రివ్యూ: జైలర్2.. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్ ఎలా ఉంది?

- A
- A+
- A++
Jailer 2 Review Telugu || చిత్రం: జైలర్2; నటీనటులు: రజనీకాంత్, ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, రమ్యకృష్ణ, విద్యాబాలన్, యోగిబాబు, మిర్నా మేనన్, రిత్విక్; రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్; విడుదల: 15-10-2026

రజనీకాంత్ ( Rajinikanth) నటించిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రజనీ స్టైల్, యాక్షన్, నెల్సన్ టేకింగ్ అలరించాయి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘జైలర్2’. (Jailer 2 release date) మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి భాగాన్ని మించి అలరించేలా ఉందా?
కథేంటంటే..
Jailer 2 Story || తనయుడిని కోల్పోయిన టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) అలియాస్ జైలర్ తన కుటుంబానికి అన్నీ తానై సాధారణ జీవితం గడుపుతుంటాడు. మరోవైపు వర్మ (వినాయకన్)ని హత్య చేసింది ఎవరో కనిపెట్టి, అతన్ని మట్టుబెట్టాలనే ప్రయత్నంలో ఉంటాడు విగ్రహాల ముఠాలో కీలకమైన దిలీప్ (సూరజ్ వెంజరమూడు). ముత్తువేల్ పాండ్యన్ కూడా దిలీప్ని బయటకు లాగి, ఈ ముఠా వెనక ఎవరున్నారో తేల్చాలనుకుంటాడు. అలా లోకల్ రౌడీ అయిన మూర్తి (నమో నారాయణ)తో కలిసి దిలీప్ వరకూ వెళతాడు టైగర్ ముత్తువేల్. దిలీప్, టైగర్ ఒకరికొకరు ఎదురు పడ్డాక ఏం జరిగింది?దిలీప్ వెనక ఉంటూ, విగ్రహాల ముఠాని నడుపుతున్న బోధి కల్పక్ (ఎస్.జె.సూర్య) ఎవరు?కలుగులో దాక్కున్న అతన్ని, అతని కుటుంబాన్నీ జైలర్ ఎలా తనవరకూ పిలిపించుకున్నాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? ఈ కథలో కాంత (విద్యాబాలన్) ఎవరు?జైలర్‌కు ఓ సైన్యంలా నిలిచిన నరసింహ (శివ రాజ్‌కుమార్) మ్యాథ్యూ (మోహన్‌లాల్), కామ్‌దేవ్ (జాకీ ష్రాఫ్)లకు తోడు రోడీ (హృతిక్ రోషన్) ఈసారి ఎలా సాయం చేశాడు? తదితర విషయాలు తెరపై చూసి తెలుసుకోవల్సిందే. (Jailer 2 Movie Review)
ఎలా ఉందంటే
Jailer 2 Review Telugu || అంతకుముందు సినిమాలకు భిన్నంగా రజనీకాంత్‌ని వయసుకు తగ్గట్టుగా చూపిస్తూనే... ఆయన ఇమేజ్‌ని పక్కాగా వాడుకుంటూ ‘జైలర్’ ( ) తీశారు నెల్సన్ దిలీప్‌కుమార్. శక్తిమంతమైన కథానాయకుడి పాత్ర, అందుకు దీటైన అతిథి పాత్రలు, కావల్సినంత ఇతరత్రా గ్లామర్‌తోనూ అదొక మరపురాని వాణిజ్య చిత్రంగా నిలిచిపోయింది. రజనీ ఇమేజ్ ఉంది కదాని పూర్తిగా ఆయనపైనే ఆధారపడకుండా తన మార్క్ డార్క్ కామెడీని జోడిస్తూ నెల్సన్ (Jailer 2 Director) ఆ చిత్రాన్ని తీశారు. అలా అన్నీ తోడవడంతోనే ఆ చిత్రం ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి కొనసాగింపు అంటే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటం సహజం. అది దృష్టిలో ఉంచుకునే కామెడీ, మాస్ అంశాలు, ఎలివేషన్లు, భావోద్వేగాలు... ఇలా అన్నీ పక్కాగా ఉండేలా, ఏ విషయంలోనూ తక్కువ కాకుండా ఈసారి మరింత జాగ్రత్తపడ్డాడు నెల్సన్. కాకపోతే తొలి భాగం టెంప్లేట్లోనే సినిమా సాగింది. దానికితోడు ఈసారి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తోడైనా ప్రథమార్ధం స్థాయిలో అతిథి పాత్రలు ప్రభావం చూపించలేదు. అయినా సరే, ఎక్కడా ఆసక్తిని మాత్రం కోల్పోకుండా చివరికి సినిమా పైసా వసూల్ అనే భావన కలగజేస్తుంది.
