

ఆ ఖాన్.. ఓ కాలనాగు

- A
- A+
- A++
ఈనాడు, కాకినాడ: కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకడానికి కారకుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్‌ఖాన్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. తన దగ్గర షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన బాలుడిని అడ్డుపెట్టుకుని అతడి తల్లితో సన్నిహితంగా మెలిగాడు. ఆమెను మాటలతో మభ్యపెట్టి ఆ ఇంటి వ్యవహారాలన్నీ తన గుప్పెట పెట్టుకున్నాడు. వారి బంగారం, డబ్బు, ఏటీఎం కార్డులు లాక్కుని వేధింపులకు గురిచేశాడు. ఇంజినీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా మానసిక హింసకు గురి చేశాడు. జులై 2న నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి చనిపోవడం వెనుక కూడా సాధిక్ హస్తం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసుతో పాటు మరో ఐదు సెక్షన్లు నమోదుచేశారు.
తాము ఆత్మహత్యకు పాల్పడేముందు అందుకు కారణాలపై నూకరాజు లేఖరాసి వాట్సప్ గ్రూప్‌లలో పోస్టు చేశారు. నూకరాజు కుమార్తె సౌజన్య కూడా ఓ లేఖ రాసి ఇంటివద్ద స్కూటర్ డిక్కీలో పెట్టారు. ఈ విషయాన్ని ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు కార్తికేయ చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో సాధిక్ గురించి ఆమె రాసిన లేఖ అధికారులను విస్తుపోయేలా చేసింది. తన భర్త జగదీశ్వరరెడ్డికి విష పదార్థమిచ్చి సాధిక్ చంపేశాడని, తన ప్రైవేటు ఫొటోలు అడ్డుపెట్టుకుని బెదిరించాడని, ఆస్తి కోసం వేధించేవాడని, అతనికి సహకరించకపోతే తన తండ్రి నూకరాజును, కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. తనను ఇస్లాంలోకి మారాలని వేధించేవాడని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ లేఖ ఆధారంగా సౌజన్య మామ భాస్కరరెడ్డి.. తన కుమారుడు జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానం ఉందని, విచారణ చేపట్టాలని కాకినాడ ఎస్పీకి ఫిర్యాదుచేశారు. తన ఇంటితో పాటు భర్త ఫోన్, ఎస్బీఐ లాకర్ కీ, తండ్రి ఆస్తి పత్రాలన్నీ సాధిక్ స్వాధీనం చేసుకున్నట్లు సౌజన్య లేఖలో రాశారని, తన మనవడికి కూడా ఈ విషయాలు చెప్పి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని గోదావరి నదికి తీసుకువెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.
నూకరాజు కుటుంబం ఆత్మహత్య విషయం తెలియగానే సాధిక్ కాకినాడ నుంచి పరారయ్యాడు. తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేశాడు. రైల్లో వెళ్తూ వేరే వారి ఫోన్ నుంచి కుటుంబసభ్యులు, ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్లు తెలిసింది. సాధిక్ కోసం కాకినాడ జిల్లా నుంచి మూడు, తూర్పుగోదావరి నుంచి రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సౌజన్య భర్త సెల్‌ఫోన్ సైతం సాధిక్ దగ్గరే ఉంది.
సాధిక్ పేరుకే రైఫిల్ షూటింగ్ కోచ్. అతని గురి మాత్రం అమ్మాయిలు, మహిళలపైనే. అకాడమీకి వచ్చేవారిలో కొందరికి ప్రత్యేక శిక్షణ అంటూ తాను చెప్పిన సమయానికే కేంద్రానికి రావాలని చెబుతుంటాడు. ఆ సమయంలో వేరేవారు రాకుండా చూసుకుంటాడు. షూటింగ్ నేర్పే క్రమంలో ఎక్కడెక్కడో తాకుతుంటాడని కొందరు ఆరోపిస్తున్నారు. అతను లేని సమయంలో వెళ్లి సాధన చేసుకుని వెళ్లిపోయేవారమని ఓ విద్యార్థిని తెలిపారు. కాకినాడ డీఎస్‌ఏలో ఎలక్ట్రానిక్ షూటింగ్ సదుపాయం లేకపోవడంతో గత్యంతరం లేక ఆ అకాడమీకి వెళ్లాల్సి వచ్చేదని మరో యువతి ‘ఈనాడు’కు తెలిపారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నాకు సగం.. తహసీల్దార్‌కు సగం! ‘లంచం డబ్బుల్లో నాకు సగం.. తహసీల్దార్‌కు సగం ఇవ్వాలి.. రెండు వేర్వేరు బండిళ్లలో డబ్బు తీసుకురండి.
- పశువుల ఎముకలతో కల్తీ నూనె తయారీ పశువుల కొవ్వు, ఎముకలు, చర్మాన్ని ఉపయోగించి కల్తీ నూనె తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టయింది.
- ‘యూనిక్’ కంపెనీ పేరుతో ఘరానా మోసం.. యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్, యూనిక్ ఎస్ఎంసీఎస్ సంస్థల పేరుతో చిట్‌ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ దేశవ్యాప్తంగా సుమారు పది వేల మందిని మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన ఇద్దరిలో ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రియుడి బెయిల్‌కు డబ్బుల్లేక అడ్డదారులు.. డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన యువతి జైలులో ఉన్న ప్రియుణ్ని విడిపించుకునేందుకు డబ్బులు అవసరమై.. కమీషన్ కోసం డ్రగ్స్ తెస్తూ ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
- కొలువులో చేరినచోటే కాసుల వేట రాజధాని శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు పాపాల చిట్టా బయటపడుతోంది.
- పోలీసులపై దాడి ఘటనలో 20 మంది అరెస్టు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్‌లో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో ఇరవై మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- ఆలయంలోకి ఎందుకొచ్చారని నిలదీత ఆలయంలోకి ఎందుకొచ్చారంటూ ఎస్సీ దంపతులను నిలదీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- సహ జీపీఏ హోల్డర్‌కు తెలియకుండా 3 వేల గజాల స్థలం అమ్మకం ఓ వ్యక్తి హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని తన స్థలాన్ని అమ్మిపెట్టే బాధ్యతను ఇద్దరికి అప్పగించి వారి పేరిట సంయుక్త జీపీఏ చేశారు.
- నిజామాబాద్‌లో రసాయన డబ్బా పేలి మహిళ దుర్మరణం చెత్త సేకరించే మహిళ ఓ రసాయన డబ్బాను తెరిచేందుకు ప్రయత్నించగా..అది పేలి ఆమె దుర్మరణంపాలైన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
- ఔషధ దుకాణంలో డ్రగ్స్ విక్రయం..నిలదీసిన ఉద్యమకారుడి కాల్చివేత మందుల దుకాణంలో మత్తుపదార్థాల విక్రయాలను ఫేస్బుక్ లైవ్‌లో ప్రశ్నించడం ఓ ఉద్యమకారుడి ప్రాణాలు తీసింది.
English Translation

