వరుణుడు కరుణిస్తే.. విజయం మనదే

- A
- A+
- A++

శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించడానికి టీమ్ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. కానీ రెండు టెస్టుల సిరీస్‌లో శుభ్‌మన్ సేన ఆధిక్యంలోకి వెళ్తుందా లేదా అన్నది వరుణుడి చేతుల్లోనే ఉంది. తొలి టెస్టుకు ఆరంభం నుంచి అంతరాయం కలిగిస్తున్న వర్షం.. చివరి రోజు కూడా గాలెను వీడేలా లేదు. సగం రోజు ఆట సాగినా.. భారత్ విజయాన్ని అడ్డుకోవడం లంకకు కష్టమే. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు వంద పరుగులైనా చేయకముందే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో సాగుతోంది.
శ్రీలంకతో తొలి టెస్టులో ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయిస్తున్న టీమ్ఇండియా.. విజయానికి 6 వికెట్ల దూరంలో నిలిచింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. నాలుగో రోజు ఆట చివరికి 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, కుప్పకూలేలా ఆతిథ్య జట్టును.. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (31 బ్యాటింగ్), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనాల్ దినుష (25 బ్యాటింగ్) ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే ఓపెనర్ నిషాన్ మదుష్క (6)ను ఆరంభంలోనే ఔట్ చేసి సిరాజ్ జట్టుకు శుభారంభాన్నివ్వగా.. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (2/30) సూపర్ బౌలింగ్‌ను కొనసాగిస్తూ లహిరు ఉదార (16), పసిందు సూర్యబండార (0)లను పెవిలియన్ చేర్చాడు. లంక వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ (2)ను ప్రసిద్ధ్ ఔట్ చేయడంతో లంక పతనం దిశగా సాగింది. ఈ స్థితిలో ధనంజయ, దినుష గంట పాటు పట్టుదలతో నిలిచి మరో వికెట్ కోల్పోకుండా ఆటను ముగించారు. ఈ జోడీ అయిదో వికెట్‌కు అజేయంగా 37 పరుగులు జోడించింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (66; 69 బంతుల్లో 8×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో (4/31), ప్రభాత్ జయసూర్య (3/43), లహిరు కుమార (2/28) రాణించారు.

పంత్ ధనాధన్:తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిరాశపరిచింది. మ్యాచ్‌కు ప్రతి రోజూ వర్షం అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో వేగంగా ఆడి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని భారత్ చూడగా.. ఈ క్రమంలో చకచకా వికెట్లు పడ్డాయి. దీంతో 200 మార్కు కూడా అందుకోకుండానే భారత్ ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ను అసిత డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (35; 47 బంతుల్లో 2×4, 2×6), తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు దేవ్‌దత్ పడిక్కల్ (44; 75 బంతుల్లో 6×4) రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ ఈ భాగస్వామ్యం విడిపోయాక భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రాహుల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ (8)ను ప్రభాత్ ఔట్ చేయడంతో 65/1 నుంచి 81/3తో భారత్ ఇబ్బందుల్లో పడింది. అర్ధశతకం దిశగా సాగుతున్న పడిక్కల్‌తో పాటు ధ్రువ్ జురెల్ (7) తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో స్కోరు 120/5కు చేరుకుంది. ఈ దశలో రిషబ్ పంత్ వన్డే తరహాలో 53 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే 174 పరుగుల వద్ద పంత్ ఆరో వికెట్ రూపంలో ఔట్ కాగానే మళ్లీ పతనం ఊపందుకుంది. జడేజా (9)తో పాటు మానవ్ సుతార్ (9) ఒకరి తర్వాత ఒకరు వెనుదిరిగారు. కుల్దీప్ (5), ప్రసిద్ధ్ (2) పోరాడకుండానే వికెట్లు ఇచ్చేశారు. చివరి 5 వికెట్లను భారత్ 19 పరుగుల తేడాలో కోల్పోయింది.
టెస్టుల్లో వంద సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. అతడికిది 51వ టెస్టు. ప్రపంచ క్రికెట్లో బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్-138), బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్-107), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా-100) మాత్రమే ఈ ఘనత సాధించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్:462
శ్రీలంక తొలి ఇన్నింగ్స్:284
భారత్ రెండో ఇన్నింగ్స్:యశస్వి (సి) డిక్వెలా (బి) అసిత 0; రాహుల్ (సి) రత్ననాయకే (బి) ప్రభాత్ 35; పడిక్కల్ ఎల్బీ (బి) నువంత 44; గిల్ ఎల్బీ (బి) ప్రభాత్ 8; పంత్ (సి) డిక్వెలా (బి) లహిరు 66; జురెల్ (సి) డిక్వెలా (బి) అసిత 7; జడేజా (సి) సూర్యబండార (బి) లహిరు 9; సుతార్ (సి) డిక్వెలా (బి) అసిత 9; కుల్దీప్ (సి) ధనంజయ (బి) ప్రభాత్ 5; సిరాజ్ నాటౌట్ 2; ప్రసిద్ధ్ (సి) లహిరు (బి) అసిత 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (48.5 ఓవర్లలో ఆలౌట్) 193; వికెట్ల పతనం: 1-0, 2-65, 3-81, 4-111, 5-120, 6-174, 7-179, 8-188, 9-190; బౌలింగ్: అసిత 8.5-0-31-4; నువంత 23-3-0-86-1; ప్రభాత్ జయసూర్య 11-0-43-3; ధనంజయ 1-0-4-0; లహిరు 5-0-28-2
శ్రీలంక రెండో ఇన్నింగ్స్:మదుష్క (సి) ప్రసిద్ధ్ (బి) సిరాజ్ 6; ఉదార (సి) జురెల్ (బి) సుతార్ 16; సూర్యబండార ఎల్బీ (బి) సుతార్ 0; కమిందు (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 2; ధనంజయ బ్యాటింగ్ 31; దినుష బ్యాటింగ్ 25; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (34 ఓవర్లలో 4 వికెట్లకు) 84; వికెట్ల పతనం: 1-13, 2-14, 3-21, 4-47; బౌలింగ్: సిరాజ్ 5-1-11-1; సుతార్ 11-0-30-2; ప్రసిద్ధ్ 8-2-13-1; జడేజా 6-0-16-0; కుల్దీప్ 3-0-8-0; పడిక్కల్ 1-0-5-0
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ ఇద్దరి వల్లే పాక్ క్రికెట్ పతనం.. ఆటగాళ్లు, బోర్డుపై మాజీల మండిపాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. కఠిన చర్యలు చేపట్టింది.
- మెస్సి టాటా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సిని మళ్లీ ప్రపంచకప్‌లో చూడలేం. తన ఆటతో రెండు దశాబ్దాలపాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మాంత్రికుడు.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైరయ్యాడు. ఇకపై అర్జెంటీనాకు ఆడనని ప్రకటించాడు.
- తిలక్ అజేయ శతకం దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో తిలక్ వర్మ (106 బ్యాటింగ్; 225 బంతుల్లో 7×4) అదిరే శతకం సాధించాడు.
- జకోవిచ్‌కు షాక్ కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం జకోవిచ్ చాలా కాలంగా పోరాడుతున్నాడు. కానీ అది మాత్రం అందట్లేదు. జకోవిచ్ నిరీక్షణను పొడిగిస్తూ.. యుఎస్ ఓపెన్‌లో అతడికి షాక్ తగిలింది.
- ‘25’ ఇక కలేనా! మూడేళ్లు అయింది సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి. ఆ తర్వాత 11 టోర్నీలు ఆడాడు..
- అఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్, నితీశ్! భారత స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, నితీశ్‌కుమార్ రెడ్డి త్వరలో పునరాగమనం చేయబోతున్నారు.
- చైనా మాస్టర్స్‌పై లక్ష్య గురి భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమయ్యాడు. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన అతడు..
- భారత్‌తో సిరీస్‌పై చర్చిస్తున్నాం భారత్‌తో వాయిదా పడిన పరిమిత ఓవర్ల సిరీస్‌ను నిర్వహించడానికి చర్చలు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చెప్పాడు.
- బంగ్లా శుభారంభం మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆ జట్టు సోమవారం ఇండోనేసియాపై 71 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.