బుల్ జోష్‌.. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు పైకి

Eenadu icon
By Business News Team Updated : 15 Oct 2026 16:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Stock market | ఇంటర్నెట్‌ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచాయి. చమురు ధరలు కాస్త తగ్గడమూ సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ 1533.72 పాయింట్లు ఎగబాకి 74,315.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 374.65 పాయింట్లు లాభపడి 22,997.35 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.1 శాతం పెరిగి 95.04గా ఉంది.

సెన్సెక్స్ 30లో హిందుస్థాన్‌ యునిలీవర్‌, ట్రెంట్‌, బీఈఎల్‌ షేర్లు తప్ప మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ ధర 103.8 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్‌ ధర రూ.4,155.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ తేదీలను ప్రకటించడంతో రిలయన్స్‌ షేర్లు దూసుకెళ్లాయి. దాదాపు 3 శాతం మేర కంపెనీ షేర్లు లాభపడ్డాయి.

కారణాలివే..

  • ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్‌, కన్జూమర్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లూ సూచీలకు కలిసొచ్చింది.
  • అమెరికాలో అంచనాల కంటే వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల వడ్డీ రేట్ల విషయంలో కేంద్రబ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తాయనే భయాలు ఉన్నాయి. దీంతో హైగ్రోత్ కంపెనీలు, మరీ ముఖ్యంగా ఏఐ సంస్థల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిన్నటి అమెరికా మార్కెట్‌లు నష్టాల్లో ముగియగా.. ఆ ప్రభావం ఇతర ఆసియా మార్కెట్‌లపైనా పడింది. అయితే ఏఐ స్టాక్స్ దిద్దుబాటుకు గురవడం భారత మార్కెట్లకు మంచి పరిణామంగా నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టొచ్చన్న సానుకూల అంచనాలే నేటి లాభాలకు కారణం.
  • చమురు ధరలు ధర కాస్త దిగొచ్చాయి. ఇదీ లాభాలకు కారణంగా నిలిచింది. రూపాయి విలువ పెరగడమూ సూచీలకు కలిసొచ్చింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 16:30 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రేపటి నుంచే ఐఫోన్‌ డ్యుయో ప్రీ ఆర్డర్లు.. డిస్‌ప్లే పగిలితే జేబుకు చిల్లే! iPhone Duo: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ డ్యుయో ప్రీ ఆర్డర్లకు సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్‌ 16) సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.
  • మార్కెట్‌లోకి మహీంద్రా XUV 3XO CNG.. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం Mahindra XUV 3XO CNG: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ పాపులర్ ఎస్‌యూవీ XUV 3XOలో సీఎన్‌జీ వేరియంట్‌ను (Mahindra XUV 3XO CNG) మార్కెట్లోకి విడుదల చేసింది.
  • రుణ గ్రహీతలకు SBI షాక్‌.. రుణ రేట్లు పెంపు State bank of India:  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) రుణ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లింక్డ్‌ రేట్‌ (EBLR), రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌ (RLLR), మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR)ను సవరించింది.
  • గుర్తుతెలియని కాల్స్‌కు చెక్‌.. ఇక, కాలర్‌ ఐడీ డిస్‌ప్లే తప్పనిసరి! govt mandate caller IDs: స్పామ్‌, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ బెడదకు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైంది. 
  • భారీ లాభాల్లో మార్కెట్లు.. 1000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌ Stock Market: దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమంటున్నా.. ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నప్పటికీ నిన్నటి నష్టాల నుంచి సూచీలు పుంజుకున్నాయి.
  • ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంక్‌ ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72% వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌  కొనుగోలు చేయనుంది. ఇందు కోసం 5.5 బిలియన్‌ డాలర్లు (రూ.53,000 కోట్లు) వెచ్చించనుంది.
  • 21-23 తేదీల్లో జియో ఐపీఓ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈనెల 21న ప్రారంభమై, 23న ముగియనుంది.
  • స్కైరూట్‌ విక్రమ్‌ రాకెట్లతో రెండు ప్రయోగాలు అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో ‘రెండు ప్రత్యేక రాకెట్‌ ప్రయోగాల కోసం’ ఒప్పందం కుదుర్చుకుంది.
  • 2029 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-7 కార్లు, ఎస్‌యూవీలు మన దేశంలో కొత్త కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ) కోసం అత్యంత కఠినమైన బీఎస్‌-7 (భారత్‌ స్టేజ్‌-7) ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • కలవరపెట్టిన ద్రవ్యోల్బణం సెప్టెంబరులో రిటెయిల్, టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో, బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు అధిక ధరలూ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలపడి 95.17  వద్ద ముగిసింది.
  • మరింత ముదిరిన టాటా ట్రస్ట్స్‌ వివాదం టాటా గ్రూప్‌లో రగులుతున్న అంతర్గత విభేదాలు, న్యాయస్థానాలకు చేరుతున్నాయి. తాజాగా టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్‌ సింగ్‌ లేవనెత్తిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో బాంబే హైకోర్టుతో పాటు ముంబయి సిటీ సివిల్‌ కోర్టులో టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటా, ఆయన కుమారుడు నెవిల్లే టాటా కేవియట్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు.
  • మస్క్‌ స్టార్‌లింక్‌ కంటే వన్‌వెబ్‌ రేసులో ముందుంది దేశీయంగా ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవల కోసం, అమెరికా కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కంటే తమ యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌ సంస్థే రేసులో ముందుందని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ బుధవారం బ్లూమ్‌బెర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ 2026లో వెల్లడించారు.
  • టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతానికి దేశీయంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 11.39 శాతానికి చేరింది. ఆహారం, తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్‌ ధరలు పెరగడం ఇందుకు కారణం.
  • మేలిమి వెండి సులభ దిగుమతికి వీలు కొన్ని రకాల వెండి వస్తువుల దిగుమతికి అనుమతులను వేగంగా జారీ చేసేందుకు, స్వీయ ప్రకటన ఆధారిత సరళీకృత విధానాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..(14-10-2026) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
  • పొగాకు రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినతరం! పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత కఠినం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో ఫ్రాంఛైజీలు, ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండు పేర్లు, నిర్వహణ ఒప్పందాల కోసం లైసెన్సింగ్‌లో ఎఫ్‌డీఐని నిషేధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
  • ఫారెక్స్‌ విపణిలో స్థిరత్వం తీసుకొస్తాం! ఫారెక్స్‌ (విదేశీ మారకపు ద్రవ్య) విపణిలో స్థిరత్వం తీసుకురావడానికి, రూపాయి విలువపై ఊహాజనిత కార్యకలాపాలు నిరోధించడానికి చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు.
  • ఎస్‌ఎంఈ ఐపీఓలకు కొత్త నిబంధనలు! చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎస్‌ఎంఈల) ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే మదుపర్ల నిధులకు మరింత రక్షణ కల్పించేందుకు, నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ బుధవారం సమగ్ర మార్పులను ప్రతిపాదించింది.
  • కెనరా బ్యాంకు లాభం రూ.5,175 కోట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,175 కోట్ల  నికర లాభం నమోదు చేసింది. 2025-26 ఇదే కాల లాభం  రూ.4,774 కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.38,598 కోట్ల నుంచి రూ.40,931 కోట్లకు పెరిగింది.
  • సంక్షిప్త వార్తలు(4) రెడీ టూ డ్రింక్‌ డెయిరీ విభాగంలోకి రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ అడుగుపెట్టింది. జాయ్‌ల్యాండ్‌ బ్రాండ్‌ పేరిట ప్యాకేజ్డ్‌ ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను విడుదల చేసింది. స్ట్రాబెర్రీ, వెనిలా ఫ్లేవర్‌లతో తమిళనాడు మార్కెట్‌లో తొలుత విడుదల చేయగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

