రెండో వన్డేలో అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. లఖ్‌నవూలో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. లక్ష్యఛేదనలో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది. గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన దర్విష్ రసూలీ (6) తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. రహ్మత్ షా (79; 89 బంతుల్లో) చివరి వరకు పోరాడాడు. రహ్మనుల్లా గుర్బాజ్ (41), సెథికుల్లా అటల్ (42), ఇబ్రహీం జద్రాన్ (21) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గూర్నూర్ బ్రార్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అరంగేట్ర బౌలర్ ప్రిన్స్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నైలో జరగనుంది.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. గూర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో (39.6 ఓవర్) మహ్మద్ సలీం (9) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 40 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 220/8. ఆ జట్టు లక్ష్యం 403.
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఘజన్‌ఫర్ (1) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో (34.1 ఓవర్) శ్రేయస్ అయ్యర్‌కు చిక్కాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో ఇది మూడో వికెట్. 35 ఓవర్లకు స్కోరు 194/7. రహ్మత్ షా (53*), మహ్మద్ సలీం (4*) క్రీజులో ఉన్నారు.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గాన్ ఓటమి దిశగా సాగుతోంది. రషీద్ ఖాన్ (12) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్ వేసిన 32.6 ఓవర్‌కు రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 33 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 188/6. మరోవైపు, రహ్మత్ షా (52*) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ వేసిన 30.1 ఓవర్‌కు నంగేయాలియా (6) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్‌కు వన్డేల్లో ఇది తొలి వికెట్. 31 ఓవర్లకు స్కోరు అఫ్గాన్ స్కోరు 182/5. రషీద్ ఖాన్ (10*), రహ్మత్ షా (48*) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ లక్ష్యం 403.
భారత్‌తో రెండో వన్డేలో 403 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. గూర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో (24.5 ఓవర్) హష్మతుల్లా షాహిదీ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 25 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 140/4. ప్రస్తుతం నంగేయాలియా (0), రహ్మత్ షా (24) క్రీజులో ఉన్నారు.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెథికుల్లా అటల్ (42; 50 బంతుల్లో) ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 23.1 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 24 ఓవర్లకు స్కోరు 131/3. అఫ్గాన్ లక్ష్యం 403.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గాన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. సెథికుల్లా అటల్ (28), రహ్మత్ షా (14) మూడో వికెట్‌కు ఇప్పటివరకు 35 పరుగులు జోడించారు. 20 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 105/2.
భారత్ నిర్దేశించిన 403 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో అఫ్గాన్ 71 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (21; 31 బంతుల్లో) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ వేసిన 13.1 ఓవర్‌కు ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో జద్రాన్ వెనుదిరిగాడు.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రహ్మనుల్లా గుర్బాజ్ (41; 33 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. గూర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో (7.3 ఓవర్) వికెట్‌కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 8 ఓవర్లకు స్కోరు 52/1. అఫ్గాన్ లక్ష్యం 403.
భారత్ నిర్దేశించిన 403 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు అఫ్గాన్ బరిలోకి దిగింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (26), ఇబ్రహీం జద్రాన్ (6) నిలకడగా ఆడుతున్నారు. 5 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 32/0.
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154; 110 బంతుల్లో), ఇషాన్ కిషన్ (125; 79 బంతుల్లో) శతకాలు బాదారు. రోహిత్ శర్మ (48), శ్రేయస్ అయ్యర్ (26), వాషింగ్టన్ సుందర్ (19) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో నంగేయాలియా 4, రషీద్ ఖాన్ 3, ఘజన్‌ఫర్, మహమ్మద్ సలీం ఒక్కో వికెట్ పడగొట్టారు.
అఫ్గాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గూర్నూర్‌బ్రార్ (3), ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (3) ఔటయ్యారు. కాసేపటికే వాషింగ్టన్ సుందర్ (19)ని రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. 49 ఓవర్లకు భారత్ స్కోరు 397/9.
