లక్ష్యసేన్ కష్టంగా..

- A
- A+
- A++

దిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సింగిల్స్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే ఆయుష్ శెట్టి శుభారంభం చేయగా.. గట్టి పోటీ ఎదురైనా లక్ష్యసేన్, ఉన్నతి హుడా కూడా ముందంజ వేశారు. మిక్స్డ్ డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జంట ప్రిక్వార్టర్స్ చేరింది. లక్ష్య తొలి రౌండ్లో చెమటోడ్చాడు. పెద్దగా పేరులేని కొలిన్స్ ఫిలిమన్ (ఆస్ట్రియా)ను ఓడించేందుకు కష్టపడ్డాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య 16-21, 21-8, 21-4తో ఫిలిమన్పై గెలిచాడు. తొలి గేమ్‌లో లక్ష్యకు ఫిలిమన్ (128వ ర్యాంకు) నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను లక్ష్య అలవోకగా గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత యువ కెరటం ఉన్నతి హుడా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 22-20, 21-16తో తెట్ తుజార్ (మయన్మార్)ను ఓడించింది.
గాయత్రి జోడీ ముందంజ..:మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జోలీ జంట ప్రిక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో గాయత్రి ద్వయం 21-15, 21-12తో లారెన్ లామ్-అలిసన్ లీ (అమెరికా) జంటను ఓడించింది. కవిప్రియ సెల్వమ్-సిమ్రన్ సింఘి జోడీకి చుక్కెదురైంది. భారత జంట 7-21, 14-21తో గాబ్రియెలా స్టొయెవా-స్టెఫాని స్టొయెవా (బల్గేరియా) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో రుత్విక శివాని-రోహన్ కపూర్ ద్వయం 22-20, 19-21, 17-21తో జొనాథన్ బింగ్-సాన్ లాయ్ (కెనడా) జోడీకి తలొంచింది. సూర్య-అమృత ప్రముతేశ్ ద్వయం హోరాహోరీగా పోరాడినా ఫలితం లేకపోయింది. గంట పైనే జరిగిన ఈ పోరులో భారత జంట 21-16, 29-30, 22-24తో సన్మెజ్-యాస్మిన్ (తుర్కియే) జోడీ చేతిలో ఓడింది.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ ఇద్దరూ భవిష్యత్ స్టార్లు మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) ద్వారా మారుమూల ప్రాంతాల నుంచి మహిళా క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భారత మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ చెప్పింది.
- నడిపించిన నాయకుడు టీ20 క్రికెట్లో ఇప్పటికే తనేంటో రుజువు చేసుకున్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ.. ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ సత్తా చాటుకున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టిన సౌత్ జోన్ కెప్టెన్..
- బ్యాటుతో మెరవాలి మహిళల టీ20 ఆసియాకప్‌లో భారత జట్టు మరోసారి సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఎ పోరులో గురువారం హాంకాంగ్‌ను ఢీకొంటుంది. పొట్టి ఫార్మాట్లో మూడుసార్లు ఆసియా టైటిల్‌ను గెలిచిన భారత్..
- భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ మహిళల క్రికెట్లో తొలి ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ.. శ్రీలంక నుంచి భారత్‌కు తరలించింది. ముందు అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీకి లంక ఆతిథ్యం ఇవ్వాలి.
- శ్రీకాంత్ శుభారంభం చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం తొలి రౌండ్లో అతడు 21-16, 21-15తో చి యు జెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు.
- బుమ్రా @ 3 ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్‌లో ఇటీవలే అగ్రస్థానం కోల్పోయిన జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు మరో ర్యాంకు తగ్గాడు. శ్రీలంక పర్యటనకు దూరమైన అతడు తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు.
- చెమటోడ్చిన జ్వెరెవ్ యుఎస్ ఓపెన్‌లో సంచలనం తప్పింది. టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ త్రుటిలో పరాజయాన్ని తప్పించుకున్నాడు. అయిదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో అన్‌సీడెడ్ సొనెగోను ఓడించి, అతడు అతికష్టంగా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.
