కీర్తి సురేశ్‌ ‘సావిత్రి’.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

Eenadu icon
By Entertainment Team Published : 17 Jun 2026 14:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్ డెస్క్: ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌ (Praveen S. Vijaay) దర్శకత్వంలో, కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్టు రూమ్ డ్రామా చిత్రం ‘సత్తియవాన్‌ సావిత్రి’ (Satyavan Savithri release date). ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని కీర్తి తన ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా పంచుకున్న పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కీర్తి సురేశ్‌ న్యాయవాదిగా ప్రత్యర్థిని సవాల్‌ చేస్తున్నట్లు కన్పించింది.

ఈ పోస్టర్‌పై అభిమానులు స్పందిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మరో పవర్‌ఫుల్ పాత్రలో కీర్తిని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెట్టారు. ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘న్యాయానికీ, చట్టానికీ మధ్య తేడా ఉంటుంది. తన భర్త కేసులో భాగమైన సావిత్రి అనే న్యాయవాది కథే ఈ చిత్రం. ఆమె న్యాయం కోసం పోరాడుతుంటే, ఆమె సీనియర్‌కు మాత్రం చట్టమే ముఖ్యం. పరిస్థితుల కారణంగా ఆమె తన సీనియర్‌తోనే తలపడాల్సి వస్తుంది’’ అని తెలిపారు. ‘హార్ట్ బీట్’ ఫేమ్ చారుకేశ్ (Charukesh) ఇందులో కీర్తి భర్తగా నటిస్తున్నారు.

ఇక కీర్తి తదుపరి ఓ భారీ బడ్జెట్ రొమాంటిక్ థ్రిల్లర్ కోసం ప్రముఖ దర్శకుడితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారీస్థాయిలో రూపొందనుందని, ఇప్పటివరకు చేయని జోనర్‌లో ఆమె కనిపించనున్నారని టాక్. అటు కీర్తి, రాజ్‌కుమార్‌ రావ్ జంటగా నటించిన ‘రఫ్తార్’ చిత్రం కూడా విడుదల కానుంది. 

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘ధురంధర్’ సీన్‌తో స్టాటస్టిక్స్.. ఐఐఎం ప్రొఫెసర్ వినూత్న ప్రయోగం ఐఐఎం అహ్మదాబాద్‌లో ఓ ప్రొఫెసర్, విద్యార్థులకు సినిమాలోని సన్నివేశాలను చూపిస్తూ పాఠాన్ని బోధించారు.
  • 18 నెలలు ఇంటర్వ్యూలు ఇవ్వను: రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్’ సూపర్‌ హిట్‌తో ఒక్కసారిగా హైలైట్‌ అయ్యారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌.
  • రివ్యూ: మా ఇంటి బంగారం.. సమంత కొత్త మూవీ ఎలా ఉంది? ‘ఓ బేబీ’ కాంబినేషన్‌లో నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది? రెండు వైవిధ్యమైన పాత్రల్లో సామ్‌ ఎలా  నటించారు?
  • మాధవన్‌తో గోల్ఫ్ ఆడిన బ్రెట్‌లీ ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ, నటుడు మాధవన్ దుబాయ్‌లో కలుసుకున్నారు. అక్కడ వారిద్దరూ కలిసి సరదాగా గోల్ఫ్ ఆడారు.
  • బాలకృష్ణకు జోడీగా కాజల్‌.. లుక్‌ రిలీజ్‌ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
  • ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు: సమంత సెలబ్రిటీల బరువుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదోఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.
  • ధనుష్‌ ‘ఓం’పై అల్లు అర్జున్‌ ‘పుష్ప’ మార్క్‌.. దర్శకుడు ఏమన్నారంటే! ధనుష్‌ హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఓం’. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ పవర్‌ఫుల్‌ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
  • రివ్యూ: వంద దేవుళ్ళు.. విజయ్‌ ఆంటోనీ కొత్త మూవీ ఎలా ఉంది? ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘వంద దేవుళ్ళు’. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • సంక్రాంతి సినిమా మొదలు ముగ్గుల పండగే లక్ష్యంగా సినిమాల్ని సిద్ధం చేస్తూ... వరుస విజయాల్ని అందుకుంటున్న దర్శకుడు -  అనిల్‌ రావిపూడి.
  • అప్పుడే మీ పతనం ప్రారంభం ‘‘స్టార్‌డమ్‌ అందమైనదే కానీ.. పనికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాన’’ని అంటోంది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.
  • సెట్స్‌పైకి ‘జాంబిరెడ్డి 2’ ‘హనుమాన్‌’, ‘మిరాయ్‌’ విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా.
  • రెండు భాగాలుగా రిషబ్‌ చిత్రం! ‘కాంతార’ చిత్రాల విజయాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ కథానాయకుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి.
  • అదా శర్మ తొలి మరాఠీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్‌’ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది కథానాయిక అదా శర్మ.
  • దేశం దాచిన నిజాన్ని నిలదీసే కథ ‘‘కొన్ని కథలు అలరిస్తాయి. కానీ ఈ కథ మాత్రం దేశం దాచి ఉంచిన సత్యాన్ని నిలదీస్తుంది’’ అంటోంది కాజల్‌.
  • ‘కన్నప్ప’ మరోసారి! ఈ నెల 27తో ‘కన్నప్ప’ విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా మరోసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు కథానాయకుడు మంచు విష్ణు.
  • అందుకే మేకప్‌ వేసుకోలేదు: నటి రాశీ సింగ్‌ ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’’ అని చెబుతోంది నటి రాశీ సింగ్‌.
  • ధనుష్‌ @ ఓం ‘కర’ చిత్రంతో ఇటీవలే ఓ దొంగ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు ధనుష్‌. ఇప్పుడాయన ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథతో రాబోతున్నారు.
  • సంక్షిప్త వార్తలు (5) హిందీ అగ్రహీరో అక్షయ్‌ కుమార్, దిశా పటానీ జంటగా రూపొందిన సినిమా ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, సునీల్‌ శెట్టి, అర్షద్‌ వార్సీ, జాకీ ష్రాఫ్, రవీనా టాండన్‌ తదితర బాలీవుడ్‌ నటులు కీలకపాత్రలు పోషించారు.
  • ప్రేక్షకుల ముందుకు మరో తెలుగు కథానాయిక జానపద పాటల్లో నటించి మెప్పించి యువతకు దగ్గరైన నటి నాగ దుర్గ. యూట్యూబ్‌ వేదికగా ఆమె చేసిన ఆల్బమ్స్‌ సూపర్‌హిట్ అయ్యాయి. ఇటీవల తమిళంలో ‘లవ్‌ ఓ లవ్‌’ మూవీ చేస్తున్న ఆమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు.
  • గొడవ పడే పరిస్థితే వస్తే.. వెనుకాడను.. ‘బట్వారా 1947’ టీజర్‌ ఆమిర్‌ ఖాన్‌ ‘లగాన్‌’, సన్నీ దేవోల్‌ ‘గదర్‌’ చిత్రాలు విడుదలై ఇటీవలే పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంలోనే వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానుండటం ఆసక్తి రేపుతోంది.