్ధన్. గతంలో వరి, జొన్న, మొక్కజొన్న సాగుచేసేవారు.
- బీసీల విద్యాభివృద్ధికి కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి బీసీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్రాలకు.. కేంద్రం 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
- రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు: హరీశ్‌రావు రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ జీవో 17 జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
- రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది.
- ఎల్‌నినో, ఐవోడీ పరస్పర చర్యలతో రుతుపవనాల్లో మార్పులు ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్(ఈఎన్ఎస్వో), హిందూ మహాసముద్ర డైపోల్(ఐవోడీ)ల మధ్య జరిగే సంక్లిష్టమైన చర్యలు భారతీయ రుతుపవనాల గమనాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఐఐటీ ఖరగ్‌పుర్ ప్రొఫెసర్ అనిల్‌కుమార్ గుప్తా అన్నారు.
- 32 నెలలు.. 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు హెల్మెట్ పెట్టుకోకపోవడం.. రాంగ్ రూట్లో దూసుకెళ్లడం.. పరిమితికి మించిన వేగం.. మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడటం రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్నా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిశానిర్దేశం చేశారు.
- నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం.. అద్భుతం అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు.
- పట్టభద్రుల ఓటు కోసం ఫారం-18 నింపాల్సిందే! మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.
- సంక్షిప్త వార్తలు(21) రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)కు బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం తాజాగా రూ.296.60 కోట్ల కేటాయింపులకు పాలనాపరమైన అనుమతిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీకే శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- సెమీకండక్టర్ల పరిశోధనకు ఐఐటీ హైదరాబాద్-జపాన్ వర్సిటీ ఒప్పందం పరస్పర సహకారంతో విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్, జపాన్‌లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం చేతులు కలిపాయి.
- కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తోంది: రామచందర్‌రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు తాజాగా సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు.
- నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు: సీఎస్ ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.
- మరోసారి ఎమ్మెల్సీ బరిలో రామచందర్‌రావు? హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావును బరిలో దించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
- త్వరలో హైదరాబాద్‌లోనూ మార్చ్.. సభ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేవరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఉద్యమం ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.
- ఏళ్ల తరబడి భద్రంగా సర్టిఫికెట్ మీ సేవ ఆధ్వర్యంలో రూపకల్పన ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
- ఆర్బిట్రేటర్లుగా అవకాశం కొందరికే ప్రపంచీకరణ నేపథ్యంలో వర్తక, వాణిజ్య, ఒప్పందాల ఉల్లంఘనల్లో ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం)కు అధిక ప్రాధాన్యమిస్తుండగా..ఆర్బిట్రేటర్లుగా కొందరికే అవకాశాలు లభిస్తున్నాయంటూ నల్సార్ వర్సిటీ ఆధ్వర్యంలోని మిలన్ కె.బెనర్జీ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా రూపొందించిన నివేదిక వెల్లడించింది.
- ఫ్యూచర్ సిటీలో ఎన్ఐయూఎం ప్రాంగణం తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేసే పట్టణాభివృద్ధి పరిశోధన సంస్థ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)’ నూతన ప్రాంగణాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్నారు.
- యుద్ధప్రాతిపదికన హ్యామ్‌రోడ్ల పనులు: మంత్రి సీతక్క రాష్ట్రంలో చేపట్టిన 7,448 కి.మీ. హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
English Translation

Congress attempt to privatize Singareni

- A
- A+
- A++
Today Digital, Karimnagar; Newstoday, Godavarikhani: Bharasa Executive President KTR has clarified that the Congress government is trying to privatize Singareni and will effectively counter those conspiracies. He alleged that there was massive corruption in the Naini coal block tenders, site visit certification, open cost mining tenders, coal production and procurement of machinery in Singareni. He demanded a comprehensive inquiry into the irregularities by the CBI or the sitting judge. Speaking at the open meeting of Singareni Karmak Garjana held on Wednesday night under the auspices of Telangana Coal Mines Labor Union, Bharasa in Godavarikhani of Peddapalli district, KTR criticized the government's attitude. 'Minister Komati Reddy revealed that the Naini Coal Tender Scam has been prevented. He said in an interview that the government is left with Rs.30 thousand crores. Who wants to pay that amount? The truth should come out. Nine block tenders were canceled before the shares could be reached. A scam of about Rs.10 thousand crores was committed in the name of site visit certification in Singareni. If a complaint was made to Union Coal Mines Minister Kishan Reddy with evidence, he wrote a letter to the CM instead of investigating the matter. By this it is clear that there is a dark deal between Congress and BJP. The main reason behind the decrease in coal production in Singareni open cast mines is the delay in holding tenders. Tenders are being deliberately delayed in the name of site visit certification. CM Revanth Reddy and his brother-in-law Srujan Reddy are the key players behind the postponement of tenders seven times in Srirampur opencast projects. mb-2">40 lakh tonnes of coal lost
Singareni's coal production in December 2023 was 70 million tonnes, but last year it fell to 58 million tonnes. This is due to delay in tenders, management errors and failure to take decisions. Around 40 lakh metric tonnes of coal was lost across Singareni. Where did it go should be answered. If a power station with a capacity of 4000 megawatts is constructed in Yadadri, at present even 400 megawatts of electricity is not being produced. At the time of formation of the state, the power generation capacity was only 7,778 MW. During KCR's rule, we took it to the level of 24 thousand megawatts. KCR is credited with providing 24 hours electricity to agriculture. After Congress came to power, the cuts increased. As the transformers and motors are burning, the farmers are faced with the plight of having to hit the road again. The Modi government handed over the Lower Seeleru project to AP as per the wish of Chandrababu and did injustice to Telangana. Government owes Rs.60 thousand crores to Singareni. After the Congress came to power, what has the government done with all that, which has borrowed Rs. four and a half lakh crores so far? Paying to Rahul Gandhi in Delhi. In Singareni, funds of Rs.6,317 crore have gone by the wayside within two years. The government is reducing the share of profits to the workers every year. The result of the recent RTC labor elections should be repeated in the Singareni elections. KCR's leadership is necessary to save the organization," KTR said in his speech. Former Ministers Koppula Eshwar, Jeevan Reddy, MLAs Gangula Kamalakar, Kaushik Reddy, Kova Lakshmi, former Speaker Madhusudanachari, former MLAs Balka Suman, Korukanti Chander, Putta Madhu, Gandra Venkataramana Reddy, Ravi Shankar, Diwakar Rao, Durgang Chinnaguyya, Telangana Coal Mine Workers Union President Miryala Rajireddy were present in the assembly. Others participated.

