‘మద్యం తాగేటప్పుడు’ మంచింగ్ ఎందుకు?

- A
- A+
- A++

మద్యం ప్రియులకు ఇష్టమైన మాట స్టఫ్. మద్యంతో పాటే చిప్స్, కాల్చిన మాంసం ముక్కలు, మిక్చర్లు, వేయించిన గింజల్ని నోట్లో వేసుకుంటే వారికి చెప్పలేని అనుభూతి. ఇంతకీ మద్యం తాగుతున్నప్పుడు జంక్‌ఫుడ్ తినాలనే కోరిక ఎందుకు కలుగుతుంది? ఉప్పగా ఉన్న ఆహారం నాలుకకు తగలాలని ఎందుకు కోరుకుంటారు? దీనిపై ఆస్ట్రేలియా అధ్యయనకర్తలు దాదాపు 10 వేల మందిపై విస్తృత పరిశోధనలు చేశారు. ఆకలిని కూడా ఆల్కహాల్ ప్రేరేపిస్తుందని గుర్తించారు. ప్రొటీన్‌ను పొందాలనే తపన మనసును మభ్యపెట్టి.. ఆనారోగ్యకరమైన ఆహారాలు తినేలా మద్యం ప్రియుల్ని ఉసిగొల్పుతోందని వారు కనుగొన్నారు.
ప్రొటీన్ తినాలనే కోరిక...
శరీరానికి ప్రొటీన్ అవసరమైనప్పుడు అది ఎక్కువగా ఉండే ఉప్పటి ఆహారాల్ని కోరుకుంటాం. తీపి పదార్థాల జోలికెళ్లం. ఈ రెండు కోర్కెలు ‘ఎఫ్‌జీఎఫ్21’ అనే హార్మోన్ ద్వారా మెదడుకు సంకేతాలుగా వెళతాయి. శరీరంలో ప్రొటీన్ కొరతను గుర్తించినప్పుడు కాలేయం ఈ హోర్మోన్‌ను విడుదల చేస్తుంది. మద్యం సేవించడం వల్ల ఎఫ్‌జీఎఫ్21 విడుదలై, ప్రొటీన్ తినాలనే కోరిక పుడుతుంది. తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది. శాస్త్రవేత్తలు దీనిని ‘అపెరిటిఫ్ ఎఫెక్ట్’ అని పిలుస్తారు. మద్యంతో పొందే అనుభూతితో పాటు, ఆహార సంతృప్తి కూడా కలుగుతుంది కాబట్టి అనేక సంస్కృతుల్లో మద్యాన్ని ఆహారంతో జతచేస్తారు.
అవి ప్రొటీన్ ఎరలు
మాంసం, సముద్రపు ఆహారం, పప్పుధాన్యాలు వంటివి ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. పారిశ్రామిక ఆహార వ్యవస్థలు అతిగా ప్రాసెస్ చేసే చిప్స్, మిక్చర్లు, పిజ్జాలు, ఇతరత్రా జంక్‌ఫుడ్స్ వంటివి ఈ కోవలోకి రావు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ.. ప్రొటీన్‌ను తక్కువగా, కొవ్వు, కార్బోహైడ్రేట్లను ఎక్కువగా అందిస్తాయి. కానీ ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలతో ముడిపడి ఉన్న ఇంద్రియ సంకేతాలను అందిస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటిని ‘ప్రొటీన్ ఎరలు’గా పిలుస్తారు.
అతిగా తినేస్తారు…
మద్యానికి, చిరుతిళ్లకు మధ్య అవినాభావ సంబంధం ఉందని అధ్యయనకర్తలు కనుగొన్నారు. మనం ఎలాంటి ఆహారాన్ని ఎంత తీసుకున్నాం అనే దాన్ని బట్టి మొత్తం శక్తి ఆధారపడి ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే మాంసం, పప్పుధాన్యాల్ని తిన్నప్పుడు.. ఆల్కహాల్ తీసుకున్నా కేలరీలు పెరగలేదు. అదే సమయంలో మద్యం తాగుతున్నప్పుడు ప్రాసెస్ చేసిన ఆహారం, కొవ్వు పదార్ధాలు తీసుకునేవారు మరీ ఎక్కువగా తింటున్నారు. ఫలితంగా బరువు కూడా పెరుగుతున్నారు. ఉప్పగా ఉండే స్నాక్స్ ఎన్ని తిన్నా వారికి ఇంకా తినాలనిపిస్తుందని అధ్యయనంలో గుర్తించారు.
నివారించేదెలా?
క్రమం తప్పకుండా మద్యం సేవించే వారు.. దాంతో పాటు తీసుకునే చిరుతిళ్లు శరీరానికి ఎలాంటి హాని చేస్తాయో గుర్తించాలి. మన శరీరానికి ప్రొటీన్ ఎక్కువ అవసరం కాబట్టి.. కొవ్వు తక్కువున్న మాంసం, వేయించిన శనగలు, గుడ్లు, లేదా సముద్రపు ఆహారం వంటి వాటిని తీసుకోవాలి. ప్రొటీన్ తీసుకుంటున్నామని మన మెదడును మోసగించే కొవ్వు, పిండిపదార్థాలు అధికంగా ఉండే ప్రొటీన్‌ల ఎరల నుంచి మోసపోకూడదు. అవి మన బలమైన ప్రొటీన్ ఆకలిని తీర్చకుండా వదిలేస్తాయి.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 18:15 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హైబ్రిడ్ కార్లను అవగాహనతో నడుపుదాం.. హైబ్రిడ్ కార్లు.. ఇప్పుడివే నయా ట్రెండ్. వీటి వినియోగంపై ప్రజలూ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ఈ కార్లలో రెండు ఇంజిన్లు ఉండటమే ప్రత్యేకం.
- సయ్యంటోంది.. సైనిక కీటకం మినీ జెట్ ఫైటర్ లాంటి ఆకారం.. సైనికుడి దుస్తుల్లాంటి రెక్కలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉన్న ఈ కీటకం ఒలియాండర్ హాక్ మాత్.
- ఆ పల్లెలో పాలు కొనరు.. పంచుకొంటారు! గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంటా పాలప్యాకెట్ కొనుగోలు తప్పనిసరి అయిన రోజుల్లో అక్కడ పాలప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు.
- నీటి హక్కులపై రాజీ లేదు కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాలో.. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
- ‘నిషేధం’... అయోమయం! రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది.
- ఆరు నెలలకో పోటీ పరీక్ష నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆరు నెలలకో పోటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
- ఏఎస్‌డీడీ ఓట్లపై రాజకీయ పార్టీల దృష్టి! సేకరించడానికి వీలులేని(అన్ కలెక్టబుల్) జాబితాలో ఉంచిన ఓటర్లపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
- గోల్కొండ కోటలో మువ్వన్నెల రెపరెపలు ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం గోల్కొండ కోటలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా కోటను అందంగా తీర్చిదిద్దారు.
- చురుగ్గా కొత్త కోర్టుల నిర్మాణం ప్రజలకు నాణ్యమైన, సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ వెల్లడించారు.
- ఊరూరా తారు రోడ్లు దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) విధానంలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- దేశంలో కీలక గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ: గవర్నర్ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
- రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
- రూ.525 కోట్ల పనులు... ముగ్గురే ఇంజినీర్లు కొత్త మార్కెట్లు, భవనాలు, గోదాములు, షెడ్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణాలు ఇలా... 33 జిల్లాల్లో రూ.525.86 కోట్ల పనులు కొనసాగుతున్నాయి.
- ఈ-ఆటో.. రైట్ రైట్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్య నియంత్రణ, హరిత రవాణా లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
- స్మార్ట్ రేషన్‌కార్డులతో పారదర్శకత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే రాష్ట్రవ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
- చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి రాజకీయ లబ్ధి కోసం దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, కేంద్రంలోని భాజపా నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
- కేంద్ర పథకాల్లో సీఎం ఫొటో పెట్టాలి జీఎస్టీతోపాటు ఇతర విధానాల్లో కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో పన్నులు చెల్లిస్తున్నందున రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- మేమిచ్చిన రైతుబంధు నిధులే ఎక్కువ కేసీఆర్ ప్రభుత్వంలో రెండేళ్లలో ఇచ్చిన రైతుబంధు నిధుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.15 వేల కోట్లు తక్కువ ఇచ్చిందని భారాస శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
- స్మార్ట్ రేషన్‌కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలెందుకు? కేంద్రం రేషన్ బియ్యం ఇస్తున్నా.. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకుండా సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
- భరతమాతే అమ్మవారు.. వందేమాతరమే వేదమంత్రం ఆలయాల్లో దేవతామూర్తులకు వేద మంత్రాలతో, స్తోత్రాలతో పూజలు నిర్వహించడం సాధారణం.