రాజధానిలో వర్షబీభత్సం

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుంభవృష్టితో దాదాపు అన్ని ప్రాంతాలు వణికిపోయాయి. అత్యధికంగా మల్కాజిగిరి వినాయక్‌నగర్ వార్డు ఆఫీసు ప్రాంతంలో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేట్‌లో 8.75, హిమాయత్‌నగర్ విఠల్‌వాడీలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వరణుడు విరుచుకుపడటంతో నగరం అల్లాడిపోయింది. ముఖ్యంగా పాతబస్తీలో వీధిలైట్ల తీగ తెగి పడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చార్మినార్ సమీపంలో చెత్తబజార్‌లో పాతకాలం నాటి ఓ కమాన్ స్వల్పంగా కూలింది. అంబర్‌పేట్, ముషీరాబాద్, తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేెలకొరిగాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.

రహదారులపై నరకం..
వాన సరిగ్గా సాయంత్రం మొదలైంది. ఆఫీసులు ముగిసే సమయానికి కుండపోతగా కురిసింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన ఉద్యోగులతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో.. వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. మూడు కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్ల అధికారులు, హైడ్రా సిబ్బంది రహదారులపై వరదనీటిని దారి మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం కనిపించలేదు. గచ్చిబౌలి-కొండాపూర్ మార్గం, జూబ్లీహిల్స్ రోడ్డు నం.45-మైండ్‌స్పేస్ రహదారుల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. ఐటీ కారిడార్‌లోని అన్ని రహదారులపైనా ఇదే పరిస్థితి. ర్యాపిడో, ఇతరత్రా ఆన్‌లైన్ వాహన బుకింగ్‌లు పని చేయక జనాలు ఇబ్బంది పడ్డారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్‌టవర్స్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు 6 ఫేజ్ ప్రధాన రహదారిపై నడుములోతు నీరు నిలవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మణికొండలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెక్నాంపూర్ డివిజన్‌లోని కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది. హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు స్టీలు బ్రిడ్జిపైనా వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పటిలాగే మలక్‌పేట ఆర్‌యూబీ వద్ద వరద నీరు భారీ స్థాయిలో నిలిచింది. మురుగునీటి పైపులైన్లు, వరద నాలాలు పొంగిపొర్లడంతో మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కిందనున్న రోడ్డు చెరువులా మారింది.
చురుగ్గా రుతుపవనాలు..:నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక పరిసరాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.


గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘పెద్దవాగు’పై చిన్నచూపు తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలు చిన్నచూపు చూస్తున్నాయి.
- ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లండి! మీనాక్షి నటరాజన్‌పై నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
- ఐసెట్‌లో 46,654 మంది పాస్ ఐసెట్‌లో 91.22 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 56,206 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 51,146 మంది పరీక్ష రాశారు.
- ఈ బడుల్ని ఎప్పుడు బాగుచేస్తారు? సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి ఇది. ఏళ్ల కిందట నిర్మించిన భవనం గోడలు నెర్రెలిచ్చాయి.
- చిన్నారికి అరుదైన వ్యాధి.. ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా జన్యుపరమైన ఎస్‌ఎంఏ టైప్-2 అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆర్యాన్ష్ చికిత్సకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
- పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయం పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తేల్చి చెప్పింది.
- ఆదాయపు పన్ను నోటీసుల కొట్టివేత మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271డి కింద ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
- గ్రేడ్-2 ఈవోలకు గ్రేడ్-1గా పదోన్నతులు దేవాదాయ శాఖలో గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులు(ఈవో)గా పనిచేస్తున్న 26 మందికి గ్రేడ్-1 ఈవోలుగా పదోన్నతి కల్పించారు.
- వ్యవసాయ అంకురాలకు ప్రోత్సాహం వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి బయోనెస్ట్ కో ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్)లో మూడు సంస్థలు మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
- ‘ఆత్మనిర్భరత’తోనే దేశానికి రక్షణ ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడటం ప్రమాదకరమని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు నిరూపించాయని భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్ అన్నారు.
- ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
- సింగరేణిలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు సింగరేణిలో కారుణ్య నియామకాలకు అర్హత సాధించిన 335 మందికి శనివారం మంచిర్యాలలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
- ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఓట్లతోపాటు సీట్లనూ కేంద్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని, అందులో భాగమే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
- సమ్మక్క బ్యారేజీకి ఎన్వోసీ ఇవ్వండి గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ అనుమతుల సాధనలో మరో ముందడుగు పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
- వచ్చే మార్చి నాటికి బీబీనగర్ ఎయిమ్స్ అందుబాటులోకి.. బీబీనగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రిని వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు.
- అటు వానలు.. ఇటు వడగాలులు రాష్ట్రంలో ఒకవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా...ఇంకోవైపు వేడిగాలులు భయపెడుతున్నాయి. 16 జిల్లాల పరిధి 63 మండలాల్లో శుక్రవారం వడగాలులు వీచాయి.
- ప్రియాంక గాంధీని కలిసిన మహేశ్‌కుమార్‌గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు.
- పశువుల కొట్టాలుగా రెండు పడకల ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలు చాలాచోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి.
- రహదారుణాలు రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్ల్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) తాజా నివేదిక స్పష్టం చేసింది.
- కమీషన్ల కోసమే సౌర విద్యుత్ ప్రాజెక్టులు సింగరేణిలో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పనులు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల కమీషన్ల కోసమే చేపట్టారని శాసనసభలో భారాస పక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.