హైదరాబాద్‌లో షెహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: పాకిస్థాన్ ఐఎస్ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్వర్క్ (ఎస్బీఎన్) జాడలు హైదరాబాద్‌లో బహిర్గతమయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని యూసుఫ్‌గూడ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ఠాణాల పరిధిలో గతంలో అరెస్టయిన ఇద్దరు యువకులకు ఇదే నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు తాజాగా వెల్లడైంది. ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నిన ఉదంతాల్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం ప్రకటించగా.. అందులో తెలంగాణ నుంచి ఇద్దరున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో గతంలోనే అరెస్టయిన ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన జాయిద్ఖాన్(22)తోపాటు రాజస్థాన్‌కు చెందిన మరో యువకుడికి ఎస్బీఎన్ లింకులున్నట్లు వెల్లడైంది. జాయిద్ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్‌కు వచ్చి రెస్టరెంట్లో సర్వర్‌గా పనిచేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో ఐఎస్ఐ సానుభూతిపరులు హబీబ్, రాణా హుస్సేన్‌లకు దగ్గరయ్యాడు. వారు అతనితో జరిపిన చాటింగ్‌లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నిఘాకు చిక్కడంతో గత మే 23న అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడలో మిఠాయి దుకాణంలో పనిచేస్తున్న రాజస్థాన్ యువకుడు సైతం ఐఎస్ఐ సానుభూతిపరులతో చాటింగ్ చేస్తూ చిక్కాడు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 07:06 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 30శాతం మార్కులొస్తే.. ‘పోలీస్’ తొలిమెట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి జారీ చేసిన నోటిఫికేషన్లో భాగంగా యూనిఫాం సర్వీసులకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు సన్నద్ధతపై అభ్యర్థులు దృష్టిసారించారు.
- సొమ్ముకు ‘గ్యారంటీ’ లేదు బ్యాంకులో రూ.మూణ్నాలుగు లక్షల రుణం కావాలని వెళితే అధికారులు సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. ఎంత ఆదాయం ఉన్నా, ఆర్థిక క్రమశిక్షణను తెలిపే ‘సిబిల్’ స్కోర్ మంచిగా లేకుంటే ఇవ్వనేఇవ్వవు.
- సీనియర్ న్యాయవాదిగా పల్లె నాగేశ్వరరావు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
- పత్తికి మరింత ఊతమివ్వాలి భారత వస్త్ర పరిశ్రమ(టెక్స్టైల్) 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా దేశంలో పత్తి పంటకు భారీఎత్తున ఊతమివ్వాలని నీతి ఆయోగ్ సూచించింది.
- నాంపల్లి కోర్టుకు ఉపముఖ్యమంత్రి కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు.
- వినాయకుడి లడ్డూ.. ముస్లిం నేత సొంతం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లోని దర్గా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
- ఫీజుల పథకం ఎత్తేయాలనే కుట్రలు తగదు: ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలనే కుట్రలు మానుకోకపోతే విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
- కాంగ్రెస్ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరవు కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకొంటూ, కమీషన్ మేనేజ్మెంట్లో ఆరితేరిందని... వాటర్ మేనేజ్మెంట్లో విఫలమైందని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
- చిన్నారులకు ‘ఊపిరు’లూదుదాం! వాయు కాలుష్యం వల్ల ముఖ్యంగా పిల్లల ఊపిరితిత్తులపై తీవ్రమైన దుష్ప్రభావం ఉంటుందని గతంలో అనేక అధ్యయనాలు చెప్పాయి.
- గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటాం: ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
- కొంగర ఖుర్దు అటవీ ప్రాంతంలో 3 లక్షల ఏళ్లనాడే మానవ ఆవాస ఆనవాళ్లు! హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మానవ ఆవాసం ఎంత ప్రాచీనమైనదో తెలిపే మరో ఆధారం వెలుగుచూసింది.
- ఈ బుడతలు.. భక్తిలో ఎవరికీ తగ్గరు! టేప్ రికార్డర్ స్పీకరే డీజే.. అందంగా అలంకరించిన సైకిలే భారీ ట్రక్.. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ గొంతెత్తి చేస్తున్న నినాదాలే మేళతాళాలు.. ఇలా తమ బుల్లి గణపయ్యకి వీడ్కోలు పలికేందుకు తీసుకెళ్తున్నారు ఈ బుడతలు.
- విద్యుత్యుక్తి పరికరాలు ఏసీలు, గీజర్లు, హీటర్లు, వాషింగ్‌మెషిన్ల వంటి గృహోపకర ణాలను సెల్‌ఫోన్‌తో నియంత్రించే స్మార్ట్ ప్లగ్ అందుబాటు లోకి వచ్చేసింది. దీని ద్వారా ఏదైనా మెషిన్‌కు విద్యుత్తు సరఫరా చేస్తే..
- గ్లోబల్ సమిట్‌పై అంతర్జాతీయ రోడ్‌షోలు డిసెంబరు 7-9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు ప్రచారం కోసం తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న దేశాల్లో అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
- సర్కారు బడులకు సౌర వెలుగులు రాష్ట్రంలోని మూడో వంతుకుపైగా ప్రభుత్వ పాఠశాలలకు సౌర విద్యుత్తు అందుబాటులోకి రానుంది. వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 9,937 పాఠశాలల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు.
- విద్యా సంస్థలు వ్యాపార దుకాణాలు కారాదు విద్యార్థులు పాఠశాలల్లో అడ్మిషన్లు రద్దు చేసుకున్నా.. మధ్యలోనే చదువు ఆపేసినా వారు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయమైన వ్యాపారం (అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్) కిందకే వస్తుందని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-2 స్పష్టం చేసింది.
- పాఠశాలలకు 10 నుంచి దసరా సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబరు 10 నుంచి 22వ తేదీ వరకు... మొత్తంగా 13 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రేపు సెలవు వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.
- ప్రజారోగ్య విభాగంలో వసూళ్ల పర్వం వాస్తవమే! ప్రజారోగ్య విభాగంలో ముగ్గురిపై నమోదైన కేసులో జరిగిన విచారణ నివేదిక ప్రభుత్వానికి అందింది.
- సాక్ష్యం కీలకమైతే మళ్లీ విచారించొచ్చు: హైకోర్టు ఏదైనా కేసులో న్యాయం చేసే క్రమంలో.. ఇప్పటికే విచారించిన వ్యక్తి ఇచ్చే సాక్ష్యం కీలకమనుకుంటే.. ఆ సాక్షిని మరోసారి పిలిపించి విచారణ చేపట్టవచ్చని హైకోర్టు స్పష్టత ఇచ్చింది.