అభివృద్ధి ఫలాలు అందరికీ

- A
- A+
- A++

ఈనాడు, విశాఖపట్నం; న్యూస్‌టుడే, మధురవాడ, సింహాచలం: ‘తెదేపా, భాజపా, జనసేన కూటమి కేవలం ఎన్నికల కోసం ఏర్పడలేదు. రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలకటానికి, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించటానికి కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలకు 21, అసెంబ్లీ స్థానాల్లో 175కు 164 చోట్ల సాధించిన అద్భుత విజయం మరింత కష్టపడి పనిచేయాలని గుర్తుచేస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతోంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, రూ.15 వేల కోట్లతో అమరావతి పునర్నిర్మాణ ప్యాకేజీ, విశాఖ-రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధికి దోహదపడతాయి’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేర్కొన్నారు. విశాఖలోని వైజాగ్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. భాజపా జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లాల ప్రత్యేకతలతో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు.

‘త్యాగం, తపస్సు, సిద్ధాంతాల పునాదులపైనే భాజపా ఈ స్థాయికి చేరుకుంది. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జాతీయస్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు వంటి నాయకుల ప్రస్థానమే తార్కాణం. డబుల్ ఇంజిన్ సర్కారు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. భారత భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా యువతను తీర్చిదిద్దేందుకు కేంద్రం యత్నిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కొత్తతరంతో నిరంతరం మాట్లాడాలి. 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా కార్యకర్తలు ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు.

‘ప్రతిపక్షాలు అసాంఘిక శక్తులను ప్రోత్సహించి దేశాన్ని అస్థిరత్వంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రతిపక్షాల తీరు దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని అగౌరవపరిచేలా అసభ్యకర భాష ప్రయోగిస్తున్నారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌కు నేషనల్ ఫస్ట్ (దేశం ముందు) కాదు.. సెల్ఫ్ ఫస్ట్ (స్వార్థమే ముందు). దేశంలో మౌలిక సదుపాయాలకు గతంలో రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తే ప్రస్తుతం రూ.8 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం’ అని వివరించారు.

- కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన రాష్ట్రాల కంటే 25% అదనంగా ఏపీకి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగటంపై ధన్యవాదాలు చెబుతూ మొదటి తీర్మానం చేశారు.
- రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయటం, పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి భద్రత కల్పించటంపై రెండో తీర్మానం చేశారు.
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో మృతిచెందిన భాజపా నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
సమావేశం జరుగుతున్న బూత్ స్థాయి అధ్యక్షుడు సత్యసాయి రాజు, ఎండాడ మండల అధ్యక్షుడు చోడవరపు నాగరాజు, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కలిసి సెల్ఫీ దిగారు. నబీన్ తన ఫోన్లో సెల్ఫీ తీయగా.. ఆ తర్వాత మాధవ్ ఫోన్ నుంచి స్టేజీ ముందున్న 945 మండలాల అధ్యక్షులు కనిపించేలా మరో సెల్ఫీ దిగారు. ఏడాదిలో రాష్ట్రంలో భాజపా చేసిన కార్యక్రమాలపై రిపోర్ట్ కార్డును నితిన్ నబీన్ ఆవిష్కరించారు.
సమావేశంలో భాజపా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌యాదవ్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, పాకా వెంకటసత్యనారాయణ, ఆర్.కృష్ణయ్య, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, నడికుడి ఈశ్వరరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పోతుల సునీత, పార్టీ జాతీయ సెల్స్ కోకన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి కిలారు దిలీప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామాంజనేయచౌదరి, దేవానంద్, శివన్నారాయణ, ఆడారి ఆనంద్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, ప్రధాన కార్యదర్శులు దయాకర్‌రెడ్డి, రమేష్‌నాయుడు, మట్టా ప్రసాద్, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
అంతకుముందు ఉదయం సింహాద్రి అప్పన్నస్వామిని నితిన్ నబీన్ దర్శించుకున్నారు. ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ‘వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు ఇలా భాజపా ప్రతినిధులు పోటీచేసిన ప్రతిచోటా గెలిపించుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ని మండల స్థాయికి తీసుకెళ్లాలి. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితాన్ని పూర్తిచేసుకోనున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి నెల రోజులపాటు ‘సేవా సంకల్ప ఉత్సవాలు’ జరపాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రతి గ్రామంలో కమలం వికసించేలా చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తిచేశారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఈ స్పీకర్ ఉంటే రోజూ పార్టీయే.. ఈ రోజుల్లో ఏ చిన్న వేడుకకైనా మ్యూజిక్ ఉండాల్సిందే. సౌండ్ మోగాలంటే స్పీకర్ తప్పదు. ఇంట్లో పార్టీలు, వేడుకలు.. స్నేహితులు, కుటుంబంతో గెట్టుగెదర్, సెలబ్రేషన్స్‌కు అద్భుతమైన సౌండ్‌ను అందించే పార్టీ స్పీకర్లు అందుబాటులోకి వచ్చేశాయి. వెంట కూడా తీసుకెళ్లొచ్చు.
- మీ ఊరి చరిత్ర తెలుసా? అయితే మెకంజీ కైఫీయత్‌లు వెతకండి. అందులో మీ ఊరూ ఉండొచ్చు. పూర్వ చరిత్ర తెలుసుకోవచ్చు. వాటిని చదవాలంటే కొద్దిగా కష్టపడాలి.
- వయసుకు తగినట్లు ఎదగాలి కన్నా.. ఎదగాలి! రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో వయసుకు తగ్గ అభివృద్ధిలో తీవ్రమైన లోపం ఉన్న వారు 87,448 (4.83%) మంది ఉన్నట్లు బయటపడింది.
- రెండేళ్లుగా కాలయాపన.. పుష్కరాల వేళ హైరానా గోదావరి పుష్కరాలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది.
- మారిన పళ్లెం.. నేర్పుతోంది సమానత్వ పాఠం అందరూ సమానమే.. అనే భావన పిల్లల్లో చిన్నప్పటి నుంచే కలగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
- విజయవాడలో 72 అడుగుల మహాగణపతి విజయవాడకు చెందిన డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో లేబరుకాలనీ మైదానంలో 72 అడుగుల పర్యావరణహిత ‘శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
- వేంకటాద్రికి బ్రహ్మోత్సవ శోభ! తిరుమల శ్రీవేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ క్రతువును తితిదే నిర్వహించనుంది.
- ఎల్‌నినో తీవ్రం.. పైర్లలో పోతున్న జీవం ఎల్‌నినో ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అల్పపీడనంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నా.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి.
- సామాన్య భక్తుడే వీఐపీ ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకే ప్రాధాన్యమివ్వనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలతోపాటు శ్రీవాణి టికెట్లను రద్దుచేసింది.
- చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డులు! రోడ్లపై తోపుడు బళ్లు, దుకాణాలు పెట్టుకుని పళ్లు, కూరగాయలు తదితర వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకూ బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నాయి.
- అన్ని వర్గాల్ని ఒకచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా వాడవాడలా అన్నివర్గాలూ ఎంతో ఘనంగా చేసుకొనే పండుగ వినాయక చవితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
- ఎస్కేయూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో 1988-91 మధ్య ఎల్ఎల్బీ (న్యాయవిద్య) పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అనంతపురంలో జరిగింది.
- తిరుమలకు ప్రైవేట్ వాహనాలపై ఆంక్షల్లేవు తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
- మీ కష్టపడేతత్వమే విద్యావ్యవస్థ భవిష్యత్తు టెట్-2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు.
- చీకటి గోపి మృతిపై సిట్ వేయాలి గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసల కారణంగానే మృతి చెందాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.
- క్యూలైన్లలో వైకుంఠ వైభవం! తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృథా పోనివ్వకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు తితిదే వినూత్న అడుగువేసింది.
- డీఎస్సీపై జగన్ తీరు.. దిగజారుడు రాజకీయం మెగా డీఎస్సీలో 16 వేల ఉపాధ్యాయ పోస్టుల్ని వంద శాతం పారదర్శకతతో భర్తీ చేసినట్టు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్సీపై వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నాయకుల విమర్శలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.
- హెల్త్కార్డులున్నా అందని నగదు రహిత వైద్యం హెల్త్‌కార్డుల పేరుతో భరోసా ఇచ్చి, వైద్యం విషయంలో చేతులు ఎత్తేయడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, లంకపల్లి సాయిశ్రీనివాస్ అన్నారు.
- పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్లో.. మహాత్మునికి అయ్యన్నపాత్రుడి నివాళి దక్షిణాఫ్రికాలోని చారిత్రక పీటర్ మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు సందర్శించారు. జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.
- అంటువ్యాధుల కేసుల రిపోర్టింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయాలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
English Translation
Fruits of development for all

- A
- A+
- A++

Today, Visakhapatnam; Newstoday, Madhurawada, Simhachalam: TDP, BJP and Jana Sena alliance was not formed just for elections. To usher in a new chapter in the development of the state, the bracelet is tied to provide the fruits of development to everyone. In the 2024 elections in the state, the miraculous victory of 21 out of 25 Lok Sabha seats and 164 out of 175 assembly seats reminds us to work harder. Development is going on under the leadership of Narendra Modi at the Centre, Chief Minister Chandrababu Babu and Deputy Chief Minister Pawan Kalyan in the state. Bhogapuram Alluri Sitharamaraju International Airport, Amaravati reconstruction package worth Rs.15 thousand crores, Visakha-Raipur greenfield highway construction, Advanced Medium Combat Aircraft (AMCA) projects in Puttaparthi will contribute to the development of AP," said BJP National President Nitin Nabeen. He attended the wide-ranging meeting of the BJP state executive committee held at the Vizag Convention Hall in Visakhapatnam on Tuesday. After unveiling the BJP flag, they visited the stalls set up with the specialties of the districts. Earlier, he started his speech in Telugu by greeting the people of Andhra Pradesh.
The reason behind this is the rise of leaders like Venkaiah Naidu, who started his political career as an ordinary activist and rose to the national level. The responsibility of the workers is to take the welfare and development provided by the double engine government to the people. The future of India lies in the hands of the youth. The center is trying to train the youth as job-creating entrepreneurs. Constantly talk to the new generation through social media. He called that the activists should move forward with the goal of Vikasit Bharat and Vikasit Andhra Pradesh by 2047. The opposition's behavior during the independence celebrations is an insult to the country's democracy. Congress leader Rahul Gandhi is using vulgar language to disrespect Prime Minister Modi. Congress leaders are unable to digest the development of the country under Modi's leadership. Congress is not national first (before country)..self first (self first). He explained that if in the past Rs.2 lakh crores were spent on infrastructure in the country, now we are spending Rs.8 lakh crores.
- The first resolution is thanking AP for getting 25% more than the rest of the states by investing Rs. did
- The second resolution was passed on speedy completion of water resources projects in the state and ensuring irrigation water security through the Polavaram project.
- A condolence resolution was introduced for the BJP leaders and activists who died due to accidents and illness in Andhra Pradesh.
SThe booth level president Satyasai Raju, Endada mandal president Chodavarapu Nagaraju, district president Parasuramaraju, state president PVN Madhav, national president Nitin Nabeen took a selfie together. While Nabeen took a selfie on his phone, Madhav took another selfie from his phone so that the presidents of 945 mandals could be seen in front of the stage. Nitin Nabin unveiled the report card on the activities done by BJP in the state during the year.
BJP National Organization General Secretary BL Santosh, Joint Organizational General Secretary Sivaprakash, Union Minister of State Bhupathiraju Srinivasavarma, State Minister Satyakumar Yadav, MPs Daggubati Purandeshwari, CM Ramesh, Paka Venkatasatyanarayana, R. Krishnaiah, former Chief Minister Nallari Kirankumar Reddy, MLAs Vishnukumarraju, Sujana Chaudhary, Kamineni Srinivas, Adinarayana Reddy, Ramakrishna Reddy, Nadikudi Iswara Rao, MLCs Somu Veerraju, Potula Sunitha, Party National Sales Co-convener Vishnuvardhan Reddy, State Media Incharge Kilaru. Dileep, State Vice-Presidents Sitharamanjane Chowdhury, Devanand, Sivannarayana, Adari Anand, Organization General Secretary Madhukar, General Secretaries Dayakar Reddy, Ramesh Naidu, Matta Prasad and Lakshmiprasanna were present.
Earlier in the morning, Nitin Nabeen visited Simhadri Appannaswamy. Andal worshiped in the presence of Goddess Andal.
BJP state president PVN Madhav said that BJP representatives should win wherever they contested, such as ward members, sarpanchs, councillors, corporators, municipal chairmen and mayors. We have created a special activity for local body elections. The 'Janata Waradhi', which is being organized to solve public problems, should be taken to the mandal level. On the occasion of Prime Minister Modi completing 25 years of public life, a month-long 'Seva Sankalpa Utsavam' should be held from September 17. Central government schemes and development programs should be explained to the public. Let us make lotus blossom in every village,' he appealed to the party ranks.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Every day is a party if this speaker is present.. Nowadays any small celebration should have music. A speaker is required for sound. Party speakers have become available that provide excellent sound for home parties, celebrations, get togethers with friends, family and celebrations. You can also take it with you.
- Do you know the history of your town? But look for Mackenzie Kaifiyats. It may include your city. Previous history can be known. You have to work hard to read them.
- Rather than growing up according to your age.. 87,448 (4.83%) of the children in Anganwadi Centers in the state have severe stunting for their age. As the Godavari pushkaras are few more months away, the government is focusing on the arrangements. All are equal.. The Government has launched an innovative program with the intention of inculcating the concept of ``Ganapati'' in children from childhood.
- 72 feet Mahaganapati in Vijayawada. Under the auspices of Vijayawada-based Dundee Ganesh Seva Samiti, a 72-feet eco-friendly statue of 'Sripanchamukha Varasiddhi Mahaganapati' was installed in Labor Colony grounds. The festival will be held from 14th to 24th of this month. As part of Tirumala Srivenkateswara's Salakatla Brahmotsavam, Thithide will conduct the budding ceremony on Monday evening. The effect of El Nino is intensifying day by day. Although there are heavy rains due to low pressure, most parts of the state are experiencing rainy conditions.
- Common devotee is VIP. Thithide has made extensive arrangements for the Salakatla Brahmotsavam of Sri Venkateswara to be held from 15th to 23rd of this month. Priority will be given to ordinary devotees. On the days of Brahmotsavam, Srivani has canceled all kinds of privileged darshan tickets.
- Credit cards for small traders! Banks will also issue credit cards to small traders who set up street stalls and shops selling fruits, vegetables etc.
- Vinayaka Chavithi is a great social festival that brings all communities together. Chief Minister Chandrababu said that Vinayaka Chavithi is a festival celebrated by all sections of the community irrespective of villages, colonies, towns and cities. Greetings of Vinayakachavathi to the people.
- SKU Alumni Association A spirited gathering of former students of Sri Krishna Deva Raya University (SKU) who completed LLB (Law) between 1988-91 was held in Anantapur on Sunday.
- There is no restriction on private vehicles for Thirumals. In a statement on Sunday, Thithide said that people should not believe the false propaganda being spread on social media that private vehicles are being restricted to Tirumala.
- Your hard work is the future of the education system. Education and IT Minister Nara Lokesh on Sunday congratulated the candidates and in-service teachers who passed TET-2026. Manda Krishna Madiga, founder president of MMRPS, alleged that the Dalit youth of Ponnekallu village, Tadikonda mandal of Guntur district, Ghama Gopi, died due to illegal detention and torture by the police. Thithide has taken an innovative step to instill spiritual thought and calmness in the devotees who wait in queues for hours to have a glimpse of Tirumala Shrivari.
- Jagan's attitude towards DSC. Palla Srinivasa Rao, State President of TDP said that 16 thousand teacher posts have been filled in Mega DSC with 100% transparency. Vaikapa chief Jagan and the party leaders' criticism of DSC is a proof of degenerate politics. STU State President and General Secretaries M. Raghunatha Reddy and Lankapalli Saisrinivas said that it is not appropriate to give assurances in the name of health cards and raise hands in the matter of medicine. Legislative Assembly Speaker Ayyannapatra visited the historic Peter Maritzburg Railway Station in South Africa. Tributes to the statue of Father of the Nation Mahatma Gandhi.
- The reporting system of infectious disease cases should be strengthened. Health Minister Satyakumar Yadav has directed the officials to take measures to prevent the spread of infections in the state in the wake of rains.