వీరమాతలు

Eenadu icon
By Editorial Team Published : 24 Feb 2026 01:37 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

రిత్రలో ఎందరో మాతృమూర్తులు తమ బిడ్డలను ధీరపురుషులుగా తీర్చిదిద్ది వీరమాతలై వెలిగారు. మహారాణులుగా వారు అంతఃపురాలకే పరిమితమైనా, సంతానాన్ని శీలవంతులుగా సంస్కరించడంలో విశేషంగా కృషి చేశారు. తెరవెనుక నిలిచినా పరోక్ష ప్రేరకులుగా తరిగిపోని స్ఫూర్తితో ప్రకాశించారు. మార్కండేయ పురాణంలో ప్రస్తావించిన రాణి మదాలస, మహాభారతంలో పరిచయమయ్యే విదుల తదితరులే అందుకు నిదర్శనం. పుత్రుల్ని సమర రంగానికి సంసిద్ధపరచడం దగ్గర నుంచి వారికి పారమార్థిక జ్ఞానాన్ని ప్రసాదించడం వరకు ఆ మహిళామూర్తులు ఘనమైన పాత్రను పోషించారు. 

రాణి మదాలస యోగశాస్త్రాన్ని అభ్యసించి యోగినిగా మారింది. ఆత్మజ్ఞానాన్ని ఆర్జించి తన నలుగురు కుమారులను తేజోవంతులుగా మలచింది. జోలపాటలు పాడే నాటి నుంచే జ్ఞానబోధ చేస్తూ ‘శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి...’ - ‘నువ్వు పరిశుద్ధ ఆత్మస్వరూపుడవు, బద్ధుడవు కావు బుద్ధుడవు, నిత్య నిరంజనుడవు’ అంటూ మేల్కొలిపేది. అలా కుమారులను జాగృతపరచి, మహారాణిగానే కాదు ఆత్మజ్ఞానిగా కూడా జీవితాన్ని ధన్యం చేసుకుంది. సంతానానికి స్ఫూర్తి కలిగించడంలో ఆధునికతరం మాతృమూర్తులకూ ఆదర్శప్రాయం- విదుల. కొడుకు సంజయుడు సింధుదేశపు రాజు చేతిలో పరాజితుడై ఇంటికి చేరి, నిరాశతో దుఃఖించసాగాడు. అప్పుడు తల్లి విదుల ‘నాయనా! ఎందుకు ఆ నైరాశ్యం? యుద్ధంలో గెలుపోటములు సహజం. పొగలు గక్కే కట్టెలాగా చిరకాలం బతికేకన్నా, క్షణకాలం జ్వలించినా ప్రకాశాన్నిచ్చే నిప్పు కణికలా జీవించడం ఉత్తమం’ అని చైతన్యపరిచింది. ‘విజయమో, వీరమరణమో’ అంటూ కొడుక్కి వీరతిలకం దిద్ది సమరాంగణానికి సాగనంపింది. సంజయుడు అజేయుడై తిరిగి వస్తే సగర్వంగా స్వాగతం పలికింది.  

ఆ మాతృమూర్తుల విజయగాథలను తలపించే మహిళామణులు నవభారతంలోనూ ఉన్నారు. తన ఆశల్నీ ఆకాంక్షల్నీ బాల శివాజీకీ ఉగ్గుపాలలో రంగరించిపోసింది జిజాబాయి. తల్లీతండ్రీ అన్నీ తానై శివాజీని పెంచింది. రాముడిలోని సహనం, అర్జునుడిలోని సాహసం కలగలిసిన గుణసంపన్నుడిగా తీర్చిదిద్దింది. తండ్రి కన్నా తల్లి దగ్గరే కొడుకు పరిపూర్ణుడుగా రూపుదిద్దుకుంటాడని నిరూపించింది. ‘భోగలాలస లేనివాడు, దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించే యోధుడు, అశేష జనవాహినిని ముందుకు నడిపించగల ధీరుడు మన దేశానికి అవసరం. అలాంటి కొడుకును నేను ఈ భారతావనికి అందిస్తాను’ అని ఆమె ప్రతిన బూనింది. ఛత్రపతి శివాజీని భరతజాతికి బహూకరించి ధన్యచరితగా మిగిలింది.   

స్వామి వివేకానంద తల్లి భువనేశ్వరీదేవి కూడా కుమారుడి మహోన్నతమైన వ్యక్తిత్వంపై ప్రగాఢ ముద్రవేశారు. స్వామీజీ రామాయణ భారతాది ఇతిహాసాలు, పురాణాల్ని మాతృమూర్తి నుంచే ఆలకించారు. వివేకానందకు విలువల పాఠాలు నేర్పిన తొలిగురువు తల్లే. అందుకే ‘మా అమ్మ ప్రార్థనల ఫలమే నేను. నాకోసం ఆమె ఎన్ని పూజలు చేసిందో! ఎన్ని నోములు నోచిందో! నన్నీ లోకంలోకి తీసుకురావడానికి ఒక యోగినిలా మారింది. నా జీవితం, ప్రఖ్యాతి మా అమ్మ పెట్టిన భిక్ష’ అని ఓ ప్రసంగంలో ఉద్వేగభరితుడయ్యారు.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అసలైన పూజ ఏది? మనిషి భగవంతుడికి దగ్గరవడానికి ఎంచుకునే మార్గమే పూజ. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెనలాంటిది అది.
  • మహా వాక్యాలు మనిషి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటప్పుడు ‘నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు మనిషి ఎవరు? భౌతికంగా కనిపించే శరీరమా? లేక లోపల ఉన్న మనసా? వీటన్నిటికన్నా అతీతమైన రూపమేదైనా ఉందా?
  • మానస సరోవరం మనసు ఒక సరోవరం లాంటిది. అందుకనే దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా అది హిమాలయాల్లో ఉన్నా ప్రతి మనిషికీ మెదడే మానస సరోవరం.
  • ఆధ్యాత్మిక అద్భుతాలు ఈ లోకం అనేక వింతలమయం. ఇదొక మయసభ. ప్రపంచ వింతలెన్నో మనకు తెలుసు. కానీ ఆధ్యాత్మిక వింతల గురించి కూడా ఆలోచించాలి. మనిషి మెదడులో అసాధ్యమని భావించింది అద్భుతం రూపంలో సుసాధ్యమై కళ్లముందు కొలువుతీరుతుంది.
  • ఆలయం ‘లయం’ అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడో, పెద్దయెత్తున వరదలూ సునామీ లాంటివి ముంచెత్తినప్పుడో సంభవించేది అది.
  • పరమాత్మను మెప్పించాలి భగవంతుడు ప్రేమతో, ఆర్తితో, వినయంతో, ఆవేదనతో, సంతోషంతో... ఎలా పిలిచినా పలుకుతాడు. కరుణిస్తాడు. రక్షిస్తాడు. అహల్య, శబరి, గుహుడు తదితరుల విన్నపాలను రామావతారంలో విన్నాడు. మద్ది వృక్షాలై పొమ్మని నారదుడి శాపం పొందిన కుబేరుడి కుమారులు నలకూబరుడు, మణిగ్రీవులను కృష్ణావతారంలో తన పాదస్పర్శతో శాపవిముక్తుల్ని చేశాడు.
  • అదే అత్యుత్తమ సేవ... రంగురంగుల ప్రకృతి శోభ వర్ణనాతీతం. భౌతికంగా, మానసికంగా విభిన్న తత్వాలు ఉన్న మానవ ప్రపంచం అంతకన్నా అద్భుతం.
  • జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.