పాక్ బాంబుల వర్షం.. నిద్రలోనే 11 మంది చిన్నారుల మృతి

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. అర్ధరాత్రి వేళ.. అఫ్గాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై పాక్ బాంబులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు నిద్రలోనే కన్నుమూశారు.
మంగళవారం అర్ధరాత్రి దాటాక ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్‌లలోని పౌర నివాసాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అఫ్గాన్ ( Afghanistan) ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. సెర్పా జిల్లాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలోనే 9 మంది చనిపోయారని, మరో 10 మంది గాయపడ్డారని ఖోస్ట్ ప్రావిన్స్‌కు చెందిన అధికారి తెలిపారు. పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాలో జరిగిన మరో దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా చిన్నారులేనని స్థానికులు తెలిపారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడులు జరగడంతో.. వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దాడి ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులతో సహా ఓ మహిళ, ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడగా.. వారిలో అనేకమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. మృతి చెందిన చిన్నారుల ఫొటోలను జబిహుల్లా ఎక్స్‌లో పంచుకున్నారు. కాగా.. ఈ దాడుల విషయంపై పాక్ ( Pakistan) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
- రణరంగంగా పశ్చిమాసియా.. అమెరికా- ఇరాన్ మధ్య భీకర దాడులు
అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ సెక్యూరిటీ పోస్టుపై ఇటీవల దాడి జరిగింది. తాలిబన్ మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లు పాక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేయడం గమనార్హం.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 09:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ 10% సుంకాల వసూలు కొనసాగించొచ్చు.. ట్రంప్‌నకు భారీ ఊరట Trump tariffs: ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10 శాతం గ్లోబల్ సుంకాలను వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది.
- అణ్వాయుధాలపై ఇరాన్ రాజీ.. త్వరలో యూరప్‌లో సంతకాలు: ట్రంప్ Donald Trump: అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
- ఇరాన్‌పై దాడుల విరమణ ఇరాన్‌పై తాజా దాడుల్ని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
- ముగ్గురు భారతీయుల్ని బలిగొన్న అమెరికా అమెరికా దుందుడుకుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు.
- మధ్యవర్తిత్వమంటే భారత్‌లో అందరికీ తెలుసు మధ్యవర్తిత్వమంటే భారత్‌లో అందరికీ తెలుసునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వాన్ని భారత న్యాయవ్యవస్థ ఓ పటిష్ఠమైన వివాద పరిష్కార యంత్రాంగంగా తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు.
- భారీగా పెరిగిన తీరప్రాంత వరదలు ఒకప్పుడు అతి అరుదుగా సంభవించే తీర ప్రాంత వరదలు కేవలం మనుషుల కార్యకలాపాల వలన జరిగిన పర్యావరణ విధ్వంసం కారణంగా ప్రస్తుతం విరివిగా ఏర్పడుతున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.
- న్యూట్రినోలకు రూపాలు మార్చుకొనే స్వభావం అదృశ్య పరమాణువులుగా పేర్కొనే న్యూట్రినోలకు రూపం మార్చుకొనే స్వభావం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
- గాడ్జిలా ఎల్‌నినో వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న ఎల్‌నినోపై అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (నోవా) తాజా సమాచారాన్ని అందించింది.
- అఫ్గాన్‌పై పాక్ వాయు దాడుల్లో మృతులు పౌరులే: ఐరాస బృందం అఫ్గానిస్థాన్ తూర్పు ప్రాంతంపై పాకిస్థాన్ జరిపిన వాయు దాడుల్లో మృతిచెందిన 13 మంది పౌరులేనని, మరో 10 మంది గాయపడినట్లు తాము ధ్రువీకరించి నమోదు చేసినట్లు ఐక్యరాజ్య సమితి సహాయక బృందం (యూఎన్‌ఏఎంఏ) గురువారం వెల్లడించింది.
- పిల్లల ‘ఆన్‌లైన్’ రక్షణకు కెనడాలో సోషల్ మీడియా బిల్లు పిల్లలపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాన్ని నిరోధించి ‘ఆన్‌లైన్’ రక్షణ కల్పించే ‘‘సేఫ్ సోషల్ మీడియా యాక్ట్’’ బిల్లును కెనడా ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.
- సంక్షిప్త వార్తలు (5) తన శాఖ బడ్జెట్టును పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో కినుక వహించిన బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హేలీ అనూహ్యంగా గురువారం రాజీనామా చేశారు.
- ఇరాన్‌పై దాడులను విరమించుకున్న ట్రంప్ ఇరాన్‌పై దాడులను విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి చర్చలకు ఇరాన్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
- పెంటగాన్‌లో ‘లాక్‌డౌన్’.. ఏం జరిగిందంటే! అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
- ఈ రాత్రికి భీకర దాడులు చేస్తాం - ట్రంప్ ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
- రెండుగా చీలిపోనున్న ఆఫ్రికా! ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోనుందా? భూగర్భంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆఫ్రికాలోని సరిహద్దుల్ని మార్చేయనున్నాయా?... అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.
- నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి: ధ్రువీకరించిన కేంద్ర మంత్రి Indian Sailors: వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
- హర్మూజ్‌లో చమురు రవాణాకు ‘సీక్రెట్ మిషన్’.. ట్రంప్ వెల్లడి Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రంగా మారాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- ‘లెక్కలు బాగున్నాయి.. ఐ లవ్ ద్రవ్యోల్బణం’: ట్రంప్ వ్యాఖ్యలు Donald Trump: ద్రవ్యోల్బణం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- అన్నంత పని చేసిన ట్రంప్.. ఇరాన్‌పై అమెరికా సైన్యం మళ్లీ భీకర దాడులు పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది.
- యుద్ధం.. మళ్లీ తీవ్రం భయపడినట్లే జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా బుధవారం ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది.