ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తా

- A
- A+
- A++

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేయాలని సీఎంకు సూచించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి కార్యాచరణ చేపడదామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు గురించి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, రామ్మోహన్‌నాయుడిలతో మాట్లాడుతున్నప్పుడు.. ఆదిలాబాద్ కలెక్టర్‌ను పిలిపించామన్నారు. ప్రాజెక్టుల విషయంలో అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పిలిపించుకుంటున్నామని తెలిపారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ప్రతి మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నా. వేటికీ నేను అడ్డుపడలేదు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ దయాదాక్షిణ్యాలతో మేం అధికారంలో లేము. నేను రేవంత్‌రెడ్డికి జవాబుదారీ కాదు. కేంద్ర ప్రభుత్వానికి, నా నియోజకవర్గ ప్రజలకు, భాజపాకు జవాబుదారీని. చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. నేను రేవంత్‌రెడ్డిలా మాటకారిని కాదు. మాటమీద నిలబడే వ్యక్తిని. అధికారం, పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాను. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద చర్చకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమా? భారాస, కాంగ్రెస్ హయాంలో ఒకే తరహా పాలన, ఒకే రకమైన దోపిడీ జరుగుతోంది. తిరగనివ్వను, పొలిమేర దాటనివ్వను అని మాట్లాడుతున్న సీఎం వ్యవహార శైలిని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. రేవంత్‌రెడ్డి హామీల అమలులో విఫలమయ్యారు కాబట్టే.. భాజపాను, నన్ను విమర్శిస్తున్నారు. తుమ్మిడిహెట్టి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవకుండా నేను అడ్డుపడలేదు.
రాష్ట్రంలో అభివృద్ధికి సహకరిస్తున్నాం..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇంకా కొంత భూమిని సేకరించాలి. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్ పిలవాలి. ఇవన్నీ పూర్తైన తర్వాత ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మెట్రో రెండో దశ ప్రకియ కొనసాగుతోంది. ఎల్‌అండ్‌టీకి ఇవ్వాల్సిన నిధులను కూడా రైల్వే శాఖ నుంచి అప్పుగా ఇప్పించాం. ఫైనల్ ప్రపోజల్ రాగానే.. అన్ని కమిటీలు ఆమోదం తెలిపిన తర్వాత అది క్యాబినెట్‌కు వెళ్తుంది. మూసీ అభివృద్ధి కోసం.. 36 ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు నిధులు ఇచ్చాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూనే ఉన్నాం. 53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అంగీకరించాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం ఏడాదికి రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తే.. గతేడాది మేం రూ.26 వేల కోట్లు వ్యయం చేశాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఇంటర్‌లో మాజీ మావోయిస్టు దేవ్‌జీ ఉత్తీర్ణత మావోయిస్టుల మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ(61) ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించారు.
- బడి బాగుకు చర్యలు.. పెరిగేనా పిల్లలు.. కొత్త విద్యాసంవత్సరం (2026-27)లో ప్రభుత్వ పాఠశాలల బాగుకు.. వాటిల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
- ఆర్‌జీ కోల్‌మైన్‌కు పచ్చజెండా! బొగ్గు ఉత్పత్తి పడిపోయి, వ్యాపారం తగ్గి వెలవెలబోతున్న సింగరేణి సంస్థకు ఊపిరి పోసే కొత్త నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది.
- ఆలోచన పొదిగే.. ఉపాధి ఎదిగే.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన కొలకాని సంపత్ ఉన్నతంగా చదువుకొని శాస్త్రవేత్తగా ఎదగాలనుకున్నా.. ఆర్థికంగా అడ్డంకులు ఎదురవడంతో పదో తరగతితోనే చదువు మానేశాడు.
- ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ‘ఆభా’ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లగానే మొదట అవుట్ పేషెంట్(ఓపీ) విభాగంలో రోగుల ఆధార్ కార్డుతో ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’(ఆభా) రూపొందిస్తున్నారు.
- కాంగ్రెస్ పాలనలో బాలికల ప్రాణాలకు రక్షణ లేదు ఖమ్మంలో బాలికపై జరిగిన పైశాచిక దాడి.. రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతలకు నిదర్శనమని భారాస శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
- సహకార సంఘాల్లో.. సకల సేవలు! ఆధార్.. పాన్.. పాస్‌పోర్ట్.. ఫాస్టాగ్.. జీఎస్టీ.. లేబర్ రిజిస్ట్రేషన్.. ఇలాంటి ఒక్కో సేవకు ఒక్కో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.
- భూ సేకరణతోనే జల ప్రవాహం మూడేళ్లుగా భూసేకరణ పూర్తికాక పనులు నిలిచిపోయిన ఈ కాలువ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనిది.
- జేఈఈలా ‘నీట్’కూ ‘వడపోత’ మంచిది ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ముందుగా జేఈఈ మెయిన్ నిర్వహిస్తున్నట్లుగానే జాతీయస్థాయి నీట్‌కు కూడా ఆ తరహా విధానాన్ని అమలు చేయడం మంచిదని బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.రాంగోపాల్‌రావు సూచిస్తున్నారు.
- బాలికపై అఘాయిత్యం అమానుషం ఖమ్మంలో పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి, భవనంపై నుంచి తోసేసిన ఘటన అత్యంత అమానుషమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు.
- అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి కోర్టులకు వస్తారా? ‘ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి..కూల్చివేసేందుకు అధికారులు రాగానే కోర్టులను ఆశ్రయిస్తారా’ అంటూ ఓ కేసు విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణదారులను ఉద్దేశించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
- విద్యార్థుల దుస్తులు, బూట్ల కాంట్రాక్టులో అవకతవకలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన దుస్తులు, బూట్ల కాంట్రాక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
- ‘సర్’పై మూడు పార్టీలది తప్పుడు ప్రచారం : రామచందర్‌రావు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్)పై కాంగ్రెస్, భారాస, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
- అవయవదాన చట్టం సవరణకు ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడిగా ప్రొ.శ్రీభూషణ్‌రాజుకు చోటు దేశవ్యాప్తంగా అవయవదాన ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది.
- ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని... సీతమ్మసాగర్ బ్యారేజీ, సీతారామ ఎత్తిపోతల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
- ఎస్సీ సంక్షేమ శాఖలో పదోన్నతులకు ఎదురుచూపులు! ఎస్సీ సంక్షేమ శాఖలో పాతికేళ్ల క్రితం వసతి గృహ సంక్షేమాధికారిగా పనిచేసిన ఉద్యోగి... ఎలాంటి పదోన్నతి లేకుండానే పదవీ విరమణ చేయాల్సి వస్తోంది.
- హౌసింగ్ బోర్డు స్థలాలపై ప్రభుత్వం దృష్టి..! హౌసింగ్ బోర్డు స్థలాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇటీవల కొన్ని చోట్ల హౌసింగ్ బోర్డు స్థలాల అన్యాక్రాంతం ఘటనలో అధికారులపై చర్యలు తీసుకోగా.. ఇతర స్థలాల పైన అధికారులు దృష్టిసారించారు.
- ‘మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై హరీశ్ ఆరోపణలు దారుణం’ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణమంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించడం దారుణమని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ పేర్కొన్నారు.
- నీటి లభ్యత ఆధారంగా సాగు విధానం ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌లో పంటలపై తీవ్ర ప్రభావమే పడుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా నివేదించాయి.
- వీబీ జీరాంజీ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేయండి వీబీ జీరాంజీ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు.