10 వేల కోట్ల సూర్యుళ్లంత వెలుగు

Eenadu icon
By Telangana News Desk Published : 19 Aug 2026 04:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

వాషింగ్టన్‌: విశ్వంలో కనీవినీ ఎరుగని ఒక భారీ ఆకృతిని అమెరికా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. అది ఏకంగా 10వేల కోట్ల సూర్యుళ్ల స్థాయిలో వెలుగులీనుతోంది. సౌర కుటుంబం కన్నా ఇది పెద్దగా ఉంది. రోదసిలోని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) దీన్ని గుర్తించింది. దాన్ని కొత్తరకం ఖగోళ వస్తువుగా వర్గీకరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. హైదరాబాద్‌లో జన్మించిన రోహన్‌ నాయుడు వీరికి నేతృత్వం వహించటం విశేషం. 

మొదట ఎర్ర చుక్కలా..

తొలినాటి విశ్వానికి సంబంధించిన గెలాక్సీల కోసం గాలిస్తున్న తరుణంలో పరిశోధకులకు ఇది తారసపడింది. జేడబ్ల్యూఎస్‌టీ చిత్రాల్లో మొదట ఈ వస్తువు ప్రకాశవంతమైన ఎర్ర చుక్కలా కనిపించింది. దీన్ని నిశితంగా పరిశీలించాక అనూహ్యమైన అంశం బయటపడింది. దాని వెలుగులు చూసి.. అది సాధారణ నక్షత్రం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. అయినా దాని ఆకృతి ఏ కృష్ణబిలం లేదా గెలాక్సీతో సరిపోలడంలేదు. విశ్వం ఆవిర్భావానికి కారణమైన ‘బిగ్‌ బ్యాంగ్‌’ పరిణామం ఏర్పడిన కొద్దికాలానికే ఇది రూపుదాల్చిందని భావిస్తున్నారు. ఈ తరహా ఖగోళ వస్తువులను ‘కృష్ణబిల నక్షత్రాలు’గా వర్గీకరించాలని పరిశోధకులు ప్రతిపాదించారు. 

ఏముంది? 

ఆ వింత ఖగోళ వస్తువుకు ఎంఓఎం-బీహెచ్‌-1 అని పేరు పెట్టారు. అందులో సూర్యుడి కన్నా లక్ష రెట్లు భారీగా ఉన్న ఒక కృష్ణబిలం ఉండొచ్చని శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. దాని చుట్టూ ఒక హైడ్రోజన్‌ వాయు వలయం ఉండొచ్చని పేర్కొన్నారు. అందువల్ల సౌర కుటుంబమంత పెద్దగా ఉండే నక్షత్రంలా అది కనిపిస్తోందని వివరించారు. సాధారణ తారలు కేంద్రక సంలీనచర్య (న్యూక్లియర్‌ ఫ్యూజన్‌) ద్వారా శక్తిని సమకూర్చుకుంటాయి. ఈ ఖగోళ వస్తువు మాత్రం తన కృష్ణబిలంలోకి వచ్చి పడుతున్న పదార్థాల ద్వారా శక్తిని ఒడిసిపడుతుండొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ కృష్ణబిల తారలో ఎలాంటి భారలోహాలు లేవని, ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రోహన్‌ నాయుడు తొలుత ఇంజినీరింగ్‌లో చేరారు. అయితే పెద్ద ఆసక్తిగా అనిపించకపోవడంతో ఆ చదువును వదిలేశారు. 18 ఏళ్ల వయసులో సింగపూర్‌లోని యేల్‌-ఎన్‌యూఎస్‌ కాలేజీలో చేరారు. అక్కడ ఖగోళశాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. తర్వాత అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చేరారు. 2022లో ఖగోళశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం ఏర్పడ్డ తొలి గెలాక్సీలపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు శంషాబాద్‌ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు రానున్నాయి. ప్రస్తుతం ఒబెరాయ్‌ గ్రూపు సంస్థలతో పాటు వెంకటేశ్వర హోటల్స్‌ యాజమాన్యం హోటళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.
  • వైద్యుడి చీటీ సమగ్రంగా ఉండాల్సిందే! వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక, రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కొత్త మార్గదర్శకాలతో కూడిన ‘ప్రిస్క్రిప్షన్‌ ఆడిట్‌’ తాజాగా విడుదల చేసింది.
  • గురుకులాల పనివేళలపై వివరణివ్వండి: హైకోర్టు తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనివేళల మార్పుతోపాటు ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడంపై వివరణివ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
  • నవంబరు 19 నుంచి ‘యువ వికాసం’ సాయం రాజీవ్‌ యువ వికాసం పథకం తొలి విడతగా నవంబరు 19 నుంచి లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
  • తెలంగాణతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలి రాష్ట్రంతో ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ కొనసాగిస్తున్న అనుబంధాన్ని భవిష్యత్‌లో మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ను కోరారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో మంగళవారం ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ రహీమ్‌ ఆగాఖాన్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
  • 2 వేల ఏళ్లనాటి టెర్రకోట డాబర్‌.. నల్గొండ జిల్లాలో లభ్యం శాతవాహనుల పూర్వకాలానికి చెందిన టెర్రకోట డాబర్‌ (తాపీలాంటి పరికరం)ను నల్గొండ జిల్లా అప్పాజిపేటలో తాజాగా గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్‌ మంగళవారం వెల్లడించారు.
  • నైతిక విలువలతోనే వ్యాపారంలో దీర్ఘకాలం రాణింపు వ్యాపార రంగంలో రాణించాలంటే కఠోర శ్రమ, సరైన ఆలోచనా విధానం, లక్ష్యంపై స్పష్టత కీలకమని మార్గదర్శి చిట్‌ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ అన్నారు.
  • తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 3.46 లక్షల గ్రామీణ ఇళ్లు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కొత్తగా 3,46,544 ఇళ్లు మంజూరు చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 2,25,788, తెలంగాణకు 1,20,756 ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు.
  • శాంతా శ్రీరాం కేసులో ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత హైదరాబాద్‌ లోతుకుంటలోని 40 ఎకరాల భూ వివాదం కేసులో ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.
  • కేంద్ర ప్రకటనపై రాష్ట్రాలు స్పందించాలి: అసదుద్దీన్‌ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనను ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు.
  • రేపు నగరానికి ఉపరాష్ట్రపతి: సీఎస్‌ పరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 17న హైదరాబాద్‌ నగరంలో పర్యటించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సీఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరం తెలుసుకోవాలి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి తరం యువత (జెన్‌జీ) తెలుసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు.
  • న్యాయమూర్తి విచక్షణను ఏఐ భర్తీ చేయలేదు కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా దూసుకుపోతున్నా..న్యాయమూర్తి విచక్షణను, మానవీయ ఆలోచనా విధానాన్ని అది భర్తీ చేయలేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద అన్నారు.
  • పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల ఎస్సై(ప్రస్తుతం డీఎస్పీ)లకు డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
  • ఆర్‌సీఐ డైరెక్టర్‌గా తెలుగుతేజం డా.పి.శ్రీహరి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా శాస్త్రవేత్త డాక్టర్‌ పి.శ్రీహరి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలోని మండవల్లిలో ఆయన జన్మించారు.
  • ‘స్థానికత’పై హైకోర్టు తీర్పు సబబే ఒక అభ్యర్థి 7 నుంచి 10వ తరగతితోపాటు ఇంజినీరింగ్‌ కోర్సు రాష్ట్రంలోనే చదివినప్పటికీ.. 1 నుంచి 7వ తరగతి మధ్య వరుసగా నాలుగేళ్లు చదవలేదన్న కారణంతో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి స్థానికేతరుడిగా ప్రకటించడం కుదరదన్న హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ టీజీపీఎస్సీ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • నామమాత్రంగా గల్ఫ్‌ సలహా కమిటీ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గల్ఫ్‌ సలహా కమిటీ నామమాత్రంగా మారింది.
  • దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం చిల్లర ద్రవ్యోల్బణంలో ఆగస్టులో దేశవ్యాప్తంగా సగటున   4.82% ద్రవ్యోల్బణం నమోదు కాగా..తెలంగాణ 6.27%తో అగ్రస్థానంలో ఉంది.
  • మియాపూర్‌ భూములు స్వాధీనం చేయాలన్న పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం హైదరాబాద్‌ మియాపూర్‌ గ్రామ పరిధిలో 159 సర్వే నంబర్లలోని జాగీర్దారీ భూములను తమకు అప్పగించాలని 1976లో బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని కోరుతూ 76 మంది వ్యక్తులు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలను సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి.. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సన్మానం పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయనకు ఘనస్వాగతం పలికారు.

English Translation

Light like 10 thousand crore suns

Eenadu icon
By Telangana News Desk Published : 19 Aug 2026 04:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Washington: A team of American scientists has discovered a huge shape never seen before in the universe. recognized. It is shining at the level of 10 thousand crore suns. It is bigger than the solar family. It was detected by the James Webb Space Telescope (JWST) in Rhodes. Scientists say that it should be classified as a new type of celestial object. This research was done by scientists from Massachusetts Institute of Technology (MIT) in America. It is remarkable that Rohan Naidu, who was born in Hyderabad, is leading them. 

The first red dot..

It struck a chord with researchers as they searched for galaxies belonging to the early universe. The object first appeared as a bright red dot in JWST images. A closer look at this reveals an unexpected fact. Seeing its lights, scientists concluded that it is not an ordinary star. However, its shape does not match that of any black hole or galaxy. It is believed to have formed shortly after the 'Big Bang' evolution that caused the creation of the universe. Researchers have proposed to classify these types of celestial objects as 'black-white stars'. 

What's up? 

The strange object was named MOM-BH-1. Scientists have formulated that there may be a black hole that is a million times more massive than the Sun. It is said that there may be a hydrogen gas ring around it. Therefore, it is explained that it looks like a star as big as the solar family. Normal stars produce energy through nuclear fusion. Scientists are analyzing that this celestial object may be losing energy through the materials falling into its black hole. It is said that this Krishnabila star does not contain any heavy metals, mainly hydrogen and helium.

Born and brought up in Hyderabad, Rohan Naidu first joined engineering. But he left that study as he was not interested. At the age of 18, he joined Yale-NUS College in Singapore. There he developed a passion for astronomy. Later joined Harvard University in America. Received PhD in Astronomy in 2022. He is researching the first galaxies formed after the Big Bang. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Five Star Hotels near Shamshabad Airport New five star hotels are coming up in the surrounding area of Shamshabad airport. Currently, the owners of Venkateswara Hotels along with Oberoi Group companies have started building hotels.
  • The doctor's certificate must be comprehensive! The National Health Mission (NHM) has recently released 'Prescription Audit' with new guidelines to ensure that after examining the patients who come to them, the details of the prescribed medicines should be comprehensive. The High Court on Tuesday directed the government to explain the change in working hours and the assignment of non-teaching duties to the teachers in Telangana BC welfare gurukula schools. Deputy Chief Minister Bhatti Vikramarka directed the officials to take steps to provide financial assistance up to Rs.1 lakh to the beneficiaries for self-employment units from November 19 as the first phase of the Rajiv Yuva Vikasam scheme. State Governor Shiv Pratap Shukla asked Prince Rahim Aga Khan to take steps to strengthen the association of Aga Khan Foundation with the state in the future. Aga Khan Development Network Chairman Rahim Aga Khan had a courtesy meeting with the Governor at Lok Bhavan on Tuesday.
  • 2 thousand years old terracotta dabur.. Available in Nalgonda district President of Telangana History Team Sreeramoju Haragopal revealed on Tuesday that a terracotta dabur (brick-like device) belonging to the Satavahanas was recently discovered in Appajpet of Nalgonda district. Shailaja Kiran, Managing Director of Margadarshi Chitfund said that hard work, right mindset and clarity on the goal are key to excel in the business sector.
  • 3.46 lakh new rural houses for Telugu states. Union Minister of State for Rural Development Pemmasani Chandrasekhar revealed that 3,46,544 new houses have been sanctioned under Pradhan Mantri Awas Yojana for rural areas in Telugu states. He said that 2,25,788 houses have been allotted to Andhra Pradesh and 1,20,756 to Telangana. The Supreme Court dismissed the government's petition in the 40-acre land dispute case in Lothakunta, Hyderabad.
  • States should respond to central announcement: Asaduddin MIM president and MP Asaduddin Owaisi has severely criticized Union Home Minister Amit Shah's statement on the implementation of the Common Citizenship (UCC) in the country.
  • Vice President of the city tomorrow: CS Chief Secretary Sanjay Jaju said that the President CP Radhakrishnan will visit Hyderabad city on 17th of this month. The CS held a review meeting with the concerned officials on the arrangements for the visit of the Vice President at the secretariat on Tuesday.
  • Today's generation should know about the armed struggle in Telangana. BJP state president Ramachandra Rao said that today's generation of youth (Genji) should know about the armed struggle in Telangana.
  • AI did not replace the discretion of the judge. Telangana High Court Judge Justice Surepalli Nanda said that artificial intelligence (AI) is advancing rapidly..it has not replaced the judge's discretion and humane way of thinking. DGP CV Anand advised the SCs (currently DSPs) of 1991, 1995 and 1996 batches not to miss out on promotions. He assured that he will take the problems in the matter of promotions to the attention of the CM and work for a permanent solution. Scientist Dr. P. Srihari took charge as the Director of Research Center Imarat (RCI) at Hyderabad Missile Complex of Defense Research and Development Organization (DRDO) on Tuesday. He was born in Mandavalli near Kaikaluru in Eluru district.
  • High Court verdict on 'Locality' Even if a candidate has studied 7th to 10th class along with engineering course in the state. The Supreme Court dismissed the petition filed by TGPSC challenging the High Court verdict that it could not declare a non-local for the post of Assistant Executive Engineer on the grounds that he had not studied for four consecutive years between Class 1 to 7.
  • Nominally Gulf Advisory Committee. The Gulf Advisory Committee set up by the government to provide assistance to Telangana residents who go to Gulf countries for employment has become nominal.
  • Telangana has the highest inflation in the country. Retail inflation in August was recorded at an average of 4.82% across the country, while Telangana was at the top with 6.27%.
  • Supreme dismissed petition to acquire Miyapur lands The Supreme Court struck down the SLPs filed by 76 persons seeking implementation of the order issued by the Board of Revenue in 1976 to hand over 159 survey numbers of jagirdari lands in Miyapur village of Hyderabad to them.
  • Completion of two years as PCC President. It has been two years since Mahesh Kumar Goud took charge as PCC President on Tuesday. On this occasion, he was felicitated at Gandhi Bhavan on Tuesday.