
ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం

- A
- A+
- A++
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్ లాస్ (ఎమెండ్మెంట్) యాక్ట్ 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. అయితే ఈ అంశం తేలేవరకూ ప్రస్తుతం ఆ మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికలపై స్టే ఇవ్వడానికి జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసును దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా విచారిస్తామని స్పష్టం చేసింది. తుది విచారణను నవంబరు 17కు వాయిదా వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి, శ్రీకాకుళం కార్పొరేషన్లు, రాజాం, ఆమదాలవలస, చింతలపూడి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గుడివాడ, తాడిగడప, బాపట్ల, పొన్నూరు, కందుకూరు, పొదిలి, కావలి, అల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట పురపాలక, నగరపంచాయతీల ఎన్నికలకు మార్గం సుగమమయింది.
వైకాపా ప్రభుత్వం పలు గ్రామ పంచాయతీలను సమీపంలోని 20 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో విలీనం చేస్తూ.. 2021 జూన్ 9న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా ఇలా విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల వీటిని కొట్టేయాలంటూ ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం, తోట రాధాకృష్ణమూర్తి 2021లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రామాల విలీనంలో ప్రభుత్వం అధికార పరిధిని అతిక్రమించలేదంటూ ఈ నెల 1న తీర్పు వెలువరించింది. దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బుధవారం విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టికల్ 243క్యూ(2) ప్రకారం గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే విషయంలో రాష్ట్రాల శాసననాధికారాలపై పరిమితులు ఉన్నాయని రఘునందన్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు ఏ గ్రామాన్నయినా మున్సిపాలిటీలో విలీనం చేయడానికి వీల్లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రామాల విలీనం ఆర్టికల్ 243 క్యూ(2) కింద పేర్కొన్న నిబంధనల ప్రకారం చేయలేదన్నారు.
2021లో హైకోర్టులో ఈ పిటిషన్లు వేసినప్పటి నుంచి ఆ మున్సిపాలిటీల ఎన్నికలపై స్టే కొనసాగిందని, ఇప్పుడు కూడా స్టే ఇవ్వాలని రామకృష్ణప్రసాద్ కోరారు. మున్సిపాలిటీల్లో చేర్చడం వల్ల పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని సీనియర్ న్యాయవాది చల్లా కోదండరాం పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ గ్రామీణ ప్రాంతాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నప్పుడు ఆర్టికల్ 243 క్యూ(1) ప్రకారం వాటిని మున్సిపాలిటీల్లో చేర్చొచ్చన్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలను అప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో కలిపారే తప్ప గ్రామాలను మున్సిపాలిటీలుగా కొత్తగా ప్రకటించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
వాదనలు విన్న జస్టిస్ పీఎస్ నరసింహ స్టే విధించడానికి నిరాకరించారు. విలీనం చేసేటప్పుడు ఆర్టికల్ 243 క్యూ(2) నిబంధనలన్నీ పాటించారో లేదో లోతుగా పరిశీలించడానికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అయితే ఎన్నికలపై మధ్యంతర స్టే ఇవ్వలేమని, స్టే ఎంత కాలం కొనసాగిస్తామంటూ విచారణ ముగించారు. ఈ పట్టణ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 05:19 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
- చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
- కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
- జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
- దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
- 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
- మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
- జగన్ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
- మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు రజత్‌భార్గవ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
- ప్రత్యేక నామినేషన్ కేంద్రం ఏర్పాటు పిటిషన్‌పై వాదనలు పూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సాధారణ నామినేషన్ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
- మహాచండీదేవిగా జగన్మాత దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ.. మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- కూష్మాండదుర్గగా శ్రీశైల భ్రామరి నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- సీతా స్వయంవర అలంకారంలో శ్రీవారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు.
- న్యాయవాద వృత్తిలో నిరంతర అధ్యయనం అవసరం కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. కోర్టులో ఎలా వ్యవహరించాలి, వాదనలు ఎలా చెప్పాలనే విషయాన్ని సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు.
- ఓఎంసీ కేసులో విశ్రాంత ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో 6వ నిందితురాలైన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు బుధవారం అభియోగాలను నమోదు చేసింది.
- ‘పోలవరం’ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం సందర్శించింది. ప్రాజెక్టును ఈ బృందం సందర్శించడం ఇది ఎనిమిదోసారి. బృంద సభ్యులు రిచర్డ్ డొన్నెల్లీ, డేవిడ్ పాల్, డి సిస్కో, హించ్‌బెర్గర్‌లతో తొలుత పోలవరం అధికారులు, అథారిటీ అధికారులు సమావేశమయ్యారు.
- పరిశ్రమల అవసరాలకు శిక్షణ.. ఉపాధికి చేయూత: మంత్రి లోకేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నైపుణ్యాలు పెంపొందించడమే తమ ప్రాధాన్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
- ఎర్రబస్సు రాదన్నారు.. అదే విమానాశ్రయంలో దిగారు ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌బస్ ఎలా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ గతంలో మాట్లాడారని అదే విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
- జడ్పీ ఛైర్మన్ రేసులో పరిటాల శ్రీరామ్ శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్ కూటమి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆయనను బరిలో నిలపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
- మూడున్నరేళ్లుగామొక్కవోని దీక్ష! ఇది విశాఖ ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలోని సీఎండీ ఛాంబర్. ఆ ప్రాంతమంతా ఇలా మొక్కలతో నిండిపోయి కనువిందు చేస్తోంది.
English Translation

We cannot stay the election in those 23 places

- A
- A+
- A++
Today, Delhi: 23 in the state. The Supreme Court has issued a notice to the state government in the petitions filed challenging the AP Municipal Laws (Amendment) Act 2021 made by the Vaikapa government in 2021 by including the nearby villages in the city administration, municipal bodies and city panchayats. However, the bench comprising Justice PS Narasimha and Justice Alok Aradhe refused to stay the elections to be held for those municipalities until this point is resolved. It has been clarified that the case will be investigated quickly without keeping it pending for a long time. The order was issued on Wednesday adjourning the final hearing to November 17.
This includes Rajamahendravaram, Kakinada, Mangalagiri-Tadepalli, Srikakulam Corporations, Rajam, Amadalavalasa, Chintalapudi, Bhimavaram, Tanuku, Tadepalligudem, Palakollu, Gudivada, Tadigadapa, Bapatla, Ponnur, Kandukuru, Podili, Kavali, Allur, Guduru, The way for Srikalahasti, B. Kottakota municipal and city panchayat elections has been paved.
YKappa government has issued a gazette notification on June 9, 2021, merging many village panchayats into 20 nearby city, municipal bodies and city panchayats. Eddula Subbareddy, Vallepalli Venkata Subrahmanyam and Thota Radhakrishnamurthy approached the High Court in 2021 saying that this merger without the resolution of the Gram Panchayats is unconstitutional, so they should be struck down. The Division Bench of the High Court, which conducted the investigation, ruled on the 1st of this month that the government did not overstep the jurisdiction in the merger of the villages. Challenging it, the petitioners approached the Supreme Court.
Senior advocate Raghunandan Rao, speaking on behalf of the petitioners in Wednesday's hearing, stated that according to Article 243Q(2), there are limitations on the legislative powers of the states in the matter of merging villages into nearby municipalities. He said that the state government cannot merge any village into the municipality as it likes. Another senior lawyer L. Narasimha Reddy argued that the merger of villages was not done as per the provisions mentioned under Article 243 Q(2).
Since the petitions were filed in the High Court in 2021, the stay on the elections of those municipalities continued and Ramakrishna Prasad asked for a stay even now. Senior advocate Challa Kodandaram stated that as per the Panchayat Raj Act, these villages will stop receiving funds from the central government due to inclusion in municipalities.
On behalf of the state government, Solicitor General Tushar Mehta argued that when rural areas are transformed into towns, they can be included in municipalities under Article 243 Q(1). It was brought to the court's attention that the villages around here were not declared as new municipalities unless they were merged into the existing municipalities.
Justice PS Narasimha, after hearing the arguments, refused to impose a stay. Notices will be issued to examine in depth whether all the provisions of Article 243 Q(2) have been followed during the merger. But the investigation concluded that an interim stay cannot be given on the election and how long the stay will continue. Elections to these urban local bodies will be subject to the court's final verdict.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 05:19 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Mogindi Nagara The city has rang for local body elections in the state. Notification for elections in 13 municipal bodies and 87 municipal societies was released on Wednesday. The code of conduct for elections also came into effect immediately.
- Discussions successful. "Discussions between Telugu Desam and Janasena in local body elections have been successful. There are no mistakes between us The adjustment of seats between the coalition parties in the local body elections is almost over. Janasena is likely to contest in four municipal bodies, 20 to 24 municipal societies and three to four city panchayats.
- Vangaveeti Radhakrishna joins Janasena. Former Vijayawada MLA Vangaveeti Radhakrishna has joined Janasena. He, who was in TEDP till now, joined the alliance.
- No Deuce, caste certificates within 24 hours of application. State Election Commissioner Anilchandra Punetha has made it clear that elections are being held simultaneously with the intention of not having administrative difficulties.
- Elections in 13 city governing bodies. Elections will be held for a total of 3,942 wards in 13 city governing bodies and 87 municipal societies in the state. The fate of mayors, chairpersons, corporators and ward members will be decided by 1.03 crore voters in urban local bodies.
- President visits Mahachandi Devi President Draupadimurmu on Wednesday participated in the Sharannavaratri celebrations at Vijayawada Indrakiladri. Visited Durgamma in the form of Mahachandi Devi.
- Daily investigation in Jagan cases. A crucial development has taken place in the CBI court in the illegal assets case of Vaikapa chief Jagan. The CBI court has decided to conduct daily investigation in the cases registered by the Enforcement Directorate (ED) regarding Jagan's illegal assets. Retired IAS officer Rajat Bhargava attended the Enforcement Directorate (ED) hearing on Wednesday in connection with the Rs 1,000-crore liquor scam case during the Vaikapa government. Arguments ended in the High Court on Wednesday on the lawsuit filed by Vaikapa State General Secretary Lella Appireddy to issue instructions to set up a special center at the District Election Officer in each district in addition to the normal nomination centers to file nominations during the elections of ZPTC, MPTC and Municipalities.
- Jaganmata Durgamma as Mahachandi Devi. As part of the Dussehra Sharannavaratri celebrations, Jaganmata Durgamma appeared to the devotees in the form of Mahachandi Devi on the Indrakiladri of Vijayawada on Wednesday on the fourth day. Devi Sarannavaratri festival is being held in Srishaila Mahakshetra of Nandyala district with grandeur. On Wednesday, Bhramaramba Devi appeared to the devotees in Kushmanda Durga Alankaram. As part of the Tirumala Srivari Navratri Brahmotsavam, Srimalayappa Swami along with Sridevi and Bhudevi appeared on the Mutyapupandiri vehicle on the third day on Wednesday night as part of Tirumala Srivari Navratri Brahmotsavam. High Court Judges advised the young lawyers to observe the proceedings in the court with a close eye. They want to learn from seniors how to behave in court and how to present arguments.
- Retired IAS Srilakshmi has been charged in the OMC case. The CBI court on Wednesday filed charges against the 6th accused in the Obulapuram Mining (OMC) case, retired IAS officer Y. Sreelakshmi, Secretary of the Industries Department. A team of foreign experts visited the Polavaram project on Wednesday. This is the eighth time the team is visiting the project. Team members Richard Donnelly, David Paul, D Cisco, Hinchberger first met Polavaram officials and authority officials.
- Training for the needs of industries.. Help for employment: Minister Lokesh Education and IT Minister Lokesh said in a statement that their priority is to develop skills to provide job opportunities to the youth of the state. Landed at the same airport Vizianagaram MP Kalishetti Appalanayudu stated that former Chief Minister Jagan had previously talked about how Airbus would come to Bhogapuram where there was no red bus, and he was welcomed by a special flight to the same airport. Paritala Sriram's name came to the fore as the candidate of the Sri Sathya Sai Zilla Parishad Chairman alliance. There is a strong campaign in the political circles that the TDP leadership wants to keep him in the ring as the post of ZP chairman has been allotted to the general. This is the CMD Chamber in APEPDCL office, Visakha. The whole area is full of plants and it is pleasing to the eye.