ఒక్కసారిగా కుప్పకూలిన స్పైడర్ కెమెరా.. వీడియో వైరల్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెనుప్రమాదం తప్పింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్పైడర్ కెమెరా ఒక్కసారిగా కిందపడిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హంగేరీ, కజికిస్థాన్ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో స్పైడర్ కెమెరా తీగలు తెగిపోవడంతో ఒక్కసారిగా అది కిందకు పడిపోయింది. దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడింది. ఆ పక్కనే ఓ కెమెరామెన్ ఉన్నాడు. అతడికి కాస్త దూరంలో స్పైడర్ కెమెరా పడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో మ్యాచ్ నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సరైన ఏర్పాట్లు చేయని ఫెడరేషన్‌పై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేశారు.
మరో రెండు రోజుల్లోనే..
ఫుట్‌బాల్ ప్రపంచకప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు వివాదాలతో నిరంతరం వార్తల్లో కొనసాగుతోంది. అభిమానులకు సంబంధించి వీసా వ్యవహారంలో ఫిఫా తీరుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా మైదానంలో స్పైడర్ కెమెరా కుప్పకూలడంతో.. వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. హంగేరీ, కజికిస్థాన్ ప్రపంచ కప్‌నకు అర్హత సాధించలేదు. అయితే, ప్రపంచకప్ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ ఘటన తెలియజేస్తోంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 సెమీస్‌కు పీవీ సింధు పీవీ సింధు అద్భుత ఫామ్‌తో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో దూసుకుపోతోంది.
- వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలో జాప్యం..? వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే తరుణం కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దానికి ఐర్లాండ్‌లో తలెత్తిన పరిస్థితులే కారణం.
- ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా శుభారంభం.. చెకియాపై సూపర్ విక్టరీ ఆసియా దేశం దక్షిణ కొరియా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్‌లోనే చెకియాను చిత్తు చేసింది.
- మనుబాకర్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత Coach Jaspal Rana: దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా (49) కన్నుమూశారు.
- తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డులు.. అతడే అసలైన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి తమ జట్టును గెలిపించడం చూస్తుంటాం. కానీ, మ్యాచ్ రిఫరీ కూడా తనదైన శైలి నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు.
- సంబరం ఆరంభం మెక్సికోలో గురువారం ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆరంభ వేడుకల్లో భాగంగా ట్రోఫీ విగ్రహాన్ని ప్రదర్శించారిలా.. మధ్యలో బంగారు వర్ణంలో మెరిసిపోయిన పెద్ద ప్రపంచకప్... చుట్టూ బంతులతో ప్రదర్శనకారులు.. గిరిజన వస్త్రధారణతో ఇంకొందరు.. ఆపై పాప్ సింగర్లు ఆటాపాటా!
- అమ్మాయ్.. అదిగో ఇంకో కప్పు! మహిళల క్రికెట్లో భారత్ ఎంత మెరుగుపడుతున్నా సరే.. ప్రపంచకప్ వస్తోందంటే మన జట్టును ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించడానికి సందేహమే! గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను దాటి భారత్ టైటిల్ గెలుస్తుందని నమ్మినవాళ్లు తక్కువమందే.
- భారత జట్టులో ‘ఈ’ ఛాంపియన్స్ ఆటగాడు శ్రీలంకతో సిరీస్‌లో ఆడే భారత అండర్-19 వన్డే జట్టులో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ ఆటగాడు ఊట్కూరు యశ్వీర్ గౌడ్‌కు చోటు దక్కింది.
- మహిళల జట్టులో దీక్ష గుంటూరుకు చెందిన కాట్రగడ్డ దీక్ష అండర్-19 భారత మహిళల టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ అయిన దీక్షను శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.
- వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సవరణల్లో భాగంగా టీమ్‌ఇండియా (118) ఒక పాయింట్ కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.
- ఆస్ట్రేలియా టీ20 జట్టులో నిఖిల్ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు చెందిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి చోటు దక్కించుకున్నాడు. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఆడబోతున్న తొలి భారత పురుష క్రికెటర్ నిఖిలే.
- ఆసీస్‌పై బంగ్లా తొలిసారి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. గురువారం వర్ష ప్రభావిత రెండో వన్డేలో బంగ్లా 5 వికెట్లతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే ఆతిథ్య జట్టు 2-0తో దక్కించుకుంది.
- అఫ్గాన్ చేతిలో భారత్ ఓటమి ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎకు తొలి దెబ్బ! తిలక్ బృందం 4 పరుగుల (డ/లూ) తేడాతో అఫ్గానిస్థాన్-ఎ చేతిలో పరాజయం చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌కు 49 ఓవర్లుగా కుదించగా.. మొదట భారత్ 9 వికెట్లకు 349 పరుగులు చేసింది.
- సంక్షిప్త వార్తలు స్టార్ షూటర్లు మను బాకర్, ఇషా సింగ్ ఆసియా క్రీడల్లో రెండు ఈవెంట్లలో తలపడనున్నారు. సెప్టెంబరులో జపాన్‌లో జరగబోయే ఆసియా క్రీడల్లో బరిలో దిగబోయే 30 మంది సభ్యులతో కూడిన జట్టును భారత జాతీయ రైఫిల్ సంఘం గురువారం ప్రకటించింది.
- బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం కోట్లాది మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న సాకర్ సంరంభం ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
- అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానులు ఆనందంతో ఉప్పొంగుతున్న వేళ.. విశ్వ సాకర్ సంగ్రామం మొదలైంది. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్ల మ్యాజిక్‌లను చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఇక నెలన్నర రోజులు పండగ చేసుకోనున్నారు. మెక్సికో సిటీలో అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ వేడుకలు ప్రారంభమయ్యాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు పాప్ సింగర్ షకీరా తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పలువురు కళాకారులు తమ ఆటపాటలు, విన్యాసాలతో అలరించారు.
- చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ఆసీస్‌ను ఓడించి వన్డే సిరీస్ కైవసం బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గింది.
- అండర్ 19 స్క్వాడ్‌లో ద్రవిడ్ కొడుకు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.
- భారత్-ఎ జట్టుకి గుంటూరు కుర్రోడు ఎంపిక గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్-ఎ జట్టులో స్థానం సంపాదించాడు.
- ముక్కోణపు సిరీస్.. భారత్-ఎపై అఫ్గాన్-ఎ విజయం ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-ఎతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు గెలిచింది.