మమతకు షాక్‌.. మరో ఎంపీ రాజీనామా.. ఆ వెంటనే హిమంతతో భేటీ

Eenadu icon
By National News Team Updated : 10 Jun 2026 12:58 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే మమతకు నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్‌రాయ్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

అస్సాం కాంగ్రెస్‌ సీనియర్ నేత సంతోష్‌ మోహన్‌దేవ్ కుమార్తె సుష్మితా దేవ్‌ (Sushmita Dev). గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. 2019లో ఓటమి తర్వాత ఆ పార్టీని వీడి.. 2021లో టీఎంసీ (TMC)లో చేరారు. టీఎంసీలో అతికొద్దికాలంలోనే ఉన్నత పదవులు అందుకున్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పొందారు. బుధవారం తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌కు ఆమె లేఖ రాశారు. తక్షణమే దీన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా ప్రకటించిన వెంటనే కీలక పరిణామం చోటుచేసుకుంది. సుష్మిత దిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ను కలిశారు. దీంతో ఆమె భాజపాలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 12:41 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆ తృణమూల్‌ నేతకు బంగ్లాదేశ్‌ అతివాద సంస్థలతో సంబంధాలు: రెబల్‌ ఎంపీ తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబల్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ ఆ పార్టీ మాజీ ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు.
  • టిండర్‌ యాప్‌లో హనీట్రాప్‌.. రూ.లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయమూర్తి Honeytrap: హనీట్రాప్‌లో పడి.. ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. 
  • కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్‌ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
  • వరుస అగ్నిప్రమాదాలు.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం Delhi: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో తక్కువ ఎత్తున్న నివాస భవనాలలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా చట్టాలను తేవాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 
  • పెట్రోల్‌ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్‌ Petrol: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • మా ఆవిడ కుట్లు, అల్లికలతో రూ.కోట్లు సంపాదించింది మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసులు జరిపిన సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
  • అనిశ్చితిలోనూ పరుగు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్నా అభివృద్ధి పథంలో భారత్‌ దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
  • ఇక్కడ పిటిషన్‌.. అక్కడ ఏకగ్రీవం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు గురువారం కీలకమలుపు తిరిగాయి. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • అభిషేక్‌ వల్లే పార్టీ సర్వనాశనం తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
  • ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు.
  • గృహిణులు జాతి నిర్మాతలు కుటుంబానికే పరిమితమైనట్లుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికీ ఎంతగానో దోహదపడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • మణిపుర్‌లో ఆగని హింసాకాండ మణిపుర్‌లో గిరిజన తెగల మధ్య హింస ఆరని కుంపటిలా రగులుతోంది.
  • నౌకలో చిక్కుకున్న క్షిపణి వార్‌హెడ్‌ వెలికితీత ముడిచమురు రవాణా నౌకలో పేలని స్థితిలో ఉన్న క్షిపణి వార్‌హెడ్‌ను భారత నౌకాదళం విజయవంతంగా వెలికితీసి, సురక్షితంగా నిర్వీర్యం చేసింది.
  • విద్యుత్తు కోసం ప్రధానికి 48 గ్రామాల రుధిర లేఖలు ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతీ - సీతానదీ పులుల అభయారణ్యం పరిధిలో గల 48 గ్రామాల ప్రజలు లైన్లు లాగి విద్యుత్తు సదుపాయం కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 700కు పైగా లేఖలను రక్తంతో రాసి, స్పీడ్‌పోస్టులో పంపారు.
  • కలిసిన మనసుల ‘ఇష్టపది..’ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల చేయూతతో యువ దివ్యాంగులకు ఓ జీవనమార్గం దొరికినా.. ఆ దారిలో కడదాకా నడిచేందుకు కుటుంబ మద్దతు ఎంతో అవసరం.
  • సీబీఎస్‌ఈ లోపాలు బయటపెట్టిన నిసర్గను ఇంజినీర్‌గా నియమించుకున్న ఐఐటీ కాన్పూర్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) మూల్యాంకన ప్రక్రియలో లోపాల్ని బయటపెట్టిన నిసర్గ అధికారి(19)ని ఐఐటీ కాన్పుర్‌ విధుల్లో నియమించుకుంది.
  • దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీక్‌లవంటి సమస్యలపై దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.
  • చిన్నారుల మానసిక పరీక్షకు ఆషామాషీగా అనుమతివ్వరాదు భార్యాభర్తల వివాదాల కేసుల్లో వారి పిల్లలను కేవలం సాక్ష్యాధార వస్తువులుగా పరిగణించరాదని, ఆషామాషీగా వారి మానసిక పరీక్షకు ఆదేశించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • 90 నిమిషాలు ఇలా చేసి చూడండి ఒక ముఖ్యమైన పనిని ఎంచుకోండి. దానికి  90 నిమిషాల సమయాన్ని కేటాయించండి.
  • ఇటు నిఫా.. అటు షిగెల్లా ఒకపక్క నిఫా, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కేసులు కేరళలో పెరుగుతున్నాయి.