శ్రేయస్ ఔట్
శ్రేయస్ అయ్యర్ (26; 24 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. నంగేయాలియా వేసిన 45 ఓవర్‌లో ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 45 ఓవర్లకు భారత్ స్కోరు 373/6. గూర్నూర్‌బ్రార్ (1), వాషింగ్టన్ సుందర్ (5) క్రీజులో ఉన్నారు.
వరుసగా రెండు వికెట్లు
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (154; 110 బంతుల్లో), తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ డకౌటయ్యాడు. వీరిద్దరిని నంగేయాలియా ఔట్ చేశాడు. 43 ఓవర్లకు భారత్ స్కోరు 361/5. వాషింగ్టన్ సుందర్ (1), శ్రేయస్ అయ్యర్ (19) పరుగులతో ఉన్నారు.
ఇషాన్ ఔట్
సెంచరీ బాది జోరు మీదున్న ఇషాన్ కిషన్ (125; 79 బంతుల్లో) ఔటయ్యాడు. నంగేయాలియా వేసిన 37 ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఇషాన్.. తర్వాత బంతికి భారీ షాట్ ఆడి ఇక్రమ్ అలీఖిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో గిల్, ఇషాన్ 224 పరుగుల భాగస్వామ్యానికి (139 బంతుల్లో) తెరపడింది. 37 ఓవర్లకు భారత్ స్కోరు 322/3. శుభ్‌మన్ గిల్ (135), శ్రేయస్ అయ్యర్ (1) క్రీజులో ఉన్నారు.
భారీ స్కోరు దిశగా భారత్
అఫ్గాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. శుభ్‌మన్ గిల్ (134), ఇషాన్ కిషన్ (113) దూకుడుగా ఆడుతున్నారు. ఈ జోడీ మూడో వికెట్‌కు ఇప్పటివరకు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 36 ఓవర్లకు స్కోరు 307/2.
ఇషాన్ కిషన్ సెంచరీ

అఫ్గాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇషాన్ కిషన్ 71 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో అతడికిది రెండో శతకం. తొలుత నెమ్మదిగా ఆడి 52 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న ఇషాన్.. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. 33 ఓవర్లకు భారత్ స్కోరు 266/2. ఇషాన్ కిషన్ (103), శుభ్‌మన్ గిల్ (104) క్రీజులో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ శతకం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకం (77 బంతుల్లో 103 నాటౌట్) నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో గిల్‌కి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. అఫ్గాన్‌పై తొలి శతకం. మరోవైపు ఇషాన్ కిషన్ (91)తో కలసి మూడో వికెట్‌కు 153 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. 32.1 ఓవర్లకు భారత్ స్కోరు 249/2.
గిల్ హాఫ్ సెంచరీ
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో రెండో వన్డేలో అతడు వన్‌డౌన్‌గా వచ్చాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. కెరీర్‌లో అతడికిది 19వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్ స్కోరు 17 ఓవర్లకు 120/2. క్రీజ్‌లో గిల్ (55*), ఇషాన్ కిషన్ (10) ఉన్నారు.
రోహిత్ ఔట్
అఫ్గానిస్థాన్‌తో రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ (48) కొద్దిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం భారత్ 13.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (42*), ఇషాన్ కిషన్ ఉన్నారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (4) త్వరగా పెవిలియన్‌కు చేరాడు.
ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం
లఖ్‌నవూలోని ఏకనా స్టేడియం వేదికగా భారత్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టాస్ నెగ్గిన అఫ్గాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ సిరీస్‌పై కన్నేసింది. టీమ్‌ఇండియా తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. దీంతో ఒకే సిరీస్‌లో భారత్ నుంచి మూడో డెబ్యూ ప్లేయర్‌గా ప్రిన్స్ నిలిచాడు. తొలి వన్డేలో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేశారు. ఈసారి శ్రేయస్ అయ్యర్ చేతులమీదుగా ప్రిన్స్ క్యాప్‌ను అందుకొన్నాడు. రెండో వన్డే కోసం భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.
