హర్మూజ్‌లో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు!

Eenadu icon
By International News Team Updated : 15 Oct 2026 15:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: హర్మూజ్‌ జలసంధిలో ఓ కార్గో నౌక (Cargo Ship) మునిగిపోయింది. సీమైన్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC) వెల్లడించింది. అయితే, మైన్‌ను ఢీకొట్టి నౌక మునిగిపోయినట్లుగా ఐఆర్‌జీసీ ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చట్ట విరుద్ధమైన, ప్రమాదకర మార్గంలో నౌక ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 

ప్రమాదానికి గురైన నౌక దాదాపు 2500 కంటైనర్లతో వెళ్తున్నట్లు సమాచారం.  వీటిలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూమ్‌ బాటిళ్లు, తదితర వస్తువులున్నాయి. ప్రమాదం అనంతరం కంటైనర్లు చెల్లాచెదురు కాగా.. అందులోని ఐఫోన్‌లు సహా ఇతర వస్తువులు కుప్పలుగా నీటిపై తేలియాడుతున్న దృశ్యాలు కనిపించాయి. జీఎఫ్‌ఎస్‌ ప్రైడ్ అనే సింగపూర్‌ జెండా ఉన్న నౌక దుబాయ్ నుంచి ఈ సరకులను తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది.

హర్మూజ్‌ మార్గంలో వెళ్తున్న సమయంలో సింగపూర్‌కు చెందిన రెండు సరకు రవాణా నౌకలు గుర్తు తెలియని వస్తువులను ఢీకొన్నాయని నౌకాశ్రయ అధికారులు తొలుత పేర్కొన్నారు. ఇందులో ఒకటి మునిగిపోగా.. మరొకటి సురక్షితంగా గమ్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి నౌకలోని సిబ్బంది అందర్నీ సురక్షితంగా తరలించామని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సింగపూర్‌ పోర్టు అధికారులు వెల్లడించారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 15:40 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కుప్పకూలిన పాఠశాల పైకప్పు.. 28 మంది విద్యార్థులు, టీచర్‌ దుర్మరణం పాకిస్థాన్‌ (Pakistan)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి (school roof collapses) 28 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.
  • పుతిన్‌ కోసమే స్టార్‌ ‘లింక్‌ తెగిందా’.. అమెరికా ప్రభుత్వం చేతిలో కీ..! Elon Musk-Starlink: శాటిలైట్ ఆధారిత స్టార్‌లింక్ (Starlink) సేవల భారత్‌ ప్రవేశ జాప్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
  • యువ జిమ్నాస్ట్‌ల నగ్న వీడియోలు చిత్రీకరించిన కోచ్‌.. 90 ఏళ్ల జైలు యువ జిమ్నాస్ట్‌ (young gymnasts)ల నగ్న వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన కోచ్‌కు అమెరికా (USA) న్యాయస్థానం 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
  • పడేనా ట్రంప్‌ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
  • కోలుకుంటున్న పోప్‌ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్‌ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్‌ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్‌ మేరీ మిల్బెన్‌ ఆరోపించారు.
  • ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోకముందే... ఎలాన్‌ మస్క్‌ కూడా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్‌ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్‌ బుధవారం పేర్కొంది.
  • పాకిస్థాన్‌ మళ్లీ ‘హ్యాండ్‌ ఇచ్చింది’..! ఒక చిన్న గెరిల్లాదళమైన హూతీలు సౌదీ అరేబియాపై వరుసదాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.
  • జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలోని బాకూమ్‌ నగరంలో ఓ నివాస సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
  • ఇరాన్‌ వ్యూహాల్లో మరో టర్నింగ్‌ పాయింట్‌.. రంగంలోకి స్పాటర్లు Iran: అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమై హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)లో నౌకల లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇరాన్ (Iran) కొత్త వ్యూహాలు పన్నుతోంది.
  • హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని మునిగిన నౌక హర్మూజ్‌లో సీమైన్లను ఢీకొని ఓ చమురు ట్యాంకర్‌ మునిగిపోయింది.
  • ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌- బీబీ రహస్య చర్చలు! ఇరాన్‌పై త్వరలోనే దాడులు ప్రారంభించేందుకు ట్రంప్-నెతన్యాహు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికన్ల నుంచి నిధులు: సింగర్ ఆరోపణలు Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ (American singer) ఆరోపించారు.
  • ఓపెన్‌ఏఐ మీటింగ్‌ హాల్‌లో గూఢచర్య పరికరాలు..! ఓపెన్‌ఏఐ సంస్థలో పని చేస్తూ.. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 
  • బాలికను అసభ్యంగా తాకిన రోబో.. షాకింగ్‌ ఘటన జర్మనీ (Germany)లో ఓ రోబో.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రవర్తించేలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
  • ప్రపంచం కోసమే రష్యా డీజిల్‌ కొనుగోలు: ట్రంప్ విచిత్ర వివరణ Donald Trump: డీజిల్‌ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
  • సౌదీకి షాక్‌: అరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీ అరేబియాలో దాడులు తీవ్రమయ్యాయి. ధహ్రాన్‌ నగరంలోని చమురు సంస్థ అరాంకో(Aramco) కార్యాలయపై హూతీలు(Houthis) బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు.
  • గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.

