పంత్ విచిత్రమైన షాట్లతో కొన్నిసార్లు భారత్‌కు నష్టం: అశ్విన్

Eenadu icon
By Sports News Team Published : 10 Jun 2026 10:54 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమ్ఇండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు సాధించారు. రిషభ్‌ పంత్ (81), సాయి సుదర్శన్ (81), వాషింగ్టన్ సుందర్ (52*) హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు. శతకం చేసే అవకాశం సుదర్శన్‌తోపాటు రిషభ్ పంత్‌ చేజార్చుకున్నాడు. అయితే, రిషభ్‌ పంత్ ఇలా 80లు, 90ల్లో ఔట్ కావడం ఇదేమీ కొత్త కాదు. భిన్నమైన షాట్లు ఆడి మరీ వికెట్‌ను సమర్పించిన రోజులున్నాయి. దీనివల్ల టీమ్‌ఇండియాకు కొన్నిసార్లు నష్టం వాటిల్లినట్లు మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 50 టెస్టులు ఆడిన పంత్ ఖాతాలో 8 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. మరో ఎనిమిదిసార్లు శతకాలు చేసే అవకాశం కాస్తలో చేజార్చుకున్నాడు. 

  • అలా వచ్చాడు.. ఇలా తిప్పాడు

‘‘రిషభ్‌ పంత్ చాలాసార్లు 80లు, 90ల వద్ద ఔటయ్యాడు. అయితే, ఇలాంటి దూకుడైన బ్యాటర్‌ టెస్టుల్లో దొరకడం కష్టమే. కానీ, 80ల్లోకి వచ్చాక భిన్నమైన షాట్లను ప్రయత్నించి పెవిలియన్‌కు చేరడం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరో 20 పరుగులు చేస్తే సెంచరీ అయిపోతుంది. అలా ఆడేందుకు ప్రయత్నించలేడా? విచిత్రమైన షాట్లతో భారత్‌కు కొన్నిసార్లు నష్టం కలిగించాడు. బ్యాటర్‌గా అతడు అదనపు బాధ్యత తీసుకోవాలి. సెంచరీలుగా మలచాలి. అప్పుడు అతడి గణాంకాలు ఇప్పటికంటే అద్భుతంగా ఉండేవి’’ అని అశ్విన్ తెలిపాడు. 

పరిస్థితులకు తగ్గట్టుగా..

‘‘ప్రతి బ్యాటరూ పొరపాట్లు చేయడం సహజమే. కానీ, రిషభ్ పంత్ పదేపదే అవే తప్పులను చేస్తుండటమే నిరాశకు గురి చేస్తోంది. అది తప్పు అని చాలామంది చెప్పినా సరే.. మళ్లీ చేస్తూనే వెళ్తున్నాడు. ఇప్పటికే 50 టెస్టులు ఆడాడు. ఇకనైనా జట్టు కోసం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది’’ అని అశ్విన్ సూచించాడు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్‌ కార్డులు.. అతడే అసలైన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి తమ జట్టును గెలిపించడం చూస్తుంటాం. కానీ, మ్యాచ్‌ రిఫరీ కూడా తనదైన శైలి నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు.
  • సంబరం ఆరంభం మెక్సికోలో గురువారం ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆరంభ వేడుకల్లో భాగంగా ట్రోఫీ విగ్రహాన్ని ప్రదర్శించారిలా..  మధ్యలో బంగారు వర్ణంలో మెరిసిపోయిన పెద్ద ప్రపంచకప్‌... చుట్టూ బంతులతో ప్రదర్శనకారులు.. గిరిజన వస్త్రధారణతో ఇంకొందరు.. ఆపై పాప్‌ సింగర్లు ఆటాపాటా!
  • అమ్మాయ్‌.. అదిగో ఇంకో కప్పు! మహిళల క్రికెట్లో భారత్‌ ఎంత మెరుగుపడుతున్నా సరే.. ప్రపంచకప్‌ వస్తోందంటే మన జట్టును ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించడానికి సందేహమే! గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను దాటి భారత్‌ టైటిల్‌ గెలుస్తుందని నమ్మినవాళ్లు తక్కువమందే.
  • భారత జట్టులో ‘ఈ’ ఛాంపియన్స్‌ ఆటగాడు శ్రీలంకతో సిరీస్‌లో ఆడే భారత అండర్‌-19 వన్డే జట్టులో హైదరాబాద్‌ ‘ఈ’ ఛాంపియన్స్‌ ఆటగాడు ఊట్కూరు యశ్వీర్‌ గౌడ్‌కు చోటు దక్కింది.
  • మహిళల జట్టులో దీక్ష గుంటూరుకు చెందిన కాట్రగడ్డ దీక్ష అండర్‌-19 భారత మహిళల టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. వికెట్‌ కీపర్, ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన దీక్షను శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.
  • వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సవరణల్లో భాగంగా టీమ్‌ఇండియా (118) ఒక పాయింట్‌ కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.
  • ఆస్ట్రేలియా టీ20 జట్టులో నిఖిల్‌ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు చెందిన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ నిఖిల్‌ చౌదరి చోటు దక్కించుకున్నాడు. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఆడబోతున్న తొలి భారత పురుష క్రికెటర్‌ నిఖిలే.
  • ఆసీస్‌పై బంగ్లా తొలిసారి బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. గురువారం వర్ష ప్రభావిత రెండో వన్డేలో బంగ్లా 5 వికెట్లతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలివుండగానే ఆతిథ్య జట్టు 2-0తో దక్కించుకుంది.
  • అఫ్గాన్‌ చేతిలో భారత్‌ ఓటమి ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌-ఎకు తొలి దెబ్బ! తిలక్‌ బృందం 4 పరుగుల (డ/లూ) తేడాతో అఫ్గానిస్థాన్‌-ఎ చేతిలో పరాజయం చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌కు 49 ఓవర్లుగా కుదించగా.. మొదట భారత్‌ 9 వికెట్లకు 349 పరుగులు చేసింది.
  • సంక్షిప్త వార్తలు స్టార్‌ షూటర్లు మను బాకర్, ఇషా సింగ్‌ ఆసియా క్రీడల్లో రెండు ఈవెంట్లలో తలపడనున్నారు. సెప్టెంబరులో జపాన్‌లో జరగబోయే ఆసియా క్రీడల్లో బరిలో దిగబోయే 30 మంది సభ్యులతో కూడిన జట్టును భారత జాతీయ రైఫిల్‌ సంఘం గురువారం ప్రకటించింది.
  • బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం కోట్లాది మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న సాకర్‌ సంరంభం ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
  • అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్‌ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్‌ సింగర్‌ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.
  • చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. ఆసీస్‌ను ఓడించి వన్డే సిరీస్‌ కైవసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ టీమ్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గింది.
  • అండర్‌ 19 స్క్వాడ్‌లో ద్రవిడ్‌ కొడుకు భారత క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ అండర్‌ 19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
  • భారత్‌-ఎ జట్టుకి గుంటూరు కుర్రోడు ఎంపిక గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్-ఎ జట్టులో స్థానం సంపాదించాడు.
  • ముక్కోణపు సిరీస్‌.. భారత్‌-ఎపై అఫ్గాన్‌-ఎ విజయం ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఎతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌-ఎ జట్టు గెలిచింది.
  • ఆ జట్టుదే ఫిఫా వరల్డ్ కప్‌.. మెషిన్ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ ఏం చెప్పిందంటే? ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ కోసం 48 జట్లు బరిలోకి దిగాయి. ఒకరికే టైటిల్ వస్తుంది. ఆ జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కనుంది.
  • ఐదుగురు మహిళా డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ల వ్యక్తిగత ఫొటోలు లీక్‌ మహిళల ప్రైవసీ విషయంలో ఆన్‌లైన్‌పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఐదుగురి రెజ్లర్ల ప్రైవేట్ ఫొటోలు నెట్టింట లీక్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.
  • చెలరేగిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్‌ A లక్ష్యం 350 పరుగులు భారత్‌ A జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు. అఫ్గాన్‌ జట్టుకు భారీ లక్ష్యం నిర్దేశించారు.
  • మా ఆయనకు కోచ్‌గా ప్రమోషన్‌ ఇచ్చా: పీవీ సింధు పోస్టు పీవీ సింధు భర్త దత్త సాయి కాసేపు కోచ్‌గా మారిపోయారు. దానికి కారణం ఏంటో సింధు తన పోస్టులో తెలియజేసింది.