మహిళల T20 WC.. నెదర్లాండ్స్‌పై భారత్ సూపర్ విక్టరీ

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో బాబెట్ డి లీడే 28, హీథర్ సీగర్స్ 21, స్టెర్రే కాలిస్ 18 రన్స్ చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 4, షెఫాలీ వర్మ 3, నందని శర్మ 2 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ ఒక వికెట్ తీసింది. 17వ ఓవర్‌లో శ్రీ చరణి మూడు వికెట్లు, 18వ ఓవర్‌లో షెఫాలీ వర్మ 2 వికెట్లు తీశారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (74; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (55; 38 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 26 బంతుల్లో 47 పరుగులు జోడించారు. అయితే, స్వల్ప వ్యవధిలోనే మంధాన, జెమీమా, యాస్తికా భాటియా (3) ఔటయ్యారు. చివర్లో రిచా ఘోష్ (20*; 8 బంతుల్లో 1 ఫోర్, రెండు సిక్స్‌లు), దీప్తి శర్మ (10*; 2 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో స్కోరు 200 దాటింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే 2 వికెట్లు.. హీథర్ సీగర్స్, వాన్ డెన్ రాడ్, ఐరిస్ జ్విల్లింగ్ తలో వికెట్ తీశారు.
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు చేసేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. షెఫాలి వర్మ (55; 38 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసి ఔటైంది. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 121/1 స్కోరుతో ఉంది. స్మృతి మంధాన (46*), జెమీమా రోడ్రిగ్స్ (6*) క్రీజులో ఉన్నారు.
నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. స్మృతి మంధాన (24), షెఫాలి వర్మ (26) చక్కగా సమన్వయం చేసుకుంటూ పరుగులు రాబడుతున్నారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 59/0. ఆరో ఓవర్‌లో వాన్ డెన్ రాడ్ ఏకంగా ఆరు వైడ్లు వేయడం గమనార్హం.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. అరుంధతి రెడ్డికి విశ్రాంతి ఇచ్చి నందని శర్మను తుది జట్టులోకి తీసుకున్నట్లు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.
భారత్ తుది జట్టు:షెఫాలి వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందని శర్మ.
నెదర్లాండ్స్ ప్లేయింగ్ XI:హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే (కెప్టెన్, వికెట్‌కీపర్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 22:22 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆంధ్ర క్రికెట్లోనూ అడుగు తెలంగాణలో ఈ ఏడాదే మొదలైన టీజీ20 లీగ్‌లో అత్యధిక బిడ్‌తో హైదరాబాద్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రామోజీ గ్రూపు సంస్థ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్..
- ఘనారంభం లంక పర్యటనలో టీమ్‌ఇండియా ఆరంభం అదిరిపోయింది. గాలె టెస్టులో గిల్ బృందం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
- బోణీ అదిరింది హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ముందుండి నడిపించిన వేళ టోర్నీలో జట్టు బోణీ కొట్టింది.
- భారత్‌కు చైనా పరీక్ష మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ తొలి సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం పూల్-డిలో బలమైన చైనాతో సలీమా బృందం తలపడనుంది.
- చరిత్రకు చేరువలో.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుపై బంగ్లా పట్టు ఆస్ట్రేలియా పేలవ బ్యాటింగ్ కొనసాగుతున్న వేళ.. బంగ్లాదేశ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయానికి చేరువైంది.
- ప్రజ్ఞ గేమ్ డ్రా సింక్‌ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద నిలకడగా ఆడుతున్నాడు. టోర్నీ సాగేకొద్దీ పోడియంపై నిలిచే అవకాశాల్ని మెరుగుపరుచుకుంటున్నాడు.
- వాటిని వేరుగానే ఉంచాలి ఆన్‌లైన్ చెస్ రేటింగ్స్‌ను ఆటగాడి అధికారిక ఫిడే రేటింగ్ పాయింట్లుగా మార్చకూడదని, రెండింటినీ వేర్వేరుగానే ఉంచాలని భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు.
- అలా పిలిపించుకోవాలంటే.. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాల పట్టికలో అగ్రదేశాల సరసన నిలిచినప్పుడే.. భారత్‌కు క్రీడా దేశమనే పిలుపు దక్కుతుందని మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది.
- చిరాగ్‌కు చిరాకొస్తోంది భుజం గాయం తిరగబెడుతుండటం నిరాశకు గురి చేస్తోందని బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజు పేర్కొన్నాడు.
- దేవదత్.. టీమ్ ఇండియా ‘తొలి’ జెన్ ఆల్ఫా కుర్రాడి కథ తెలుసా? టీమ్ ఇండియాకు టెస్టుల్లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ సెంచరీ కొట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ మాట చాలు ఆ ప్లేస్ కోసం మన జట్టు ఎంతగా ఇబ్బంది పడుతోందో తెలియడానికి. ఈ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. సెంచరీతో ఆ పని చేసింది దేవదత్ పడిక్కల్. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్ చేసిన ఈ కుర్రాడి గురించి చూద్దాం.
- ‘పడిక్కల్ దేవుడిచ్చిన వరం.. అతడొచ్చినా మూడో స్థానంలోనే ఆడించాలి’ టీమ్ఇండియా బ్యాటర్లు కొన్నాళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్‌లో దిగిన దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు.
- హాకీ ప్రపంచ కప్.. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్ డిలో వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన 3-1 తేడాతో విజయం సాధించింది.
- శ్రీలంకపై సెంచరీ.. అరుదైన ఘనత సాధించిన దేవదత్ పడిక్కల్ టీమ్ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికిది తొలి శతకం.
- బంగ్లాతో టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియాకు కష్టాలే బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురైన ఆసీస్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడ్డారు. అప్పుడే నాలుగు వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.
- స్ఫూర్తినింపిన విరాట్ కోహ్లీ పోస్టు.. నెట్టింట ప్రశంసలు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
- అదీ ధోని స్పెషల్.. చడీచప్పుడు లేకుండా ‘7’ జెర్సీ రిటైర్మెంట్ అద్భుతమైన ఘనతలు సాధించినా సింపుల్‌గా ఉండటం ధోని ప్రత్యేకత. తన రిటైర్మెంట్ వ్యవహారంలోనూ ఇదే సూత్రం పాటించాడు.
- స్వాతంత్ర్య వేడుకల్లో.. టీమ్‌ఇండియా ఆటగాళ్లు శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు తాము బస చేసిన హోటల్ వద్ద భారత జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంది.
- గంభీర్ అవన్నీ గెలిచాడు..: శ్రీలంక హెడ్ కోచ్ భారత్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై శ్రీలంక ప్రధాన కోచ్ గ్యారీ కిరిస్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
- పడిక్కల్ సెంచరీ.. తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ 288/2 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ కీలక పోరులో తలపడుతోంది. శ్రీలంకతో తొలి టెస్టు బరిలోకి దిగింది.
- శ్రీలంకతో తొలి టెస్టు: పాఠకులు ఎంపిక చేసిన భారత జట్టు ఇదే శ్రీలంకతో తొలి టెస్టు కోసం ఎంపిక చేయమని పెట్టిన పోల్‌కు విశేష స్పందన వచ్చింది.