తుది జట్లు
భారత్:యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
అఫ్గానిస్థాన్:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, ఖరోటి, ఘజనఫర్, సలీమ్ సాఫి, బిలాల్ సామి
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 21:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- బంగ్లా చేతిలో సొంత గడ్డపై ఓటమి.. అత్యంత అవమానకరం: ఆసీస్ మాజీలు తమ క్రికెట్ చరిత్రలో ఈ ఓటమి అత్యంత అవమానకరమైందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- వేడి దెబ్బకు వాంతులు.. సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్ టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్ వాతావరణం దెబ్బకు తీవ్రంగా ఇబ్బంది పడిన ఘటన సిన్సినాటి ఓపెన్‌లో చోటు చేసుకుంది.
- చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాపై ఘన విజయం ఆసీస్‌ను తమ సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ, బంగ్లాదేశ్ తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
- టీ బ్రేక్.. ఐదు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా గాలె వేదికగా శ్రీలంక - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు.
- గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచ కప్ ప్రారంభం! వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ను ఓ ప్రత్యేకమైన రోజున ప్రారంభించేందుకు ఐసీసీ ఆలోచనలు చేస్తోంది.
- 30 వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఇద్దరు భారత క్రికెటర్లు మాత్రమే ఆ జాబితాలో ఉండగా.. యశస్వి ఇప్పుడు వారి సరసన చేరాడు.
- శ్రీలంకతో తొలి టెస్ట్.. ఫస్ట్ డే హైలైట్స్ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ హవా సాగింది.
- ఆంధ్ర క్రికెట్లోనూ అడుగు తెలంగాణలో ఈ ఏడాదే మొదలైన టీజీ20 లీగ్‌లో అత్యధిక బిడ్‌తో హైదరాబాద్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రామోజీ గ్రూపు సంస్థ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్..
- ఘనారంభం లంక పర్యటనలో టీమ్‌ఇండియా ఆరంభం అదిరిపోయింది. గాలె టెస్టులో గిల్ బృందం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
- బోణీ అదిరింది హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ముందుండి నడిపించిన వేళ టోర్నీలో జట్టు బోణీ కొట్టింది.
- భారత్‌కు చైనా పరీక్ష మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ తొలి సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం పూల్-డిలో బలమైన చైనాతో సలీమా బృందం తలపడనుంది.
- చరిత్రకు చేరువలో.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుపై బంగ్లా పట్టు ఆస్ట్రేలియా పేలవ బ్యాటింగ్ కొనసాగుతున్న వేళ.. బంగ్లాదేశ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయానికి చేరువైంది.
- ప్రజ్ఞ గేమ్ డ్రా సింక్‌ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద నిలకడగా ఆడుతున్నాడు. టోర్నీ సాగేకొద్దీ పోడియంపై నిలిచే అవకాశాల్ని మెరుగుపరుచుకుంటున్నాడు.
- వాటిని వేరుగానే ఉంచాలి ఆన్‌లైన్ చెస్ రేటింగ్స్‌ను ఆటగాడి అధికారిక ఫిడే రేటింగ్ పాయింట్లుగా మార్చకూడదని, రెండింటినీ వేర్వేరుగానే ఉంచాలని భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు.
- అలా పిలిపించుకోవాలంటే.. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాల పట్టికలో అగ్రదేశాల సరసన నిలిచినప్పుడే.. భారత్‌కు క్రీడా దేశమనే పిలుపు దక్కుతుందని మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది.
- చిరాగ్‌కు చిరాకొస్తోంది భుజం గాయం తిరగబెడుతుండటం నిరాశకు గురి చేస్తోందని బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజు పేర్కొన్నాడు.
- దేవదత్.. టీమ్ ఇండియా ‘తొలి’ జెన్‌జీ కుర్రాడి కథ తెలుసా? టీమ్ ఇండియాకు టెస్టుల్లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ సెంచరీ కొట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ మాట చాలు ఆ ప్లేస్ కోసం మన జట్టు ఎంతగా ఇబ్బంది పడుతోందో తెలియడానికి. ఈ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. సెంచరీతో ఆ పని చేసింది దేవదత్ పడిక్కల్. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్ చేసిన ఈ కుర్రాడి గురించి చూద్దాం.
- ‘పడిక్కల్ దేవుడిచ్చిన వరం.. అతడొచ్చినా మూడో స్థానంలోనే ఆడించాలి’ టీమ్ఇండియా బ్యాటర్లు కొన్నాళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్‌లో దిగిన దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు.
- హాకీ ప్రపంచ కప్.. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్ డిలో వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన 3-1 తేడాతో విజయం సాధించింది.
- శ్రీలంకపై సెంచరీ.. అరుదైన ఘనత సాధించిన దేవదత్ పడిక్కల్ టీమ్ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికిది తొలి శతకం.
English Translation
Great victory over Afghanistan in the second ODI..India's series

- A
- A+
- A++

Internet Desk: India to play three ODI series with Afghanistan won 2-0. India won by 170 runs in the second ODI in Lucknow on Wednesday. Batting first, Team India scored a huge score of 402 runs in 49.5 overs. Afghanistan were restricted to 232/9 in 44.3 overs. Darvish Rasooli (6), who left the field as a retired Hurt due to injury, did not return to bat. Rahmat Shah (79; off 89 balls) fought till the end. Rahmanullah Gurbaz (41), Sethikullah Atal (42) and Ibrahim Zadran (21) scored runs. Among the Indian bowlers, Arshdeep Singh and Gurnoor Brar took three wickets. Debutant bowler Prince Yadav took 2 wickets and Washington Sundar took one wicket. The nominal third ODI will be held in Chennai on June 20.
Afghan lost their eighth wicket in the second ODI against India. Mohammad Salim (9) was clean bowled by Gurnoor Brar (39.6 overs). Afghanistan score 220/8 after 40 overs. The team's target is 403.
Indian bowlers are on fire in the second ODI against Afghanistan. Ghazanfar (1) reached the pavilion for the seventh wicket. Arshdeep Singh was bowled by Shreyas Iyer (34.1 overs). This is Arshdeep Singh's third wicket in this match. Score 194/7 after 35 overs. Rahmat Shah (53*) and Mohammad Salim (4*) are at the crease.
Afghan is heading towards defeat in the second ODI against India. Rashid Khan (12) returned for the sixth wicket. Rohit was caught by Arshdeep in 32.6 overs. Afghanistan score 188/6 after 33 overs. On the other hand, Rahmat Shah (52*) completed his half-century.
Afghanistan lost five wickets in the second ODI against Team India. Nangeyalia (6) was clean bowled in 30.1 over by Prince Yadav. This is the first ODI wicket for Prince Yadav who made his debut in this match. Afghanistan score 182/5 after 31 overs. Rashid Khan (10*) and Rahmat Shah (48*) are at the crease. Afghanistan's target is 403.
Afghanistan lost four wickets while chasing a target of 403 runs in the second ODI against India. Hashmatullah Shahidi (4) was clean bowled by Gurnoor Brar (24.5 overs). Afghanistan score 140/4 after 25 overs. Currently, Nangeyalia (0) and Rahmat Shah (24) are at the crease.
Afghanistan lost their third wicket in the second ODI against India. Sethikulla Atal (42; off 50 balls) is out. Washington Sundar's LBW in 23.1 overs. Score 131/3 after 24 overs. Afghanistan's target is 403.
Afghan batsmen are playing consistently in the second ODI against India. Sethikulla Atal (28) and Rahmat Shah (14) have added 35 runs for the third wicket so far. Afghanistan's score is 105/2 after 20 overs.
Afghanistan lost their second wicket at 71 runs in India's 403-run target. Opener Ibrahim Zadran (21; off 31 balls) was dismissed. Prince Yadav took a brilliant catch in 13.1 overs by Arshdeep and Zadran was left behind.
Afghanistan lost their first wicket in the second ODI against India. Aggressive Rahmanullah Gurbaz (41; off 33 balls) joins the pavilion. Gurnoor Brar bowled (7.3 overs) and gave a catch to wicketkeeper Rahul. Score 52/1 after 8 overs. Afghanistan's target is 403.
Afghan came into the ring to chase down the steep target of 403 runs set by India. Openers Rahmanullah Gurbaz (26) and Ibrahim Zadran (6) are playing consistently. Afghanistan's score is 32/0 for 5 overs.
Team India made a huge score in the second ODI against Afghanistan. After losing the toss and going into bat, India were bowled out for 402 runs in 49.5 overs. Captain Shubman Gill (154; off 110 balls) and Ishan Kishan (125; off 79 balls) scored centuries. Rohit Sharma (48), Shreyas Iyer (26) and Washington Sundar (19) scored runs. Among the Afghan bowlers, Nangeyalia 4, Rashid Khan 3, Ghazanfar and Mohammad Salim took one wicket each.
India lost nine wickets in the second ODI against Afghanistan. Gurnoorbrar (3) was dismissed off the bowling of Rashid Khan and Arshdeep Singh (3) off the bowling of Ghazanfar. Soon Washington Sundar (19) was dismissed by Rashid Khan. India score 397/9 in 49 overs.
Shreyas out
Shreyas Iyer (26; off 24 balls) joins the pavilion. In the 45th over bowled by Nangeyalia, Ibrahim Jadran was caught. India score 373/6 after 45 overs. Gurnoorbrar (1) and Washington Sundar (5) are at the crease.
Two wickets in a row
India lost two wickets in a row in the second ODI against Afghanistan. Shubman Gill (154; off 110 balls) followed by KL Rahul. Nangeyalia dismissed both of them. India score 361/5 after 43 overs. Washington Sundar (1) and Shreyas Iyer (19) are with runs.
Ishaan out
Ishaan Kishan (125; off 79 balls) who is on the verge of a century. After hitting two consecutive fours in Nangeyalia's 37 over, Ishan hit the ball with a huge shot and gave a catch to Ikram Alikhil. With this, Gill and Ishan's partnership of 224 runs (in 139 balls) ended. India score 322/3 after 37 overs. Shubman Gill (135) and Shreyas Iyer (1) are at the crease.
India towards a big score
Team India is heading towards a big score in the second ODI against Afghanistan. Shubman Gill (134) and Ishan Kishan (113) are playing aggressively. The pair have put on a partnership of 211 runs for the third wicket so far. The score is 307/2 in 36 overs.
Ishan Kishan Century

Ishan Kishan's 71-ball century in the second ODI against Afghanistan did His second century in ODIs. Ishan, who played slowly at first and scored a half-century in 52 balls, changed gears after his half-century. India score 266/2 after 33 overs. Ishan Kishan (103) and Shubman Gill (104) are at the crease.
Shubman Gill century
Indian captain Shubman Gill scored a century (103 not out from 77 balls) in the second ODI against Afghanistan as part of the three ODI series. This is Gill's ninth century in his ODI career, while his first century against Afghanistan. On the other hand, he made an unbeaten partnership of 153 runs for the third wicket with Ishan Kishan (91). India score 249/2 in 32.1 overs.
Gill Half Century
Indian captain Shubman Gill scored a half century. He got one down in the second ODI against Afghanistan. He completed his half century in just 39 balls. It was his 19th career half-century. India's score is currently 120/2 after 17 overs. Gill (55*) and Ishan Kishan (10) are at the crease.
Rohit out
Opener Rohit Sharma (48) scored a short half-century in the second ODI against Afghanistan. Rohit was bowled by Rashid Khan. Currently, India have scored 96 runs for the loss of 2 wickets in 13.1 overs. Captain Shubman Gill (42*) and Ishan Kishan are at the crease. Earlier, Yashaswi Jaiswal (4) quickly reached the pavilion.
Prince Yadav's debut
The second ODI between India and Afghanistan will be held at the Ekana Stadium in Lucknow. After winning the toss, Afghanistan chose to bowl. Having already won the first ODI, India is eyeing the series. Prince Yadav made his debut for Team India. With this, Prince became the third debutant player from India in the same series. Harsh Dubey and Gurnoor Brar made their debut in the first ODI. This time, Shreyas Iyer received the prince's cap. India come into the ring with three changes for the second ODI.
Final Teams
India:Yasaswi Jaiswal, Rohit Sharma, Shubman Gill (captain), Ishan Kishan (wicket keeper), Shreyas Iyer, KL Rahul, Washington Sundar, Kuldeep Yadav, Gurnoor Brar, Arshdeep Singh, Prince Yadav
Afghanistan:Rahmanullah Gurbaz (wicket keeper), Ibrahim Zadran, Sedikhullah Atal, Rahmat Shah, Hashmatullah Shahidi (captain), Darwish Rasooli, Rashid Khan, Kharoti, Ghazanafar, Saleem Safi, Bilal Sami
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 21:35 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this regard.
More
- Home defeat by Bangladesh.. most humiliating: Former Aussies Australian ex-cricketers were furious that this defeat was the most humiliating in their cricket history.
- Vomiting due to heat stroke. Tennis star player Djokovic was severely affected by the weather at the Cincinnati Open.
- Bangladesh made history. Beating the Aussies on their own soil is very difficult. But, Bangladesh won for the first time and created history.
- Tea break.. Team India lost five wickets. First Test between Sri Lanka and India at Galle.
- The ODI World Cup will start on Gandhi Jayanti! ICC is planning to start the ODI World Cup next year on a special day.
- 30 venues.. 30 matches.. Sachin vs Yashaswi Jaiswal Yashaswi Jaiswal achieved a rare feat. Until now there are only two Indian cricketers in that list.. Yashaswi now joins them.
- First Test against Sri Lanka.. First Day Highlights On the first day of the first Test against Sri Lanka, India had the wind Ushodaya Enterprises Pvt. Ltd., a Ramoji Group company, has secured the Hyderabad franchise with the highest bid in the TG20 League, which started this year in Telangana. Team India got off to a rocky start in their tour of Lanka. The Gill team is showing dominance in the Galle Test That's the start for India in the Hockey World Cup. Captain Harmanpreet led the team in the tournament.
- China test for India India is ready for its first challenge in the Women's Hockey World Cup. Salima's team will face strong China in Pool-D on Sunday.
- Bangla's grip on the first Test against Australia is close to history. While Australia's poor batting continues..Bangladesh is on the verge of its biggest win in Test cricket history.
- Prajna Game Draw Pragyananda is playing consistently in the Sinquefield Cup chess tournament. As the tournament progresses, his chances of getting on the podium are improving.
- They should be kept separate. Indian Grandmaster Arjun Irigesi believes that online chess ratings should not be converted into the player's official FIDE rating points, but both should be kept separate. Former shuttler Saina Nehwal believes that India can be called a sports nation only when it stands in front of the top countries in the medal table in international tournaments.
- Chirag is annoyed. Badminton men's doubles star Satwik Sairaju said that his shoulder injury is disappointing.
- Devadut.. Do you know the story of Team India's 'first' Jenji boy? It has been two and a half years since Team India scored a first down batsman century in Tests. This word is enough to know how much our team is struggling for that place. This problem has finally been checked. Devdutt Padikkal did that with a century. Let's see about this boy who traveled from Kerala to Telangana to Karnataka.
- 'Padikkal is a gift from God.. He should play at third position' It is known that Team India's batters have been struggling to cope effectively with spin bowling for years. However, Devdutt Padikkal, who got down one down in the first Test against Sri Lanka, is playing the spin brilliantly.
- Hockey World Cup. The Indian men's team has got off to a good start in the ongoing Hockey World Cup in the Netherlands. Harmanpreet Sena won the match against Wales in Pool D by 3-1.
- Devadut Padikkal scored a rare century against Sri Lanka. Team India's batsman Devdutt Padikkal achieved a rare feat. Padikkal scored a century in the first innings of the first Test against Sri Lanka. It is his first century in Tests.