టెక్కలి రూరల్‌:స్థానిక మెళియాపుట్టి రోడ్డు జంక్షన్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలానికి చెందిన సకలభక్తుల రంజిత్‌కుమార్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం గ్రామానికి చెందిన రంజిత్‌ కుమార్‌ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వస్తుండగా, స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రంజిత్‌ కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తి కుడి కాలు పూర్తిగా విరిగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.