తొలి భాగం తరహాలోనే అసలు కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు. మూర్తి పాత్ర పరిచయం దగ్గర్నుంచి గేర్ మారిపోతుంది. టైగర్ని మూర్తి తన డ్రైవర్‌గా నియమించుకోవడం నుంచి నాన్‌స్టాప్‌గా నవ్వులు పండుతాయి. యోగిబాబు తోడయ్యాక ఆ మోతాదు మరింతగా పెరుగుతుంది. మూర్తి పేరుతో దిలీప్ గ్యాంగ్‌ని భయపెట్టడం, ఆ తర్వాత దిలీప్ డెన్లోకి మూర్తి గ్యాంగ్ అడుగు పెట్టడం, అక్కడ నడిచే డీల్ ఆ నేపథ్యంలో పండే నవ్వులు నెల్సన్ శైలి డార్క్ కామెడీ పతాక స్థాయిలో ప్రభావం చూపుతుంది. మూర్తికి టైగర్ ( ) ఎవరో తెలిసే సన్నివేశాలతో ఎలివేషన్ల జోరు పెరుగుతుంది. టైగర్, దిలీప్ నేరుగా తలపడే సన్నివేశాలు సినిమాకే హైలైట్. అక్కడ చోటు చేసుకునే మలుపులు, యాక్షన్ సన్నివేశాలు, అతిథి పాత్రల హంగామా, టైగర్ జారీ చేసే హుకుమ్ తదితర సన్నివేశాలన్నీ ప్రథమార్ధం సినిమా అద్భుతం అనిపిస్తాయి.

దీంతో ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే అక్కడ్నుంచి కథ అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. ప్రధాన ప్రతినాయకుడైన బోధి కల్పక్తోపాటు, కాంత తదితర కీలక పాత్రలు అక్కడ్నుంచే పరిచయమవుతాయి. కల్పక్ పాత్రలో ఎస్.జె.సూర్య స్టైలిష్‌గా కనిపిస్తాడు తప్ప, పెద్దగా భయపెట్టలేకపోయాడు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్కీ, కల్పక్ కుటుంబానికీ మధ్య ఎత్తులు, పైఎత్తులతోనే ద్వితీయార్ధంలోని చాలా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఆ డ్రామా పెద్దగా మెప్పించలేదు. అయితే మాస్ అంశాలకు మాత్రం లోటుండదు. హృతిక్ రోషన్ అతిథి పాత్ర సహా బలమైన మాస్ అంశాలు, భావోద్వేగాల్ని మేళవించే ప్రయత్నం కనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో మరో అతిథి పాత్ర మెరుస్తుంది. మరో భాగం సినిమా కొనసాగడానికి కావాల్సిన పునాది పడింది.
ఎవరెలా చేశారంటే?