English Translation

Bull Josh.. Sensex up 1500 points

Eenadu icon
By Business News Team Updated : 15 Oct 2026 16:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Stock market | Internet Desk: Domestic stock market indices ended with huge gains. Indices were buoyed by buying support in IT, banking and auto stocks. A slight drop in oil prices also contributed to the indices. Sensex rose 1533.72 points to settle at 74,315.61. The Nifty gained 374.65 points to close at 22,997.35. The rupee rose 0.1 percent to 95.04 against the dollar.

Except for Hindustan Unilever, Trent and BEL shares, all shares of the Sensex 30 closed higher. Tech Mahindra, ICICI Bank, Reliance, Bharti Airtel, Eternal and HCL Tech shares were major gainers. The price of Brent crude continues at 103.8 dollars in the international market. Gold is trading at Rs 4,155.52 an ounce.

  • Reliance shares soar after Jio Platforms announces IPO dates. Shares of the company gained around 3 percent.

The reason..

  • Buying support gathered in IT shares. Infosys, TCS and HCL Tech shares gained heavily. On the other hand, buying in banking and consumer stocks also added to the indices.
  • There are fears that the central banks will act harshly in the matter of interest rates due to faster than expected inflation in America. As a result, the shares of high-growth companies, especially AI companies, are under pressure. While the American markets ended in losses yesterday, the impact also fell on other Asian markets. However, experts say that the correction of AI stocks is a good development for the Indian markets. It is in this order that the positive expectations that foreign investors can invest in India is the reason for today's gains. This is the reason for the profits. Rupee's appreciation also helped the indices.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 16:30 IST

Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Pre-orders of iPhone Duo from tomorrow. iPhone Duo: Leading tech giant Apple is getting ready for pre-orders of the first foldable iPhone Duo. Pre-orders will start from 5 pm on Friday (October 16).
  • Mahindra XUV 3XO CNG in the market. Price starts from Rs.9.99 lakh Mahindra XUV 3XO CNG: The leading automobile company Mahindra and Mahindra has launched the CNG variant (Mahindra XUV 3XO CNG) of its popular SUV XUV 3XO in the market.
  • SBI shock for loan recipients.. Increase in loan rates State bank of India: State-owned banking giant State Bank of India (SBI) has hiked lending rates. Revised External Benchmark Linked Rate (EBLR), Repo Linked Lending Rate (RLLR), Marginal Cost of Funds Based Lending Rate (MCLR) on selected time periods.
  • Check for unknown calls.. Now, Caller ID display is mandatory! Govt Mandate Caller IDs: It's time to check the nuisance of spam and calls from unknown numbers. 
  • Markets in huge gains.. Sensex rose 1000 points Stock Market: Domestic markets continued to make huge gains on Thursday. Crude oil prices fall..Indices recover from yesterday's losses despite lingering inflation fears.
  • Fairfax acquires IDBI Bank Canada's Fairfax Financial Holdings will buy 60.72% stake in IDBI Bank. 5.5 billion dollars (Rs. 53,000 crores) will be spent for this.
  • Jio IPO on 21-23 The initial public offering (IPO) of Reliance Industries' digital and telecom arm Jio Platforms Limited (JPL) will begin on the 21st of this month and end on the 23rd.
  • Two experiments with Skyroot Vikram rockets America's Reflect Orbital.. The Hyderabad-based space agency has signed an agreement with Skyroot Aerospace for 'two separate rocket launches'.
  • BS-7 cars, SUVs from April 2029 The Union Ministry of Road Transport and Highways has released a draft notification proposing to implement the strictest BS-7 (Bharat Stage-7) emission norms for new cars and sports utility vehicles (SUVs) in our country from April 1, 2029.
  • Disturbing Inflation Domestic indices closed lower on Wednesday as retail and wholesale inflation picked up in September. Higher crude oil prices also hurt investor sentiment. The rupee strengthened by 19 paise to close at 95.17 against the dollar. Internal conflicts raging in the Tata Group are reaching the courts. Tata Trusts Chairman Noel Tata and his son Neville Tata have filed caveat petitions in Bombay High Court and Mumbai City Civil Court in the wake of allegations and controversies raised by Tata Trusts trustees Venu Srinivasan and Vijay Singh.
  • OneWeb is ahead of Musk Starlink in the race. Bharti Airtel Chairman Sunil Bharti Mittal revealed on Wednesday at the Bloomberg New Economy Forum 2026 that his Eutelsat OneWeb company is ahead of US tycoon Elon Musk's Starlink for domestic satellite internet services.
  • Wholesale inflation to 11.39 percent. Domestic inflation based on the Wholesale Price Index (WPI) reached 11.39 percent in September. The reason for this is the increase in the prices of food, manufactured goods, fuel and electricity. Ministry of Commerce has introduced a simplified system based on self-declaration to speed up issuance of permits for import of certain types of silver items.
  • Prices of gold and silver in major cities of Telugu states as follows..(14-10-2026) Look at the gold and silver rates (Gold Silver Rate Today) in Hyderabad, Vijayawada and Visakha, the major cities of Telugu states. It seems that the government is planning to tighten foreign direct investment (FDI) norms in the tobacco sector. Sources said that the government is considering a proposal to ban FDI in licensing for franchises, trademarks, brand names and management contracts in this sector.
  • Let's bring stability to the forex market! Reserve Bank of India (RBI) Governor Sanjay Malhotra on Wednesday revealed that steps have been taken to bring stability to the forex (foreign exchange) market and prevent speculative activities on the value of the rupee.
  • New rules for SME IPOs! Markets regulator Sebi on Wednesday proposed comprehensive changes to strengthen regulatory frameworks to provide more protection for investors' funds applying for IPOs of small and medium enterprises (SMEs).
  • Canara Bank's profit was Rs 5,175 crore. Public sector Canara Bank posted a net profit of Rs 5,175 crore for the September quarter. This is 8.4% higher than the profit of Rs.4,774 crore for the same period of 2025-26. During the same period the total income increased from Rs.38,598 crores to Rs.40,931 crores.
  • News Brief(4) Reliance Consumer Products has entered the ready-to-drink dairy segment. Joyland launched packaged flavored milk under the brand name. Initially launched in the Tamil Nadu market with strawberry and vanilla flavors, it will soon be expanded across the country.