మిడ్‌రేంజ్‌ యూజర్ల కోసం రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌

Eenadu icon
By Business News Team Updated : 10 Jun 2026 20:30 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Realme P4R 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒప్పో అనుబంధ సంస్థ రియల్‌మీ పీ4 సిరీస్‌లో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. పీ4ఆర్‌ 5జీ (Realme P4R 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌ కోరుకునే వారి కోసం ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 8000 ఎంఏహెచ్‌ బిగ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఈ ఫోన్‌ వస్తోంది.

రియల్‌మీ పీ4ఆర్‌ 5జీలో 6.8 అంగుళాల హెచ్‌డీ+ 144 Hz ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 1200 నిట్స్‌ పీక్‌బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌ ఇచ్చారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ కెమెరా ఇచ్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ 16తో కూడిన రియల్‌మీ యూఐ 7తో పనిచేస్తుంది. 2 ఏళ్లు ఓఎస్‌ అప్‌డేట్స్‌, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. ఐపీ 65 రేటింగ్‌, ఏఐ పల్స్‌ లైట్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో మూడు రోజుల పాటు ఫోన్‌ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో పాటు 27W రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది.

ఇక ధర విషయానినికొస్తే.. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా నిర్ణయించారు. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.20,999, 6జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ పేర్కొంది. కార్డు ఆఫర్‌తో రూ.2 వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. జూన్‌ 17 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. సిల్వర్‌ గ్లేర్‌, టైటానియం గ్లేర్‌, లావెండర్‌ గ్లేర్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ ఇండియా స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 13:31 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆఫర్ల సంగతి మరిచిపోండి.. స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత పెరుగుతాయ్‌! Nothing CEO on smartphone price: స్మార్ట్‌ఫోన్‌ ధరలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు నథింగ్‌ కంపెనీ సీఈఓ కార్ల్‌ పై. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
  • ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌.. మరింత కాస్ట్‌లీ! iphone 18 pro max: యాపిల్‌ తయారు చేసే ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. కొత్త ఐఫోన్‌ వస్తుందంటే చాలు కొన్ని రోజుల ముందే ఆరా తీస్తుంటారు. 
  • యాపిల్‌ ఐఓఎస్‌ 27 ఈ ఫోన్లకే.. ఈ జాబితాలో మీ ఐఫోన్‌ ఉందా? Apple iOS 27: టెక్‌ దిగ్గజం యాపిల్‌ సరికొత్త ఓఎస్‌ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ప్రస్తుతమున్న ఓఎస్‌లో పలు మార్పులు చేయడంతో పాటు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ ఐఓఎస్‌ 27ను తీసుకొస్తోంది.
  • షావోమీ నుంచి మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌.. 17T విశేషాలు ఇవే Xiaomi 17T: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీ 17T (Xiaomi 17T) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
  • 6500 mAh బ్యాటరీ, 50MP కెమెరాతో మోటోరొలా ఎడ్జ్‌ 70 ప్రో+ Motorola Edge 70 Pro+: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) ఎడ్జ్‌ 70 ప్రో+ (Motorola Edge 70 Pro+) విడుదల చేసింది.
  • ప్రైమ్‌ యూజర్లకు షాక్‌.. అమెజాన్‌ మ్యూజిక్‌లో ఇక యాడ్స్‌ Amazon Music: ప్రైమ్‌ యూజర్లకు అమెజాన్‌ షాకిచ్చింది. ఇన్నాళ్లు వీరికి ఉచితంగా లభిస్తున్న అమెజాన్‌ మ్యూజిక్‌లో ఇకపై అడ్వర్టైజ్‌మెంట్లు రానున్నాయి.
  • చిన్న స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? బెస్ట్‌ ఆప్షన్లు ఇవే.. చిన్న డిస్‌ప్లే, పాకెట్‌లో ఇట్టే ఇమిడిపోయేలా, చేత్తో పట్టుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని కంపెనీలు ఈ మధ్య కాలంలో విడుదల చేస్తున్నాయి.
  • జియో నుంచి సరికొత్త ప్లాన్‌.. రూ.200కే ఓటీటీ పాస్ JIO OTT pass: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో (JIO) సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే యూజర్లే లక్ష్యంగా జియో ఓటీటీ పాస్‌ను (JIO OTT pass) తీసుకొచ్చింది.
  • మరోసారి స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెంచేసిన రెడ్‌మీ మెమొరీ చిప్‌లు కొరత, విడిభాగాల తయారీ ఖర్చు పెరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి.
  • ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు.. అల్ట్రా రూ.లక్షన్నర పైనే! చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 9 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.
  • ఎంట్రీ లెవల్‌లో మోటో G37, మోటో G37 పవర్‌ స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) తన జీ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది.
  • స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెంచేసిన రియల్‌మీ చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచేసింది.
  • ఇన్‌స్టాగ్రామ్‌లో స్నాప్‌చాట్‌ తరహా ఫీచర్‌ మెటాకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.
  • యాపిల్‌కు పోటీగా గూగుల్‌బుక్‌ Googlebook: యాపిల్‌ మ్యాక్‌బుక్ నియోకు పోటీగా గూగుల్‌ సంస్థ గూగుల్‌బుక్‌ను పరిచయం చేసింది. 
  • స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారా? ఈ 5 చిట్కాలతో చెక్‌ పెట్టేయండి..! ఓ వైపు ట్రాయ్‌.. మరోవైపు టెలికాం కంపెనీలు.. స్పామ్‌ కాల్స్‌ చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే స్పామ్‌కాల్స్‌ అత్యధికంగా ఉండే దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉందని తాజాగా ట్రూకాలర్ సంస్థ వెల్లడించందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
  • పత్రాలు డిజిటల్‌ సంతకంతో భద్రంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీలు సర్వసాధారణం అయ్యాయి. అదే తరుణంలో మోసాలూపెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో  పంపే ముఖ్యమైన పత్రాలు ఎవరైనా మార్చేస్తే? దొంగిలిస్తే? ఆ భయం లేకుండా ఉపయోగపడేదే డిజిటల్‌ సిగ్నేచర్‌. దీని గురించి మరిన్ని  వివరాలు తెలుసుకుందాం.
  • వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ6, సీఈ6 లైట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల.. వివరాలు ఇవే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపనీ వన్‌ప్లస్‌ రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.
  • వివో ఎక్స్‌ 300 అల్ట్రా, ఎక్స్‌200 FE విడుదల.. వివరాలు ఇవే Vivo X300 series: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో దేశీయ మార్కె్ట్‌లోకి రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. వివో ఎక్స్‌ 300 సిరీస్‌లో వివో ఎక్స్‌ 300 అల్ట్రా (Vivo X300 Ultra), వివో ఎక్స్‌300 ఎఫ్‌ఈని (Vivo X300 FE) లాంచ్‌ చేసింది.
  • శాంసంగ్‌ పరిమితకాలపు ఆఫర్‌.. ఈ మోడల్‌పై ₹9వేల వరకు తగ్గింపు! Samsung price cut: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ మొబైల్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.
  • రియల్‌మీలో వన్‌ప్లస్‌ విలీనం.. యూజర్లపై ప్రభావం ఎంత? OnePlus merges with Realme: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌కు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. వన్‌ప్లస్‌ సంస్థ రియల్‌మీతో విలీనం అయినట్లు తెలుస్తోంది.