రణరంగంగా పశ్చిమాసియా.. అమెరికా- ఇరాన్ మధ్య భీకర దాడులు

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. హర్మూజ్ సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్‌పై అమెరికా ( USA) ప్రతీకార దాడులకు దిగింది. దీనికి టెహ్రాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తోంది. గల్ఫ్ ప్రాంతాల్లో అగ్రరాజ్య స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది.
అమెరికా దాడులను దురాక్రమణ చర్యగా ఐఆర్‌జీసీ అభివర్ణించింది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికా ఫ్లీట్‌తో పాటు, జోర్డాన్‌లోని ఆ దేశానికి చెందిన అల్ అజ్రాక్ వైమానిక స్థావరం లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఉత్తర ఇరాక్‌లలో పలు పేలుడు శబ్దాలు వినిపించాయి. తమ భూభాగంపై దాడులు ఇలానే కొనసాగితే.. తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ముందు దక్షిణ ఇరాన్‌లోని జాస్క్, సిరిక్, ఖేష్మ్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా యూఎస్ దళాలు దాడులు చేశాయి. ట్రంప్ ( Donald Trump) ఆదేశాల మేరకు ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) పేర్కొంది. ఈ దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ ( Iran)కు గట్టి సందేశం ఇచ్చేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ‘ప్రతిస్పందనలు చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నా. వారు మా హెలికాప్టర్‌ను కూల్చివేశారు. వారు చేసిన దానికి ఇది మా ప్రతిస్పందన. ఇది చాలా బలంగా.. అత్యంత శక్తిమంతంగా ఉండాలని అనుకుంటున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
- ఇరాన్‌పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన అమెరికా
అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చేశాం..
వైమానిక ఘర్షణ నేపథ్యంలో.. బుషెహర్ ప్రావిన్స్‌పై ఒక అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అయితే, ఈ ప్రకటనను అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు.
క్షేమంగా ఉండాలంటే.. ఇరాన్ వార్నింగ్
దాడుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. యూఎస్ తమ సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు కచ్చితంగా స్పందిస్తాయన్నారు. క్షేమంగా ఉండాలనుకుంటే.. వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని యూఎస్ బలగాలను హెచ్చరించారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 08:28 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఇరాన్‌పై దాడుల విరమణ ఇరాన్‌పై తాజా దాడుల్ని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
- ముగ్గురు భారతీయుల్ని బలిగొన్న అమెరికా అమెరికా దుందుడుకుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు.
- మధ్యవర్తిత్వమంటే భారత్‌లో అందరికీ తెలుసు మధ్యవర్తిత్వమంటే భారత్‌లో అందరికీ తెలుసునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వాన్ని భారత న్యాయవ్యవస్థ ఓ పటిష్ఠమైన వివాద పరిష్కార యంత్రాంగంగా తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు.
- భారీగా పెరిగిన తీరప్రాంత వరదలు ఒకప్పుడు అతి అరుదుగా సంభవించే తీర ప్రాంత వరదలు కేవలం మనుషుల కార్యకలాపాల వలన జరిగిన పర్యావరణ విధ్వంసం కారణంగా ప్రస్తుతం విరివిగా ఏర్పడుతున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.
- న్యూట్రినోలకు రూపాలు మార్చుకొనే స్వభావం అదృశ్య పరమాణువులుగా పేర్కొనే న్యూట్రినోలకు రూపం మార్చుకొనే స్వభావం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
- గాడ్జిలా ఎల్‌నినో వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న ఎల్‌నినోపై అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (నోవా) తాజా సమాచారాన్ని అందించింది.
- అఫ్గాన్‌పై పాక్ వాయు దాడుల్లో మృతులు పౌరులే: ఐరాస బృందం అఫ్గానిస్థాన్ తూర్పు ప్రాంతంపై పాకిస్థాన్ జరిపిన వాయు దాడుల్లో మృతిచెందిన 13 మంది పౌరులేనని, మరో 10 మంది గాయపడినట్లు తాము ధ్రువీకరించి నమోదు చేసినట్లు ఐక్యరాజ్య సమితి సహాయక బృందం (యూఎన్‌ఏఎంఏ) గురువారం వెల్లడించింది.
- పిల్లల ‘ఆన్‌లైన్’ రక్షణకు కెనడాలో సోషల్ మీడియా బిల్లు పిల్లలపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాన్ని నిరోధించి ‘ఆన్‌లైన్’ రక్షణ కల్పించే ‘‘సేఫ్ సోషల్ మీడియా యాక్ట్’’ బిల్లును కెనడా ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.
- సంక్షిప్త వార్తలు (5) తన శాఖ బడ్జెట్టును పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో కినుక వహించిన బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హేలీ అనూహ్యంగా గురువారం రాజీనామా చేశారు.
- ఇరాన్‌పై దాడులను విరమించుకున్న ట్రంప్ ఇరాన్‌పై దాడులను విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి చర్చలకు ఇరాన్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
- పెంటగాన్‌లో ‘లాక్‌డౌన్’.. ఏం జరిగిందంటే! అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
- ఈ రాత్రికి భీకర దాడులు చేస్తాం - ట్రంప్ ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
- రెండుగా చీలిపోనున్న ఆఫ్రికా! ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోనుందా? భూగర్భంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆఫ్రికాలోని సరిహద్దుల్ని మార్చేయనున్నాయా?... అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.
- నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి: ధ్రువీకరించిన కేంద్ర మంత్రి Indian Sailors: వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
- హర్మూజ్‌లో చమురు రవాణాకు ‘సీక్రెట్ మిషన్’.. ట్రంప్ వెల్లడి Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రంగా మారాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- ‘లెక్కలు బాగున్నాయి.. ఐ లవ్ ద్రవ్యోల్బణం’: ట్రంప్ వ్యాఖ్యలు Donald Trump: ద్రవ్యోల్బణం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- అన్నంత పని చేసిన ట్రంప్.. ఇరాన్‌పై అమెరికా సైన్యం మళ్లీ భీకర దాడులు పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది.
- యుద్ధం.. మళ్లీ తీవ్రం భయపడినట్లే జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా బుధవారం ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది.
- వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయుల గల్లంతు ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబెలో అనే వాణిజ్య ట్యాంకర్‌పై అమెరికా బుధవారం దాడి చేయడం కలకలం సృష్టించింది.
- మానవ రహిత అద్భుతం ఇరాన్ దాడిలో హెలికాప్టర్ కూలి ప్రమాదంలో చిక్కుకుని అసహాయులుగా ఉన్న ఇద్దరు అమెరికా పైలట్లను కాపాడిన మానవ రహిత డ్రోన్ బోట్ (సీ బోట్) చరిత్ర సృష్టించింది.