ఆధ్యాత్మిక అద్భుతాలు

- A
- A+
- A++

ఈలోకం అనేక వింతలమయం. ఇదొక మయసభ. ప్రపంచ వింతలెన్నో మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక వింతల గురించి కూడా ఆలోచించాలి. మనిషి మెదడులో అసాధ్యమని భావించింది అద్భుతం రూపంలో సుసాధ్యమై కళ్లముందు కొలువుతీరుతుంది. భగవంతుడు మనిషిని గొప్ప ప్రణాళికతో సృష్టించాడు. ఈ భూమ్మీద అతణ్ని మించిన వింత జీవి మరొకరు లేరు.
మహాభారతంలో ‘అన్నింటిలోకీ గొప్ప వింత ఏంటి?’ అని యక్షుడు ఒక గాఢమైన ప్రశ్న వేస్తాడు. తన తోటి వారు మరణించినా తాను మాత్రం ఈ లోకంలో శాశ్వతంగా ఉంటానని మనిషి భ్రమిస్తూ ఉంటాడని... ధర్మజుడు సమాధానం చెబుతాడు. పోయినవారి గురించి రేవులో మునుగుతూ దుఃఖపడుతూ ఉంటారు ఉన్నవాళ్లు. తరవాత వంతు తమకూ వస్తుందని వాళ్లు అలా యముడికి ఒట్టేసి మరీ చెబుతారని ‘చనువారిం గని యేడ్చు వారు...’ పద్యంలో కవి ధూర్జటి ఆ దుఃఖానికి వింత అర్థం చెప్పాడు. శ్రీరామచంద్రుడి పాదధూళికి శిల స్త్రీగా మారడం ఒక అద్భుతం.
సముద్రం మీద సేతువు కడితే రాళ్లు నీటిమీద తేలడం మరో గొప్ప అద్భుతం. రామనామస్మరణతో సద్గతులు కలగడం ఈ అద్భుతాల్లోకెల్లా పెద్ద అద్భుతం అంటాడు దాశరథీ శతకంలో శ్రీరామదాసు. భక్తులు వింత వింత కోరికల చిట్టాను దేవదేవుడి ముందు ఉంచుతారని అన్నమయ్య ఓ కీర్తనలో గానం చేస్తాడు. కంసుడి నుంచి కృష్ణుణ్ని కాపాడటానికి పసిబిడ్డను తీసుకుని నది దాటుతూ ఉంటాడు వసుదేవుడు. అప్పుడు యమున తన నీటిని తగ్గించుకుని వసుదేవుడికి దారిస్తుంది. ఇది భగవంతుడు తన క్షేమం కోసం తాను సృజించుకున్న అద్భుత మార్గం.
అర్జునుడిలో భక్తిని పెంచడానికి తన మహిమలను అద్భుతాలుగా ప్రకటించి గీతాచార్యుడు దైవిక శక్తిని తేటతెల్లం చేస్తాడు విభూతి యోగంలో. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిలోనూ ఎన్నెన్నో వింతలు ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు అతీత శక్తులలో కూడా ఇంత అద్భుత సామర్థ్యం ఉండదేమో అనిపిస్తుంది. భగవంతుడు సృష్టించిన వింత జీవులు ప్రకృతికి తమ వంతు ప్రకాశాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. ఆ అద్భుతాలను పరికిస్తున్నప్పుడు ఆ దైవం మనకు మళ్లీ సరికొత్త నేత్రాలు ప్రసాదించాడేమో అనే ఆలోచన రాక మానదు. ప్రకృతిని ఎవరూ దోచుకునే సాహసం చేయకూడదు. అది భగవానుడు మన కోసం ఏర్పాటు చేసిన పరమాద్భుత సొత్తని గుర్తుంచుకోవాలి.
చివరగా అన్ని వింతలలో కాలం చేసే ఇంద్రజాలం ఎవరికీ ఓ పట్టాన అర్థం కాదు. కాలం బికారిని కుబేరుడిగా మారుస్తుంది. శత కోటీశ్వరుడి కుటుంబాన్ని ఒక్కరోజులో చెట్టు కిందకి తీసుకువస్తుంది. అందుకనే కాలాన్ని దైవకార్యాల కోసం వినియోగించుకోవాలి. వర్తమానంలో ఉన్న ఈ ఘడియలనే అద్భుత క్షణాలుగా భావించాలి. స్వార్థం లేని పవిత్ర ప్రేమతో ఆధ్యాత్మిక దిశగా అడుగులు వేయాలి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సాక్షులున్నారు! కళ్లు మూసుకుని పాలు తాగుతూ పిల్లి తననెవ్వరూ గమనించడం లేదనుకుంటుందట! అదేవిధంగా మోహంతోనో, ఆవేశంతోనో, అహంకారంతోనో, అధికారంతోనో కళ్లు మూసుకుపోయి ఎవరు చూడొచ్చారులే అనుకుంటూ అధర్మపు పనులు చేయవచ్చు.
- అసలైన పూజ ఏది? మనిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది.
- మహా వాక్యాలు మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు ‘నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా? లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపమేదైనా ఉందా?
- వీరమాతలు చరిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు.
- మానస సరోవరం మనసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్నా ప్రతి మనిషికీ మెదడే మానస సరోవరం.
- ఆలయం ‘లయం’ అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడో, పెద్దయెత్తున వరదలూ సునామీ లాంటివి ముంచెత్తినప్పుడో సంభవించేది అది.
- పరమాత్మను మెప్పించాలి భగవంతుడు ప్రేమతో, ఆర్తితో, వినయంతో, ఆవేదనతో, సంతోషంతో... ఎలా పిలిచినా పలుకుతాడు. కరుణిస్తాడు. రక్షిస్తాడు. అహల్య, శబరి, గుహుడు తదితరుల విన్నపాలను రామావతారంలో విన్నాడు. మద్ది వృక్షాలై పొమ్మని నారదుడి శాపం పొందిన కుబేరుడి కుమారులు నలకూబరుడు, మణిగ్రీవులను కృష్ణావతారంలో తన పాదస్పర్శతో శాపవిముక్తుల్ని చేశాడు.
- అదే అత్యుత్తమ సేవ... రంగురంగుల ప్రకృతి శోభ వర్ణనాతీతం. భౌతికంగా, మానసికంగా విభిన్న తత్వాలు ఉన్న మానవ ప్రపంచం అంతకన్నా అద్భుతం.
- జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
- యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
- దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
- శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
- తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
- మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
- మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
- అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
- సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
- దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
- ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
- అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.