పదవీ విరమణ సమయంలో నివారించాల్సిన తప్పులివే..

Eenadu icon
By Business News Team Updated : 17 Jun 2026 16:46 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

పదవీ విరమణ వయసు..చాలా మందికి విశ్రాంతి, సంతృప్తిని ఇచ్చే సమయం. అయితే, ఈ సమయంలో చేసే కొన్ని సాధారణ తప్పులు ఆర్థిక భద్రత విషయంలో వారిని ప్రమాదంలో పడేస్తుంటాయి. చాలా మంది పదవీ విరమణ అనంతరం వారి జీవితంలో సంతృప్తిగా ఉండకపోవడానికి ఆర్థికపరమైన కారణాలే ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం ఆర్థికపరమైన కొన్ని కీలక విషయాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. కొంతమంది భవిష్యత్‌ ఖర్చులను పరిగణనలోకి తీసుకోరు. ఇంకా ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల ప్రభావాన్ని తరచూ విస్మరిస్తుంటారు. కాబట్టి, పదవీ విరమణ చేసిన వారు నివారించాల్సిన ఆర్థికపరమైన తప్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వైద్య ఖర్చులు

భారత్‌లో 10-12% వైద్య ద్రవ్యోల్బణం ఉన్న తరుణంలో, సీనియర్లకు ఒక తీవ్రమైన చికిత్సకే లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. చికిత్స మరిన్ని ఎక్కువ రోజులు కొనసాగిందంటే వారి పదవీ విరమణ నిధి వేగంగా హరించుకుపోతుంది. ఆకాశాన్నంటుతున్న చికిత్స ఖర్చులు, మందులు, ఆసుపత్రి బిల్లుల నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్య బీమా ఇప్పుడు ఆప్షన్‌ కాదు, తప్పనిసరి. సాధారణ కవరేజ్ కోసం ఒక బేస్ ఇండివిడ్యువల్ పాలసీని తీసుకుని, పెద్ద క్లెయింల కోసం ఒక సూపర్ టాప్-అప్‌ను దానికి జోడించండి. అంతేకాకుండా, అదనపు ఖర్చుల కోసం కొంత నగదును సిద్ధంగా ఉంచుకోండి. ఈ బహుళ అంచెల ఆరోగ్య రక్షణ పరిస్థితులు మీ వృద్ధాప్య జీవితాన్ని దెబ్బతీయకుండా కాపాడతాయి.

స్థిరాస్తి పెట్టుబడులు

కొంతమంది స్థిరాస్తి పెట్టుబడులను ప్రధాన ఆదాయ మార్గంగా పరిగణిస్తుంటారు. అయితే, పన్నులు, మరమ్మతులు, నిర్వహణ/సొసైటీ ఫీజులు వంటి ఖర్చులు..అద్దెల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మిగలకుండా చేస్తాయి. వృద్ధాప్యంలో జీవన వ్యయం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, స్థిరాస్తి ఆదాయంపై ఆధారపడకూడదు. దీనికి బదులుగా 60 ఏళ్లు పైబడిన సీనియర్లు రివర్స్‌ మార్ట్‌గేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం మేలు. ఈ పథకంలో బ్యాంకులు..మీ సొంత ఇంటిపై రుణాన్ని అందిస్తాయి. మీరు నివసిస్తున్నంత కాలం క్రమం తప్పకుండా నిర్దిష్ట ఆదాయాన్ని పొందొచ్చు. ఈ పథకంలో మరణం/ఇంటి అమ్మకం వరకు ఈఎంఐ చెల్లింపులు అవసరం లేదు. ఇది పన్ను రహిత నిధులను అందిస్తుంది. సొంత స్థిరాస్తులు అమ్ముకోకుండానే నిధులు పొందే అవకాశం ఇందులో ఉంటుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

చాలా మంది సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు గ్యారెంటీ రాబడులతో సురక్షితంగా అనిపిస్తాయి. కానీ, ఆదాయ పన్ను శాఖ వాటి వడ్డీపై మీ పూర్తి ఆదాయ శ్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తుంది. దీనివల్ల చేతికి అందే డబ్బు తగ్గిపోతుంది. పన్ను రూపంలో పెద్ద మొత్తాన్ని కోల్పోయి, మినహాయింపుల తర్వాత తక్కువే మిగులుతుంది. అందుచేత, కొంత మొత్తాన్ని డీప్ డిస్కౌంట్ బాండ్లకు మార్చండి. వీటిపై వచ్చే లాభాలను ఆదాయ పన్ను శాఖ దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి, (ఇండెక్సేషన్ తర్వాత) కేవలం 12.50% పన్ను విధిస్తుంది. దీనివల్ల మెరుగైన ఆదాయం అందుతుంది. పన్ను పరంగా తెలివైన ఈ చర్య, అదనపు రిస్క్ లేకుండా పదవీ విరమణ జీవితంలో ఆర్థిక భరోసాగా పనిజేస్తుంది. బాండ్లను కొనుగోలు చేసే ముందు వాటి రేటింగ్ తప్పక పరిశీలించండి.

