అఫ్గాన్ Aపై భారీ విజయం.. ఫైనల్‌కు ఇండియా ఎ

Eenadu icon
By Sports News Team Updated : 17 Jun 2026 21:46 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా అఫ్గాన్‌ ఎతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఎ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత యువ భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో అఫ్గాన్ A 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. బాహిర్ షా (57), ఫైసల్ షినోజాదా (46), ఇమ్రాన్ మీర్ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత్ ఎ బౌలర్లలో నిషాంత్ సింధు 4, యశ్‌ ఠాకూర్ 2, అంశుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సుర్యాంశ్‌, అనుకుల్ రాయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. అఫ్గాన్ ఎ, శ్రీలంక ఎ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేత ఇండియా ఎతో తుది పోరులో తలపడనుంది.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇండియా ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ ఎ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌ (6), షమ్స్ ఉర్ రెహ్మాన్ (8)ని నిషాంత్ సింధు వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా అఫ్గాన్ ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఎ పట్టుబిగిస్తోంది. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో మహమ్మద్ ఇషాక్ (16) ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఫర్మానుల్లా సఫీ (17)ని సుర్యాంశ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 33 ఓవర్లకు అఫ్గాన్ A స్కోరు 204/7. ఆ జట్టు లక్ష్యం 320.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇండియా ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ ఎ ఐదు వికెట్లు కోల్పయింది. ఫైసల్ షినోజాదా (46; 56 బంతుల్లో)ని అనుకుల్‌ రాయ్‌ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. బహిర్ షా (57; 52 బంతుల్లో) విప్రాజ్‌ నిగమ్ బౌలింగ్‌లో సుర్యాంశ్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 27.1 ఓవర్లకు అఫ్గాన్ A స్కోరు 173/5.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇండియా ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ ఎ బ్యాటర్లు పోరాడుతున్నారు. 320 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ 23 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బహిర్ షా (44), ఫైసల్ షినోజాదా (41) అర్ధ శతకాలకు చేరువయ్యారు.

320 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 18 ఓవర్లకు స్కోరు 124/3. బాహిర్ షా (28), ఫైసల్ షినోజాదా (34) నాలుగో వికెట్‌కు ఇప్పటివరకు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ A బౌలర్లు పట్టుబిగిస్తున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అఫ్గానిస్థాన్‌ Aను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు 11 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌, అంశుల్‌ కాంబోజ్‌, నిశాంత్‌ సింధు తలో వికెట్‌ పడగొట్టారు. అఫ్గాన్‌ లక్ష్యం 320 పరుగులు.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా కీలకమైన మ్యాచ్‌లో భారత A బ్యాటర్లు దూకుడుగా ఆడారు. అఫ్గానిస్థాన్‌ Aతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (59), ఓపెనర్ ప్రియాంశ్‌ ఆర్య (58), కుమార్ కుషాంగ్రా (58) అర్ధశతకాలు సాధించారు. మిగతా బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో వైభవ్ డకౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడు ఇచ్చిన క్యాచ్‌ను అఫ్గాన్ ఫీల్డర్ పట్టినా.. బంతి నేలకు తాకినట్లు రీప్లేలో తేలింది. సూర్యాంశ్‌ షెడ్జే (7) త్వరగా పెవిలియన్‌కు చేరాడు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్ (30), నిషాంత్ సింధు (21*) విలువైన పరుగులు రాబట్టారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరిదూన్ 2, అబ్దుల్లా 2, ఫర్మనుల్లా 2.. జహీర్‌ఖాన్ 1 వికెట్ తీశారు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 14:06 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జిమ్‌ ఫిట్‌నెస్‌ కాదు.. మ్యాచ్‌ కోసం ఫిట్‌గా ఉండాలి: గావస్కర్ భారత జట్టు ఆటగాళ్ల గాయాలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
  • బంగ్లా చేతిలో సొంత గడ్డపై ఓటమి.. అత్యంత అవమానకరం: ఆసీస్‌ మాజీలు తమ క్రికెట్ చరిత్రలో ఈ ఓటమి అత్యంత అవమానకరమైందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
  • వేడి దెబ్బకు వాంతులు.. సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌ టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌ వాతావరణం దెబ్బకు తీవ్రంగా ఇబ్బంది పడిన ఘటన సిన్సినాటి ఓపెన్‌లో చోటు చేసుకుంది.
  • చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. ఆస్ట్రేలియాపై ఘన విజయం ఆసీస్‌ను తమ సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ, బంగ్లాదేశ్‌ తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
  • నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు.. 400 దాటిన స్కోరు గాలె వేదికగా శ్రీలంక - భారత్‌ జట్ల మధ్య తొలి టెస్టు. 
  • గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచ కప్‌ ప్రారంభం! వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ను ఓ ప్రత్యేకమైన రోజున ప్రారంభించేందుకు ఐసీసీ ఆలోచనలు చేస్తోంది.
  • 30 వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఇద్దరు భారత క్రికెటర్లు మాత్రమే ఆ జాబితాలో ఉండగా.. యశస్వి ఇప్పుడు వారి సరసన చేరాడు.
  • శ్రీలంకతో తొలి టెస్ట్‌.. ఫస్ట్‌ డే హైలైట్స్‌ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్‌ హవా సాగింది.
  • ఆంధ్ర క్రికెట్లోనూ అడుగు తెలంగాణలో ఈ ఏడాదే మొదలైన టీజీ20 లీగ్‌లో అత్యధిక బిడ్‌తో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రామోజీ గ్రూపు సంస్థ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
  • ఘనారంభం లంక పర్యటనలో టీమ్‌ఇండియా ఆరంభం అదిరిపోయింది. గాలె టెస్టులో గిల్‌ బృందం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
  • బోణీ అదిరింది హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ముందుండి నడిపించిన వేళ టోర్నీలో జట్టు బోణీ కొట్టింది.
  • భారత్‌కు చైనా పరీక్ష మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ తొలి సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం పూల్‌-డిలో బలమైన చైనాతో సలీమా బృందం తలపడనుంది.
  • చరిత్రకు చేరువలో.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుపై బంగ్లా పట్టు ఆస్ట్రేలియా పేలవ బ్యాటింగ్‌ కొనసాగుతున్న వేళ.. బంగ్లాదేశ్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద విజయానికి చేరువైంది.
  • ప్రజ్ఞ గేమ్‌ డ్రా సింక్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీలో ప్రజ్ఞానంద నిలకడగా ఆడుతున్నాడు. టోర్నీ సాగేకొద్దీ పోడియంపై నిలిచే అవకాశాల్ని మెరుగుపరుచుకుంటున్నాడు.
  • వాటిని వేరుగానే ఉంచాలి ఆన్‌లైన్‌ చెస్‌ రేటింగ్స్‌ను ఆటగాడి అధికారిక ఫిడే రేటింగ్‌ పాయింట్లుగా మార్చకూడదని, రెండింటినీ వేర్వేరుగానే ఉంచాలని భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు.
  • అలా పిలిపించుకోవాలంటే.. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాల పట్టికలో అగ్రదేశాల సరసన నిలిచినప్పుడే.. భారత్‌కు క్రీడా దేశమనే పిలుపు దక్కుతుందని మాజీ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ అభిప్రాయపడింది.
  • చిరాగ్‌కు చిరాకొస్తోంది భుజం గాయం తిరగబెడుతుండటం నిరాశకు గురి చేస్తోందని బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజు పేర్కొన్నాడు.
  • దేవదత్‌.. టీమ్‌ ఇండియా ‘తొలి’ జెన్‌జీ కుర్రాడి కథ తెలుసా? టీమ్‌ ఇండియాకు టెస్టుల్లో ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ సెంచరీ కొట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ మాట చాలు ఆ ప్లేస్‌ కోసం మన జట్టు ఎంతగా ఇబ్బంది పడుతోందో తెలియడానికి. ఈ సమస్యకు ఎట్టకేలకు చెక్‌ పడింది. సెంచరీతో ఆ పని చేసింది దేవదత్‌ పడిక్కల్‌. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్‌ చేసిన ఈ కుర్రాడి గురించి చూద్దాం. 
  • ‘పడిక్కల్ దేవుడిచ్చిన వరం.. అతడొచ్చినా మూడో స్థానంలోనే ఆడించాలి’ టీమ్ఇండియా బ్యాటర్లు కొన్నాళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్‌లో దిగిన దేవదత్‌ పడిక్కల్ (Devdutt Padikkal) స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు.
  • హాకీ ప్రపంచ కప్.. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్ డిలో వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన 3-1 తేడాతో విజయం సాధించింది.