‘అన్నదాతలకు’ సంపూర్ణ భరోసా

- A
- A+
- A++

వానాకాలం సీజన్‌లో విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోళ్ల వరకు అన్నదాతలకు సంపూర్ణ భరోసా కల్పించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిర్దిష్ట కార్యాచరణకు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఆయన వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ నిపుణుల సూచనలపై సమీక్షించారు. వానాకాలం సీజన్‌కు రైతు భరోసా పథకం నిధుల విడుదలకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల కోసం రూ.9 వేల కోట్లను విడుదల చేయాలని వ్యవసాయశాఖ ప్రతిపాదించగా... దానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సూచించారు. వ్యవసాయ, ఆర్థికశాఖలు ఈ నెల 18న జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. ఈ నెల 26న తొలిరోజున రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులకు ఎకరం వరకు సాయం అందేలా నిధులను విడుదల చేస్తారు. మిగిలిన రైతులకు విడతల వారీగా నిధులు జమ చేస్తారు.
ప్రత్యేక కమిటీ వేయాలి..
‘‘ఏ రైతు ఏ పంట వేశారు.. ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ఇలా అన్ని వివరాలు కచ్చితంగా క్షేత్రస్థాయి పరిశీలనతో నమోదు చేయాలి. కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో ఆయా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలను గమనంలోకి తీసుకొని తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయడం చాలా కీలకం. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆ శాఖ సంచాలకుడు, ప్రణాళిక శాఖ కార్యదర్శి, పౌరసరఫరాల సంచాలకునితో ప్రత్యేక కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి.

వ్యవసాయ వర్సిటీ ద్వారా సాంకేతికత
వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకోవాలి. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. ఏఐ ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేయాలి.
వేదికలు అన్నింటికీ ఉపయోగపడాలి
రైతు వేదికలను ఇకపై అన్నింటికీ ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడే రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ జరగాలి. ప్రతి వేదిక వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలి. జిల్లాల్లో వాటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలి. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో వాటిని పండించే రైతుల పూర్తి వివరాలను సేకరించండి. వ్యవసాయశాఖ నిర్దేశించిన ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సమృద్ధిగా నిల్వ చేసి రైతులకు సబ్సిడీపై ఇవ్వాలి.
‘రామగుండం’ ఎరువులు తెలంగాణకే..
అన్నిరకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానం తేవాలి. సంబంధిత యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలి. యూరియా పంపిణీ బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించాలి. వానాకాలం సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కోటాపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఎప్పటికప్పుడు లేఖలు రాయాలి. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యేవాటిల్లో అత్యధికం తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలి. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం దిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలి.
మార్క్‌ఫెడ్ నష్టాలు తగ్గాలి...
మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. వ్యాపారులకు తలొగ్గకుండా ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టాన్ని తగ్గించింది. గతంలో టన్ను రూ.13 వేలకు అమ్మారు. ఈసారి దాదాపు రూ.21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చింది. అలాగే ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల బాట పట్టించాలి. ప్రభుత్వ డెయిరీని మరింత బలోపేతం చేయాలి. పాడి రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు బోనస్ అమలుపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఆయా పంటలకు ఉత్పత్తి ఆధారంగా కాకుండా విస్తీర్ణం ఆధారంగా బోనస్ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.
వ్యవసాయం-2047 నివేదిక విడుదల
వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య రూపొందించిన తెలంగాణ వ్యవసాయం-2047 నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. వీసీ రాసిన భారతదేశ హరితవిప్లవ రూపశిల్పి ఇందిరాగాంధీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఖాళీగా ఉన్న 550 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి హామీ ఇచ్చారు. సంబంధిత దస్త్రాలను ఆమోదించి తన వద్దకు పంపించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. మౌఖిక పరీక్షలు లేకుండా రాత పరీక్ష ఆధారంగా, పారదర్శకంగా పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 04:33 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హైబ్రిడ్ కార్లను అవగాహనతో నడుపుదాం.. హైబ్రిడ్ కార్లు.. ఇప్పుడివే నయా ట్రెండ్. వీటి వినియోగంపై ప్రజలూ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ఈ కార్లలో రెండు ఇంజిన్లు ఉండటమే ప్రత్యేకం.
- సయ్యంటోంది.. సైనిక కీటకం మినీ జెట్ ఫైటర్ లాంటి ఆకారం.. సైనికుడి దుస్తుల్లాంటి రెక్కలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉన్న ఈ కీటకం ఒలియాండర్ హాక్ మాత్.
- ఆ పల్లెలో పాలు కొనరు.. పంచుకొంటారు! గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంటా పాలప్యాకెట్ కొనుగోలు తప్పనిసరి అయిన రోజుల్లో అక్కడ పాలప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు.
- నీటి హక్కులపై రాజీ లేదు కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాలో.. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
- ‘నిషేధం’... అయోమయం! రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది.
- ఆరు నెలలకో పోటీ పరీక్ష నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆరు నెలలకో పోటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
- ఏఎస్‌డీడీ ఓట్లపై రాజకీయ పార్టీల దృష్టి! సేకరించడానికి వీలులేని(అన్ కలెక్టబుల్) జాబితాలో ఉంచిన ఓటర్లపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
- గోల్కొండ కోటలో మువ్వన్నెల రెపరెపలు ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం గోల్కొండ కోటలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా కోటను అందంగా తీర్చిదిద్దారు.
- చురుగ్గా కొత్త కోర్టుల నిర్మాణం ప్రజలకు నాణ్యమైన, సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ వెల్లడించారు.
- ఊరూరా తారు రోడ్లు దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) విధానంలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- దేశంలో కీలక గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ: గవర్నర్ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
- రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
- రూ.525 కోట్ల పనులు... ముగ్గురే ఇంజినీర్లు కొత్త మార్కెట్లు, భవనాలు, గోదాములు, షెడ్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణాలు ఇలా... 33 జిల్లాల్లో రూ.525.86 కోట్ల పనులు కొనసాగుతున్నాయి.
- ఈ-ఆటో.. రైట్ రైట్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్య నియంత్రణ, హరిత రవాణా లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
- స్మార్ట్ రేషన్‌కార్డులతో పారదర్శకత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే రాష్ట్రవ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
- చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి రాజకీయ లబ్ధి కోసం దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, కేంద్రంలోని భాజపా నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
- కేంద్ర పథకాల్లో సీఎం ఫొటో పెట్టాలి జీఎస్టీతోపాటు ఇతర విధానాల్లో కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో పన్నులు చెల్లిస్తున్నందున రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- మేమిచ్చిన రైతుబంధు నిధులే ఎక్కువ కేసీఆర్ ప్రభుత్వంలో రెండేళ్లలో ఇచ్చిన రైతుబంధు నిధుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.15 వేల కోట్లు తక్కువ ఇచ్చిందని భారాస శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
- స్మార్ట్ రేషన్‌కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలెందుకు? కేంద్రం రేషన్ బియ్యం ఇస్తున్నా.. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకుండా సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
- భరతమాతే అమ్మవారు.. వందేమాతరమే వేదమంత్రం ఆలయాల్లో దేవతామూర్తులకు వేద మంత్రాలతో, స్తోత్రాలతో పూజలు నిర్వహించడం సాధారణం.