Betting App Case: బెట్టింగ్ యాప్ కేసు.. యువరాజ్ సింగ్, సోనూసూద్ ఆస్తులు అటాచ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది (Betting App Case). ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, బాలీవుడ్ నటులు సోనూసూద్, నేహాశర్మ ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. ఆ జాబితాలో నటి ఊర్వశీ రౌతేలా తల్లితో పాటు టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, అంకుశ్ హజ్రా (బెంగాలీ నటుడు) కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ వీరిని ఇప్పటికే విచారించగా.. తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.7.93 కోట్లని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గతంలో మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అన్ని విషయాలు తెలిసే 1xBet, దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్‌కు చెందిన రూ.4.5 కోట్ల స్థిరాస్తిని, సురేశ్‌కు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్‌లను సీజ్ చేసేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ వేదికగా రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :