సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష.. 12 ఏళ్ల పాలనపై మోదీ ఆసక్తికర పోస్టు

Eenadu icon
By National News Team Updated : 10 Jun 2026 12:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. భారత్‌లో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేతగా ఆయన నిలిచారు. ఈసందర్భంగా తన 12 ఏళ్ల పాలనపై మోదీ ( PM Modi) ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ప్రజా సేవ అనేది సుపరిపాలనకు అతిపెద్ద పరీక్ష. వినయం, అంకితభావం, కర్తవ్య దీక్షతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలడు’ అని మోదీ రాసుకొచ్చారు.

ఇక, ప్రధానమంత్రిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేకమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ‘కొందరు నాయకులు దేశాన్ని పాలిస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే దేశ గతిని మార్చేస్తారు. వారిలో ఒకరే ప్రధాని మోదీ. ఒక సామాన్యుడి ఇంటిలోని నీటి కుళాయి నుంచి చంద్రయాన్‌తో చంద్రుడిని చేరేవరకు.. పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దుల్లోని సైనికుడి ధైర్యం వరకు మోదీ నాయకత్వం దేశ విశ్వాసాన్ని, సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంది. ప్రగతి ఫలాలు ప్రతి భారతీయుడికి చేరేలా చూసింది. ఆయన పాలనలో సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను పాటించారు. బలహీనులకు మద్దతిస్తూనే.. అవకాశాలను విస్తరించి భారత ఆర్థిక పునాదులను బలోపేతం చేసే సంస్కరణలను మేళవించారు. కరుణ, ఆశయం రెండూ కలిసి సాగగలవని ఆయన నిరూపించారు. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. స్వర్ణాంధ్రను నిర్మించడానికి.. వికసిత్‌ భారత్‌ సాకారం అయ్యేందుకు కట్టుబడి ఉన్నాం’ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

  • స్వతంత్ర భారతంలో సరికొత్త అధ్యాయం!

‘దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి నా హృదయపూర్వక అభినందనలు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను అధిగమించి.. ఈ అసమానమైన రికార్డును సృష్టించడం నిజంగా అద్భుతం. మోదీ నాయకత్వం ప్రపంచ వేదికపై భారత్‌ను అజేయశక్తిగా నిలబెట్టింది. అవకాశాలు, ప్రజల గౌరవం, స్వావలంబన, సాధికారత వైపు దేశాన్ని నడిపించింది’ - ఏపీ మంత్రి నారా లోకేశ్‌ 

‘‘మాతృభూమిపై గౌరవం, కర్మభూమి సంక్షేమం కోసమే తన జీవితం అంకితం అన్న స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్ర మోదీ 4,399 రోజులుగా దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం భారత్‌ నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎంచుకొంది. నేడు భారత్‌ గతంలో కంటే బలంగా, సురక్షితంగా, మరింత ఆత్మవిశ్వాసంతో నిలబడింది. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధికి నిరంతరం మద్దతిస్తున్న మోదీకి నా కృతజ్ఞతలు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా మనం కృషి చేస్తున్నాం. వికసిత్‌ భారత్‌ సాకారంలో ఆంధ్రప్రదేశ్‌ బలమైన భాగస్వామిగా ఉన్నందుకు గర్వంగా ఉంది’’ - ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 11:52 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆ తృణమూల్‌ నేతకు బంగ్లాదేశ్‌ అతివాద సంస్థలతో సంబంధాలు: రెబల్‌ ఎంపీ తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబల్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ ఆ పార్టీ మాజీ ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు.
  • టిండర్‌ యాప్‌లో హనీట్రాప్‌.. రూ.లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయమూర్తి Honeytrap: హనీట్రాప్‌లో పడి.. ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. 
  • కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్‌ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
  • వరుస అగ్నిప్రమాదాలు.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం Delhi: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో తక్కువ ఎత్తున్న నివాస భవనాలలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా చట్టాలను తేవాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 
  • పెట్రోల్‌ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్‌ Petrol: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • మా ఆవిడ కుట్లు, అల్లికలతో రూ.కోట్లు సంపాదించింది మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసులు జరిపిన సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
  • అనిశ్చితిలోనూ పరుగు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్నా అభివృద్ధి పథంలో భారత్‌ దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
  • ఇక్కడ పిటిషన్‌.. అక్కడ ఏకగ్రీవం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు గురువారం కీలకమలుపు తిరిగాయి. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • అభిషేక్‌ వల్లే పార్టీ సర్వనాశనం తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
  • ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు.
  • గృహిణులు జాతి నిర్మాతలు కుటుంబానికే పరిమితమైనట్లుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికీ ఎంతగానో దోహదపడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • మణిపుర్‌లో ఆగని హింసాకాండ మణిపుర్‌లో గిరిజన తెగల మధ్య హింస ఆరని కుంపటిలా రగులుతోంది.
  • నౌకలో చిక్కుకున్న క్షిపణి వార్‌హెడ్‌ వెలికితీత ముడిచమురు రవాణా నౌకలో పేలని స్థితిలో ఉన్న క్షిపణి వార్‌హెడ్‌ను భారత నౌకాదళం విజయవంతంగా వెలికితీసి, సురక్షితంగా నిర్వీర్యం చేసింది.
  • విద్యుత్తు కోసం ప్రధానికి 48 గ్రామాల రుధిర లేఖలు ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతీ - సీతానదీ పులుల అభయారణ్యం పరిధిలో గల 48 గ్రామాల ప్రజలు లైన్లు లాగి విద్యుత్తు సదుపాయం కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 700కు పైగా లేఖలను రక్తంతో రాసి, స్పీడ్‌పోస్టులో పంపారు.
  • కలిసిన మనసుల ‘ఇష్టపది..’ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల చేయూతతో యువ దివ్యాంగులకు ఓ జీవనమార్గం దొరికినా.. ఆ దారిలో కడదాకా నడిచేందుకు కుటుంబ మద్దతు ఎంతో అవసరం.
  • సీబీఎస్‌ఈ లోపాలు బయటపెట్టిన నిసర్గను ఇంజినీర్‌గా నియమించుకున్న ఐఐటీ కాన్పూర్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) మూల్యాంకన ప్రక్రియలో లోపాల్ని బయటపెట్టిన నిసర్గ అధికారి(19)ని ఐఐటీ కాన్పుర్‌ విధుల్లో నియమించుకుంది.
  • దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీక్‌లవంటి సమస్యలపై దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.
  • చిన్నారుల మానసిక పరీక్షకు ఆషామాషీగా అనుమతివ్వరాదు భార్యాభర్తల వివాదాల కేసుల్లో వారి పిల్లలను కేవలం సాక్ష్యాధార వస్తువులుగా పరిగణించరాదని, ఆషామాషీగా వారి మానసిక పరీక్షకు ఆదేశించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • 90 నిమిషాలు ఇలా చేసి చూడండి ఒక ముఖ్యమైన పనిని ఎంచుకోండి. దానికి  90 నిమిషాల సమయాన్ని కేటాయించండి.
  • ఇటు నిఫా.. అటు షిగెల్లా ఒకపక్క నిఫా, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కేసులు కేరళలో పెరుగుతున్నాయి.