ఈక్వీటీలు

చాలా మంది పదవీ విరమణ చేసినవారు స్టాక్స్‌లోని హెచ్చుతగ్గులకు భయపడి వాటిని దూరం పెట్టేస్తారు. కానీ, ఈక్వీటీలకు దూరంగా ఉండడం వల్ల 20-30 ఏళ్లలో ద్రవ్యోల్బణం నెమ్మదిగా మీ పొదుపును మింగేస్తుంది. 70 ఏళ్లు పైబడిన వారు కూడా, పెరుగుతున్న ఖర్చులను అధిగమించి స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధి పొందాలంటే తమ పెట్టుబడిలో 10-15% నాణ్యమైన లార్జ్-క్యాప్ స్టాక్స్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో ఉంచాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి సమతుల్యంగా, అత్యవసర పరిస్థితులు, ఆదాయం కోసం 5-7 సంవత్సరాల ఖర్చులకు సరిపడా జీవన వ్యయాలను FD/బాండ్లు వంటి సురక్షితమైన వాటిలో పెట్టుబడిగా పెట్టాలి. ఇలాంటి పెట్టుబడులు..తీవ్రమైన నష్టభయాలు లేకుండా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటూ మూలధనాన్ని కాపాడతాయి.

ఉపసంహరణ ప్రణాళిక

పదవీ విరమణ అంటే కేవలం పొదుపు చేసుకోవడం మాత్రమే కాదు. నగదును తెలివిగా ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవడం వల్ల అది 25+ సంవత్సరాల పాటు సరిపోతుంది. కానీ స్పష్టమైన ఉపసంహరణ ప్రణాళిక లేకుండా, చాలామంది ముందుగానే ప్రయాణాలు, వినోదం కోసం, పిల్లల కోసం అధికంగా ఖర్చు చేసేస్తారు. దీనివల్ల, తర్వాత సంవత్సరాల్లో వారి వైద్య, ఇతర అవసరాలకు ఏమీ మిగలదు. కాబట్టి, పదవీ విరమణ చేసిన వారు మొదటి సంవత్సరం వారి దగ్గర ఉన్న మొత్తం నిధిలో 4-5 శాతం మొత్తాన్ని పక్కకు తీసి పెట్టండి. ఆ తర్వాత పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా, ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ప్రతి సంవత్సరం దాన్ని సర్దుబాటు చేసుకోండి. ఈ నిధిని మీరు ఇతర ఖర్చుల కోసం కూడా ఉపయోగించొచ్చు. ఈ సరళమైన వ్యూహం, రాబోయే సంవత్సరాల్లో మీ అవసరాలను తీరుస్తూనే మీ అసలు నిధి మొత్తాన్ని కాపాడుతుంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 15:50 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పదవీ విరమణ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ఎంతవరకు పన్ను రహితం? పదవీ విరమణ సమయంలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఉద్యోగులకు పరిమితి మేరకు మినహాయింపు లభిస్తుంది.
  • మనమూ సాధిద్దాం ఆర్థిక స్వాతంత్య్రం పిల్లల ఉన్నత చదువులు, సొంతిల్లు, ప్రశాంతమైన విశ్రాంత జీవితం.. ప్రతి సాధారణ కుటుంబం కలలుగనే ముఖ్యమైన జీవిత లక్ష్యాలివి. ఎవరిపైనా ఆధారపడకుండా మీ సొంత పొదుపుతోనే వీటిని ఎలా సాధించాలి? దేశ స్వాతంత్య్ర ఉత్సవాల వేళ ప్రతి ఇంటికీ లభించాల్సిన నిజమైన ‘ఆర్థిక స్వాతంత్య్రం’ మాత్రం మన ప్రణాళికలతోనే మొదలవుతుంది.
  • మ్యూచువల్‌ ఫండ్లు.. స్మాల్‌ క్యాప్‌లో మదుపు చేస్తున్నారా? దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్‌ల గురించే చర్చ జరుగుతోంది. జులై 2026లో స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలోకి మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.7,768 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • పాత పాలసీలను సమీక్షించుకోండి మనలో చాలామంది భవిష్యత్తులో ఉపయోగపడతాయని సంప్రదాయ బీమా పాలసీలను తీసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, పదవీ విరమణ ప్రణాళికలు ఇలా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం వీటిని తీసుకున్నప్పటికీ, వీటి వల్ల వచ్చే రాబడి ఎంత? ఇవి నిజంగా మనకు లాభదాయకమేనా?