Jailer 2 Cast and Crew || రజనీకాంత్ ( Rajinikanth) తన టైగర్ పాత్రతో కథ మొత్తాన్నీ తన భుజాలపైనే నడిపించారు. చిన్న చిన్న హావభావాలతోనే పాత్రపై గణనీయమైన ప్రభావం చూపించారు. ప్రథమార్ధంలో నమో నారాయణ, యోగిబాబుతో కలిసి ఆయన నవ్వులు పండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆయన ఎలివేషన్లు కూడా మాస్‌ని అలరిస్తాయి. అతిథులుగా మెరిసినవాళ్లలో ఈసారి హృతిక్ రోషన్ (Hrithik Roshan) పోషించిన రోడీ పాత్రకు ఎక్కువ మార్కులు పడతాయి. ఆయన పాత్ర పరిచయమైన తీరు, తెరపై కనిపించిన విధానం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ మరోసారి మెరిశారు. సూరజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu) పోషించిన దిలీప్ పాత్ర బాగుంది. మరోసారి వర్మని గుర్తు చేస్తుందా పాత్ర. ఎస్.జె.సూర్య (S. J. Suryah) స్టైలిష్ విలన్‌గా కనిపించాడు. అక్కడక్కడా డేంజర్‌గానే కనిపించినా, ఆ పాత్రపై మరికాస్త దృష్టిపెట్టాల్సింది. మిథున్ చక్రవర్తి, ( Mithun Chakraborty) విద్యాబాలన్ పోషించిన పాత్రలు సినిమాకి కీలకం.
సాంకేతిక విభాగాలు అత్యుత్తమ పనితీరుని కనబరిచాయి. రజనీకాంత్ అనగానే సంగీత దర్శకుడు అనిరుధ్‌కి పూనకం వచ్చేస్తుందేమో. ఆయన సమకూర్చిన నేపథ్య సంగీతం సినిమాపై ఆ స్థాయిలో ప్రభావం చూపించింది మరీ. పాటలు వినడానికి అంతంత మాత్రంగానే అయినా, తెరపైన వాటి చిత్రీకరణ మాత్రం బాగుంది. విజయ్ కార్తీక్ కణ్ణన్ విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు మినహా, అంచనాలకు దీటుగానే దర్శకుడు నెల్సన్ (jailer 2 director) ఈ సినిమాని తీర్చిదిద్దారు.
- బలాలు
- + రజనీకాంత్
- + ప్రథమార్ధం
- + హాస్యం, యాక్షన్ సన్నివేశాలు
- బలహీనతలు
- - ద్వితీయార్ధం
- - పాటలు
- చివరిగా: జైలర్ 2... టైగర్ మళ్లీ గర్జించాడు.. (Jailer 2 Movie Review Telugu)
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 13:05 ISTఅతిథి పాత్రలు:మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, వినాయకన్, వసంత్ రవి తదితరులు; సంగీతం: అనిరుధ్ రవిచందర్; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ కణ్ణన్; ఎడిటింగ్: ఆర్.నిర్మల్; నిర్మాత: కళానిధి మారన్
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సాఫ్ట్వేర్ కంపెనీలో పెళ్లికాని ప్రసాదు: ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రివ్యూ ఇంటిల్లిపాది ఆస్వాదించేగలిగే కంటెంట్‌తో ప్రేక్షకులకు చేరువైంది ఈటీవీ విన్. ఈ సంస్థ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించారు.
- రివ్యూ: హనుమాన్ అంశ్.. తెలుగువారినీ అలరిస్తుందా? బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి భక్తి భావాన్ని నింపింది?
- రివ్యూ: ఖలీఫా: ది రూలర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన ‘ఖలీఫా: ది రూరల్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్.. శ్రీవిష్ణు ఎంటర్టైనర్ మెప్పించిందా? శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- అమ్మాయి ‘నో’ చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య.. నేరం ఎవరిది?: ‘పూజా మేరీ జాన్’ రివ్యూ తాను ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమకు ‘నో’ చెప్పిందని అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే, ఆ యువతి నేరస్థురాలవుతుందా?ఈ విషయాన్ని చర్చిస్తూ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan).
- రివ్యూ: #లవ్.. ఆ 60 రోజుల డేటింగ్లో ఏం జరిగింది? మోడ్రన్ రిలేషన్షిప్స్ నేపథ్యంలో ‘#లవ్’ (#Love) వెబ్ సిరీస్ విడుదలైంది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) నిర్మాణంలో, ‘మారి’, ‘మారి 2’ చిత్రాల దర్శకుడు బాలాజీ మోహన్ (Balaji Mohan) దీన్ని తెరకెక్కించారు.
- రివ్యూ: ది ఇండియా స్టోరీ.. ఆ పాప హత్యకు కారణం ఎవరు? కాజల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కాజల్ పోరాటం ఎవరిపై చేసింది?
- రివ్యూ: తెల్లకాగితం.. రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? హర్ష్ రోషన్ కథానాయకుడిగా నటించిన ‘తెల్లకాగితం’ బలమైన ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: సిగ్మా.. దర్శకుడిగా సీఎం విజయ్ కుమారుడి ఫస్ట్ మూవీ ఎలా ఉంది? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన ‘సిగ్మా’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: దృశ్యం: ది కన్‌క్లూజన్.. సమీర్ చావుకు హిందీలోనైనా ముగింపు పలికారా? అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఫహద్ ఫాంటసీ ఫిల్మ్ మెప్పించిందా? మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: డోరతీ.. వార్తల్లో నిలిచిన కీర్తి సురేశ్ కొత్త మూవీ ఎలా ఉంది? కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ‘డోరతీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- మూగ యువతి కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారితే: ‘బేబీ డూ డై డూ’ రివ్యూ ప్రముఖ నటి హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రధారిగా నటించిన ‘బేబీ డూ డై డూ’ రివ్యూ.
- రివ్యూ: ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్.. ఫాంటసీ థ్రిల్లర్ మెప్పించిందా? సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ది వన్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: అనుమాన పక్షి.. రాగ్ మయూర్ మూవీ వినోదాన్ని పంచిందా? రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘అనుమాన పక్షి’. ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: ‘ది ప్యారడైజ్’.. నాని యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- ఫస్ట్ నైట్ రోజే వధువు ‘సారీ బ్రో..’ అంటే! ‘మొద రాత్రి’ రివ్యూ ‘మొద రాత్రి’ రివ్యూ. ఈరోజుల్లో ఒకరిని ప్రేమించి, ఆ విషయం తల్లితండ్రులకు చెప్పలేక అయిష్టంగానే మరొకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతున్నదే. అలాంటి ఘటన ఆధారంగా రూపొందిన సినిమా ఇది.
- రివ్యూ: ‘లస్ట్ స్టోరీస్ 3’.. సిద్ధార్థ్-అదితి దంపతుల ఆంథాలజీ ఎలా ఉంది? మహిళల లైంగిక స్వేచ్ఛ గురించి ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ చర్చించాయి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 3’ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
- రివ్యూ: ఇమ్మోర్టల్.. జీవీ ప్రకాశ్, కయాదు హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది? జీవీ ప్రకాశ్‌కుమార్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: దాయ్రా.. పృథ్వీరాజ్, కరీనాల క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దాయ్రా’ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
English Translation
Review: Jailer 2.. How is Rajinikanth's blockbuster movie sequel?

- A
- A+
- A++
Jailer 2 Review Telugu || Movie: Jailer2; Starring: Rajinikanth, SJ Surya, Mithun Chakraborty, Sooraj Venjaramoodu, Ramyakrishna, Vidya Balan, Yogibabu, Mirna Menon, Rithvik; Written and Directed by: Nelson Dilipkumar; Release: 15-10-2026

Rajinikanth ( Rajinikanth) everyone knows how much success 'Jailor' has achieved at the box office. Rajini's style, action and Nelson's take are entertaining. Now the movie 'Jailor 2' has come as a sequel to that movie. (Jailer 2 release date) And how is this movie? Is it more entertaining than the first part?
The story is..
Jailer 2 Story || Tiger Muthuvel Pandyan (Rajinikanth) aka Jailer, who has lost his brother, lives a normal life for his family. On the other hand, Dileep (Sooraj Venjaramoodu), a key member of Vigrahala gang, is trying to find out who killed Verma (Vinayakan) and kill him. Muthuvel Pandyan also drags Dileep out and wants to find out who is behind this gang. So Tiger Muthuvel goes to Dileep along with Murthy (Namo Narayana), a local bully. What happened when Dileep and Tiger faced each other? Who is Bodhi Kalpak (S.J. Surya) who is behind Dileep and runs the gang of idols? How did the jailer summon him and his family who were hiding in Kalugu? What were the consequences? Who is Kanta (Vidyabalan) in this story? How did Narasimha (Shiva Rajkumar), Mathew (Mohanlal), Kamdev (Jackie Shroff) along with Roddy (Hrithik Roshan) help the jailer this time? Other things need to be seen on the screen. (Jailer 2 Movie Review)
How is it
Jailer 2 Review Telugu || Nelson Dilipkumar made 'Jailor' ( ) while showing Rajinikanth younger than his age... using his image firmly. With a strong lead role, decent guest roles, and all the glamor that is needed, it remains an unforgettable commercial film. Nelson (Jailer 2 director) made the film adding his trademark dark comedy without relying entirely on Rajni's image. With all this, the film achieved that level of success. A continuation of that naturally means huge expectations. The comedy, mass elements, elevations, emotions, etc. that it focuses on, Nelson has been more careful this time, not less in any matter. Otherwise, the movie proceeded in the same template as the first part. Apart from that, this time, even with Bollywood star Hrithik Roshan, the guest roles did not show an impact in the first half. However, without losing the interest anywhere, the film finally feels like a cash grab.
Like the first part, the director took some time to go into the original story. The gear changes from the introduction of Murthy's character. Murthy's appointment of Tiger as his driver creates non-stop laughs. After joining Yogi Babu, that dose will increase more. Nelson's style of dark comedy is at its best when the gang is terrorizing Dilip's gang in the name of Murthy, and then Murthy's gang steps into Dilip's den, where the deal is made. The elevations gain momentum with the scenes where Murthy gets to know who Tiger ( ) is. The highlight of the movie is the direct confrontation between Tiger and Dileep. The twists and turns, the action sequences, the chaos of the guest characters, the Hukum issued by Tiger and all the other scenes in the first half of the movie feel amazing.

This adds more interest to the second half. But from there the story could not show the impact as expected. Along with the lead actor Bodhi Kalpak, Kanta and other key characters are introduced from there. SJ Surya looks stylish in the role of Kalpak, but he is not very scary. The ups and downs between Tiger Muthuvel Pandyan and the Kalpak family shaped most of the scenes in the second half. The drama was not very pleasing. But there is no shortage of mass items. It looks like an attempt to incorporate strong mass elements and emotions, including Hrithik Roshan's guest appearance. Another guest role shines in the iconic scenes. Another part lays the necessary foundation for the continuation of the movie.
Who did it?
Jailer 2 Cast and Crew || Rajinikanth ( Rajinikanth) has the whole story on his shoulders with his role as Tiger. led He showed a significant impact on the character with small gestures. In the first half, Namo Narayana and Yogibabu's laughter is impressive. His elevations also entertain the masses. Among those who shined as guests, this time Hrithik Roshan's role of Roadie gets more marks. The way his character was introduced and the way he appeared on screen became the main attraction of the movie. Mohanlal, Shivrajkumar and Jackie Shroff shined once again. Dileep's character played by Suraj Venjaramoodu is good. The character reminds me of Varma again. S. J. Suryah looks like a stylish villain. Even if it looks like danger here and there, more focus should be given to that character. Mithun Chakraborty, ( Mithun Chakraborty) Vidya Balan's roles in the film Critically.
Technical departments have shown excellent performance. Music director Anirudh will get paid like Rajinikanth. The background music composed by him had a great impact on the film. Although the songs are barely audible, their portrayal on screen is good. Vijay Karthik Kannan's visuals are very good. The structure is superior. Except for some scenes in the second half, director Nelson (jailer 2 director) has made this movie as expected.
- Strengths
- + Rajinikanth
- + First half
- + Comedy, Action Scenes
- Weaknesses
- - Second Half
- - Songs
- Finally: Jailer 2... Tiger roars again.. (Jailer 2 Movie Review Telugu)
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 13:05 ISTGuest roles:Mohanlal, Shiva Rajkumar, Jackie Shroff, Hrithik Roshan, Vijay Sethupathi, Vinayakan, Vasanth Ravi and others; Music: Anirudh Ravichander; Cinematography: Vijay Karthik Kannan; Editing: R. Nirmal; Producer: Kalanidhi Maran
Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Unmarried Prasad in Software Company: 'Least Eligible Bachelor' Review ETV WIN reaches out to the audience with content that they can enjoy endlessly. This company has brought another new web series called 'Least Eligible Bachelor' to the audience. Harsha Chemudu, who is known as a comic actor, acted in the lead role.
- Review: Hanuman Ansh.. will entertain Telugu people too? 'Hanuman Ansh', which received sensational success at the box office, came before the Telugu audience this Friday. And how is this movie? What kind of devotion did it fill?
- Review: Khalifa: The Ruler.. How was Prithviraj Sukumaran's action thriller? How about 'Khalifa: The Rural' starring Malayalam actor Prithviraj Sukumaran? What kind of thrill did it spread?
- Review: Comrade Kalyan.. Did Srivishnu entertainer please? How is the entertainer 'Comrade Kalyan' starring Sree Vishnu? What kind of entertainment did it provide?
- Boy commits suicide because girl said 'no'.. Whose fault is it?: 'Pooja Mary Jaan' review If a boy commits suicide because the girl he likes says 'no' to his love, does the young woman become a criminal? The film 'Pooja Meri Jaan', made as a courtroom thriller, discusses this issue.
- Review: #Love.. What happened in those 60 days of dating? The web series '#Love' (#Love) has been released in the background of modern relationships. Produced by Soundarya Rajinikanth's daughter Soundarya Rajinikanth, directed by 'Maari' and 'Maari 2' director Balaji Mohan.
- Review: The India Story.. Who is responsible for the murder of that baby? Kajal's latest film is 'The India Story'. Currently streaming on Jio Hotstar platform. And how is this movie? Who did Kajal's fight against?
- Review: White paper.. Did you like the romantic drama? Harsh Roshan starrer 'Tellakagitham' has opened to the audience with strong publicity. And how is this movie? How entertaining is it?
- Review: Sigma.. How is CM Vijay's son's first movie as a director? Tamil Nadu Chief Minister Vijay's son Jayson Sanjay's directorial debut 'Sigma'? What kind of entertainment?
- Review: Scene: The Conclusion.. Is Sameer Chau's death a conclusion in Hindi? How is the Ajay Devgan-starrer crime thriller Drishyam: The Conclusion? What kind of thrill did it spread?
- Review: Don't Trouble The Trouble.. Was Fahadh's fantasy film pleasing? How about 'Don't Trouble the Trouble' starring Malayalam actor Fahad Fazil in the lead role? What kind of entertainment did it give?
- Review: Dorothy.. How is Keerthy Suresh's new movie in the news? How is 'Dorothy' starring Keerthy Suresh, Sananth and Rishikant? What kind of fun?
- When a mute girl becomes a contract killer: 'Baby Do Die Do' Review Review of 'Baby Do Die Do' starring Huma Qureshi in the lead role.
- Review: The One: Force of the Forest.. Did you like the fantasy thriller? How is the movie 'The One' starring Siddharth Malhotra and Tamannaah in pivotal roles? What kind of thrill did it spread?
- Review: Anumana Pakshi.. Did Raag Mayur movie entertain? Anumana Pakshi is an entertaining movie starring Rag Mayur and Merin Phillip. how is it What kind of entertainment did it provide?
- Review: 'The Paradise'.. Did the action thriller please me? How is the periodical action thriller 'The Paradise' directed by Srikanth Odela starring Nani? What kind of thrill was spread?
- On the first night, the bride said 'sorry bro..'! Review of 'First Night' Review of 'First Night'. Nowadays it is happening that people love someone and marry someone else reluctantly without being able to tell their parents about it. This is a movie based on such an incident.
- Review: 'Lust Stories 3'.. How is Siddharth-Aditi couple anthology? 'Lust Stories' and 'Lust Stories 2' discussed women's sexual freedom. Let's see to what extent the 'Lust Stories 3' in this franchise has impressed.
- Review: Immortal.. Jeevee Prakash, Kayadu horror thriller? What kind of thrill did the horror thriller 'Immortal', starring Jeeves Prakashkumar and Kayadu Lohar in key roles?
- Review: Daira.. Prithviraj and Kareena's crime thriller? What about Prithviraj Sukumaran and Kareena Kapoor's crime thriller 'Daira'? What kind of thrill was spread?