అతివల చేతిలోనే ప్రగతి

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలో ఉంది. వారికి అండగా ఉండే బాధ్యత మాది. ఎవరెన్ని కుట్రలు చేసినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోను’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళలను స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన చేస్తున్నామని, తమ ప్రభుత్వంలో దళారులు, దోపిడీదారులకు చోటులేదన్నారు. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. ఆడబిడ్డలను నిర్లక్ష్యం చేసేవారు అధికారంలో ఉండలేరని, మహిళాలోకం పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన మహిళా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన మహిళాశక్తి మహాసభలో సీఎం ప్రసంగించారు. ‘‘ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీదేవితో పోల్చే సంస్కృతి మనది. భూమిని భూమాతగా, దేశాన్ని భారతమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో మహిళామణులు మన కీర్తిని ప్రపంచానికి చాటారు. మంత్రులుగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లుగా, మేయర్లుగా ఆడబిడ్డలు రాణించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని 2013లో సోనియాగాంధీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టారు. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగం కాబోతున్నారు. గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఒక్క మహిళకూ మంత్రిగా అవకాశం కల్పించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏనాడూ పార్టీ అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వలేదు.

ప్రజాప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే శాసనసభ సాక్షిగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. కొందరు కడుపునిండా విషం నింపుకొని, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలని రోడ్డెక్కారు. అయినా వెనక్కి తగ్గకుండా ఆ పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఇందుకోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. ఉచితబస్సుల్లో వెళ్లి మన ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. చదువు మానేసే వారి సంఖ్య తగ్గిపోయింది. గత ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన రూ. 4 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టింది. మేం అధికారంలోకి రాగానే వాటిని మంజూరు చేశాం. పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పని మహిళా సంఘాలకు అప్పగించాం. ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సమాఖ్యలకు రూ.159 కోట్ల ఆదాయం వచ్చింది. అంబానీల మాదిరిగా మహిళలు పెట్రోల్‌బంకులు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నాం. అదానీతో పోటీపడేలా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నాం. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా ఇందిరా మహిళాశక్తి భవనాలను నిర్మిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయానికి హైటెక్ సిటీలో రూ.వెయ్యి కోట్ల స్థలంలో 106 స్టాళ్లు ఏర్పాటు చేశాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాం.

