అఫ్గాన్‌తో వన్డే సిరీస్.. విరాట్ బాటలోనే హార్దిక్ పాండ్య!

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి బాటలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా సిరీస్ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, పాండ్య ఫిట్‌నెస్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంతృప్తి వ్యక్తంచేసిన రోజు వ్యవధిలోనే ఈ నిర్ణయం రానుండటం గమనార్హం.
- పంత్ విచిత్రమైన షాట్లతో కొన్నిసార్లు భారత్‌కు నష్టం: అశ్విన్
వెన్ను నొప్పితో ఐపీఎల్‌లోనూ హార్దిక్ పాండ్య కొన్ని మ్యాచులు ఆడలేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. రోహిత్‌తోపాటు హార్దిక్ కూడా ఫిట్‌నెస్ టెస్టు ఎదుర్కొన్నాడు. అంతా ఓకే అనుకున్నాక.. ఇప్పుడు తొడ కండరాల గాయంతో మూడు వారాలు ఆటకు దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. మరి అతడి స్థానంలో ఎవరిని రిప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీ కోసం సన్నద్ధతలో భాగంగా భారత్ కేవలం తొమ్మిది మ్యాచులు మాత్రమే ఆడనుంది.
అఫ్గాన్‌తో వన్డే సిరీస్..
- జూన్ 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే
- జూన్ 17న లఖ్‌నవూ వేదికగా రెండో వన్డే
- జూన్ 20న చెన్నై వేదికగా మూడో వన్డే
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డులు.. అతడే అసలైన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి తమ జట్టును గెలిపించడం చూస్తుంటాం. కానీ, మ్యాచ్ రిఫరీ కూడా తనదైన శైలి నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు.
- సంబరం ఆరంభం మెక్సికోలో గురువారం ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆరంభ వేడుకల్లో భాగంగా ట్రోఫీ విగ్రహాన్ని ప్రదర్శించారిలా.. మధ్యలో బంగారు వర్ణంలో మెరిసిపోయిన పెద్ద ప్రపంచకప్... చుట్టూ బంతులతో ప్రదర్శనకారులు.. గిరిజన వస్త్రధారణతో ఇంకొందరు.. ఆపై పాప్ సింగర్లు ఆటాపాటా!
- అమ్మాయ్.. అదిగో ఇంకో కప్పు! మహిళల క్రికెట్లో భారత్ ఎంత మెరుగుపడుతున్నా సరే.. ప్రపంచకప్ వస్తోందంటే మన జట్టును ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించడానికి సందేహమే! గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను దాటి భారత్ టైటిల్ గెలుస్తుందని నమ్మినవాళ్లు తక్కువమందే.
- భారత జట్టులో ‘ఈ’ ఛాంపియన్స్ ఆటగాడు శ్రీలంకతో సిరీస్‌లో ఆడే భారత అండర్-19 వన్డే జట్టులో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ ఆటగాడు ఊట్కూరు యశ్వీర్ గౌడ్‌కు చోటు దక్కింది.
- మహిళల జట్టులో దీక్ష గుంటూరుకు చెందిన కాట్రగడ్డ దీక్ష అండర్-19 భారత మహిళల టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ అయిన దీక్షను శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.
- వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సవరణల్లో భాగంగా టీమ్‌ఇండియా (118) ఒక పాయింట్ కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.
- ఆస్ట్రేలియా టీ20 జట్టులో నిఖిల్ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు చెందిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి చోటు దక్కించుకున్నాడు. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఆడబోతున్న తొలి భారత పురుష క్రికెటర్ నిఖిలే.
- ఆసీస్‌పై బంగ్లా తొలిసారి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. గురువారం వర్ష ప్రభావిత రెండో వన్డేలో బంగ్లా 5 వికెట్లతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే ఆతిథ్య జట్టు 2-0తో దక్కించుకుంది.
- అఫ్గాన్ చేతిలో భారత్ ఓటమి ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎకు తొలి దెబ్బ! తిలక్ బృందం 4 పరుగుల (డ/లూ) తేడాతో అఫ్గానిస్థాన్-ఎ చేతిలో పరాజయం చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌కు 49 ఓవర్లుగా కుదించగా.. మొదట భారత్ 9 వికెట్లకు 349 పరుగులు చేసింది.
- సంక్షిప్త వార్తలు స్టార్ షూటర్లు మను బాకర్, ఇషా సింగ్ ఆసియా క్రీడల్లో రెండు ఈవెంట్లలో తలపడనున్నారు. సెప్టెంబరులో జపాన్‌లో జరగబోయే ఆసియా క్రీడల్లో బరిలో దిగబోయే 30 మంది సభ్యులతో కూడిన జట్టును భారత జాతీయ రైఫిల్ సంఘం గురువారం ప్రకటించింది.
- బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం కోట్లాది మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న సాకర్ సంరంభం ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
- అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్ సింగర్ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.
- చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఆసీస్‌ను ఓడించి వన్డే సిరీస్ కైవసం బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గింది.
- అండర్ 19 స్క్వాడ్‌లో ద్రవిడ్ కొడుకు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
- భారత్-ఎ జట్టుకి గుంటూరు కుర్రోడు ఎంపిక గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్-ఎ జట్టులో స్థానం సంపాదించాడు.
- ముక్కోణపు సిరీస్.. భారత్-ఎపై అఫ్గాన్-ఎ విజయం ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-ఎతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు గెలిచింది.
- ఆ జట్టుదే ఫిఫా వరల్డ్ కప్.. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ఏం చెప్పిందంటే? ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం 48 జట్లు బరిలోకి దిగాయి. ఒకరికే టైటిల్ వస్తుంది. ఆ జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కనుంది.
- ఐదుగురు మహిళా డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ల వ్యక్తిగత ఫొటోలు లీక్ మహిళల ప్రైవసీ విషయంలో ఆన్‌లైన్‌పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఐదుగురి రెజ్లర్ల ప్రైవేట్ ఫొటోలు నెట్టింట లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది.
- చెలరేగిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్ A లక్ష్యం 350 పరుగులు భారత్ A జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు. అఫ్గాన్ జట్టుకు భారీ లక్ష్యం నిర్దేశించారు.
- మా ఆయనకు కోచ్‌గా ప్రమోషన్ ఇచ్చా: పీవీ సింధు పోస్టు పీవీ సింధు భర్త దత్త సాయి కాసేపు కోచ్‌గా మారిపోయారు. దానికి కారణం ఏంటో సింధు తన పోస్టులో తెలియజేసింది.