- గాయాల మీదే ప్రధాన చర్చ ఇటీవల భారత ఆటగాళ్లు ఎక్కువమంది గాయాల పాలవడం, ఫిట్నెస్ సాధించడంలో ఆలస్యం జరుగుతుండడంపై చర్చే గురువారం జరిగే బీసీసీఐ సమీక్ష సమావేశంలో ప్రధాన అజెండా కానున్నట్లు సమాచారం.
- రాముకు స్వర్ణం జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు ఎల్. రాము, ఎం.సోము సత్తా చాటారు. బాలుర అండర్-18 విభాగం 400 మీటర్ల పరుగులో రాము 47.21 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించాడు.
- సంక్షిప్త వార్తలు (2) మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో పసికూన ఇండొనేసియాను ప్రత్యర్థి జట్లు ఆటాడుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో 58 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. శ్రీలంకపై 49 పరుగులకే చేతులెత్తేసింది.
- బుమ్రా, నితీశ్ వచ్చేశారు కానీ.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి కొన్ని నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చారు. అఫ్గానిస్థాన్‌తో ఈ నెల 13, 15, 16 తేదీల్లో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు వీళ్లిద్దరితో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు.
- ముంబయి కెప్టెన్‌ను తేల్చేది రోహితే! ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్ మారడం ఖాయం. అయితే కొత్తగా ఆ జట్టు పగ్గాలు ఎవరు చేపట్టాలన్నది నిర్ణయించేది ప్రధానంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మేనని సమాచారం.
- అల్కరాస్ మొదలెట్టాడు.. టెన్నిస్ స్టార్ అల్కరాస్ అదరగొట్టాడు. గాయంతో అయిదు నెలలు ఆటకు దూరమైన అతడు.. యుఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ స్వైటెక్.. ఘనంగా బోణీ కొట్టింది.
- దులీప్ ట్రోఫీ .. ఫైనల్లో ఈస్ట్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌ను ఓడించింది.
- వాళ్లిద్దరి నుంచి నేర్చుకుంటున్నా బ్యాటర్లను ఎలా ఎటాక్ చేయాలో సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్‌ల నుంచి నేర్చుకుంటున్నానని భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ చెప్పాడు. ‘‘రంజీ ట్రోఫీతో పాటు భారత్-ఎ తరఫున సత్తా చాటడంతో టీమ్ఇండియాకు ఎంపికయ్యా.
- అచ్చం యమాల్లాగే.. స్పెయిన్ యువ కెరటం యమాల్ ఏంటి కేరళలో ఉన్నాడు! ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అని ఆ కుర్రాడిని చూసి ఫుట్‌బాల్ అభిమానులు తికమక పడడం ఖాయం. ఎందుకంటే కొల్లంకు చెందిన అలెన్ జేమ్స్.. యమాల్ మాదిరే ఉంటాడు.
- ఉన్నతి తొలి రౌండ్లోనే.. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నమెంట్లో ఉన్నతి హుడా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో ఆమె 10-21, 18-21తో కిమ్ గయిన్ (కొరియా) చేతిలో ఓడిపోయింది.
- నచ్చకపోతే హోటళ్లకు వెళ్లొచ్చు ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రికెట్ జట్ల కోసం చేసిన వసతి ఏర్పాట్లు బాగా లేవన్న విమర్శలపై జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజి స్పందించాడు. తాము ఏర్పాటు చేసిన వసతి నచ్చకపోతే జట్లు బయట హోటళ్లలో బస చేయడానికి అభ్యంతరమేమీ లేదని అతను స్పష్టం చేశాడు.
- సంక్షిప్త వార్తలు ( 5) మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్-ఎ పోరులో ఆ జట్టు 35 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. మొదట పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులే చేసింది.