  • పన్ను రిఫండ్‌ రాలేదా? ఆలస్యానికి కారణాలు ఇవే! ITR Refund: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో చాలా మంది రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. రిటర్నులు దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే కొందరు రిఫండ్ అందుకోగా.. మరికొందరు మాత్రం వారాలు గడుస్తున్నా తమకు రిఫండ్‌ రాలేదని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడతున్నారు.
  • డిజిటల్ సంతకాలు ఆన్‌లైన్ మోసాలను ఎలా నివారిస్తాయి? ఆన్‌లైన్ లావాదేవీల్లో మోసాలను నివారించడానికి డిజిటల్ సంతకాలు ఎలా సహాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
  • గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో కూడా సమస్యలుంటాయా.. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక భద్రతా వలయంలా అనిపించినప్పటికీ, ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటంటే..
  • సిప్‌ vs లంప్సం - పెట్టుబడికి ఏ వ్యూహం మేలు? పెట్టుబడిదారుడి ఆర్థిక పరిస్థితి, మార్కెట్ పరిస్థితులను బట్టి, ఈ రెండు వ్యూహాలకు వేర్వేరు రిస్క్, సమయపరమైన చిక్కులు/అనుకూలత ఉంటాయి.
  • Mutual Funds: వివిధ లార్జ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే.. 1, 3, 5 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.
  • విదేశీ విద్యకు సంబంధించి స్పాన్సర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? విద్యార్థిగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మీ విద్యార్థి ప్రయాణ బీమాతో పాటు ‘స్పాన్సర్ ప్రొటెక్షన్ రైడర్‌’ను ఎంచుకోండి.
  • ఐటీఆర్‌లో తప్పులున్నాయా? సాధారణ వేతన జీవులు, ఆడిటింగ్‌ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సాధారణ గడువు ముగిసింది.
  • పదవీ విరమణ నిధి.. ఇలా చేస్తే సరి.. ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా వచ్చే జీతం ఆగిపోతుంది. అప్పటివరకూ పొదుపు చేసిన మొత్తమే మలి జీవితంలో జీవనానికి ప్రధాన ఆధారంగా మారుతుంది.
  • ETFలు Vs మ్యూచువల్ ఫండ్లు..పెట్టుబడికి ఏవి సరైనవి? మీ పెట్టుబడి వ్యూహం, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి సరిపోయే పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడానికి ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి.
  • అత్యుత్తమ జీవిత బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి? జీవిత బీమా సంస్థ నుంచి బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
  • కెరీర్‌కు విరామమా, అయితే ఇలా సిద్ధం కండి.. కెరీర్‌కు బ్రేక్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా! అయితే, మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
  • మీరు ITR ఫైల్ చేసిన తర్వాత పన్ను నోటీసులు వచ్చాయా.. ఆదాయ పన్ను శాఖ నుంచి సమాచారం(Intimation) అందినప్పుడు..సెక్షన్ 143(1) నోటీసులు & పన్ను డిమాండ్లకు ఎలా స్పందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
  • ఐటీఆర్‌ దాఖలు చేశారా? గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ.
  • రూ.కోటి వార్షిక వేతనమున్నా.. మీ వద్ద ఉన్న ఆస్తుల నికర విలువ కాగితాలపై మిమ్మల్ని ధనవంతుల్ని చేయొచ్చు.
  • పదవీ విరమణకు 15 ఏళ్ల ముందు విశ్రాంత జీవితానికి మరో 15 ఏళ్ల సమయం ఉందనుకొని నిశ్చింతగా ఉన్నారా? పెరుగుతున్న ద్రవ్యోల్బణం మీ అంచనాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది.
  • మిడ్‌క్యాప్‌ షేర్లలో మిడ్‌క్యాప్‌ విభాగంలో వేగవంతమైన వృద్ధిని అందుకోవాలని కోరుకునే వారి కోసం ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 మొమెంటమ్‌ 50 ఈటీఎఫ్‌ ఎఫ్‌ఓఎఫ్‌ పథకాన్ని తీసుకొచ్చింది.