పాలనలో మోదీ రికార్డ్‌.. రాష్ట్రపతి అభినందనలు

Eenadu icon
By National News Team Updated : 10 Jun 2026 19:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధానమంత్రిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడారు. ఆయన పాలనలో దేశం అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం చేపట్టిన విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా అభివృద్ధి ప్రయోజనాలు సమానంగా అందించేలా చేశాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పీఎం-జన్‌మాన్‌, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్‌ (ఆదివాసీల కోసం ఏర్పాటుచేసిన పథకాలు)లకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ముర్ము వెల్లడించారు. 

మోదీ స్ఫూర్తిదాయక ప్రస్థానం భావితరాల్లో భారతదేశపు బలమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ఆశను.. నూతన విశ్వాసాన్ని నింపుతుందని రాష్ట్రపతి కొనియాడారు. ఆత్మనిర్భర్, వికసిత్‌ భారత్ దార్శనికతతో ప్రధాని దేశాన్ని మరింత ముందుకుతీసుకువెళ్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. 

  • సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష.. 12 ఏళ్ల పాలనపై మోదీ ఆసక్తికర పోస్టు

మోదీ రికార్డు..

ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును నేటితో మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి పదవిలో (వరుసగా మూడోసారి) కొనసాగుతున్నారు. బుధవారం (నేడు)తో ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు వరుసగా 4,398 రోజులు పని చేశారు. ఎన్నికైన తర్వాత వరుసగా అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన వారి జాబితాలో ఇందిరాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పదవిలో ఉన్నారు. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 13:04 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఎల్‌నినోపై వాతావరణ విభాగం హెచ్చరిక భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితలంపై ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 
  • ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది: రామ్మోహన్‌ నాయుడు ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి ఏడాది అయిన వేళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌ వేదికగా స్పందించారు. 
  • రూ.11.82కోట్ల గంజాయి స్మగ్లింగ్.. ఎయిర్‌పోర్టులో చిక్కిన మోడల్‌ కేరళకు చెందిన 28 ఏళ్ల హర్ష సన్నీ స్మగ్లింగ్ కేసులో జైలు పాలైంది. 
  • అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్‌ సమన్లు అమెరికా దౌత్యవేత్త జేసన్‌ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
  • 132 అడుగుల మొబైల్‌ టవర్‌ మాయం! బిహార్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. బక్సర్‌ జిల్లాలో ఏకంగా ఓ భారీ మొబైల్‌ టవర్‌తోపాటు జనరేటర్‌ కూడా మాయమైంది.
  • ప్రాణాలతో బతికున్నా కానీ..: ఎయిరిండియా మృత్యుంజయుడి ఆవేదన Air India crash: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటనలో బయటపడిన విశ్వాస్ మీడియాతో మాట్లాడారు. 
  • మీనాక్షి నటరాజన్‌కు ‘సుప్రీం’ షాక్‌.. నామినేషన్‌ తిరస్కరణపై పిటిషన్‌ కొట్టివేత Meenakshi Natarajan: కాంగ్రెస్‌ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 
  • టాటాలను బెంగాల్‌కు తిరిగి తీసుకొస్తాం: సువేందు అధికారి టాటాలను తిరిగి పశ్చిమబెంగాల్‌కు తీసుకువస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు.
  • మోహన్‌ భాగవత్‌ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్టు Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
  • ఆ తృణమూల్‌ నేతకు బంగ్లాదేశ్‌ అతివాద సంస్థలతో సంబంధాలు: రెబల్‌ ఎంపీ తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబల్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ ఆ పార్టీ మాజీ ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు.
  • టిండర్‌ యాప్‌లో హనీట్రాప్‌.. రూ.లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయమూర్తి Honeytrap: హనీట్రాప్‌లో పడి.. ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. 
  • కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్‌ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
  • వరుస అగ్నిప్రమాదాలు.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం Delhi: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో తక్కువ ఎత్తున్న నివాస భవనాలలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా చట్టాలను తేవాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 
  • పెట్రోల్‌ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్‌ Petrol: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • మా ఆవిడ కుట్లు, అల్లికలతో రూ.కోట్లు సంపాదించింది మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసులు జరిపిన సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
  • అనిశ్చితిలోనూ పరుగు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్నా అభివృద్ధి పథంలో భారత్‌ దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
  • ఇక్కడ పిటిషన్‌.. అక్కడ ఏకగ్రీవం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు గురువారం కీలకమలుపు తిరిగాయి. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • అభిషేక్‌ వల్లే పార్టీ సర్వనాశనం తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
  • ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు.
  • గృహిణులు జాతి నిర్మాతలు కుటుంబానికే పరిమితమైనట్లుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికీ ఎంతగానో దోహదపడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది.