గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి కోసం రూ.4కోట్ల నగలు చోరీ

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. షోరూమ్‌లో పనిచేస్తున్న నితిన్ వర్మ అనే వ్యక్తి తన ప్రేయసి కాజల్ వర్మతో పెళ్లి కోసం ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నితిన్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే నెలన్నర క్రితం షోరూమ్‌లో చేరాడు. స్టోర్ అంతర్గత కార్యకలాపాలు, భద్రతా ఏర్పాట్లు, విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? అనే కీలక విషయాలు తెలుసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. తన ప్రియురాలు కాజల్‌తో వివాహం నిశ్చయమైందని జూన్ 12న నమ్మించి షోరూమ్ సిబ్బందికి మందు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి కాజల్ వర్మ, నిందితుడి తండ్రి కూడా హాజరయ్యారు. షోరూమ్ తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్‌ను ఎక్కువ మద్యం తాగేలా ప్రోత్సహించి.. అతడిని ఇంటి దగ్గర దింపే నెపంతో తాళాల్ని కాజేశాడు.
- బాస్ పేరిట మెసేజ్.. ఐనాక్స్‌కు రూ.10.4కోట్లు ఫట్!
మరుసటి రోజు ఉదయాన్నే నితిన్ తన స్నేహితుడితో నగల దుకాణానికి వచ్చి.. దొంగిలించిన తాళం చెవితో షట్టర్ తెరిచి లోపలికి వెళ్లాడు. కేవలం 25 నిమిషాల్లో మొదటి అంతస్తులో ఉన్న బంగారం, వజ్రాలు, రత్నాలు పొదిగిన రూ. 4 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. షోరూమ్‌లో ఎటువంటి అలారం వ్యవస్థ లేకపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు వెల్లడించారు. రాత్రిపూట కాపలాగా ఉండే సెక్యూరిటీ గార్డు ఉదయం 7గంటలకు ఇంటికి వెళ్లిపోయిన అనంతరం ఈ దోపిడీ జరిగిందని వివరించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో నిందితుడు నితిన్‌తో పాటు అతడి తండ్రిని, ప్రేయసిని అరెస్ట్ చేశామని.. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 18:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మూడు రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఎన్‌టీఏ మెసేజ్ నీట్-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ తెలిపింది.
- టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. నేరగాళ్లకు అడ్డా: కేంద్రం సంచలన ఆరోపణలు Telegram: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్ వెబ్’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది.
- ఒక్కో ఎంపీకి మరో రూ.10కోట్లు ఇచ్చారు - సంజయ్ రౌత్ శివసేన (యూబీటీ)లో సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఆరుగురు ఎంపీలు డుమ్మా కొట్టడంపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- లోయలో పడిన బొలెరో.. ఏడుగురి దుర్మరణం హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- చీలిక వార్తల వేళ శివసేన (యూబీటీ) ఎంపీల భేటీ.. ముగ్గురే హాజరు Shiv Sena UBT: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెండోసారి చీలిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.
- అయోధ్య విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాలు తారుమారు..! Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న కేసులో.. సీసీటీవీలు ట్యాంపరింగ్ అయ్యాయని తాజాగా సిట్ గుర్తించింది.
- ఎరుపు రంగు చెవులతో అరుదైన ఏనుగు ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన మగ ఏనుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది.
- ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం Fuel prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం పేర్కొంది.
- విశాఖపై కన్ను.. మళ్లీ బంగాళాఖాతం జలాల్లోకి పాక్ సబ్‌మెరైన్లు.. ! Pakistan: 1971 ఇండియా-పాక్ వార్.. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని దాయాది కళ్లారా చూసింది.
- భర్త మరణించినా అతని ఆస్తి నుంచి మాజీ భార్య భరణం పొందవచ్చు దంపతులు విడిపోయిన కేసుల్లో.. భర్త మరణానంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు పేర్కొంది.
- చీలిక ముంగిట ‘సేన’, ఎస్పీ! దేశంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రాజకీయ సంక్షోభాల ముంగిట నిలిచినట్లు స్పష్టమవుతోంది.
- మన విద్యావ్యవస్థ పిల్లల్ని చిదిమేస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో ‘‘ఛాత్రోంకీ గూంజ్’’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరుతో ఏర్పాటైన మహార్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
- విద్యార్థుల భవితవ్యంతో రాహుల్ రాజకీయం: భాజపా వైద్య విద్యలో ప్రవేశం పొందాలని కోరుకుంటున్న అభ్యర్థులతో రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని భాజపా ఆరోపించింది.
- భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర: భాగవత్ దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసే ప్రయత్నాలు భారత్‌తోపాటు విదేశాల్లోనూ జరుగుతున్నాయని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
- 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు విస్తృత మద్దతు తీవ్ర నేరాలకు పాల్పడి 30 రోజుల కన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 130వ రాజ్యాంగ...
- జాక్‌ఫ్రూట్‌తో జాక్‌పాట్ పెరుగుతున్న ఖర్చులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సంప్రదాయ సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తున్నాయి.
- గతం కాదు.. భవిష్యత్తు ముఖ్యం! క్షమించడం అలవాటు చేసుకోండి. క్షమించినంత మాత్రాన.. ఇతరులు చేసిన తప్పు ఆమోదయోగ్యమేనని మీరు అంగీకరించినట్లేమీ కాదు.
- సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు అమాయకులైన మదుపరుల సొమ్మును కాజేస్తోన్న సైబర్ నేరగాళ్లు పరాన్న జీవులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
- నెలలు నిండని ప్రసవాలను సూచించే రక్త పరీక్ష నెలలు నిండకముందే ప్రసవించిన గర్భిణుల రక్తంలో అణువుల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయని, ఇలాంటి వారిలో మొదటి త్రైమాసికంలోనే తేడాలు కనిపిస్తాయని ఎమరీ విశ్వవిద్యాలయం (అట్లాంటా-అమెరికా) పరిశోధకులు తేల్చారు.
- జూనియర్లను హైకోర్టు జడ్జి పోస్టులకు సిఫార్సు చేయడంపై న్యాయాధికారి అభ్యంతరం తన కన్నా జూనియర్లు అయిన న్యాయాధికారులను హైకోర్టు జడ్జి పోస్టులకు కొలీజియం సిఫార్సు చేయడంపై హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయాధికారి బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.