మాకొద్దు ఆ సెలక్టర్ పదవి.. తిరస్కరించిన ఇద్దరు మాజీలు!

- A
- A+
- A++

BCCI Selector! ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ నుంచి ఏదైనా పదవి ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు ఇదే మరి. ఎందుకో గానీ, ఈసారి మాత్రం ఈ పదవులపై పెద్దగా ఆసక్తి కన్పించట్లేదు. బీసీసీఐ ఇటీవల సెలక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈపాటికే భారత మాజీ క్రికెటర్ల నుంచి చాలా దరఖాస్తులు వచ్చి ఉంటాయని అనుకోవడం సహజమే. కానీ, అలా జరగలేదు. ఓ ఇద్దరు మాజీలైతే ఏకంగా తమ వద్దకు వచ్చిన ఆఫర్‌ను కూడా తిరస్కరించారని వార్తలూ వస్తున్నాయి. వారిద్దరికి వందకుపైగా టెస్టులు ఆడిన అనుభవం ఉందని సమాచారం.
నాలుగేళ్లపాటు చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసింది. ఆ వెంటనే బీసీసీఐ ( BCCI) వెస్ట్ జోన్ నుంచి సెలక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసింది. రమేశ్ పొవార్, సమీర్ దిఘే మాత్రమే అప్లై చేసుకున్నారు. పార్థివ్ పటేల్ దరఖాస్తు చేసుకుంటే.. అతడే చీఫ్ సెలక్టర్‌గా నియమితులయ్యేవాడు. కానీ, అతడు ఆసక్తి చూపించలేదు. దీంతో ప్రజ్ఞాన్ ఓజా చీఫ్ సెలక్టర్ కావడం ఖాయమే. ఓజాతోపాటు ప్రస్తుతం ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ఎస్ఎస్ దాస్ సెలక్టర్లుగా ఉన్నారు.
- మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు : సంజు శాంసన్
భారీగా జీతభత్యాలు పెంచినా..
దశాబ్దన్నర కిందటి వరకూ సెలక్టర్ల జీత భత్యాలు ఎక్కువగా ఉండేవి కావు. కానీ, ఎంపిక కమిటీ బడ్జెట్‌ను బీసీసీఐ భారీగా పెంచింది. పెద్ద మొత్తంలోనే వేతనాలను చెల్లిస్తోంది. మొన్నటి వరకూ ఆ బడ్జెట్ రూ.17.45 కోట్లు ఉండగా.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి దాన్ని రూ.19.35 కోట్లకు పెంచింది. చీఫ్ సెలక్టర్‌గా పనిచేసే వారికి ఏడాదికి రూ.3 కోట్ల వరకూ అందనుంది. అందుకు తగిన పెద్ద బాధ్యతలు కూడా అతడిపై ఉంటాయి. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే ప్లేయర్ల సత్తాను అంచనా వేయడం, అవసరమైతే మ్యాచుల కోసం ప్రయాణాలు చేయడంతో పాటు సమావేశాలకూ హాజరవ్వాలి. మిగతా సెలక్టర్లు కూడా మెరుగైన ప్యాకేజీని అందుకొంటారు. ప్రతి సభ్యుడూ త్రైమాసిక నివేదికలను తయారు చేసి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు సమర్పించాలి. జట్లకు సారథిని నియమించే కీలక బాధ్యత కూడా సెలక్షన్ కమిటీ సభ్యులపైనే ఉంటుంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు : సంజు శాంసన్ ‘‘వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో తిలక్ వర్మ ఔటవడంతో ఫెయిల్డ్ ఛేజ్ మొదలైంది.. మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు’’ అని భారత ఆటగాడు సంజు శాంసన్ (Sanju Samson) అన్నాడు. యువ ఫాస్ట్ బౌలర్లు అనుభవంతో మెరుగవుతారని ధీమా వ్యక్తం చేశాడు.
- బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ పాటించలేకపోయాం : శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, నిర్ణయాత్మక పోరుకు సిద్ధమవుతామని టీమిండియా (Team india) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తెలిపాడు. బౌలింగ్‌లో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
- ఉప్పల్‌లో పడ్డారు పొట్టి క్రికెట్లో వెస్టిండీస్‌తో అంత తేలిక కాదని మరోసారి రుజువైంది. భారత్‌కు వన్డే సిరీస్ కోల్పోయాక.. టీ20 సిరీస్‌లో గట్టి పోటీనిస్తున్న కరీబియన్ జట్టు, సిరీస్‌ను 2-2తో సమం చేసి ఫలితాన్ని చివరి పోరుకు మళ్లించింది.
- తిరిగి హైదరాబాద్‌కు నటరాజన్ ఎడమచేతి వాటం పేసర్ నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. ఐపీఎల్ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్ అతణ్ని దిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుంది.
- టీ20ల్లో మేం చాలా శ్రమించాలి వన్డే ప్రపంచకప్ గెలిచినప్పటికీ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరముందని కొత్త కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది. మహిళల తొలి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది.
- ఆ స్థానం ఓజాదే..! అజిత్ అగార్కర్ స్థానంలో వెస్ట్‌జోన్ నుంచి పార్థివ్ పటేల్ సెలక్టర్ అవుతాడని అంతా భావించారు. కానీ అతడు పదవి కోసం దరఖాస్తే చేసుకోలేదు. దీంతో సెలక్షన్ కమిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్‌గా కొనసాగేందుకు ప్రజ్ఞాన్ ఓజాకు మార్గం సుగమమైంది.
- కరుణ్ శతకం ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్ డ్రా ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో కర్ణాటక డ్రాతో బయటపడింది. కరుణ్ నాయర్ (155; 242 బంతుల్లో 16×4, 2×6) వీరోచిత శతకంతో జట్టును గట్టెక్కించాడు.
- 17 ఏళ్ల తర్వాత పంజాబ్‌కు.. ఈ నెలాఖర్లో జరగనున్న హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ప్రత్యేకంగా నిలవనుంది. అతడి సొంతగడ్డ పంజాబ్‌లో 17 ఏళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది.
- నాలుగో స్థానంలో శ్రేయస్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో అతను 18 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని రేటింగ్ మెరుగుపడింది.
- యోధాస్ గెలుపు ఆర్చరీ ప్రిమియర్ లీగ్‌లో పృథ్వీరాజ్ యోధాస్ పుంజుకుంది. బుధవారం ఆ జట్టు 5-1తో చేరో ఆర్చర్స్‌పై ఘనవిజయాన్నందుకుంది. గణేశ్ మణిరత్నం 60కి 59 పాయింట్లతో జట్టు గెలుపులో కీలకమయ్యాడు.
- సాత్విక్ జోడీ ఔట్ డెన్మార్క్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ కథ ముగిసింది. బుధవారం తొలి రౌండ్లో ఈ జంట 21-12, 15-21, 19-21తో చైనా ద్వయం హె జి టింగ్, రెన్ జియాంగ్ యుల చేతిలో ఓడిపోయింది.
- సంక్షిప్త వార్తలు (4) ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారు. గురువారం దిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆయన ప్లేయర్లతో సమావేశం కానున్నారు.
- భారత్‌పై కీమో పాల్ ‘ఫైఫర్’.. విండీస్‌దే నాలుగో టీ20 ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది.
- విరాట్‌కు ధోనీలా.. మంధానకు హర్మన్ బాసటగా నిలవాలి: మిథున్ సీనియర్‌గా జట్టులో ఉన్నప్పుడు కొత్త సారథికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వెల్లడించాడు.
- నాలుగులోకి శ్రేయస్ అయ్యర్.. రెన్షా 147 స్థానాలు జంప్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఆసీస్ ప్లేయర్ దూసుకొచ్చాడు.
- ఆ టోర్నమెంట్లో అనుమతి లేకుండా నా పేరు వాడారు: శిఖర్ ధావన్ Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనధికారికంగా వాడుకోవడాన్ని భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖండించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
- అభిషేక్ ఎఫెక్ట్.. సంజుపై ఒత్తిడి: పుజారా కీలక వ్యాఖ్యలు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సంజు శాంసన్ తక్కువ పరుగులకే ఔట్ అవడంపై మాజీ క్రికెటర్ పుజారా (Cheteshwar Pujara) స్పందించాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శాంసన్ మరికొంత సమయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
- కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయితే.. రోహిత్ మంచి లీడర్: ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ సమిత్ పటేల్ (Samit Patel) ప్రశంసించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దూకుడు చూపిస్తాడని, నాయకుడిగానూ అతడు ఎంతో ప్రతిభావంతుడని పేర్కొన్నాడు.
- ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్ఇండియా తహతహలాడుతుంటే..
- ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్ గిల్.. భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డు (సెప్టెంబర్ నెల) సాధించారు.
English Translation
Don't give up that selector's post.. Two formers who rejected it!

- A
- A+
- A++

BCCI Selector! Internet Desk: Anyone who gets a job offer from BCCI jumps at it. This is the richest cricket board in the world. For some reason, this time there is not much interest in these posts. BCCI recently invited applications for the post of selector. It is natural to think that there will be many applications from former Indian cricketers. But, that didn't happen. There are also reports that the two exes have rejected the offer that came to them together. It is reported that both of them have experience of playing more than 100 Tests.
Ajit Agarkar's tenure as Chief Selector for four years ended on October 4. Soon after that BCCI ( BCCI) invited applications for the post of selector from West Zone. Deadline is October 14 at 5 PM. Only Ramesh Powar and Sameer Dighe applied. If Parthiv Patel applied... he would have been appointed as the Chief Selector. But, he was not interested. It is certain that Pragyan Ojha will be the chief selector. Along with Ojha, RP Singh, Ajay Ratra and SS Das are currently selectors.