మహిళా సంఘాల సభ్యుల సంఖ్య 67 లక్షల నుంచి కోటికి చేరాలి. రూ.60 వేల కోట్ల రుణాలతో సంఘాలను ఆర్థికంగా నిలబెడుతున్నాం. మూడు వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులుగా చేస్తాం. దీని కోసం జిల్లా, మండల, గ్రామస్థాయి సమాఖ్యలను ఎంపిక చేయాలి. వ్యవసాయంలో వడ్లు మాత్రమే కాదు.. కందులు, మినుములు, పెసలు, ఇతర పప్పుధాన్యాల పంటలు వేయాలి. కూరగాయలు, పండ్ల తోటలు పెట్టాలి. ఈ దిశగా రైతులను మహిళాసంఘాలే కార్యోన్ముఖులను చేయాలి. మీరే రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని మంచి చీరలు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన చీరలను ఎవరూ కట్టుకోలేదు. మేం అందరూ మెచ్చే చిలకపచ్చరంగు చీరలను కోటి మంది మహిళలకు ఇవ్వబోతున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తాను. మీరు వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వాటికి పెట్టుబడులు ఇస్తాం. పరిపాలనలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాం. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మీ పేరు మీద ఇచ్చాం. త్వరలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం’’ అని సీఎం తెలిపారు.
ఈసందర్భంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.500 కోట్లు, మహిళా సమాఖ్యలకు 553 బస్సుల అద్దె ఛార్జీల కింద రూ.20.34 కోట్ల చెక్కును సీఎం ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు రూ.10,700 కోట్లు ఆదా అయ్యిందన్న అంశానికి ప్రతీకగా.. ఆ మొత్తంతో కూడిన చెక్కును ప్రదర్శించారు. ‘మహిళాప్రగతి’ మాసపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మహిళా సంఘాలు ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న 553 బస్సులను.. సభ ప్రారంభానికి ముందు పరేడ్ మైదానంలో సీఎం రేవంత్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆ వెంటనే వర్షం ప్రారంభమైంది. అక్కడి నుంచి వర్షంలోనే సీఎం, మంత్రులు బస్సు ఎక్కి సభా ప్రాంగణం వద్దకు వచ్చారు. బస్సు నుంచి కిందికి దిగిన తర్వాత వర్షం పెరగడంతో వారు తడుస్తూనే లోపలికి వచ్చారు. ఈ అంశాన్ని సీఎం సభలో ప్రస్త్రావిస్తూ ‘‘ఎల్‌నినో ఉందని, వానలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. కానీ మనం 553 బస్సులను ప్రారంభించుకోగానే వరుణదేవుడు కరుణించాడు. ఆయన మహిళా సంఘాలతో కలిసి ఆనందం పంచుకున్నారు’’ అని సీఎం చమత్కరించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమే కాకుండా.. బస్సులకు యజమానులను చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మహిళా సంఘాల్లో 12-14 లక్షల మంది నిరక్షరాస్యులున్నారని గుర్తించి చదువులు చెప్పిస్తున్నాం. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఉంటే.. భారాస నాయకులు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారాస ప్రభుత్వం మహిళా సమాఖ్యలను పూర్తిగా విస్మరించింది. అప్పట్లో వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షలు మాత్రమే. వాటిని రూ.10 లక్షలకు పెంచాం. గత ప్రభుత్వంలో రూ.4 వేల కోట్ల వడ్డీ సొమ్ము మహిళలకు ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాం.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి వరుణుడు కూడా మద్దతుగా నిలిచాడు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. అతివల కోసం వడ్డీ లేని రుణాలను ప్రవేశపెడితే ఆ తర్వాత వచ్చిన భారాస సర్కారు పదేళ్లు మహిళా సంఘాలను పూర్తిగా విస్మరించింది.
రాష్ట్రంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో 553 బస్సులకు మహిళలను యజమానులుగా చేశాం. ఆయా బస్సులను ఆర్టీసీ తీసుకుని సమాఖ్యలకు నెలవారీగా అద్దె చెల్లిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ముందుకు పోతున్నాం. ఈ బస్సుల అందజేత కార్యక్రమం చరిత్రాత్మకమైనది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. అనేక రంగాల్లో ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 04:37 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘పెద్దవాగు’పై చిన్నచూపు తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలు చిన్నచూపు చూస్తున్నాయి.
- ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లండి! మీనాక్షి నటరాజన్‌పై నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
- ఐసెట్‌లో 46,654 మంది పాస్ ఐసెట్‌లో 91.22 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 56,206 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 51,146 మంది పరీక్ష రాశారు.
- ఈ బడుల్ని ఎప్పుడు బాగుచేస్తారు? సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి ఇది. ఏళ్ల కిందట నిర్మించిన భవనం గోడలు నెర్రెలిచ్చాయి.
- చిన్నారికి అరుదైన వ్యాధి.. ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా జన్యుపరమైన ఎస్‌ఎంఏ టైప్-2 అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆర్యాన్ష్ చికిత్సకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
- పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయం పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తేల్చి చెప్పింది.
- ఆదాయపు పన్ను నోటీసుల కొట్టివేత మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271డి కింద ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
- గ్రేడ్-2 ఈవోలకు గ్రేడ్-1గా పదోన్నతులు దేవాదాయ శాఖలో గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులు(ఈవో)గా పనిచేస్తున్న 26 మందికి గ్రేడ్-1 ఈవోలుగా పదోన్నతి కల్పించారు.
- వ్యవసాయ అంకురాలకు ప్రోత్సాహం వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి బయోనెస్ట్ కో ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్)లో మూడు సంస్థలు మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
- ‘ఆత్మనిర్భరత’తోనే దేశానికి రక్షణ ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడటం ప్రమాదకరమని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు నిరూపించాయని భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్ అన్నారు.
- ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
- సింగరేణిలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు సింగరేణిలో కారుణ్య నియామకాలకు అర్హత సాధించిన 335 మందికి శనివారం మంచిర్యాలలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
- ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఓట్లతోపాటు సీట్లనూ కేంద్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని, అందులో భాగమే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
- సమ్మక్క బ్యారేజీకి ఎన్వోసీ ఇవ్వండి గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ అనుమతుల సాధనలో మరో ముందడుగు పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
- వచ్చే మార్చి నాటికి బీబీనగర్ ఎయిమ్స్ అందుబాటులోకి.. బీబీనగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రిని వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు.
- అటు వానలు.. ఇటు వడగాలులు రాష్ట్రంలో ఒకవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా...ఇంకోవైపు వేడిగాలులు భయపెడుతున్నాయి. 16 జిల్లాల పరిధి 63 మండలాల్లో శుక్రవారం వడగాలులు వీచాయి.
- ప్రియాంక గాంధీని కలిసిన మహేశ్‌కుమార్‌గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు.
- పశువుల కొట్టాలుగా రెండు పడకల ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలు చాలాచోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి.
- రహదారుణాలు రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్ల్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) తాజా నివేదిక స్పష్టం చేసింది.
- కమీషన్ల కోసమే సౌర విద్యుత్ ప్రాజెక్టులు సింగరేణిలో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పనులు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల కమీషన్ల కోసమే చేపట్టారని శాసనసభలో భారాస పక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.