English Translation

Heaps of iPhones floating in Hormuz!

Eenadu icon
By International News Team Updated : 15 Oct 2026 15:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: A cargo ship in the Strait of Hormuz (Cargo Ship) sunk. The Iranian Revolutionary Guard Corps (IRGC) revealed that the incident took place after hitting a seamine. However, it is noteworthy that this is the first time that the IRGC has announced that the vessel has hit a mine and sunk. Local media said that the incident took place while the vessel was traveling on an illegal and dangerous route. 

It is reported that the stricken vessel was carrying around 2500 containers.  These include iPhones, luxury perfume bottles and other items. While the containers were scattered after the accident, other items including iPhones were seen floating in heaps on the water. It seems that the Singapore-flagged vessel GFS Pride was carrying these goods from Dubai.

The port authorities initially claimed that two cargo ships from Singapore collided with unknown objects while en route to Hormuz. He said that one of them drowned and the other reached the destination safely. In this context, the Singapore Port authorities revealed that all the crew members of the first ship were safely evacuated and no one was injured. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 15:40 IST

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • School roof collapsed.. 28 students, teacher dead A tragic incident took place in Pakistan. 28 students and a teacher lost their lives when the roof of a private school collapsed.
  • Is the star 'link broken' for Putin? Elon Musk-Starlink: Global billionaire Elon Musk is very impatient over the delay in India's entry of satellite-based Starlink services.
  • Coach who filmed nude videos of young gymnasts.. 90 years in prison The American (USA) court has sentenced the coach who secretly filmed nude videos of young gymnasts to 90 years in prison. In addition to the high cost of living with international developments... It started without an election in America.
  • The recovering Pope Pope Leo-14, who underwent surgery to remove a cancerous tumor from his lung, is slowly recovering.
  • US Funds for Cockroach Janata Party American singer Mary Milben has accused that some donors in her country are providing funds to the Cockroach Janata Party (CJP), which is agitating in India. After signing an agreement with Russia... before recovering from the shock given by US President Donald Trump... Elon Musk also hit Ukraine.
  • Fire accident in Germany... Three Indians died. Local media revealed on Wednesday that three Indians died in a fire accident in Germany. Iran said on Wednesday that a mine exploded in the Strait of Hormuz and sunk a commercial ship.
  • Pakistan again 'gave a hand'..! A small guerilla group, the Houthis, is wreaking havoc in Saudi Arabia by launching a series of attacks.
  • Fire in Germany.. Three Indians killed. Three Indians were killed in a fire in a residential complex in Baukum, Germany.
  • Another turning point in Iran's strategies.. Spotters into the field Iran: Iran is planning new strategies to target ships in the Strait of Hormuz, which is crucial for international energy transportation. An oil tanker sank after hitting sea mines in Hormuz.
  • Trump-Bibi secret talks to attack Iran again! There are reports in international media that Trump-Netanyahu plans to launch attacks on Iran soon.
  • Cockroach Janata Party funded by Americans: Singer's allegations Mary Millben: American singer Mary Millben (American singer) has accused that some donors in her country are providing funds to the Cockroach Janata Party (CJP). FBI officials have arrested a person who was involved in espionage while working in OpenAI. 
  • The robot touched the girl indecently.. Shocking incident In Germany, a robot touched a 16-year-old girl indecently. The police said that the two youths made it misbehave deliberately.
  • Russia buying diesel for the world: Trump's strange explanation Donald Trump: US President Donald Trump is facing severe criticism even from his own party over the agreement signed with Russian President Putin for the purchase of diesel.
  • Shock for Saudi Arabia: Houthi attack on Aramco headquarters Attacks escalated in Saudi Arabia. The Houthis attacked the oil company Aramco office in Dhahran with a ballistic missile.
  • Gandhi's first workplace was an Ayurvedic herbal garden in Durban. A traditional Ayurvedic herbal garden was established at the 'Phoenix Settlement', a collective ashram started in Durban in 1904 by Mahatma Gandhi while living in South Africa as a young lawyer.