- The key turning point for losing the match: Sanju Samson
Despite the huge increase in salaries...
Until a decade and a half ago, the salaries and allowances of selectors were not high. But, BCCI has increased the budget of the selection committee. Paying huge amount of wages. Till now that budget was Rs.17.45 crores, but for the financial year 2026-27 it has been increased to Rs.19.35 crores. Those working as Chief Selectors will get up to Rs.3 crores per year. Appropriate big responsibilities are also on him. Assessing the ability of players playing in national and international matches, traveling to matches and attending meetings if required. Other selectors will also get a better package. Each member shall prepare quarterly reports and submit them to the BCCI Apex Council. Selection committee members also have the key responsibility of appointing captains for teams.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- That is the turning point for losing a match : Sanju Samson "The failed chase started with Tilak Verma's dismissal in the fourth T20I against West Indies. That was the turning point for the defeat of the match," said Indian player Sanju Samson. He expressed confidence that the young fast bowlers will improve with experience.
- Couldn't follow line and length in bowling: Shreyas Iyer Team India captain Shreyas Iyer said that they will learn from the defeat in the fourth T20 against the West Indies and prepare for the decisive battle. He stated that the main reason for the defeat was not being able to execute the plans properly in bowling.
- Falled in Uppal It has been proved once again that it is not so easy against West Indies in short cricket. After losing the ODI series to India, the Caribbean team, which is competing hard in the T20 series, tied the series 2-2 and shifted the result to the final match.
- Natarajan back to Hyderabad Left-arm pacer Natarajan returned to Sunrisers Hyderabad. Sunrisers took him from Delhi Capitals as part of the IPL trade.
- We have to work hard in T20s. New captain Smriti Mandhana said that despite winning the ODI World Cup, the Indian women's team still needs to work hard in T20 cricket. She responded in the context of the women's first Champions Trophy being held in the short format next year. Everyone thought that Parthiv Patel from West Zone will be the selector in place of Ajit Agarkar. But he did not apply for the post. This paved the way for Pragyan Ojha to continue as full-fledged chairman of the selection committee.
- Karun's century Andhra, Karnataka match draw In the Ranji match against Andhra, Karnataka emerged with a draw. Karun Nair (155; 16×4, 2×6 in 242 balls) led the team with a heroic century.
- After 17 years for Punjab... Hockey Asia Champions Trophy to be held at the end of this month... Indian hockey team captain Harmanpreet Singh will stand out. An international match is going to be held in his native Punjab after 17 years.
- Shreyas in fourth place Indian cricket team captain Shreyas Iyer has reached the fourth position in the ICC T20 batting rankings. Recently in the second T20 against West Indies his rating improved when he scored 40 off 18 balls.
- Yodhas win Prithviraj Yodhas bounced back in Archery Premier League. On Wednesday, the team won 5-1 against Chero Archers. Ganesh Mani Ratnam was instrumental in the team's victory with 59 points out of 60.
- Sathvik Jodi out. The story of Satwik Sairaj and Chirag Shetty has ended in Denmark Open. In the first round on Wednesday, the pair lost 21-12, 15-21, 19-21 to the Chinese duo of He Ji Ting and Ren Xiang Yu.
- News in Brief (4) Prime Minister Narendra Modi will meet the Indian athletes who participated in the recently concluded Asian Games. He will meet the players at Major Dhyanchand Stadium in Delhi on Thursday.
- Kemo Paul 'Pfeiffer' against India.. Windies fourth T20 West Indies won against India in the fourth T20 match held at Uppal.
- Dhoni for Virat, Harman for Mandhana: Mithun BCCI president Mithun Manhas revealed that when he is in the team as a senior, he has the responsibility to stand by the new captain.
- Sreyas Iyer among the four. In the ICC T20 rankings, Indian players have stood in better positions. Aussie player stormed in Tests.
- My name was used without permission in that tournament: Shikhar Dhawan Shikhar Dhawan: Former Indian cricketer Shikhar Dhawan condemned the unauthorized use of his name by the organizers of the World T20 Continental Cup. He warned that legal action will be taken against them.
- Abhishek effect.. Pressure on Sanju: Pujara's key comments Former cricketer Pujara (Cheteshwar Pujara) reacted to Sanju Samson's dismissal for short runs in the third T20 against West Indies. Samson feels that he needs to take some more time to understand the pitch conditions.
- If Kohli is a chase master.. Rohit is a good leader: Former England all-rounder Former England all-rounder Samit Patel praised that there is no player better than Virat Kohli in scoring. He said that Rohit Sharma is aggressive in batting and he is very talented as a leader. It's time for another crucial battle in the short series that is going on juicy. Batters are ready to flood the runs. Today is the fourth T20I between India and West Indies at Uppal Stadium, a haven for batting. If Team India is eager to win the series..
- Shubman, Shefali as ICC's best players Indian ODI and Test captain Shubman Gill. Indian women's team opener Shefali Verma won the ICC 'Best Player' award (for the month of September).