- A
- A+
- A++
Today, Kakinada: Rifle shooting coach Sheikh Sadhik Khan, who was responsible for jumping into the Godavari of Panchayat Raj AE Tillapudi Nukaraju family of Kakinada, is still absconding. He stopped the boy who came to him to learn shooting and got close to his mother. He deceived her with words and kept all the affairs of the house under his hood. He took away their gold, money and ATM cards and harassed them. He subjected the entire family of the engineer to mental torture to commit suicide. It has recently come to light that Sadhik was also behind the death of Nukaraju's son-in-law Jagadeeswara Reddy on July 2. According to the complaint of Bhaskara Reddy, father of Jagadeeswara Reddy, a case of attempted murder along with five other sections was registered in Kakinada District Sarpavaram Police Station.
Before committing suicide, Nukaraju posted a letter on WhatsApp groups about the reasons. Nukaraju's daughter Saujanya also wrote a letter and put it in the trunk of the scooter at home. The police seized them after her son Karthikeya, who survived, told them. In it, the letter she wrote about Sadhik made the officials distraught. She stated in her letter that her husband killed Jagadeeswara Reddy with poison, threatened her by hiding her private photos, harassed her for property and threatened to kill her father Nukaraj and the entire family if she did not cooperate with him. She expressed her grief that he was harassing her to convert to Islam. Based on this letter, Saujanya's uncle Bhaskara Reddy has complained to Kakinada SP that he is suspicious about the death of his son Jagadeeswara Reddy and that an investigation should be conducted. Saujanya wrote in a courtesy letter that along with her house, her husband's phone, SBI locker key and father's property documents were seized, and it is clear that she told her grandson that he had no choice but to commit suicide and was taken to the Godavari river.
NuSadhik ran away from Kakinada when he came to know about the suicide of Karaju's family. He left his cell phone at home. It was learned that the family members called a lawyer from someone else's phone while traveling in the train. Three police teams from Kakinada district and two from East Godavari are searching for Sadhik. Saujanya's husband's cell phone is also with Sadhik.
Saadhik is a rifle shooting coach. His target is girls and women. He tells some of those who come to the academy to come to the center at the time he says for special training. He makes sure that no one else comes at that time. Some are accusing him of hitting somewhere while teaching shooting. A student said that they used to go and practice when he was not there. Another young lady told 'Enadu' that there was no electronic shooting facility in Kakinada DSA, otherwise she had to go to that academy.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
more
- Half for me..Half for the Tehsildar! ‘Half of the bribe money to me.. to give half to the Tehsildar.. bring the money in two separate carts.
- Making adulterated oil with cattle bones A gang that is making adulterated oil using cattle fat, bones and skin has been busted.
- Gharana fraud in the name of 'Unique' company.. The main accused is one of the two who cheated about ten thousand people across the country and looted Rs. Adilabad Police Arrested.
- Boyfriend's Bail Without Money.. Young Woman Caught Bringing Drugs A young woman was caught by the police bringing drugs for commission as she needed money to free her boyfriend who was in jail. This incident took place at Vijayawada railway station. Abdullapurmet Tehsildar Sudarshan Reddy and Surveyor Srinivasulu in the suburbs of the capital are exposed. 20 people were arrested in the attack on the police. Twenty people were arrested and remanded in the attack on the police in Waipet, Sirikonda mandal of Adilabad district. The incident took place in Vanaparthi district where the SC couple were arrested for entering the temple. This incident which took place on Monday came to light late.
- Sale of 3 thousand yards of land without the knowledge of fellow GPA holder. A man entrusted the responsibility of selling his land in Serilingampally to two people and made joint GPA in their name.
- Woman dies due to chemical canister explosion in Nizamabad. When a garbage collector tried to open a chemical container...it exploded and she died in Nizamabad city. Questioning the sale of drugs in a drug store on Facebook Live took the life of an activist.