గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 17 Jun 2026 06:27 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో సీఐఐ-2026 భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని.. సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలకు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త.. కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. తమ వేగం.. నిబద్ధత.. విశ్వసనీయత గురించి స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్‌ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఏపీని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో మంగళవారం నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమిట్‌-2026 బిజినెస్‌ రోడ్‌ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అనుకూలం. ఇక్కడ మీ పెట్టుబడులు సురక్షితం. ఆక్వా, ఉద్యాన పంటలు, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రం. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉంది. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి, నీటి లభ్యత ఉంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరాకు అవకాశం ఉంది. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త విధానం ద్వారా ప్రజలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నది లక్ష్యం. నైపుణ్య మానవ వనరులు తయారు చేసేందుకు ఆపరేషనల్‌ స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. సుదీర్ఘమైన సముద్ర తీరం.. అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం.  

ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు మేం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణాన్ని చేపడుతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించేలా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 

మా వేగానికి ఇవి నిదర్శనం

  • అర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఏపీ నుంచి ఎగుమతులు మొదలవుతాయి. దీనికి అవసరమైన అనుమతులు, భూ కేటాయింపులు మొత్తం 18 నెలల్లో పూర్తి చేసి పరిశ్రమలకు శంకుస్థాపన చేశాం.
  • గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటవుతోంది. వారికి గ్రీన్‌ ఎనర్జీని అందించబోతున్నాం. గూగుల్‌తో పాటు 10 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి.
  • ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ రూ.7,000 కోట్ల పెట్టుబడితో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో ప్రారంభించబోతోంది. శ్రీసిటీలో ఇప్పటికే 350కు పైగా కంపెనీలు ఉన్నాయి.
  • రాయలసీమలోని పుట్టపర్తి దగ్గర 5వ తరం యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్‌ ఫెసిలిటీ కూడా వస్తోంది.
  • అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్‌ అండ్‌ టి సంస్థలు 133 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి క్వాంటమ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. 
  • పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో అనవసర నిబంధనలు తొలగించాం. ఏపీలో అమలవుతున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు.

స్టార్టప్‌లదే భవిష్యత్తు

  • సమీప భవిష్యత్‌ అంతా స్టార్టప్‌లదే. వాటిని ప్రోత్సహిస్తేనే పెద్దఎత్తున ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీలు, సంపన్నులు స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాలి.
  • రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం.
  • అమరావతిలోనూ ఒక ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అక్కడ ఉంటాయి. 
  • భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భారత్‌కు పెట్టుబడులు వస్తున్నాయి. వాటిలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి.

సింగపూర్‌తో ప్రత్యేక అనుబంధం

సింగపూర్‌తో భారత్‌కు.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి సంబంధాలున్నాయని సీఎం ప్రస్తావించారు. ‘సింగపూర్‌ నిర్మాత లీ క్వాన్‌ యూ అంటే నాకు చాలా అభిమానం. మూడు దశాబ్దాల కిందటి నుంచే సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో సింగపూర్‌ టౌన్‌ షిప్‌ నిర్మించాం. ఏపీ విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చింది. బ్లూ, గ్రీన్‌ రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం అద్భుతమైన బృహత్‌ ప్రణాళికను సింగపూర్‌ రూపొందించింది. రాజధాని అమరావతితో పాటు.. రాష్ట్రంలోని నగరాల అభివృద్ధికి సింగపూర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 05:12 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆహార వ్యర్థాలను.. ఆర్గానిక్‌గా మార్చేద్దాం! వంట గదిలో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యే. ఆహార పదార్థాలతో పాటు కూరగాయల వ్యర్థాలు ఎక్కువగానే మిగిలిపోతుంటాయి.
  • పాద ముద్రలతో చెప్పేయొచ్చు మనుషుల వేలిముద్రలు ఎలా కచ్చితమైన సమాచారాన్నిస్తాయో... అడవుల్లో వన్యప్రాణుల పాదముద్రలు(పగ్‌ మార్క్స్‌) వాటి ఉనికిని స్పష్టంగా బయటపెడతాయి.
  • 85 వేల మొక్కల్లో వందేమాతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కలతో ప్రత్యేకంగా దాని ఆకృతిని తీర్చిదిద్దారు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు.
  • రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ సీజీఎం శేషాచలం వెల్లడి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. ఏపీ సర్కిల్‌ వినియోగదారుల కోసం ఫ్రీడం 2.0 మొబైల్‌ పేరుతో రూపాయికే సిమ్‌ అందిస్తోందని ఆ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం వెల్లడించారు.
  • ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే కారణంతో వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను, అనంతపురం జిల్లాలో ఒకరిని ఆ జిల్లాల విధ్యాశాఖాధికారులు సస్పెండ్‌ చేశారు.
  • నేను గర్వంగా ఫీలవుతున్నా.. బెయిల్‌పై విడుదలయ్యాక సీదిరి అప్పలరాజు ‘నేను చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నా. ఒక సాధారణమైన ప్రమాదాన్ని నేరపూరిత హత్య అంటూ జైలుకు పంపించారు.
  • అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
  • నవ్యాంధ్ర రాజధానిలో చరిత్రాత్మక ఘట్టం ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • సాంకేతికత ఓ సాధనం మాత్రమే.. కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో న్యాయవాదులు సృజనాత్మకతతో ఆలోచించడం మరిచిపోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లిసా గిల్‌ పేర్కొన్నారు.
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక వాయిదా విద్యుత్‌ బస్సులు సహా ఉద్యోగులకు చెందిన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడింది.
  • పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కోసం ఉద్యోగుల పదోన్నతులపై పెట్టిన నిషేధాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.
  • చెరువులను ఆక్రమిస్తే జీవాలకు మేత ఎలా? గొర్రెలు, పశువులు, మేకల మేతకు అనుకూలంగా ఉన్న చెరువు భూములను కొంత మంది ఆక్రమించుకొని పంటల సాగు చేయడంతో మూగజీవాలను ఎక్కడ మేపుకోవాలని గొర్రెల కాపర్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గొర్రెల మందలతో నిరసనకు దిగారు.
  • అసెంబ్లీ సమావేశాలకు భద్రతలో రాజీ పడొద్దు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటుచేయాలని, సభ్యులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
  • మూడేళ్ల బుడతడు.. రాకెట్‌లా దూసుకెళ్లాడు 79 కి.మీ. స్కేటింగ్‌ పూర్తి చేసి ఔరా అనిపించాడు మూడేళ్ల బుడతడు దక్షిత్‌(3).
  • ఆలయాల్లో ఉప ముఖ్యమంత్రి సతీమణి పూజలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.
  • ఎస్‌.కోటలో రూ.200 కోట్లతో హిలోరా రిసార్ట్‌ రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.
  • అందంతో కట్టిపడేసే ఫ్లెమింగో పక్షులు పొడవాటి ముక్కు, ఎత్తయిన కాళ్లతో చూడటానికి అందంగా కనిపిస్తున్న ఇవి ఫ్లెమింగో పక్షులు.
  • తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు..! నాకేం తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు.. ఇవి పోలీసుల కస్టడీలో ఉన్న వైకాపా నేత చింతాడ రవికుమార్‌ చెబుతున్న సమాధానాలు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ గత నెల 30న శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు.. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్సై పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన కేసులో చింతాడ రవి రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
  • ‘భోగాపురం.. ఆహా’రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాల్లో అందించే ఆహారం(ఇన్‌ఫ్లైట్‌ క్యాటరింగ్‌) తయారీకి ఎన్‌కామ్‌ స్కై ప్లేట్స్‌ సంస్థ ఇక్కడే వంటశాల భవనాన్ని ఏర్పాటు చేసింది.
  • ఏడుగురు రాష్ట్ర పోలీసులకు శౌర్య పతకాలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 23 మంది పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది.