‘కరుప్పు’లో పాత్రను ఎందుకు తొలగించారు? కారణం చెప్పిన ఆర్య

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో, కథానాయకుడు సూర్య (Surya) నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ ఇటీవల విడుదలై భారీ విజయం అందుకుంది. అయితే, ఈ సినిమాలో హీరో ఆర్య (Arya) నటించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ థియేట్రికల్, ఓటీటీ వెర్షన్లలో ఆయన కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనిపై తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో ఆర్య స్పందిస్తూ సీన్లు డిలీట్ చేయడానికి గల కారణాలు వివరించాడు.
‘‘కరుప్పులో ఒక చిన్న పాత్ర చేశాను. అయితే, ఆ సన్నివేశం సినిమాలో సరిగ్గా ఇమడలేదని దర్శకుడు ఆర్‌జే బాలాజీ నాకు ఫోన్ చేశారు. తొలగించే ముందు సమాచారం ఇచ్చారు. భవిష్యత్తులో మేం మరో ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తాం’’ అని నటుడు తెలిపాడు. ఆర్య పాత్రతో పాటు కాళీ వెంకట్ సన్నివేశాలు, విజయ్ ‘ది గోట్’, శివకార్తికేయన్ ‘డాక్టర్’ చిత్రాల రిఫరెన్స్‌లను కూడా తుది వెర్షన్ నుంచి తొలగించినట్లు ఎడిటర్ ఇటీవల వెల్లడించారు. ఇదే విషయంపై నటి శ్వాసిక స్పందిస్తూ.. సినిమాలో తాను నటించిన కొన్ని సన్నివేశాలు థియేటర్లలోకి రాలేదని తెలిపారు.
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ‘కరుప్పు’ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన సూర్య తొలి చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉండగా.. జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ విడుదలకు ఆర్య సిద్ధమవుతున్నాడు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ప్రపంచ వేదికపై బాహుబలి.. రెండే నిమిషాల్లో టికెట్లు క్లోజ్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి ఆదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
- 200 మంది కళ్లు తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారు: సంపత్ నంది శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ రానున్న విషయం తెలిసిందే.
- పీఎంవో నుంచి ‘ధురంధర్’ స్క్రిప్ట్..: స్పందించిన నటుడు బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగం సూపర్ హిట్ అయిన తర్వాత కొందరు దీని స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిందని విమర్శలు చేశారు.
- శ్రీవారిని దర్శించుకున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం దర్శించుకుంది.
- రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి షాట్.. వెంకటేశ్ - అనిల్ సినిమా మొదలు కథానాయకుడు వెంకటేశ్.. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.
- ‘కాక్‌టెయిల్ 2’.. లెస్బియన్ లవ్‌స్టోరీ కాదు: కృతి సనన్ స్పష్టత షాహిద్ కపూర్ హీరోగా రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాక్‌టెయిల్ 2’.
- దెబ్బలు తగిలాయి.. రక్తం కారింది: సమంత సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’.
- సవాళ్లని ఎదుర్కొని జీవించిన వారి కథ చిన్నాభిన్నమైన ప్రపంచంలో ధైర్యానికి నిదర్శనంగా నిలిచి.. సవాళ్లని ఎదుర్కొని జీవించిన వారిని కలవండంటూ ‘బట్వారా 1947’ సినిమా ప్రపంచంలోని పాత్రధారుల ఫస్ట్‌లుక్ పోస్టర్లని ఇన్‌స్టాలో విడుదల చేసింది చిత్రబృందం.
- ఏళ్లు గడిచినా ఇప్పుడే కన్న కలలా..! ప్రతి ప్రేక్షకుడినీ లక్ష్యం చేసుకుని తీసినట్టుగా, అందరి హృదయాల్నీ తాకుతుంది మా ‘దీవాన’ అంటున్నారు శ్రీకాంత్ సంగిశెట్టి. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా నటించారు.
- భయపెట్టే పనిలో జాక్వెలిన్? ఈ మధ్య కాలంలో సరైన స్క్రిప్ట్ దొరికితే.. హారర్ చిత్రాలతో సినీప్రియుల్ని భయపెట్టడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు మన సినీతారలు.
- సంక్రాంతి బరిలో శర్వా చిత్రం కథానాయకుడు శర్వానంద్ ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతి లక్ష్యంగా మరో సినిమాని సిద్ధం చేస్తున్నారు.
- ఇది సినిమా కాదు... ఓ మానవీయ అనుభవం ‘‘నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యక్తులు, సమూహాల జీవితాల వెనుక కథల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదట్నుంచీ చేస్తూనే ఉన్నా. అందులో భాగంగా చేసిన మరో చిత్రమే ‘ఎల్.జి.బి.టి - ఎ లీగల్ బ్యాటిల్’.
- భాగ్యనగరిలో చిరు యాక్షన్ కథానాయకుడు చిరంజీవి.. దర్శకుడు బాబీ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- అందుకే పదేళ్ల విరామం ‘‘ఒక మంచి సినిమా చేస్తే అందరూ చూస్తారు. అందరూ ఇష్టపడే అలాంటి ఓ కథ కోసమే ఇన్నాళ్లూ ఎదురు చూడాల్సి వచ్చింది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు వడ్డే నవీన్. ‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్లి’ సినిమాలు మొదలుకొని...
- ఫహాద్ డబుల్ ధమాకా! ఈ మధ్య కాలంలో ‘పుష్ప 2’, ‘ఆవేశం’, ‘మారీసన్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటుడు ఫహాద్ ఫాజిల్. ప్రస్తుతం పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన.. 2027లో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
- ఈసారి లంకను దహించేది సీత! ‘‘అహంకారమే ఆయుధంగా.. మోసంతో పరిపాలించి, అబద్ధాలతో గెలిచిన రాక్షసుడు. యువరాణిని అపహరించి ఇంటికి తీసుకెళ్లిన అతని కథ ఎలా ముగిసిందో చరిత్రకి తెలుసు.
- రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘డ్రాగన్’ సందడి ‘పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ‘డ్రాగన్’ సినిమాతో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
- సంక్షిప్త వార్తలు (3) ‘‘యువర్ హానర్.. న్యాయపోరాటానికి రంగం సిద్ధమైంది’’ అని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. మరి ఆమె దేని కోసం పోరాటం చేస్తుందో తెలుసుకోవాలంటే ‘సత్తియవాన్ సావిత్రి’ సినిమా చూడాల్సిందే.
- సంచిత ఆత్మహత్యకు నటుడి వేధింపులే కారణమా? ఇన్‌స్టా చాట్‌లో ఏముందంటే? ప్రముఖ బుల్లితెర నటి, ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న సంచితా ఉగాలే (Sanchita Ugale) ఆత్మహత్యకు ఓ నటుడి నుంచి ఎదురైన తీవ్ర వేధింపులే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- సీతే లంకాదహనం చేస్తే.. ‘ఆల్ఫా’ ట్రైలర్‌లో అదరగొట్టిన ఆలియా సీతే లంకాదహనం చేస్తే.. ‘ఆల్ఫా’ ట్రైలర్‌లో అదరగొట్టిన ఆలియా