నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది: పవన్ పోస్టు

- A
- A+
- A++

Pawan Kalyan | ఇంటర్నెట్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) బుధవారం హనుమకొండలో పర్యటించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్(17) అనే బాలుడు తనకు అభిమాని అని, తనను కలవాలన్న అతడి ఆకాంక్షను తెలుసుకున్న పవన్.. ఈ ఉదయం నేరుగా బాలుడి నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలతో ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
‘‘కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను. ఈరోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించాను. అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతడి అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.

నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి. ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
అదే సమయంలో వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను’’ అని పేర్కొన్నారు.
క్యాంటీన్ పెట్టుకోండి.. సాయం చేస్తా: పవన్ హామీ
ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపించి దాన్ని పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్‌ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పని చేసేవాళ్లమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నేతలకు సూచించారు. నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే పవన్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట జనసేన నేతలు శంకర్ గౌడ్, శ్రీరామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం, ఆర్ కె సాగర్ తదితరులు ఉన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 15:14 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విష ప్రచారం మానకుంటే.. వైకాపాని ప్రకాశం బ్యారేజీలో పడేస్తాం విష ప్రచారం మానకుంటే వైకాపాని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
- నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల నవంబరులో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- ఈ మాజీ జవాన్.. ఓ ‘రుధీరుడు’! అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారి పాలిట అపద్బాంధవుడిలా నిలుస్తున్నారు వైఎస్సార్ కడప జిల్లా కొండాపురానికి చెందిన ఐటీబీపీ మాజీ కమాండో హాజీవలి.
- కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు యువకులు గల్లంతు పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
- క్లస్టర్ ఉపాధ్యాయులకు ఎంత కష్టం.. ఎంత నష్టం! ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుగా తేలిన క్లస్టర్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకు పైగా ఉపాధ్యాయులు మిగులుగా తేలారు.
- క్యాన్సర్ కట్టడికి ‘బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్’ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బాధితుల్లో 70% మంది 40-69 ఏళ్ల వయసువారు ఉంటున్నారు. 2020-25 మధ్య క్యాన్సర్ కొత్త కేసుల్లో జాతీయ సగటు పెరుగుదల 12.8% ఉంటే, రాష్ట్రంలో 39.5% ఉంది.
- పట్టణాభివృద్ధికి రూ.5,940 కోట్లు పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కోసం రెండో విడతగా రూ.5,940 కోట్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది.
- వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్! రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో డేటా విశ్లేషణ, పన్నుల రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు సులభమయ్యాయి.
- తితిదేకు రూ.కోటి విరాళం తితిదే శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సీహెచ్‌పీ రామేశ్వరరావు, శ్రీసాయిచందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావులు రూ.50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం అందించారు.
- శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు క్యూకట్టారు.
- వ్యర్థం.. అయ్యింది చక్కటి రూపం! సాధారణంగా పంట కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క పెరుగుతూ ప్రవాహానికి అడ్డుగా మారుతుంటుంది. ఏటా వాటిని తొలగించేందుకు రైతులు పడే ప్రయాస అంతాఇంతా కాదు.
- ఇలపై వివాహం.. నింగిలో విహారం హెలికాప్టర్‌లో ఒక్కసారైనా తిరగాలని కలలుకన్న ఆ యువకుడు.. దాన్ని తన వివాహం రోజు నిజం చేసుకున్నాడు. గుంటూరు గ్రామీణ మండలం లాలుపురానికి చెందిన ప్రత్తిపాటి సాయికుమార్ డప్పు కళాకారుడు.
- దానయ్య కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసిన తెదేపా దానయ్య కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసిన తెదేపా
- తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగరేశారు.
- హస్త కళాకారులకు అందుబాటులో వుడ్ బ్యాంకులు హస్తకళల పరిరక్షణ, ఆయా రంగాలపై ఆధారపడ్డ కళాకారులకు ముడి సరకు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా.. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటుచేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు.
- క్వార్టర్‌కు అదనంగా రూ.10 పిండుకుందాం! మద్యం దుకాణాల లీజు గడువు మరో రెండు నెలల్లో ముగియనుండటంతో ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూళ్లకు యజమానులు తెరలేపారు. చివర్లో అందిన కాడికి దండుకుందామన్నట్లు కూడబలుక్కుని ఒక్కో సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు.
- ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్, వేఫర్ తదితర ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
- చరిత్ర ఘనం.. సేవలు మరువం ఈ చిత్రంలో కనిపిస్తున్న వింటేజ్ వాహనం పేరు ‘ఎలన్ మెమోరియల్ బ్లూ వ్యాన్’. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని గ్రామీణ ప్రజలకు ‘క్యాంబెల్ ఆసుపత్రి’ తరఫున వైద్య సేవలు అందించేందుకు 1958-60 ప్రాంతంలో ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
- భలే ఉంది.. బుల్లి గేదె! చూడటానికి చిన్నగా, చూడముచ్చటగా ఉన్న ఈ గేదె ముర్రా జాతికి చెందినది.
- విశిష్ట సేవలందించిన అధికారులకు పతకాలు పోలీసు, జైళ్ల శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పలువురు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించిన పతకాలను ఆయా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రదానం చేశారు.