KTR made a new appearance on Wednesday. Always seen with a clean shave, he attended the Karmak Garjana Sabha held in Godavarikhani with a beard. KTR himself mentioned this matter in the assembly. On reaching Karimnagar, Gangula Kamalakar asked, 'Why are you with a beard?' What if Singareni Puriti Gadda goes to Godavarikhani Sabha normally? That's why I said I left with a beard.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Speed is the weapon for hunting roaches! Not a tiger.. no strong claws. Not an intimidating shape either. Small body, long legs, thin body, bushy tail.
- Sham Sher' lizard in water conservation! The name of the farmer from Sherpalli (H) who is weeding here with a machine is Govardhan. Earlier they used to grow rice, sorghum and maize.
- Centre should give grants for educational development of BCs. National President of BC Welfare Association, MP R. Krishnaiah demanded that the Center should give 60 percent matching grant to the states for the educational development of BCs. In a statement, Harish Rao, the deputy leader of the Bharasa Legislature Party, criticized the Congress government for opening up a conspiracy to deny free electricity in the name of Rythu Discom. He vehemently condemned the issuance of JVO 17 while setting up Rythu Discom.
- MDR postponement on UPI commercial transactions exceeding Rs.2,000 National Payments Corporation of India (NPCI) has postponed the decision to impose Merchant Discount Rate (MDR) on Unified Payments Interface (UPI) commercial transactions above Rs.2,000. IIT Kharagpur Professor Anil Kumar Gupta said that the complex interactions between the El Nino Southern Oscillation (ENSO) and the Indian Ocean Dipole (IVOD) play a key role in directing the course of the Indian monsoon.
- 32 months.. 3.77 crore traffic violations. Not wearing a helmet.. taking the wrong route.. speeding beyond the limit.. steering under the influence of alcohol.. Talking on cell phones while driving is becoming a death trap on the roads, but these traffic violations are not reducing at all. Chief Minister Revanth Reddy and PCC president Mahesh Kumar Goud directed the ministers, MLAs and party leaders to take the MLC election of graduates very seriously and work hard to win. International Buddhist monks praised the architectural style of the Nelakondapalli Buddhist Mahastupa of the internationally famous Khammam district. The program of registration of names in the voter list of MLC seats of graduates of Mahabubnagar-Rangareddy-Hyderabad, Warangal-Khammam-Nalgonda constituencies is going on.
- Brief News(21) Commissioner and Director of Municipal Administration TK Sridevi issued an order on Tuesday giving administrative approval to the government's latest allocation of Rs 296.60 crore as part of the budget to the Urban Local Bodies (ULBs) in the state.
- IIT Hyderabad-Japan university agreement for semiconductor research IIT Hyderabad and Japan's MIE University join hands to strengthen education, research and technology sectors through mutual cooperation.
- Congress is threatening constitutional systems: Ramachandra Rao BJP State President N. Ramachander Rao stated that the people of the country strongly condemn the dramatic attitude of Lok Sabha Opposition Leader Rahul Gandhi and Congress ranks at the Supreme Court. CS Sanjay Jaju said that awareness programs on water conservation will be organized for 60 days in the background of El Nino.
- MLC Barilo Ramachander Rao again? It has been learned that the party is preparing to field BJP state president and former MLC N. Ramachander Rao from the post of MLC of Hyderabad-Ranga Reddy-Mahabubnagar graduates.
- Soon there will be a march in Hyderabad. Assembly TPCC President Mahesh Kumar Goud stated that the movement organized by the Congress party will not stop until CEC Gyanesh Kumar is removed from the post. Telangana government has taken another important step towards increasing the security and durability of certificates. A report prepared by Milan K. Banerjee Center for Arbitration Law under the auspices of Nalsar University revealed that while arbitration (arbitration) is given high priority in trade, commercial and contract violations, only a few are getting opportunities as arbitrators.
- NIUM premises in Future City The new premises of National Institute of Urban Management (NIUM), an urban development research institute working under Telangana Government, will be constructed in Bharat Future City. 7,448 km undertaken in the state. Panchayat Raj and Rural Development Minister Sitakka directed the officials to complete the construction works of Ham Roads on war footing and give priority to quality.