‘ఇండో’ తీసేసి.. మ్యాప్‌ మార్చి: భారత్‌కు షాకిచ్చిన అమెరికా..!

Eenadu icon
By International News Team Updated : 17 Jun 2026 14:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు గట్టి షాకిచ్చింది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్‌ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తీసేసింది. అంతేకాదు.. భారత చిత్రపటాన్ని కూడా మార్చి చూపించడం వివాదాస్పదమైంది. జీ-7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ( Donald Trump), భారత ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi) మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

అమెరికాకు చెందిన చారిత్రక ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ (US Indo-Pacific Command)’ పేరును మళ్లీ ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చినట్లు అగ్రరాజ్య రక్షణశాఖ వెల్లడించింది. ‘‘చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించాం’’ అని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. ఇక, ఈ కమాండ్‌ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ తమ వెబ్‌సైట్‌లో ఓ ఫొటోను ఉంచింది. అందులో ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌’ను పాకిస్థాన్‌ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. 

  • హెచ్‌-1బీ హోదా కాపాడుకోవాలంటే లక్ష డాలర్లు చెల్లించాల్సిందే..!

యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ను 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్‌. ట్రుమ్యాన్‌ ఏర్పాటుచేశారు. అగ్రరాజ్య వెస్ట్‌ కోస్ట్‌ నుంచి భారత పశ్చిమతీరం వరకు గత ఏడు దశాబ్దాలకు పైగా ఈ కమాండ్‌ సేవలందిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర పోషించింది. కొరియన్‌, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసింది. ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది.

అయితే, ట్రంప్‌ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో 2018లో దీని పేరును ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేరులో ‘ఇండో’ అనే పదం చేర్చినట్లు నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ వెల్లడించారు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్‌ను అగ్రరాజ్యం దూరం పెడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్వాడ్‌ అంతానికి మరో మేకు: శశిథరూర్ 

ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. ‘క్వాడ్ అంతానికి మరో మేకు’ అని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసి క్వాడ్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో ఈ కూటమి బలహీనపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 12:00 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • త్రివర్ణ పతాకంతో స్కై డైవింగ్‌.. భారతీయుల అరుదైన ఘనత లిబియా(Libya)లో 65 మంది స్కైడైవర్లు జాతీయ జెండాలతో చేసిన సాహస విన్యాసం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు(Guinness World)లో చోటు దక్కించుకుంది. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం.
  • వెయ్యికిపైగా డ్రోన్‌లతో..రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్‌ వెయ్యికిపైగా డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడింది.
  • మురుగు కాలువలో బంగారునాణేలు gold bars: డ్రైనేజీ తవ్వకాల సమయంలో కార్మికులకు అనూహ్య ఘటన ఎదురైంది.
  • యూఎస్‌లో భారత స్వాతంత్ర్య వేడుకలు.. గిన్నిస్‌ రికార్డు నమోదు అమెరికాలోని న్యూయార్క్‌ ట్రై-స్టేట్‌  ప్రాంతంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నమోదైంది. న్యూజెర్సీలోని పార్సిప్పనీ వెటరన్స్‌ మెమోరియల్‌ పార్క్‌లో 1300కు పైగా అమెరికా జెండాలను భారత త్రివర్ణ పతాకాల మధ్య అమర్చి ‘‘250’’ ఆకారాన్ని ఏర్పాటు చేశారు.
  • లింకన్‌ పోయి... వాషింగ్టన్‌ వచ్చె... ఇరాన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ సాగిస్తున్న సుదీర్ఘ యుద్ధం అమెరికాకు సంక్లిష్ట పరిస్థితిని కలిగిస్తోంది.
  • మిషిగన్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి అమెరికాలోని మిషిగన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మరణించారు. డెట్రాయిట్‌కు 270 కిలోమీటర్ల దూరంలోని మిస్సాకీ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
  • ఇండోనేసియాలో భారీ భూకంపం ఇండోనేసియా తీరానికి సమీపంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. 47 మంది మృతి చెందారు.
  • ఇజ్రాయెల్‌ దాడులు.. లెబనాన్‌లో 11 మంది మృతి దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు ఒకే ఇంట్లో మృతి చెందారు.
  • 4శాతం హిందువులను భరిస్తున్నాం! తమ దేశంలో హిందువులు 4శాతంగా ఉన్నారని, వారందరినీ తమ దేశం భరిస్తోందంటూ పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ వ్యాఖ్యానించారు.
  • యుద్ధ నౌకలతో హర్మూజ్‌ను స్వాధీనం చేసుకోలేరు: ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌ హర్మూజ్‌ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని.. దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని ఇరాన్‌ పేర్కొంది.
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
  • యూఏఈ నుంచి ఇరాన్‌కు రహస్యంగా... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) తన దేశ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను భారీ మొత్తంలో విడుదల చేసినట్లు సమాచారం.
  • భారత్, పాక్‌ ప్రజల మధ్య... పరస్పర అపనమ్మకం ఎక్కువే భారతీయులు, పాకిస్థానీలలో అత్యధికులు ఒకరినొకరు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇది రెండు పొరుగు దేశాల మధ్య లోతుగా వేళ్లూనుకున్న అపనమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అమెరికన్‌ సంస్థ ప్యూ రిసెర్చ్‌ సర్వే వెల్లడించింది.
  • ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌ బ్రిటన్‌పై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌గా ఆ దేశాన్ని సంబోధించారు. అంతేగాకుండా ‘‘ప్రపంచంలో అణ్వస్త్రాలున్న తొలి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా’’గా అభివర్ణించారు.
  • ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ ఇండోనేసియాలో  (Indonesia) శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) సంభవించింది.
  • నేపాల్‌కు ‘అగ్నిపథ్‌’ సెగలు... గూర్ఖా సైనికుల ఆందోళన దేనికి..? Nepal Gorkha soldiers: జెన్‌-జీ ఆందోళనలతో ఏకంగా అధికార పీఠమే కదిలిన నేపాల్‌కు ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది. పొఖారాలో గత కొద్ది రోజులుగా మాజీ గూర్ఖా సైనికులతో పాటు పెద్ద ఎత్తున యువత నిరసనలు చేస్తున్నారు. 
  • భార్యకు ప్రేమతో.. 200 ఎకరాలను పూలతోటగా మార్చి..! Hollyhock Garden: తన భార్య జ్ఞాపకాలను కళ్లముందు నిలిపాడో భర్త. ఆమె ఇష్టపడిందని దాదాపు 200 ఎకరాల్లో ఏకంగా ఓ పూలతోటనే నిర్మించాడు.